అనూహ్య ఓటములు..దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో బంపర్ మెజారిటీలువీరికే..90 వేల నుంచి 59 వేల‌తో..జ‌గ‌న్ గెలిచారు అంతే!.అధికారుల‌కు చంద్ర‌బాబు హెచ్చ‌రిక‌లు..చంద్రబాబును కలిసిన అధికారులు..కంభంలో సంబరాలు .

????అనూహ్య ఓటములు..అమేథీలో స్మృతి ఇరానీ ఓడిపోయారు. గాంధీ- నెహ్రూ కుటుంబానికి విధేయుడైన కిషోరీ లాల్ శర్మ అక్కడ గెలిచారు.2019లో రాహుల్ గాంధీని బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓడించారు, దీంతో నెహ్రూ- గాంధీ కుటుంబ వారసుడు ఒక సాధారణ బీజేపీ నాయకురాలి చేతిలో ఓడిపోయారనే సందేశం పంపారు. ఈసారి స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ పోటీ చేయలేదు, కానీ, కాంగ్రెస్ నుంచి మరో అభ్యర్థిని రంగంలోకి దించి, విజయం సాధించారు.ప్రారంభంలో ప్రధాని మోదీ కూడా బనారస్‌ (వారణాసి)లో వెనుకంజలో కనిపించారు. తర్వాత రౌండ్ రౌండ్‌కు ఆధిక్యాన్ని సంపాదించారు. అయితే ఈసారి బనారస్ నుంచి మోదీ గతంలో మాదిరి భారీ విజయమైతే నమోదు చేయలేకపోయారు.2019 లోక్‌సభ ఎన్నికల్లో బనారస్‌లో దాదాపు నాలుగు లక్షల 80 వేల ఓట్లతో విజయం సాధించారు మోదీ. 63 శాతం ఓట్లు వచ్చాయి.2014లో 56 శాతంతో 5,81,022 ఓట్లు సాధించారు. ప్రత్యర్థి అరవింద్ కేజ్రీవాకు 2,09,238 ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి ప్రధాని మోదీ 1,52,513 ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు.ఉత్తరప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రముఖులు పోటీలో ఉన్నారు.ప్రధాని మోదీ బనారస్ నుంచి, రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నుంచి బరిలోకి దిగారు. రాజ్‌నాథ్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో పాటు ఆయన సతీమణి డింపుల్ యాదవ్ కూడా పోటీ చేశారు.ఉత్తరప్రదేశ్‌లో ఆర్థిక ఇబ్బందులు, వ్యవసాయం, రాజ్యాంగం బలహీనపడటం వంటి అంశాలను సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు లేవనెత్తాయి. రెండు పార్టీలు కూడా రిజర్వేషన్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాయి. రిజర్వేషన్‌ను అంతం చేయాలని బీజేపీ చూస్తోందని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఆరోపించాయి. దీనితో పాటు, భారత ఆర్మీలో రిక్రూట్‌మెంట్ కోసం తీసుకొచ్చిన అగ్నివీర్ పథకంపై కూడా రాహుల్ గాంధీ ప్రశ్నలు లేవనెత్తారు.యూపీలో బీజేపీ 33 సీట్లకు తగ్గిపోవడం ప్రధాని మోదీకి ఎదురుదెబ్బే కాదు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కూడా చేదువార్త అని ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ శరత్ ప్రధాన్ అన్నారు.

???? దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో బంపర్ మెజారిటీలు వీరికే..

లాల్వాణీ (ఇండోర్-బీజేపీ) 11,75,092

రక్బీల్ హుస్సేన్ (ధుబ్రీ-కాంగ్రెస్) 10,12,476

శివరాజ్ సింగ్ చౌహాన్ (విదిశ-బీజేపీ) 8,21,408

సీఆర్ పాటిల్(నవసారి-బీజేపీ) 7,73,551

అమిత్ షా(గాంధీనగర్-బీజేపీ) 7,44,716

అభిషేక్ బెనర్జీ(డైమండ్ హార్బర్-టీఎంసీ)7,10,930

రఘువీర్ రెడ్డి ( నల్గొండ-కాంగ్రెస్) 5,59,905

???? 90 వేల నుంచి 59 వేల‌తో.. జ‌గ‌న్ గెలిచారు అంతే! ఇక, పార్టీకి ఆయువు ప‌ట్టువంటి సీమ‌లో అస‌లు వైసీపీ నామ‌రూపాలు కూడా లేకుండాపోయింది. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఘోరప‌రాజ‌యాన్నే కాదు.. అత్యంత ఘోర అవ‌మానాన్ని కూడా మిగిల్చాయి. ఆయ‌న పార్టీకి చెందిన అతిర‌థ మ‌హార‌థుల‌న‌ద‌గిన నాయ‌కులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మిన‌హా మిగిలిన వారంతా ఈ ఎన్నిక‌ల్లో మ‌ట్టిక‌రిచారు. ఇక‌, కీల‌క నాయ‌కులు కూడా.. టీడీపీకూట‌మి సృష్టించిన‌.. ఓట్ల సునామీలో కొట్టుకుపోయారు.ఇక, పార్టీకి ఆయువు ప‌ట్టువంటి సీమ‌లో అస‌లు వైసీపీ నామ‌రూపాలు కూడా లేకుండాపోయింది. ఏపీలో గరం లేపిన గురుమూర్తి ! ఇంత ఘోర ప‌రాజ‌యం ఓవైపు జ‌గ‌న్‌ను వెంటాడుతుంటే.. మ‌రో ఘోర అవ‌మానం కూడా..ఆయ‌న‌ను వెతుక్కుంటూ వ‌చ్చింది. అదేఆయ‌న గెలిచిన పులివెందుల‌లో ద‌క్కిన మెజారిటీ. 2019లో 90 వేల‌కు పైగా.. మెజారిటీ ద‌క్కించుకుని రాష్ట్రంలో నెంబ‌ర్ వ‌న్ మెజారిటీ ద‌క్కించుకున్న ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు జ‌గ‌న్‌. అయితే.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ ఇంత కుమించి మెజారిటీ వ‌స్తుంద‌ని ఆయ‌న ఆశించారు.ఇదే విష‌యాన్ని ఆయ‌న స‌తీమ‌ణి కూడా.. చెప్పుకొచ్చారు. కానీ, ఫ‌లితం ప్రారంభ‌మైన త‌ర్వాత‌.. లీడ్స్ ఒకానొక ద‌శ‌లో జ‌గ‌న్ ను భ‌య కంపితుల‌ను చేశాయ‌న‌డంలోసందేహం లేదు.అయితే..ఎట్ట‌కేల‌కు 59 వేల మెజారిటీతో జ‌గ‌న్ గ‌ట్టెక్కారు. కానీ,గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న సాధించిన మెజారిటీతో పోల్చుకుంటే.. మాత్రం ఇది అత్యంత నాశిర‌కం.అంతేకాదు.. అంత‌కు మించిన అవ‌మానం కూడా అంటున్నారు ప‌రిశీల‌కులు.జ‌గ‌న్ ఇమేజ్‌తో ఎమ్మెల్యేలు గెలిచార‌ని.. 2019లో చెప్పుకొన్న నాయ‌కులు.. ఇప్పుడు అదే జ‌గ‌న్ కు దారుణ‌మైన మెజారిటీ రావ‌డంతో కిమ్మ‌న‌డం లేదు.ఇదంతా కూడా.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను ప‌ట్టి చూపించింద‌ని ప‌లువ‌రు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ప్ర‌స్తుతం జ‌గ‌న్ సాధించిన మెజారిటీ టీడీపీ కి చెందిన 10 మందికి పైగా ఎమ్మెల్యేలు అంత‌కు మించి సాధించారు. ముఖ్యంగా జ‌గ‌న్ ఓడించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ప‌నిచేసిన టీడీపీ యువ నాయ‌కుడు.. నారా లోకేష్‌కు 91 వేల‌కు పైగా మెజారిటీ లభించింది.ఇక‌, చంద్ర‌బాబును ఓడించాల‌ని అనుకున్నారు.కానీ, ఆయ‌న‌కు 47 వేల‌కుపైగా ఓట్ల మెజారిటీ ద‌క్కింది. ఇలా..జ‌గ‌న్ కంటే.. చాలా మంది భారీ మెజారిటీ సొంతం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా ఒక్క ఛాన్స్ ను స‌రిగా నిల‌బెట్టుకోని ఫ‌లితంగా జ‌గ‌న్ బొక్క‌బోర్లా ప‌డ్డార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

????అధికారుల‌కు చంద్ర‌బాబు హెచ్చ‌రిక‌లు.. విష‌యం ఏంటి? ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ క‌నీ వినీ ఎరుగ‌ని ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ క‌నీ వినీ ఎరుగ‌ని ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. కూట‌మిగా బీజేపీ, జ‌న‌సేన‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లిన టీడీపీ.. సీట్లు పంచుకుంది. ఈ క్ర‌మంలో 144 సీట్ల‌లోనే టీడీపీ పోటీ చేసింది. అయితే.. 135 స్థానాల‌కు పైగా టీడీపీ ఒంట‌రిగానే ద‌క్కించుకుంది.ఇక‌, జ‌న‌సేన పూర్తిగా 21 -స్థానాల్లో పోటీ చేసి 21 చోట్ల విజ‌యం ద‌క్కించుకుంది. ఇలా.. కూట‌మి భారీ విజ‌యంతో దూసుకుపోయింది. అయితే.. ఈ క్ర‌మంలో సీఎంగా చంద్ర‌బాబు ప్ర‌మాణం చేసేందుకు ఇంకా స‌మ‌యం ఉంది.మంచి రోజు.. ముహూర్తం కోసం.. వేచి చూస్తున్నారు.తాను ఓడి.. అన్ననూ ఓడించిన షర్మిల.. ఏపీ ఫలితాలపై ఏమన్నారంటే? అయితే.. సాధారణంగా ఎక్క‌డైనా ప్ర‌భుత్వం మారుతుంటే.. ఫైళ్లు ధ్వంసం చేయ‌డం.. మాయంచేయ‌డం అనేవి ప‌రిపాటిగా మారి పోయాయి. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప్ర‌భుత్వాలు తీసుకున్న నిర్ణ‌యాలు..వివాదాస్ప‌ద అంశాల‌కు సంబంధించిన ఫైళ్ల‌ను మాయం చేస్తుంటారు. గ‌త 2023లో తెలంగాణ ప్ర‌భుత్వం మారిన‌ప్పుడు కూడా ఇలానే చేశార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.ఇది అక్క‌డ పెద్ద వివాదం అయింది. ఇలాంటి ప‌రిస్థితి ఏపీలోనూ ఎదుర‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని గుర్తించిన టీడీపీఅధినేత‌, కాబోయే సీఎం చంద్ర‌బాబు..ముందుగానే ఇలాంటి విష‌యంపై దృష్టి పెట్టారు.అన‌ధికారికంగానే ఆయ‌న సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్టు తెలిసింది.ఏ విభాగం నుంచి ఏ ఒక్క ఫైలు కూడా..మిస్ కావ‌డానికి వీల్లేద‌ని క‌ఠిన ఆదేశాలు జారీ చేసిన‌ట్టు స‌మాచారం.అంతేకాదు.. ఏ ఫైలైనా మిస్స‌యినా.. ధ్వంస‌మైనా..సంబంధింత అధికారుల‌ను బాధ్యుల‌ను చేసి ఖ‌ఠినంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కూడా చంద్ర‌బాబు హెచ్చ‌రించిన‌ట్టు తెలిసింది.ప్ర‌స్తుతం ఉన్న వైసీపీ ప్ర‌భుత్వం..అత్యంత దారుణ‌మైన స్థితిలో ఓడిపోయిన విష‌యం తెలిసిందే.దీంతో చంద్ర‌బాబు ఈ నెల 9న మంచి ముహూర్తంలో అమ‌రావ‌తిలో ప్ర‌మాణం చేయ‌నున్నారు.దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు.

????టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా,మరికొందరు IAS, IPS అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.

కంభంలో మిన్నంటిన సంబరాలు  సంబరాలుగిద్దలూరు లో టిడిపి అభ్యర్థి గా ముత్తుముల అశోక్ రెడ్డి గెలుపొందిన సందర్బంగా కంభం పట్టణం లోని ఆర్టీసీ బస్టాండ్ లో, కందులాపురం లో కేకులు కట్ చేసి బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.. మంగళవారం సాయంత్రం నుండి బుధవారం ఉదయం వరకు బాణసంచా కాలుస్తూనే ఉన్నారు. కార్యక్రమంలో కంభం మాజీ సర్పంచ్ స్టార్ భాష, టిడిపి నాయకులు కొత్తపల్లి వెంకటేశ్వర్లు, రజాక్ బాషా, జిలాని, రహిమాన్ ఫజల్, మస్రోద్ సుకూర్, అశ్వక్, నలబుల వెంకటేశ్వర్లు, తోట శీను, ఆర్టీసీ జిలాని, ఖాదర్ మాస్టర్,తదితరులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..