బీజేపీకి ఆయుధంగా ఫోన్ ట్యాపింగ్‌!..కౌం’ట్రిక్స్’ కౌంటింగ్ లో ఏజెంట్లదే ప్రధానపాత్ర.. రాష్ట్రపతి అవార్డు అందుకున్న ఏసిపి కిరణ్ కుమార్..ముగ్గురు యువతులు గల్లంతు..ఇద్దరు మృతి.. జీవన్ రెడ్డి అనుచరుడు దారుణ హత్య.. క్షుద్ర పూజలు చేస్తున్న 9 మంది అరెస్ట్…వ్యక్తి అనుమానాస్పద మృతి

????బీజేపీకి ఆయుధంగా ఫోన్ ట్యాపింగ్‌! ఈ కేసును వాడుకుని తెలంగాణ‌లో రాజ‌కీయ ముఖ చిత్రాన్ని మార్చేందుకు బీజేపీ క‌స‌ర‌త్తులు చేస్తోంద‌నే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ‌లో పుంజుకోవాల‌ని చూస్తున్న బీజేపీకి ఆయుధంగా ఫోన్ ట్యాపింగ్ కేసు దొరికింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ కేసును ఉప‌యోగించుకుని అటు అధికార కాంగ్రెస్‌ను, ఇటు బీఆర్ఎస్‌ను దెబ్బ‌తీసేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌నే చెప్పాలి. ల‌క్ష్మ‌ణ్‌, బండి సంజ‌య్ త‌దిత‌ర బీజేపీ నేత‌లు ఇప్పుడీ ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐ విచార‌ణ కోర‌డ‌మే అందుకు రుజువ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఈ కేసును వాడుకుని తెలంగాణ‌లో రాజ‌కీయ ముఖ చిత్రాన్ని మార్చేందుకు బీజేపీ క‌స‌ర‌త్తులు చేస్తోంద‌నే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వ హామీల‌పై ప్ర‌శ్నించ‌కుండా బీజేపీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసునే ప్ర‌ధానంగా ప్ర‌స్తావిస్తోంది. ఈ కేసును సీబీఐతో విచారించాల‌ని డిమాండ్ చేస్తోంది. ఇప్ప‌టికే కేసీఆర్ ఆదేశాల మేర‌కే ఫోన్ ట్యాపింగ్ చేసిన‌ట్లుగా రాధాకిష‌న్ రావు స్ప‌ష్టం చేశారు. దీంతో కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వ‌కుండా పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇప్పుడు సీబీఐ విచార‌ణ కోరుతూ బీజేపీ త‌న‌దైన రాజ‌కీయం చేసేందుకు ఎత్తుగ‌డ వేస్తుంద‌నే అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే ఈ కేసులో కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగిసుకుంటోంది. బీజేపీ ఈ కేసును వాడుకుని కేసీఆర్‌ను లొంగ‌దీసుకునే ప్ర‌య‌త్నాలూ చేస్తుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అందుకే సీబీఐని రంగంలోకి దించాల‌ని బీజేపీ డిమాండ్ చేస్తుంద‌న్న వాద‌న కూడా ఉంది. దీని వెనుక కేసీఆర్‌ను సీబీఐ ఉచ్చులో బంధించి, బీఆర్ఎస్ మ‌ద్ద‌తుతో రేవంత్ స‌ర్కారును కూల్చేందుకు బీజేపీ వ్యూహం ఉంద‌నే టాక్ కూడా వినిపిస్తోంది.
???? కౌంట్రిక్స్.. కౌంటింగ్ లో ప్రధాన పాత్ర..కౌంటింగ్ష్ ఏజెంట్లదే..మరికొన్ని గంటల్లో ఎన్నికల కౌంటింగ్ జరగనుందనే సంగతి తెలిసిందే. కూటమి, వైసీపీ మధ్య ప్రధానంగా పోటీ ఉన్న నేపథ్యంలో ప్రతి ఓటు కీలకంగా మారనుంది. టీడీపీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు, వైసీపీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ నేతలు సూచనలు చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ ఫైట్ లో వైసీపీకి ఇప్పటికే వరుస షాకులు తగిలాయి.వైసీపీ సుప్రీం కోర్టును పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం ఆశ్రయించగా అక్కడ ఎలాంటి తీర్పు వస్తుందో చూడాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి కూటమి నేతల తీరు ఒకలా ఉంటే వైసీపీ తీరు మరోలా ఉండటం ఏపీ ఓటర్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కూటమి ఆశలు పెట్టుకున్న స్థాయిలో వైసీపీ మాత్రం ఆశలు పెట్టుకోలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
గతంతో పోల్చి చూస్తే రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య భారీగా పెరిగిందని సమాచారం అందుతోంది. కౌంటింగ్ కేంద్రాలలో తప్పు జరిగితే అస్సలు అంగీకరించవద్దని ప్రధాన పార్టీలు ఏజెంట్లకు ఇప్పటికే సూచించడం జరిగింది.పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నిబంధనలకు సంబంధించి ఏజెంట్లకు ఏ మాత్రం అవగాహన లేకపోయినా పార్టీలకు కొంప కొల్లేరే అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
కౌంటింగ్ కేంద్రాలలో ఏజెంట్లు ఎక్స్ట్రాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఆవాంతరాలు సృష్టిస్తే నిర్ధాక్షిణ్యంగా ఆ ఏజెంట్లను బయటకు పంపించడంతో పాటు చట్టపరంగా వాళ్లపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. పోలింగ్ ఏజెంట్లు నేర్పుతో వ్యవహరిస్తే మాత్రమే మోసాలు జరగకుండా జాగ్రత్త పడే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఏజెంట్లు గొడవ పడకుండా సమయస్పూర్తితో వ్యవహరించాల్సి ఉంటుంది. రూల్స్ పాటిస్తూ తప్పులను వేలెత్తి చూపిస్తే మాత్రం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగే అవకాశాలు అయితే ఉంటాయి.
????రాష్ట్రపతి అవార్డు అందుకున్నఏసిపి కిరణ్ కుమార్..

హైదరాబాద్ లోని క్రైమ్ డిపార్ట్మెంట్లో ఏసీపీగా పనిచేస్తున్న ఏ సి పి కే ఎం కిరణ్ కుమార్ చేసిన విశిష్ట సేవలకు గాను తెలంగాణ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రపతి సేవా పథకాన్ని అందుకున్నారు.ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా బేస్తవార పేట కు చెందిన ఆయన ఎస్సై స్థాయి నుంచి డిఎస్పీగా ఏసిపి గా పనిచేసి ఎన్నో క్లిష్టమైన కేసులు చేధించి ఉన్నతాధికారులతోపలుమార్లు ప్రశంసలు అందుకున్నారు. క్రమశిక్షణతో నిజాయితీకి మారుపేరుగా నిలిచి అటు పోలీసుశాఖలో ఇటు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సాధించారు.ఆయన తండ్రి డాక్టర్ తిరుమలాచారి కర్నూలులో ఎంతో మందికి వైద్య సేవలు అందించారు. బేస్తవారిపేట, కంభం  పరిసర గ్రామాలలో వారికి కూడా ఆయన ఎంతోమందికి  వైద్య సేవలు అందించి ఎంతో మంచి పేరు గడించారు.కాగా ఆయన కుమారుడైన కిరణ్ కుమార్ అత్యంత విశిష్టమైన రాష్ట్రపతి పతకం అందుకోవడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు మిత్రులు శ్రేయోభిలాషులు, అధికారులు ప్రశంసల జల్లులు కురిపించారు. ఆయన మరిన్ని సమానత శిఖరాలను అధిరోహించాలని కోరారు.

???? మూఢనమ్మకాలు, మంత్రాలు, చేతబడుల పేరుతో ప్రజలను మోసం చేసే వారిపై దొంగ స్వాముల భరతం పట్టారు పోలీసులు. ఏకంగా బైండోవర్ చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూఢనమ్మకాలు, మంత్రాలు, చేతబడులకు సంబంధించిన వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు సీరియస్ యాక్షన్ షురూ చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అదేశాలు ఇవ్వడంతో జిల్లా వ్యాప్తంగా మంత్రాల పేరుతో ప్రజలను మోసం చేసే వారిపై దాడి చేశారు. దొంగ స్వాములు, బాబాల ఇండ్లు, స్థలాలపై ఏకకాలం లో దాడులు చేసి సోదాలు నిర్వహించారు. 11 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటుగా, 9 మందిని బైండోవర్ చేశారు.కేసులు నమోదు అయిన బాబాలు, స్వాముల పేర్లను పోలీసులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా జరిపిన దాడుల్లో జవ్వాజి ధనుంజయ్, అంబటి నర్సయ్య, బొమ్మేళ మల్లేశం, జాగిరి పర్శరాములు, గొట్టే రామస్వామి, వెంకట రాములు, శ్రీనివాస్, సురేందర్, శ్రీకాంత్, ప్రవీణ్, కడమంచి రామస్వామిలపై కేసులు నమోదు చేశారు. మిగితా 9 మంది గొట్టే రవీందర్, రామకృష్ణ, దయాకర్, మహమ్మద్ మజర్, అన్నలదాస్ దశరథం, కంపెళ్లి మహేష్, నడికుల నాగేంద్ర, టేకు నర్సయ్య, కడమంచి దుర్గయ్యలను ఎమ్మార్వో ముందు బైండోవర్ చేశారు.

???? అనకాపల్లి జిల్లా…అచ్యుతాపురం మండలం తంతడి బీచ్ లో ముగ్గురు యువతులు గల్లంతు..ఇద్దరు యువతులు మృతి ఒకరి పరిస్థితి విషమం..

విషమంగా ఉన్న మహిళను మెరుగైన చికిత్స కోసం విశాఖ తరలింపు…బీచ్ లో సెల్ఫీ తీస్తుండగా కాలు జారిపడి సముద్రంలో గల్లంతు…కాపాడిన అక్కడే ఉన్న మత్స్యకారులు అప్పటికే ఇద్దరు యువతులు మృతి…మృతిచెందిన ఇద్దరి యువతులు అక్కా చెల్లెలుగా గుర్తింపు మాకవరపాలెం మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన నూక రత్నం,కనకదుర్గ గా గుర్తింపు..

???? గుంటూరు జిల్లా..మంగళగిరి..గౌతమ బుద్ధ రోడ్డు బీఎండబ్ల్యూ షోరూమ్ ఎదుట అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి…రోడ్డు పై రెండు లారీల మధ్య రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తి…మృతుడు మంగళగిరి చెందిన లారీ క్లీనర్ గా గుర్తింపు….సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పట్టణ పోలీసులు

???? కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి అనుచరుడు నరేష్ దారుణ హత్య,..నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడైన ధర్మారం మండలం కటికెనపల్లికి చెందిన రేండ్ల నరేష్ ఆదివారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. తీవ్ర గాయాలైన నరేష్ ను హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ నరేష్ సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..