???? పనిచేయని మోడీ ఫేమ్.. నిజం ! ఇక,ఇప్పుడు జరిగిన ఎన్నికల్లోనూ ప్రధాని మోడీ ఫేమ్‌ను నమ్ముకునే బీజేపీ తర్వాత జరిగిన రెండు ప్రధాన ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకం. 2014లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని తీసుకువచ్చి ప్రధాని పదవికి ప్రమోట్ చేశారు.దేశవ్యాప్తంగా ఆయనను పరిచయం.. చేశారు.అప్పట్లో పొత్తులు పెట్టుకుని ముందుకు సాగారు. భారీ విజయాన్ని నమోదు చేశారు.అప్పట్లో మోడీ ప్రభావం కనిపించిందని అన్నారు.అయితే..ఆ తర్వాత.. 2019లో జరిగిన ఎన్నికలలోనూ.. ప్రధాని మోడీని ముందు పెట్టుకుని ఎన్డీయే కూటమి ఎన్నికలకు వెళ్లింది.అయితే..ఆ ఎన్నికల్లోనూ విజయం దక్కించుకున్నారు.ఇక, ఇప్పుడు జరిగిన ఎన్నికల్లోనూ ప్రధాని మోడీ ఫేమ్‌ను నమ్ముకునే బీజేపీ రాజకీయంగా దూసుకువెళ్లింది.దేశానికి ఉత్తమ ప్రధాని,విశ్వగురు.. వికసిత భారత్‌కు రూపకర్త.. అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం ముగిసిన ఎన్నిక ల్లో 400 సీట్లను రాబట్టాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందులోనూ..బీజేపీ ఒంటరిగానే 370 సీట్లను దక్కించుకుంటుందని కూడా.. ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు కూడా..ఈ 370 ఆ 400 స్థానాలను దృష్టిలో పెట్టుకునే ముందుకు సాగారు.ఎలా చూసుకున్నా.. తాజా ఫలితంలో ఎక్కడా బీజేపీ 300 సీట్లు కూడా దాటలేదు.ఒంటరిగా 140, కూటమి కి 293 సీట్లు మాత్రమే దక్కాయి.వరుసగా మూడోసారి అదికారం అయితే..దక్కింది. కానీ, మోడీ ఫేమ్.. ఆయన హవా ఎక్కడా పెద్దగా కనిపించలేదు.అదే ఉండి ఉంటే..యూపీలో అయోధ్య రామమందిరాన్ని నిర్మించిన నియోజకవర్గం ఫైజాబాద్‌లోనే బీజేపీ భారీ మెజారిటీతో గెలిచి ఉండాలి. కానీ,అక్కడ బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. ఇక, వారణాసిలో అప్రతిహతంగా మోడీకి మెజారిటీ వచ్చి ఉండాలి. కానీ,అక్కడ కూడా. ప్రధాని తొలి నాలుగు రౌండ్ల ఎన్నికల కౌంటింగ్‌లోనూ తడబడ్డారు. ఒకానొక దశలో 6 వేల ఓట్ల తేడాతో వెనక్కి వెళ్లారు.ఇక, గుజరాత్‌లోనూ.. ఆశించిన సీట్లు రాలేదు. ఎటొచ్చీ..ఏపీలో మాత్రం ఎన్డీయే కూటమికి కలిసి వచ్చింది..పవన్, చంద్రబాబుల ఇమేజ్‌తో పాటు యాంటీ జగన్ ప్రభావం.పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు తెలంగాణ విషయాన్ని చూసుకున్నా.. బండి సంజయ్ వంటివారు ఒంటరిగానే నెగ్గుకురాగల నాయకులు. ఫైర్ బ్రాండ్ నేతలు.పైగా.. మోడీని మించిన రాజకీయం చేయగల నేర్పరులు.ఇక, తమిళనాడులో తీసుకుంటే.. ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలైను గెలిపించుకునేందుకు మోడీ.. మూడు సార్లు తమిళనాడుకు వెళ్లారు. రోడ్ షోలు చేశారు. కోయంబత్తూరును డెవలప్ చేస్తామ న్నారు.కానీ, ఫలితం కనిపించలేదు. ఆయన చిత్తుగా ఓడిపోయారు. ఇక, చెన్నై సౌత్ నుంచి బరిలో ఉన్న తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై కూడా.. మోడీ ఫొటో పట్టుకుని ఇంటింటికీ తిరిగారు.కానీ, ఫలితం దక్కలేదు.సో.. ఈ పరిణామాలను గమనిస్తే.. మోడీ ఫేమ్, హవా ఎక్కడా కూడా.. పెద్దగా వర్కవుట్ కాలేదనే చెప్పాలి.
????బిజెపికి ఎదురు దెబ్బ.. ప్రజా తీర్పుపై సిపిఎం…18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బిజెపికి పెద్ద ఎదురు దెబ్బ అని సిపిఎం పొలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది. గత రెండు ఎన్నికల్లోనూ లోక్‌సభలో వచ్చిన మెజారిటీ ఈసారి తుడిచిపెట్టుకుపోయిందని పేర్కొంది.ఈ ఎన్నికల్లో 400సీట్లు గెలుస్తామని పదే పదే ప్రగల్బాలు పలికిన నరేంద్ర మోడీ చుట్టూ నిర్మించిన అజేయుడనే ఇమేజికి ఇది గట్టి ఎదురు దెబ్బ అని పొలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది.????ప్రతిపక్షాలపై దాడులు, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం, ధన బలాన్ని విచ్చలవిడిగా ఉపయోగించిన నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ నిరంకుశ దాడులకు దీటుగా ఎదురొడ్డి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పౌర హక్కుల పరిరక్షణ కోసం దృఢంగా నిలిచిన ప్రజలకు పొలిట్‌బ్యూరో అభినందనలు తెలియచేసింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, వ్యవసాయరంగ దుస్థితి, ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడులు వంటి అంశాలను చేపడుతూ ఇండియా బ్లాక్ విశ్వసనీయమైన రీతిలో ప్రచారం నిర్వహించింది. మోడీ, బిజెపి సాగిస్తున్న మతోన్మాద విషపూరిత ప్రచారాన్ని గణనీయంగా అడ్డుకోగలిగింది.????అందరికీ సమాన అవకాశాలు వుండేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకున్నట్లైతే ఈ ఫలితాలు బిజెపికి, ఎన్‌డిఎకి మరింత ప్రతికూలంగా వుండేవని పొలిట్‌బ్యూరో పేర్కొంది. నరేంద్ర మోడీ రెచ్చగొట్టే రీతిలో సాగించిన మతోన్మాద, విద్వేష ప్రచారాన్ని అడ్డుకోవడంలో, ఎన్నికల నిబంధనావళిని కచ్చితంగా అమలు చేయడంలో ఘోరంగా విఫలమవడం ఎన్నికల కమిషన్ ప్రతిష్టకు మాయని మచ్చగా మిగిలిపోతుందని పొలిట్‌బ్యూరో పేర్కొంది.సిపిఎం, వామపక్షాలు ఈ ఎన్నికల్లో తమ సీట్ల సంఖ్యను స్వల్పంగా మెరుగు పరుచుకున్నాయి. పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మరింత వివరణాత్మకమైన విశ్లేషణ వుంటుందని తెలిపింది.ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రజల జీవనోపాధులపై జరిగే దాడులను ప్రజలు సహించరు అనడానికి ఈ తీర్పు ఒక స్పష్టమైన సంకేతమని పొలిట్‌బ్యూరో పేర్కొంది.
???? టీవీ9ని స్వాధీనం చేసుకున్న సాక్షి – రజనీకాంత్ ప్లేస్‌లో నేమాని భాస్కర్- జగన్ పాపాలు భరించలేమంటూ చేతులెత్తేసిన మైహోం రామేశ్వరరావు- సాక్షి ఎడిటర్ నేమాని భాస్కర్ కి టివి9 బాధ్యతలు- ఇక నుంచి సాక్షి గ్రూప్ ఆధ్వర్యంలో పనిచేయనున్న టీవీ9…ఇన్నాళ్లూ టివి9కి వేసిన ముసుగు తొలగి పోయింది. రాజకీయ నేతలు ఆరోపిస్తున్నట్టుగానే అది సాక్షి-2 అని తేలిపోయింది. సోమవారం మధ్యాహ్నం టివి9 నిర్వహణ బాధ్యతలని సాక్షి గ్రూప్ తీసుకుంది. సాక్షి మేనేజింగ్ ఎడిటర్‌గా ఉంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారుడు పదవి పొందిన నేమాని భాస్కర్ ఇక నుంచి టివి9 బాధ్యతలు చూస్తారని విశ్వసనీయ సమాచారం. ఇన్నాళ్లూ రజనీకాంత్ టివి9 మేనేజింగ్ ఎడిటర్ గా ఉన్నా, ఆపరేషన్స్ అన్నీ సాక్షి వాళ్లే తెరవెనుక నుంచి చూసేవారు. ఇక నుంచి డైరెక్టుగా సాక్షియే టివి9 బాధ్యతలు చూసుకుంటుందని ప్రచారం సాగుతోంది. జగన్ కోసం టీవీ9 అథఃపాతాళానికి దిగజారిపోయి, క్రెడిబులిటీని దెబ్బతీసుకుంది. టివి9 కేంద్రంగా జగన్ గ్యాంగ్ సాగిస్తున్న అసత్యప్రచారాలన్నీ మైహోం రామేశ్వరరావుకు చుట్టుకుంటున్నాయి. జగన్ కోసం ఆయన బినామీ మెగా కృష్ణారెడ్డి టీవీ9 కొనుగోలు చేశాడు. తెలంగాణలో రవిప్రకాశ్ నుంచి ఇబ్బంది రాకుండా ఉండేందుకు మైం హోం రామేశ్వరరావుని యాజమాన్యం కుర్చీలో ఉంచారు.రామేశ్వరరావు జీయర్ స్వామిని అడ్డంపెట్టుకుని రియల్ దందాలు నడిపించుకుంటూ హాయిగా ఉండేవాడు. జగన్ కోసం టీవీ9 చేసే అకృత్యాలన్నీ మైహోం రామేశ్వరరావుకి చుట్టుకుంటున్నాయి. ఈ పాపాలు తాను మోయలేనని మైం హోం వాళ్లు చెప్పేశారు.ఎన్నికలు అయిపోయాయి. ఇక ముసుగులు పని కూడా లేదని నిర్ణయానికి వచ్చిన జగన్ అండ్ కో టీవీ9ని కూడా సాక్షి యాజమాన్యంలోకి తీసుకుంది.ముందుగా నేమాని భాస్కర్ ని సంస్థలోకి ప్రవేశపెట్టింది. రవిప్రకాశ్ దగ్గర ఉండి, ఆయనకే దెబ్బకొట్టిన రజనీకాంత్…రేపు తమకూ దెబ్బ కొట్టడన్న గ్యారెంటీ ఏంటని.. రజనీకాంత్ ని తప్పించేందుకు నేమాని భాస్కర్ రూపంలో పొమ్మనలేక పొగబెట్టింది. టీవీ9 హ్యాండోవర్ చేసుకున్నాక..తమ బినామీలతో కొనిపించిన ఎన్టీవీ,10టీవీలు కూడా సాక్షిలో మిర్జ్ చేస్తారని మీడియా సర్కిళ్లలో జోరుగా ప్రచారం సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారుతో యుద్ధం చేయాలని, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడితే తనకు చుక్కలు చూపిస్తారని…ఈ దాడులు తట్టుకోవాలంటే…అతి పెద్ద మీడియా సామ్రాజ్యం తనకు అవసరం అని భావిస్తున్నారట జగన్ రెడ్డి.ఈ దిశగానే సాక్షి నెట్ వర్క్ కిందకే తమ తోకచానళ్లు టీవీ9, 10టీవీ, ఎన్టీవీని తీసుకొస్తున్నారని విశ్లేషణలు సాగుతున్నాయి
???? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో హీట్ పుట్టిస్తోంది. సుమోటోగా స్వీకరించిన హైకోర్ట్ విచారణ చేపట్టాలని కూడా నిర్ణయించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బాంబు పేల్చారు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్. ప్రముఖ నాయకుల ఫోన్స్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మాజీమంత్రి డొక్కా ఆరోపణలు చేసిన కొద్దిసేపటికే.. అమరావతి సచివాలయంలోని ఐటీ విభాగంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఉద్యోగుల కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌లతో పాటు ఇతర వస్తు సామాగ్రిని పరిశీలించారు. పలువురి నుంచి పెన్ డ్రైవ్‌లు, డేటా హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. సర్వర్‌లలో డేటా తొలగించే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణల క్రమంలో ఈ తనిఖీలు జరగడం హాట్ టాపిక్‌గా మారింది.మరోవైపు రెవెన్యూ శాఖలో కీలక దస్త్రాల ప్రాసెస్ నిలిపివేయాలని ఆదేశించారు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ. మంత్రి పేషిలోని రికార్డులు, డాక్యుమెంట్లు జాగ్రత్తపరచాలని సిబ్బందికి సూచించారు. కాంట్రాక్టర్ల నిధుల విడుదల, భూ కేటాయింపు దస్త్రాలు నిలిపివేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. బదిలీలు, సెలవులపై కూడా నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. అటు సెక్రటేరియట్‌లోని మంత్రుల ఛాంబర్లను సాధారణ పరిపాలన శాఖ స్వాధీనం చేసుకుంది. మంత్రుల పేషిల్లోని ఫర్నీచర్, కంప్యూటర్‌ల వివరాలను నమోదు చేసుకున్న జీఏడీ అధికారులు లెక్కలు సరిపోల్చుకున్నారు. వ్యక్తిగత సామగ్రి సచివాలయం నుంచి బయటకు తీసుకెళ్లేందుకు బిల్లులు చూపించాలని అధికారులు స్పష్టం చేశారు.ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. మరోవైపు కొత్త ప్రభుత్వం కొలువు దీరేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు మాత్రం ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి
???? మావయ్య, బాబాయ్ అంటూ తారక్ విషెస్..
సినిమా ఇండస్ట్రీ నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కి శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. కనివిని ఎరుగని రీతిలో గెలుపు సాధించిన కూటమిని అభినందిస్తూ సినిమా ప్రముఖులు సోషల్ మీడియాలో వేదికగా ట్వీట్లు వేస్తున్నారు,ఎవరెన్ని ట్వీట్లు వేసినా, ఎంతమంది శుభాకాంక్షలు తెలిపినా అందరూ జూనియర్ ఎన్టీఆర్ చెయ్యబోయే ట్వీట్ కోసం వెయిట్ చేస్తున్నారు.ఏంటి బుడ్డోడి సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఇంకా ట్వీట్ వెయ్యలేదు, ఎవరెన్ని అభినందనలు తెలిపినా ఆ ఒక్కరి ట్వీట్ కోసమే అభిమానులు వెయిటింగ్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ చేసారు. మరి అందరూ అనుకున్నట్టుగా ఎన్టీఆర్ మావయ్య, బాబాయ్, బావ, అత్త, మరో బావ గెలుపుకి శుభాకాంక్షలు తెలపడమే కాదు.. జనసేన అధ్యక్షులు పవన్ ని కూడా విష్ చేసారు. ప్రియమైన మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు…మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీ లుగా గెలిచిన @sribharatm కి, @PurandeswariBJP అత్తకి నాశుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన @PawanKalyan కి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. అంటూ చేసిన ట్వీట్ సెకన్స్ లో వైరల్ గా మారింది..
???? రాయలసీమలో ఇంకా రాళ్ల రాజకీయం …‼️అనంతలో ఇంకా రాళ్ల రాజకీయం ఆగడం లేదు …అనంత జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతల ఇళ్ల పై దాడి ..కళ్యణదుర్గం వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు ఇంటిపై దాడి…వైఎస్సార్ సీపీ నేత ఉమామహేశ్వర నాయుడు ఇంటిపై దాడి..కారు ధ్వంసం, ఇంటిపైకి రాళ్లు రువ్విన గుర్తు తెలియని వ్యక్తులు.
????12 న చంద్రబాబు ప్రమాణ స్వీకారం…చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు ఈనెల 9 బదులు 12న ప్రమాణస్వీకారం . ఈనెల 9న మోదీ ప్రమాణ స్వీకారం ఉండటంతో 12వ సీఎంగా ప్రమాణ స్వీకరణ చేయాలని చంద్రబాబు నిర్ణయం.
????ఒంగోలు పార్లమెంటు ప్రజలకు కృతజ్ఞతలు –ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ రెడ్డి.. సన్మానించిన ప్రముఖులు..
2024 సాధారణ ఎన్నికలలో తనను తన సహచర అసెంబ్లీ అభ్యర్ధులను ఆదరించి తెలుగుదేశం, జనసేన మరియు బీ.జే.పి. పార్టీల నాయకులకు, తమకు అఖండ విజయాన్ని చేకూర్చిన ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ఓటరు మహాశయులకు మరియు ప్రజలందరకు కృతఙ్ఞతలు తెలియజేసారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధ్యక్ష్యులు, పవన్ కళ్యాణ్ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు ప్రధాన మంత్రి,నరేంద్ర మోదీ కలసి కూటమిగా ఏర్పడి పోటీ చేసిన 2024 సార్వత్రిక ఎన్నికల కార్యక్రమాలలో ఎండలనక – రాత్రిళ్ళనక పాల్గొని, మమ్ములను ఆదరించి,విశేష కృషి చేసి,త నకు సహచర అసెంబ్లీ అభ్యర్ధులు, ఒంగోలుకు దామచర్ల జనార్ధన్ రావుకి, కొండపికి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి, కనిగిరికి డా.ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డికి,గిద్దలూరుకు ముత్తుముల అశోక్ రెడ్డికి మరియు మార్కాపురానికి కందుల నారాయణ రెడ్డికి అఖండ విజయాన్ని అందించిన పార్లమెంటు ఓటరు మహాశయులకు,తెలుగుదేశం, జనసేన మరియు బీ.జే.పి. పార్టీల నాయకులకు,కార్యకర్తలకు, మాగుంట అభిమానులకు, శ్రేయోభిలాషులకు,ఉద్యోగులకు ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

