రికార్డు స్థాయిలో నోటా..మోడీకి ప్రజాధరణ తగ్గిందా.. మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారా-కేతిరెడ్డి,జక్కంపూడి ఆరోపణలు..మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్తత..కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత..30కోట్ల పందెం సొమ్ము మాయం..ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న ఎంపీ మాగుంట..బెంగళూరు ఎయిర్పోర్ట్ భారీగా బంగారం పట్టివేత..  …

???? రికార్డు స్థాయిలో నోటా…ఏడు విడతల్లో హోరాహోరీగా సాగిన లోక్ సభ ఎన్నికల్లో రికార్డ్ స్థాయి మెజారిటీలు, అత్యల్ప మెజారిటీలు నమోదైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో నోటా కూడా ఈ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ ఎన్నికల్లో నోటాకు లక్షల్లో ఓట్లు పోలవ్వడం గమనార్హం. ఇదే సమయంలో కొంతమంది అభ్యర్థుల జయాపజయాలను నోటాకొచ్చిన ఓట్లు తీవ్రంగా ప్రభావితం చేశాయని తెలుస్తుంది. ఉదాహరణకు కేరళలోని అత్తింగళ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అదూర్ ప్రకాశ్, సీపీఎం అభ్యర్థి వి జాయ్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 684 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే అనూహ్యంగా ఇక్కడ నోటాకు 9,791 ఓట్లు పోలయ్యాయి. ఇదే సమయమో ఒడిశాలోని జయంపురంలోనూ ఇలాంటి సంఘటన జరిగింది. ఇందులో బాగంగా… యపౌరంలో బీజేపీ అభ్యర్థి రవీంద్ర నారాయణ బెహరా.. బీజేడీ అభ్యర్థి శర్మిష్ఠ సేథీపై 1.587 ఓట్లతో గెలుపొందారు. అయితే ఇక్కడ కూడా నోటాకు 6,788 ఓట్లు పడ్డాయి. ఇలా పలు నియోజకవర్గాల్లో ఈసారి నోటా కీరోల్ పోషించిందనే చెప్పాలి. ఇక అత్యధికంగా, అత్యల్పంగా నోటాకు పోలైన స్థానాలు ఎక్కడ, ఎన్నేసి ఓట్లు అనేది ఇప్పుడు చూద్దాం…! మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో నోటాకు రికార్డ్ స్థాయిలో 2,18,674 ఓట్లు పోలయ్యాయి. దీంతో నోటా విషయంలో ఈ నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇదే క్రమంలో… నోటాకు 50,470 ఓట్లు రావడంతో ఏపీలోని అరకు లోక్ సభ స్థానం రెండో స్థానంలో నిలిచింది. ఇదే క్రమంలో… నోటాకు అత్యల్ప ఓట్లు నమోదైన నియోజకవర్గం కూడా ఏపీలో ఉంది. విశాఖ లోక్ సభ స్థానంలో అత్యల్పంగా 5,313 ఓట్లు నోటాకు పడ్డాయి.

????నరేంద్ర మోదీకి ప్రజాదరణ తగ్గిందా???..దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. ఏప్రిల్ మే నెలల్లో ఈ ఎన్నికలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇదే సమయానికి జరిగిన విషయం తెలిసిందే. ఇక ఫలితాలు జూన్ 4వ తేదీన వచ్చాయి. కేంద్రంలో ఎన్డీయే కూటమికి ప్రజలు పట్టం కట్టారు. అయితే కూటమిగా ఎన్డీయే కూడా ఇండి కూటమి నుంచి గట్టి పోటీనే ఎదుర్కొంది. ఇక నరేంద్ర మోదీ ముచ్చటగా మూడవ సారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ బరిలో దిగిన లోక్‌సభ స్థానం వారణాసిలో ఆయన ఎలాంటి పోటీని ఎదుర్కొన్నారు.. అసెంబ్లీ వారీగా ఆయన పొందిన ఓట్లు ఎన్ని అనేది ఒకసారి విశ్లేషణ చేద్దాం.2014, 2019లో ఆయన వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి మంచి మెజార్టీతో విజయం సాధించారు. కానీ 2024లో మాత్రం ఆయన గెలుపునకు చెమటోడ్చాల్సి వచ్చింది. వారణాసి లోక్‌సభ పరిధిలో రోహనియా,వారణాసి నార్త్, వారణాసి సౌత్, వారణాసి కంటోన్మెంట్, సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రారంభం కాగా తొలి ట్రెండ్స్‌లో మోదీ వెనుకబడి ఉన్నారు.ఆ తర్వాత క్రమంగా పుంజుకున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మోదీ కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నారు.పేద ప్రజల సమస్యలు తీర్చకుండా కోటీశ్వరులకు మాత్రమే లబ్ధి చేకూరుస్తున్నారని, లాభాల దిశలో పయనిస్తున్న రైల్వే, బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, విశాఖ ఉక్కు, తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం లాంటి మాయలను ప్రజలు అర్థం చేసుకున్నారని, అందువల్లే ఆయన మాటలను ప్రజలు నమ్మడం లేదని రాబోయే రోజులలో ఆయన ప్రతిష్ట మరింత దిగజారుతుందని కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

????సీఎంఓలో ఎవరెవరో కూర్చొని గంటల సేపు మాట్లాడేవారు .. మంత్రులకు, ఎమ్మెల్యేలకు కనీసం ఓ ఐదు నిమిషాలు అయినా అవకాశం ఇచ్చారా..? సీఎంగా ఉన్నప్పుడు జగన్ ను కలవడానికి ఉదయం నుంచి రాత్రి వరకు పడి గాపులు కాసేవాళ్ళం..ఎమ్మెల్యేలుగా మా నియోజకవర్గాల్లో విలువ కోల్పోయాం..?అందుకే కూటమిలో అసలు అభ్యర్థి ఎవరో కూడా తెలియకపోయినా ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు..

పక్కాగా వైసిపి గెలుస్తుంది అని భావించిన 80 నియోజకవర్గాలలో సైతం వైసిపి ఓటమి పాలైందని మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి, జక్కంపూడి రాజా ఆరోపణలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

???? వైసీపీ ఘోర ఓటమి.. కీలక నేత రాజీనామా.. గుంటూరు జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు ప్రకటించారు. ‘4 దశాబ్దాలుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమం చివరి దశకు వచ్చింది. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నమ్ముతున్నా. సమాజ సేవ కొనసాగిస్తూ, అంబేడ్కర్ ఆశలు, ఆశయాలు, ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తా’ అని ఆయన వెల్లడించారు.

మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్తత  .. రాజమండ్రి ..మోరంపూడి ఫ్లైఓవర్ ని విజిట్ చేయడానికి వచ్చిన టిడిపి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు..గత హయాంలో మోరంపూడి ఫ్లైఓవర్ శిలా ఫలకంపై ఎంపీ భరత్ పేరు ఉండడంతో ధ్వంసం చేసిన టిడిపి శ్రేణులు అడ్డుకోబోయిన పోలీసులు, పోలీసులతో వాగ్వాదం..టిడిపి శ్రేణుల తిరుగుబాటుతో సైలెంట్ అయిన పోలీసులు..

????మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత.* కృష్ణాజిల్లా గుడివాడ..

ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని…. మాట నిలబెట్టుకోవాలంటూ డిమాండ్. తెలుగు యువత శ్రేణులను అడ్డుకున్న పోలీసులు…. పరస్పరం కాల్చేసుకుండామని వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ వ్యాఖ్యలు.పోలీస్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగు యువత నేత పొట్లూరు దర్శిత్….పోలీసులను తోసుచుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు యత్నం. తెలుగు యువత శ్రేణులను అడ్డుకున్న పోలీసులు…..పోలీసులు….తెలుగు యువత శ్రేణులు మధ్య తీవ్ర వాగ్వాదం.కొడాలి నాని ఇంటిపై రాళ్లు….. గుడ్లు విసిరిన టిడిపి శ్రేణులు.జై చంద్రబాబు అంటూ కోడాలి నాని ఇంటి వద్ద టపాసులు కాల్చిన తెలుగు యువత. డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు.గుడివాడలో కొడాలి నానికు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది….. ట్రైలర్ మాత్రమే సినిమా ముందు ఉంది:పొట్లూరి దర్శిత్.. చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యానం చేస్తానని చాలెంజ్ చేశాడు….. మాజీ ఎమ్మెల్యే నాని మాట నిలబెట్టుకోవాలి.రాజకీయ సన్యాసం చేస్తానన్నావ్…. శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చాం దమ్ముంటే బయటికి రా….. పొట్లూరి దర్శిత్.బొచ్చు పీకుతారా అన్నావ్ వచ్చి మాకు సమాధానం చెప్పు..అధికారం లేకుంటే నీ బతుకు కుక్కలు చింపిన ఇస్తరి ….ఎవరిస్తారు రండి అని రెచ్చగొట్టావు…. నీ బతుకు చంద్రబాబు అవసరం లేదు…. తెలుగు యువత వస్తే…. ఇంట్లో దాక్కున్నావ్ – పొట్లూరి దర్శిత్.

????వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన నీరబ్ కుమార్ ప్రసాద్.

????నేడు ఢిల్లీ లో జరుగు NDA మీటింగ్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు ఇతర పార్లమెంట్ సభ్యులు.

???? రూ. 30కోట్ల పందెం సొమ్ముతో మధ్యవర్తి మాయం.. బెట్టింగ్ రాయుళ్లులో కలవరం!..భీమవరంలో పందెం రాయుళ్ళు గగ్గోలు పెడుతున్నారు. పందాలుకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి పరారవడంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాలలో కోట్లాది రూపాయలు పందాలు జరిగాయి. పందెం రాయుళ్లు ముందుగా పందాలు కాసేటప్పుడు ఓ మధ్యవర్తి సమక్షంలో పందేలు కాస్తారు. పందేలు కోసే ఇద్దరు వ్యక్తులు సంఘటన డబ్బులను మధ్యవర్తి సమక్షంలో ఉంచుతారు. పందెం గెలిచిన తర్వాత మధ్యవర్తి తన కమిషన్ తీసుకుని మిగిలిన పందెం డబ్బులు గెలిచిన వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది.ఆ క్రమంలోనే భీమవరం సమీపంలో రాయలం గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద ఇరు పార్టీల పందం రాయుళ్ళఉ పెద్ద మనిషిగా ఉంచారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలకు చెందిన పందెం రాయుళ్ళు బెట్టింగ్ కోసం తెచ్చిన డబ్బును సదరు మధ్యవర్తి దగ్గర ఉంచి గెలిచిన తర్వాత 5 పర్సెంట్ కమిషన్ తీసుకుని పందెంలో నెగ్గిన వ్యక్తికి మిగతా డబ్బులు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు.ఇలా మొత్తం సుమారు 30 కోట్ల రూపాయలపైనే ఆ మధ్యవర్తి వద్ద పందాలు జరిగాయి. ఎన్నికల అనంతరం పందాలు గెలిచిన వ్యక్తులు సంతోషంగా తమకు డబ్బు వస్తుందని ఆశించారు. ఎంతో ఆశగా పందెంలో గెలిచిన డబ్బు కోసం మధ్యవర్తి వద్దకు వెళ్లగా, అతని జాడ ఎవరికీ చిక్కలేదు. దాంతో అతను ఎక్కడికి వెళ్ళాడా అని ఆరా తీశారు. కానీ అతను ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించారు.మధ్యవర్తి బంధువులు కుటుంబ సభ్యులు సైతం అతని గురించి సమాచారం తెలియదు అన్నట్లుగా వ్యవహరించడంతో ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో పందెం రాయుళ్లు గగ్గోలు పెడుతున్నారు.ఒకవేళ పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయాలన్న పందెం కాయడం చట్ట వ్యతిరేకం. అందుకే ఫిర్యాదు చేస్తే తమపైనే కేసులు నమోదు చేస్తారేమో అని భయపడుతున్నారు. పందాలు కాసిన వారంతా ఒక గ్రూపుగా ఏర్పడి ఆ మధ్యవర్తి కోసం వెతుకులాట

????టిడిపీ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టనున్న ముగ్గురు ముస్లిం ఎమ్మెల్యే లు..ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించనున్న ముగ్గురు ముస్లిం ఎమ్మెల్యే లు.గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నసీర్ అహ్మద్, నంద్యాల నుండి మహమ్మద్ ఫరూక్, మదనపల్లె నుంచి షాజహాన్ బాషా టీడిపి టికెట్లపై గెలుపొందారు. ముగ్గురిలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందో చూడాలి. అటు జనసేన,బీజేపీ నుంచి మైనార్టీలెవరికీ టికెట్లు కేటాయించలేదు.వైసీపీ టికెట్లు కేటాయించిన ముస్లిం అభ్యర్థులు ఎన్నికల్లో ఓటమి చెందారు.

???? బెంగళూరు ఎయిర్పోర్ట్ భారీగా బంగారం పట్టివేత ..కర్ణాటక రాజధాని బెంగళూరు ఎయిర్పోర్ట్ భారీగా బంగారం పట్టుబడింది. రెండు వేర్వేరు ఘటనల్లో దాదాపు రూ.6.29కోట్ల విలువైన 9 కిలోల బంగారాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. థాయ్ ఎయిర్వేస్ విమానంలో బంగారాన్ని దాచినట్లు డీఆర్ఐ అధికారులకు ముందుగా సమాచారం అందింది.రంగంలోకి దిగిన అధికారులు తనిఖీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..