మాపై చేతబడి,క్షుద్ర పూజలు చేపిస్తున్నారు.. బాబా పిలుస్తున్నాడని వెళ్లి శవాలుగా మారిన..”శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు-ఎస్పీ మల్లికాగార్గ్..గిద్దలూరులో కార్డన్ సెర్చ్..లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారులు

క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.త‌న‌కు, రాష్ట్ర ముఖ్య‌మంత్రి సిద్ద రామ‌య్య‌కు కీడు త‌ల‌పెడుతున్నార‌ని.. ఈ క్ర‌మంలో ఓ పార్టీ నేత‌లు త‌మ‌పై చేత‌బ‌డి స‌హా క్షుద్ర పూజ లు చేయిస్తున్నార‌ని తెలిపారు.

త‌మ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు ఎప్ప‌టి నుంచో కుట్ర చేస్తున్న‌వారే ఇలా చేస్తున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.కేర‌ళలో ప్ర‌త్యేకంగా చేత‌బ‌డి, క్షుద్ర పూజ‌లు చేయ‌డంలో దిట్ట‌లైన మాంత్రికుల‌ను పెట్టి త‌మ‌పై ఈ పూజ‌లు చేయిస్తున్న‌ట్టు తెలిసింద‌న్నారు.తాజాగా డీకే మీడియాతో మాట్లాడుతూ..త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌డం కేంద్రంలోని న‌రేంద్ర మోడీకి రాష్ట్రం లోని జేడీఎస్‌కు ఏమాత్రం ఇష్టం లేద‌న్నారు. అందుకే త‌మ ప్ర‌భుత్వం కూల్చేయాల‌ని వారు కుట్ర‌లు చేస్తున్నార‌ని చెప్పారు. కేర‌ళ మాంత్రికులు ర‌హ‌స్య ప్రాంతంలో త‌మ‌పై చేత‌బ‌డి, క్షుద్ర పూజ‌లు చేస్తు న్న‌ట్టు స‌మాచారం అందింద‌న్నారు. త‌మకు వ్య‌తిరేకంగా శ‌త్రు భైర‌వి యాగం కూడా చేయిస్తున్న‌ట్టు చెప్పారు. అయితే ఈ క్షుద్ర పూజ‌ల‌ను తాము పట్టించుకోబోమని తెలిపారు. తాము ప్ర‌జ‌ల‌నే న‌మ్ముకున్నామ‌ని..పూజ‌ల‌ను కాద‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏడాది కాలంగా సుప‌రిపాల‌న సాగుతోంద‌ని డీకే చెప్పారు.దీనిని చూసి ఓర్చుకోలేక పోతున్నార ని బీజేపీ,జేడీఎస్‌ల‌పై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. “నేను, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కాంగ్రెస్ పార్టీ నాశనం కావాలని వారు(బీజేపీనా, జేడీఎస్సా అన్న‌ది క్లారిటీ ఇవ్వ‌లేదు) కేరళలో క్షుద్ర పూజ‌లు, చేత‌బ‌డులు చేయిస్తున్నారు. కేరళలోని రాజరాజేశ్వరి దేవాలయం చుట్టుపక్కల ఉన్న నిర్జన ప్రాంతంలో శత్రువులను చంపేందుకు చేసే రాజకంటకం, మరన్ మోహన స్తంభన యాగం చేస్తున్నారు“ అని డీకే వ్యాఖ్యానించారు.ఈ యాగం, క్షుద్ర పూజ‌ల్లో భాగంగా పంచబలి సమర్పిస్తున్నారని తనకు సమాచారం ఉందని డీకే తెలిపారు.21 ఎర్ర రంగు మేకలు,3 గేదెలు,21 నల్ల రంగు గొర్రెలు,5 పందులను బ‌లి ఇస్తున్న‌ట్టు త‌న‌కు ప‌క్కాగా స‌మాచారం ఉంద‌న్నారు.అయితే.. తాము ఈ యాగాల‌కు,పూజ‌ల‌కు భ‌య‌ప‌డేది లేద‌న్నారు. ప్ర‌జ‌ల‌ను న‌మ్ముకున్నామ‌ని.. ప్ర‌జ‌ల‌తోనే ఉన్నామ‌ని చెప్పారు.

????ఎన్నికల వేళ .. రూ.1100 కోట్లు సీజ్..
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆదాయపన్ను శాఖ నిర్వహించిన సోదాల్లో భారీగా నగదు, బంగారాన్ని సీజ్ చేశారు.
అధికార వర్గాల ప్రకారం..మే 30 వరకు ఆదాయపు పన్ను శాఖ మొత్తం రూ.1100 కోట్ల విలువైన క్యాష్, నగలను సీజ్ చేసింది.2019 నాటి ఎన్నికలతో పోలిస్తే సీజ్ చేసిన అమౌంట్ 182% అధికం.గత లోక్‌సభ ఎన్నికల వేళ రూ.390 కోట్ల నగదును సీజ్ చేశారు.
???? బాబా పిలుస్తున్నాడు అంటూ హిమాలయాలకు బయలు దేరారు ముగ్గురు అమ్మాయిలు. ఇంట్లో ఓ లెటర్ కూడా రాశారు. తమ కోసం వెతకొద్దని, మూడు నెలల తర్వాత ఇంటికి తిరిగొస్తామని.. కానీ విశ్వాసం ఉండవచ్చు కానీ అంధ విశ్వాసం ఉండకూడదు. ఇదే మూఢత్వంగా మారిపోతుంది కొన్ని సార్లు. మూఢత్వం మనస్సును ఆలోచింపనివ్వకుండా చేస్తుంది. ఆధ్యాత్మిక చింతన మాటున అంధ విశ్వాసాలకు బలౌతున్నారు.

చదువులేని వాళ్లు కాదు.. వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ సైతం ఇదే దారిలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ముగ్గురు అమ్మాయిల జీవితాలను చిధ్రం చేసింది ఇదే అంధ విశ్వాసం. బాబా పిలుస్తాడని, ఆధ్యాత్మిక చింతనలో బతికేస్తూ.. హిమాలయాలకు వెళ్లానని ఇంట్లో ఓ ఉత్తరం ముక్క రాసి పరారయ్యాడు ఈ బాలికలు. వెతికితే.. తాము తిరిగి రామని కూడా బెదిరించారు. అందులో తాము త్వరగానే ఇంటికి వస్తామని చెప్పారు. కానీ నిజంగానే త్వరగానే వచ్చారు సజీవంగా కాదు.. శవాలుగా. కన్న తల్లిదండ్రులకు శోక సంద్రంలో ముంచేశారు.‘బాబా పిలుస్తున్నాడు.. హిమాలయాలకు వెళ్తున్నాం.. మూడు నెలల తర్వాత తిరిగొస్తాం.. ఈలోపు మీరు మా గురించి వెతికితే ఆత్మహత్య చేసుకుంటాం. ’ అని లెటర్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయారు ముగ్గురు అమ్మాయిలు. వీరిది బీహార్ రాష్ట్రం. వీరు ముగ్గురు స్నేహితులు. తొమ్మిదో తరగతి చదువుతున్నారు. గౌరీ కుమారి, మోహినీ కుమారి, మాయా కుమారి స్కూల్ మేట్స్. ఈ ముగ్గురు ఈ నెల 13న ఇంట్లో నుండి పరారయ్యారు. బాబా పిలిచారని, హిమాలయకు వెళ్లాలని, మూడు నెలల తర్వాత అనగా ఆగస్టు 13న తిరిగి ఇంటికి వస్తామంటూ లేఖ రాసి వెళ్లిపోయారు. తమ కోసం పేరెంట్స్ వెతకకుండా.. ఓ బెదిరింపు కూడా చేశారు. తమను వెతికితే.. ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు. అయితే అన్నంత పని చేశారు.ఇప్పుడు మధురలోని బజ్జా బ్రిడ్జి సమీపంలోని రైల్వే ట్రాక్ పై ముగ్గురు అమ్మాయిల మృతదేహాలను గుర్తించారు పోలీసులు. వీరిని మిస్సైన గౌరీ కుమారి, మోహినీ కుమారి, మాయ కుమారిలుగా గుర్తించారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ నుండి నగరానికి చేరుకుని, వారి తమ కుమార్తెలుగా గుర్తించారు. కన్నీరు మున్నీరు అవుతున్నారు. కాగా, ముగ్గురు అమ్మాయిల మొబైల్ ఫోన్లు మాయమయ్యాయి.అయితే బీహార్ పోలీసులు తమ కేసును సరిగ్గా పట్టించుకోలేదని, లేకుంటే తమ పిల్లలు బతికేవారంటూ ఆరోపిస్తున్నారు బాలికల తల్లిదండ్రులు. స్థానిక పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే పోలీసులు ఈ ఆరోపణలు ఖండించారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసుకున్నామని, బాలికలు స్వచ్చందంగా ఇంటి నుంచి వెళ్లిపోయారని, వారు వెళ్లిపోవడానికి గల కారణాలను వివరిస్తూ లేఖలు రాసి వెళ్లిపోయారని, వారి కోసం వెతుకుతున్నామని, మథురలో మృతదేహాలు లభ్యమైన విషయం తెలియడంతో వారి కుటుంబాలకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు.

????ప్రజలు ఎన్నికల ఫలితాల అనంతరం సంయమనం పాటించాలి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేస్తే సహించేది లేదు- పల్నాడు జిల్లా ఎస్పీ మల్లిక గర్గ్ ..

పోలీసు సిబ్బంది లో మనోధైర్యాన్ని నింపుతూ, ప్రజలకు పోలీసులపై నమ్మకాన్ని కలిగిస్తూ సుమారు 350 మంది సాయుద బలగాలతో నరసరావుపేట టౌన్‌లో ఏర్పాటు చేసిన మెగా ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్న పల్నాడు జిల్లా ఎస్పీ మలిక గర్గ్ ఐపీఎస్.అనంతరం వినుకొండ చేరుకుని బస్ స్టాండ్ సెంటర్లో ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని వారిని ఉద్దేశించి మాట్లడుతూ ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఫలితాల వెలువడిన తరువాత ప్రజలు సంయమనం పాటించాలని చెప్పారు, ప్రజలు కూడా అందుకు సహకరిస్తామని ఎస్పీ కి తెలియజేశారు.

అదేవిధంగా వినుకొండ రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన సభలో సమస్యాత్మక గ్రామాల నుండి వచ్చిన సుమారు 200 మంది ట్రబుల్ మంగర్స్ కి మరియు ఎన్నికల నేరాలలో ఉండి బెయిల్ పై బయటకొచ్చిన ముద్దాయిలకు ఎస్పీ గకౌన్సిలింగ్ ఇస్తూ జాగ్రత్తగా ఉండాలని లేనియెడల రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుందని వారి ఆస్తులను జప్తు చేయిస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎక్కడ కూడా ముగ్గురు కంటే ఎక్కువ మంది గుమికూడా రాదని అలా గుమికూడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
విజయాంతరం ఎటువంటి ఉత్సవాలకు, ర్యాలీలకు, బాణాసంచా పేల్చుటకు, సభలు నిర్వహించడానికి వీలులేదని తెలియజేశారు. కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని అందరిని పూర్తిస్థాయిలో తనిఖీ చేసి పంపుతామని తెలియజేశారు.
కార్యక్రమంలో ఎస్పీ తో పాటు నరసరావు పేట డిఎస్పి సుధాకర్ రావు , నరసరావు పేట,మరియు వినుకొండ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

???? బి.కొత్తకోటలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా ..
అన్నమయ్య జిల్లా:
యదేచ్చగా మట్టి అక్రమ రవాణా: చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు రెవెన్యూ అధికారులు..అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్న మట్టి దందా*
*▪️అక్రమ మట్టి దందారాయుళ్ళు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కుంటలు,చెరువులు వదలకుండా వాటిని గుల్ల చేస్తున్నారు..బి.కొత్తకోట లోని పెద్ద చెరువులో అక్రమంగా వందల ట్రాక్టర్ల మట్టిని తోడేస్తున్న మట్టి మాఫియా..జెసిబిల సాయంతో మట్టిని తోడేస్తూ ఇళ్ల నిర్మాణాలకు, వెంచర్లకు తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు దళారులు..గత కొద్దిరోజులుగా వందల ట్రాక్టర్ల మట్టిని తరలిస్తూ జేబులు నింపుకుంటున్న అక్రమార్కులపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చేసుకుని చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.

????గిద్దలూరు పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో గల పిఆర్ కాలనీలో కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించిన సీఐ సోమయ్య..
సరైన పత్రాలు లేని 5 ద్విచక్ర వాహనాలను 1 ఆటో ను సీజ్ చేసిన పోలీసులు*
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు.. సీఐ.సర్కిల్ పరిధిలో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే సమాచారం నేరుగా పోలీసులకు అందించండి. కార్యక్రమంలో సీఐ సోమయ్య ఎస్ఐ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..
???? 108 డ్రైవర్ పై బీరు సీసాతో దాడి పరిస్థితి విషమం….
ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బోధనంపాడు గ్రామం లో 108 డ్రైవర్ అబుదావలిని బీరు సీసా తో పొడిచిన గోవింద రమేష్ చింత పిచ్చెలు జూదం దగ్గర వ్యక్తి ఘర్షణ జరిగి గొంతు మీద కాలు వేసి తొక్కి బీరు సీసాతో దాడి 108 డ్రైవర్ అబుదావలి పరిస్థితి సీరియస్ అయినట్లు సమాచారం
???? బాపట్లలో గోవా మద్యం భారీగా సీజ్ చేసిన సెబ్ అధికారులు…..*
*పోలీసుల అదుపులో 2 వ్యక్తులు..సుమారు 45 వేల రూపాయల విలువ కలిగిన మద్యం సీజ్ ….*
????బైక్ నెంబర్ ప్లేట్లపై ఇష్టం వచ్చిన రాతలు రాస్తే సహించేది లేదు సిఐ ఆవుల వెంకటేశ్వర్లు…*
మార్కాపురం సర్కిల్ పరిధిలోనీ ద్విచక్ర వాహనాల నెంబర్ ప్లేట్ల పైన.. ఫలానా ఎమ్మెల్యే తాలూకా ఫలానా నాయకుడి తాలూకా అని స్టిక్కరింగ్ చేయించిన వాహనాలను గుర్తించి వాటిపైన కేసు నమోదు చేయడం జరుగుతుందని సీఐ ఆవుల వెంకటేశ్వర్లు తెలిపారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ద్విచక్ర వాహనానికి ఇచ్చిన నెంబర్ కాకుండా ఏ ఇతర పేర్లు కానీ బొమ్మలు కానీ ఉన్న వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని వాహనదారులకు సీఐ హెచ్చరించారు…
???? లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారులు
ఇంటి నిర్మాణం కోసం భూమి సర్వే చేయడానికి
లంచం అడగడంతో రాజేంద్రనగర్
నియోజకవర్గం గండిపేట మండలం మణికొండ
మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్ కు
చెందిన ఉపేంద్రనాథ్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు.
దీంతో ఏసీబీ అధికారులు దాడులు
నిర్వహించగా ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో
పనిచేస్తున్న ఏఈ, ఈఈ, సర్వేయర్ ను
రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటుండగా
పట్టుకున్నారు. దీంతో ముగ్గురిని ఏసీబీ
అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

7k network
Recent Posts

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*