???? బిజెపిలో ఆధిపత్య పోరు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి కొనసాగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి కొనసాగుతుంది. ఈ క్రమంలో జూన్ 1న జరగబోయే ఏడో విడత పోలింగ్ తో ఎన్నికలు ముగియనున్నాయి. ఆ సంగతి అలా ఉంటే… ఈసారి కూడా అధికారం తమదే అని బీజేపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. అయితే… అదంతా మోడీ క్రెడిట్ మాత్రమే అని.. ఆరెస్సెస్స్ పాత్ర అత్యల్పం అన్నట్లుగా బీజేపీలోని ఒక వర్గం నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఆరెస్సెస్ అనేది ఆధ్యాత్మిక సంస్థ..బీజేపీ అనేది రాజకీయ సంస్థ..ఇక్కడ రాజకీయంగా బీజేపీ సాధించే విజయాలన్నీ మోడీ – షా ధ్వయం ఫలితమే అనే కామెంట్లూ తెరపైకి వస్తున్నాయని అంటున్నారు.
ఈ సమయంలో భారతీయ జనతా పార్టీలో ఆధిపత్య వైఖరి నివురుగప్పిన నిప్పులా ఉందని… ఎన్నికల ఫలితాల అనంతరం ఇది బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే టైపులో కథనాలు జాతీయ మీడియాలో తెరపైకి వస్తున్నాయి! అవును… భారతీయ జనతాపార్టీలో ఆధిపత్య వైఖరి నివురుగప్పిన నిప్పులా ఉందని.. ఎన్నికల అనంతరం అది బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వ్యవహారం ప్రధానంగా… మోడీ – షా వర్సెస్ నితిన్ గడ్కరీ గా సాగుతుందని కథనాలొస్తున్నాయి. ఇందులో భాగంగానే నాగపూర్ లో గడ్కరీని ఓడించడానికి మోడీ, షాలు ప్రయత్నించారని.. ఆయనకు అనుకూల వర్గంగా ఉన్న 1.5 లక్షల ఓట్లను జాబితాలో మాయం చేశారనే ఆరోపణలూ తెరపైకి వస్తున్నాయి. దీనికి తోడు ఎన్నికల సమయంలో నితిన్ గడ్కరీకి మద్దతుగా అటు మోడీ కానీ, ఇటు అమిత్ షా కానీ ఎలాంటి ప్రచారం చేయలేదు సరికదా…బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుండి గడ్కరీ పేరును తీసి పక్కనపెట్టిన పరిస్థితి అని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. నెక్స్ట్ స్టెప్ కు రంగం సిద్ధం.. ????ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనను దేవుడే పంపాడంటూ ఇటీవల మోదీ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు.దేవుళ్లు రాజకీయాలు చేసి అల్లర్లను ప్రేరేపించరని దీదీ విమర్శించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటుచేసిన బహిరంగ ర్యాలీలో పాల్గొన్న దీదీ మోదీపై ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘దేశ ప్రయోజనం కోసం భగవంతుడు తనను భూలోకానికి పంపారని ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు.ఆయన తనను తాను మరో దేవుడిగా భావిస్తున్నారు. కానీ, దేవుళ్లు రాజకీయాలు చేయరు. అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేయరు. నిజంగా.. ఆయన తనను దేవుడిగా భావిస్తే నేనొక్క విన్నపం చేసుకుంటున్నా.మోదీజీ..మీకు ఒక దేవాలయాన్ని నిర్మిస్తా. ప్రసాదంగా డోక్లా (గుజరాత్‌లో ప్రత్యేక వంటకం) పెడతా. నిత్యం పూజలు చేస్తా. దయచేసి మీరు ఆలయంలో కూర్చోండి. దేశాన్ని సమస్యల్లోకి నెట్టే ప్రయత్నాలు మానుకోండి’’ అని దీదీ ఎద్దేవా చేశారు.‘‘ఇప్పటివరకు ఎంతోమంది ప్రధానులతో కలిసి పనిచేశా.అందులో అటల్ బిహారీ వాజ్‌పేయ్ కూడా ఉన్నారు. ఆయన అందరితోనూ ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. కానీ, మోదీ లాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదు. ఆయన అవసరం దేశానికి లేదు’’ అని మమతా వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా.. ఇటీవల భాజపా నేత సంబిత్ పాత్ర చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.????ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ.. చాలాచోట్ల ‘పూరీ జగన్నాథుడే మోదీకి పరమభక్తుడు’ అని పొరబాటున వ్యాఖ్యానించారు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గమన్నాయి.అనుకోకుండా తప్పు జరిగిందంటూ క్షమాపణలు కోరుతూ..నోరు జారినందుకు ప్రాయశ్చిత్తంగా ఉపవాసం చేయాలని నిర్ణయించుకున్నట్లు సంబిత్ ఆ తర్వాత వివరణ ఇచ్చారు….
????జైలు సరిపోవడం లేదు: పల్నాడు ఎస్పీ..పల్నాడు జిల్లాలో జరిగిన హింసకు సంబంధించి దాదాపు 1200మందిని అరెస్టు చేశామని ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు.వినుకొండలో ఆమె మాట్లాడారు. “పల్నాడు జిల్లా పేరు దేశ వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. చెడు ఘటనలతో ప్రచారంలోకి రావడం బాధిస్తోంది. జిల్లాలో ఇంత ఫ్యాక్షనిజం ఉందా?అని అని నా స్నేహితులు అడుగుతున్నారు. నరసరావుపేట జైలులో ఖాళీలేక రాజమహేంద్రవరం జైలుకు పంపుతున్నాం” అని ఎస్పీ అన్నారు.
???? ప్రేమ మత్తులో యువత తప్పుదోవ పడుతున్నారు. ప్రేయసికి తన లవ్ ప్రపోజల్ చెబితే.. ఒప్పుకుంటే సరే సరి.. కాదంటే మాత్రం కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొంత మంది అబ్బాయిలు లైట్ తీసుకుంటున్నారు. కానీ మరికొందరు సైకోల్లా ప్రవర్తిస్తూ.. వారిని నిత్యం లవ్ చేయ్ అంటూ వేధించడం, వెంబడి పడటం చేస్తుంటారు. ప్రేమించట్లేదని ప్రేయసి చెబితే.. తనకు దక్కని అమ్మాయి మరెవ్వరికీ దక్కకూడదన్న ఉద్దేశంతో చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఓ ప్రేమోన్మాది.. తాను ప్రేమించిన అమ్మాయి.. తన లవ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదని నడి రోడ్డుపై కత్తితో అతి కిరాతకంగా దాడి చేసి చంపి.. ఆ తర్వాత అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికంగా కలవరపాటుకు గురి చేసింది.ఏలూరు జిల్లాలోని సత్రంపాడులో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించలేదన్న కారణంతో ఓ యువతిని హత్య చేసి.. ఆపై అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు నగరంలోని ఎమ్మార్సీ కాలనీకి చెందిన జక్కుల రత్న గ్రేసీ(22) స్థానికంగా తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుంది. తొట్టిబోయిన యేసురత్నం(23) అనే యువకుడు గత కొంత కాలంగా ప్రేమించాలంటూ ఆమె వెంటపడుతున్నాడు. అయితే అతడి ప్రేమను తిరస్కరిస్తూ వస్తుంది యువతి. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం గ్రేసీని వెంబడించిన యేసు రత్నం.. తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు మెడపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. యేసు రత్నం కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.స్థానికులు గమనించి.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యేసురత్నాన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా, గ్రేసీ మరణించినట్లు నిర్ధారించుకున్నారు. ఆమె మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రేమోన్మాది యేసు రత్నం పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. దీని ఆధారంగా పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు. యేసు రత్నం గతంలో ఇంటికి వచ్చి గ్రేసిని పెళ్లి చేసుకుంటానంటూ అడిగాడని.. దానికి తాము ఒప్పుకోలేదని యువతి తల్లిదండ్రులు తెలిపారు. దీంతో కక్షగట్టిన యేసురత్నం తన కూతురిపై ఈ దారుణానికి ఒడిగట్టాడని కన్నీరు మున్నీరు అవుతున్నారు గ్రేసీ పేరెంట్స్. మా అమ్మాయి జోలికి రాకుండా చూడాలని యువకుడి కుటుంబ సభ్యులకు కూడా చెప్పినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు
????ఇటీవలే నిజామాబాద్ జిల్లాలో ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.స్థానికంగా ఉన్న అయ్యప్ప స్కానింగ్ సెంటర్ లో స్కానింగ్ కోసం వచ్చే మహిళలపై.. అదే సెంటర్ లో పనిచేస్తున్న ప్రశాంత్ అనే కిరాతకుడు అకృత్యలకు పాల్పడటం తీవ్ర కలకరం రేపుతోంది. ????ఇలా స్కానింగ్ కోసం వచ్చే ఎంతోమంది మహిళలు, యువతులకు తెలియకుండానే వారి అశ్లీల ఫోటోలను, వీడియోలను రికార్డు చేసిన ఆ కేటుగాడు.. తిరిగి వారిని టార్గెట్ చేస్తూ.. ఫోన్ లు చేసి బెదిరించడం మొదలుపెట్టేవాడు.అంతేకాకుండా..ఆ ఫోటోలను, వీడియోలను చూపించి తన కామ కోర్కెలను తీర్చుకునేవాడు.అయితే గతకొన్నాళ్లుగా ఈ దారుణం అనేది కొనసాగుతునే ఉంది. ఈ క్రమంలోనే..ఓ బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.అలాగే ఈ వ్యవహారం కాస్త సీరియస్ కావడంతో.. దీనిపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపై అయ్యప్ప స్కానింగ్ సెంటర్ కు నోటీసులు జారీ కూడా చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ స్కానింగ్ సెంటర్ లో విషయంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఈ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ిషయంలో మరిన్ని కీలక విషయాలు బయటకి వస్తున్నాయి. ఆ వివరాళ్లోకి వెళ్తే..తాజాగా అయ్యప్ప స్కానింగ్ సెంటర్ లో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మరిన్ని కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. అయితే ఈ విచారణలో కలెక్టర్ ఆదేశాలతో సీపీ కల్మేశ్వర్, డీసీపీ శేషాద్రిరెడ్డి నేతృత్వంలో సీఐ శ్రీలత విచారణ చేపట్టారు. కాగా, నిందితుడు ప్రశాంత్ మొబైల్ నుంచి సేకరించిన డాటాను హార్డ్ డిస్క్ లో భద్రపరిచినట్లు సమాచారం తెలిసింది. దీంతో నిందితుడు ఫోన్ను పోలీసులు పరిశీలించగా.. అందులో మరిన్ని అశ్లీల వీడియోలు, రాసలీలలు, స్కానింగ్ చిత్రాలు ఉన్నట్లు బయటపడ్డాయి. అయితే మొదట ఒక్కరే బాధితురాలు అనుకున్న పోలీసులు.. ఆ తర్వాత మొబైల్ ను పరిశీలించిన తర్వాత చూసి ఖంగుతిన్నారు. ఎందుకంటే.. నిందుతుడి మొబైల్ లో ఒక్కరు కాకుండా.. వందల సంఖ్యల్తో మహిళల వీడియోలు తీసి ఉన్నట్లు గుర్తించారు. అయితే తన మొబైల్ నుంచి ఫోటోలు, వీడియోలను నిందితుడు వేరో ఎవరికైనా పంపించాడా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. ఇక ఇలా ఎంతమంది మహిళలు బ్లాక్ మెయిల్ చేశాడో అనే వివరాలను తెలుసుకుంటున్నారు.
????పట్టువదలని విక్రమార్కుడు.. 10వ ప్రయత్నంలో టెన్త్ పాస్..పది సార్లు రాసిన తర్వాత పదో తరగతి పాస్ అయిన యువకుడు.. బ్యాండు మేళంతో ఊరేగించిన గ్రామస్థులు మహారాష్ట్ర – బీడ్‌కు చెందిన కృష్ణ నామ్ దేవ్ ముండే 2018 నుండి 10 సార్లు రాసిన తర్వాత.. తాజాగా టెన్త్ పాసయ్యాడు. దీంతో గ్రామస్థులందరూ బ్యాండు మేళంతో అతడిని ఊరేగించి వేడుక చేశారు.
????టిప్పర్ ను ఢీ కొట్టిన బైకు.. వ్యక్తి స్పాట్ డెడ్..*ప్రకాశం జిల్లా దోర్నాల మండలం యడవల్లి గ్రామ సమీపంలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం వెంకటేశ్వర నాయుడు బైకుపై వెళ్తున్న నేపథ్యంలో వాహనం అదుపుతప్పి టిప్పర్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర నాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణాలు పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు..

