మనుషులను టార్గెట్ చేసిన బర్డ్ ఫ్లూ..200 కోట్ల స్కామ్ లో నిందితుల అరెస్టు..బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఎయిర్ హోస్టేస్స్ అరెస్టు..వైవి ని కలిసిన ఆదిమూలపు..జూన్ 3 నుంచి 5 వరకు 144 సెక్షన్- కలెక్టర్ దినేష్ కుమార్..ట్రావెల్స్ బస్సు బోల్తా..ఉపాధి కూలీలకు వేసవి భత్యం చెల్లించాలి సిఐటియు..

????మనుషులను టార్గెట్ చేసిన బర్డ్ ఫ్లూ… సీడీసీ ఏమి చెబుతుందంటే…? వాస్తవానికి యూరప్‌ లోనే కాకుండా, అమెరికన్ రైతులు కూడా పశువులకు కోడి వ్యర్థాలను తినడానికి అనుమతించబడ్డారని తెలుస్తుంది.ఇన్నాళ్లూ పక్షులు, జంతువులకు పరిమితమైన బర్డ్‌ ఫ్లూ..ఇప్పుడు మనుషులనూ టార్గెట్ చేస్తున్నట్లుంది. ఈ క్రమంలో ఇప్పటికే ముగ్గురికి సోకింది. ఈ మేరకు పాడి పశువులలో ప్రస్తుత వైరస్ వ్యాప్తికి సంబంధించిన బర్డ్ ఫ్లూ తాజాగా మూడవ మనిషికి సోకిందని అమెరికా అధికారులు నివేదించారు. దీంతో… మరోసారి బర్డ్ ఫ్లూ వైరస్ విషయం వైరల్ గా మారింది. అమెరికాలో మనుషులకూ బర్డ్ ఫ్లూ వైరస్ సోకుతుంది. ఈ క్రమంలో తాజాగా మూడో కేసు నమోదైంది. మిచిగాన్ వ్యవసాయ కార్మికుడు ఏప్రిల్‌ లో టెక్సాస్‌ లో మొదటి కేసు కాగా.. మిడ్‌ వెస్ట్రన్ రాష్ట్రంలో ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి రెండో కేసు. ఈ క్రమంలో తాజాగా మూడో కేసు నమోదైందని, అతనికి ఆవుల నుంచి ఈ వైరస్ సోకిందని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఒక ప్రకటనలో ఈ మూడు కేసులూ ఆవుల నుండి మనుషులకు వ్యాపించాయని..ఇవి మనిషి మనిషికీ భిన్నంగా ఉన్నాయని.. ఇది మరింత ఆందోళన కలిగిస్తుందని పేర్కొంది. ఈ వ్యాది సోకినవారు దగ్గు, కళ్ల సమస్యలతో బాధపడుతున్నారని తెలిపింది. ప్రస్తుతం వీరిని ఇంట్లోనే ఉంచి యాంటీవైరల్ మెడిసిన్ ఒసెల్టామివిర్ తో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. సదరు కార్మికుడు వ్యక్తిగత రక్షణ పరికరాలను ధరించలేదని, పాడి పశువులతో సన్నిహితంగా ఉన్నవారికి వ్యక్తిగత రక్షణ ముఖ్యమని ఈ మేరకు ఆరోగ్య అధికారులు సిఫార్సు చేశారని మిచిగాన్ ఆరోగ్య విభాగం తెలిపింది. వాస్తవానికి యూరప్‌ లోనే కాకుండా, అమెరికన్ రైతులు కూడా పశువులకు కోడి వ్యర్థాలను తినడానికి అనుమతించబడ్డారని తెలుస్తుంది. దీంతో… బర్డ్ ఫ్లూకి ఇది ప్రమాద కారకంగా ఉండవచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు. మరికొంతమంది యూఎస్ అధికారులు మాత్రం… బర్డ్ ఫ్లూ ఆవులకు సోకడానికి అడవి పక్షులే కారణమని విశ్వసిస్తున్నారు. కాగా… బర్డ్‌ ఫ్లూ వైరస్‌ సోకిన ఆవుల పచ్చి పాలను అలాగే తాగితే, మనుషులకు కూడా ఆ వైరస్‌ సోకే ప్రమాదముందని అట్లాంటాలోని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ పరిశోధకులు తెలిపారు. వైరస్‌ సోకిన జంతువుల పాలను నేరుగా తీసుకోవడం మానుకోవాలని, పాశ్చరైజేషన్‌ చేశాకే వాటిని వినియోగించాలని సూచించారు.
???? బంగారం అక్రమ రవాణా చేస్తూ ఓ ఎయిర్హోస్టెస్ అధికారులకు చిక్కింది. ఆమె మలద్వారంలో దాదాపు కిలో బంగారాన్ని దాచి స్మగ్లింగ్ కు పాల్పడ్డారు….కన్నూర్: దేశంలోకి బంగారం అక్రమ రవాణాను అధికారులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నప్పటికీ కొందరు స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాజాగా కేరళలో ఓ విమానయాన సంస్థ మహిళా ఉద్యోగి ఈ అక్రమ రవాణాకు యత్నిస్తూ అధికారులకు చిక్కింది.నిందితురాలు తన రహస్య అవయవాల్లో కేజీ బంగారాన్ని దాచినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మే 28న మస్కట్ నుంచి కన్నూర్ ఎయిరోపోర్టు కు ఓ విమానం చేరుకుంది. అందులో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఆర్ఎ అధికారులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఆ విమానంలో ఎయిర్హోస్టెస్ గా ఉన్న సురభి ఖాతూన్ ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో ఆమెను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మలద్వారం లో 960 గ్రాముల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.విచారణ అనంతరం నిందితురాలిని కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం 14 రోజుల కస్టడీ విధించింది. ఆమెను కన్నూర్ మహిళా జైలుకు తరలించారు. ఎయిర్లైన్కు చెందిన సిబ్బంది ఇలా రహస్య భాగాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేయడం దేశంలో ఇదే తొలిసారని డీఆస్ఐ వర్గాలు వెల్లడించాయి.

????రూ.200 కోట్ల స్కాం కేసులో కీలక పరిణామం..వాణి బాల అరెస్ట్!…

నిమ్మగడ్డ వాణిబాల అనే దంపతులు రూ.200 కోట్ల కుచ్చుటోపీ పెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించింది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.సామాన్య ప్రజలకు డిపాజిట్ల పేరుతో ఓ దంపతులు రూ.200 కోట్ల కుచ్చుటోపీ పెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించింది. కొన్ని రోజుల క్రితమే ఈ దంపతలు స్కామ్ వ్యవహారం బయటపడింది. ఈ స్కామ్ వెలుగులోకి వచ్చిన సమయంలోనే బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ (టీఎస్ సీఏబీ ) నిమ్మగడ్డ వాణి బాలని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన నిమ్మగడ్డ వాణీ బాల, మేక నేతాజీ దంపతులు. వీరు హైదరాబాద్ లోని సైదాబాద్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. వాణీ బాల హైదరాబాద్ అబిడ్స్ లోని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆమె భర్త నేతాజీ, కొడుకు శ్రీ హర్షలు ..శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజేస్ పేరుతో చిట్ ఫండ్ కంపెనీని ప్రారంభించారు. ఈ క్రమంలోనే వాణి బాల..తన బ్యాంకులో డిపాజిట్లు చేసేందుకు వచ్చే వినియోగదారులకు మాటలు కలిపి…వారిని తమ సంస్థలో చీటీలు కట్టేలా వారిని మార్చేది. ఈ క్రమంలోనే తాను పని చేసే బ్యాంకుకు సమీపంలో తమ వాళ్లది మరో ఆఫీసును కూడా తెరిపించింది ఆ విధంగా 517 మంది నుండి రూ. 200 కోట్లు కాజేశారు. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లోఆమె రిటైర్డ్ అవుతుండగా.. సడెన్ గా సెలవులు పెట్టింది. ఇదే సమయంలో దంపతుల ఫోన్లు స్విచ్చాఫ్ కావడంతో బోర్డు తిప్పేశారని అర్థం చేసుకున్న కస్టమర్లు లబోదిబోమంటుతమకు న్యాయం చేయాలంటూ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఈ స్కామ్ బయటకు రావడంతో వాణీ బాలను విధుల్లో నుండి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు వాణి బాల చిట్ ఫండ్ కంపెనీ శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ పైన సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు డిసిపి ఎన్ శ్వేత పర్యవేక్షణలో ఏసిపి కేఎం కిరణ్ కుమార్ దర్యాప్తు చేపట్టారు .ఈ క్రమంలో తాజాగా ప్రధాన నిందితురాలు నిమ్మగడ్డ వాణిబాలను ఆమె భర్త నేతాజీ, కొడుకు హర్షలను అరెస్ట్ చేశారు.

????జిల్లా వ్యాప్తంగా జూన్ 3 నుంచి 5 వ తేదీ వరకు 144 సెక్షన్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారి చేసిన కలెక్టర్ దినేష్ కుమార్..4వ తేదీన ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్లు లెక్కించనున్న నేపథ్యంలో ప్రజలు గుమి గూడకుండా  ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 144 సెక్షన్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ…..3వ తేదీ ఉదయం 6 నుంచి 5వతేదీ సాయంత్రం ఆరు గంటల వరకు144 సెక్షన్ అమలులో ఉంటుందన్న కలెక్టర్ దినేష్ కుమార్

????ట్రావెల్స్ బస్సు బోల్తా.. 20 మంది గాయాలు..పల్నాడు జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టిన తరుణంలోనే… బస్సులో ఉన్న 20 మందికి గాయాలు కాగా, ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు.. అక్కడి కి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాదు నుంచి ఒంగోలు కందుకూరు వెళ్తున్న సమయంలోనే కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది.

ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది…

????ఉపాధి కూలీలకు వేసవి భత్యం ఇవ్వాలి..వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు డిమాండ్.. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు వేసవి భత్యం ప్రభుత్వ పునరుద్ధరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని కందులూరులో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల పని ప్రదేశంలో వ్యవసాయ కార్మిక సంఘం బృందం పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలను ప్రోత్సహించే ఉద్దేశంతో గతంలో ఫిబ్రవరి నెలలో చేసిన పనికి 20% మార్చి నెలలో 30% ఏప్రిల్ మే నెలలో 35 శాతం వేతనాన్ని పెంచి అదనపు పారితోషకంగా ఇచ్చేవారని తెలిపారు. ప్రస్తుతం దాన్ని రద్దు చేయడం అన్యాయమని అన్నారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో 50 డిగ్రీల స్థాయిలో ఎండలు కాస్తున్నాయని, తీవ్రమైన వడగాళ్లు వీస్తున్నాయని, అయినా పేదలు పొట్టకూటి కోసం ఈ పనులకు వస్తున్నారని తెలిపారు. అటువంటి స్థితిలో ఏదైనా ఊహించని ప్రమాదం జరిగితే వారి జీవితాలు అస్తవ్యస్తమవుతాయని అన్నారు. మానవతా హృదయంతో పేదలను ఆదుకునేందుకు గతంలో ఇచ్చిన విధంగానే సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో పలుగు, పార,తట్ట లాంటి పనిముట్లు ప్రభుత్వ నిధులతో కొని ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే వారని, వాటిని కూడా తిరిగి పునరుద్ధరించాలని కోరారు. ఈ పథకం ద్వారా పేదల చేతుల్లోకి ప్రభుత్వం నిధులు వస్తే అవి వారి కొనుగోలు శక్తిని పెంచుతాయని పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు దేశంలో 20 కోట్ల మంది పేదలు పనిచేస్తున్న ఉపాధి హామీకి నిధులు పెంచడం ద్వారా గ్రామీణ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వాలు ఈ డిమాండ్లను సానుకూలంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.????కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వి. మోజస్ మాట్లాడుతూ కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని, పని అడిగిన వారందరికీ పని కల్పించాలని, లేదా చట్ట ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు. ప్రతి సంవత్సరం 100 రోజుల పనికి ప్రణాళిక రూపొందించగా అవి 50 రోజుల్లోపే అయిపోతున్నాయని అన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులవల్ల పని దినాలు తగ్గుతున్నాయని దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏడాదికి ప్రభుత్వం 200 రోజులకు పని దినాలు పెంచాలని డిమాండ్ చేశారు.

7k network
Recent Posts

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*