దేశాన్ని 2047 వర‌కు పాలిస్తా“మోడీ..పైకం చెల్లించలేదని కిడ్నాప్..మేనమామ పాడు పని..మద్యం మత్తులో నదిలో దూకి?..మాజీ ఎమ్మెల్యే ఉడుములను కలిసిన ఎమ్మెల్యే అన్నా..ట్రై సైకిల్ బహుకరించిన దివ్య హెల్పింగ్ హ్యాండ్స్.

????దేశాన్ని 2047 వర‌కు పాలిస్తా”మోడీ” సంచలన వ్యాఖ్యలు.. ( అవినీతిపరులైన శతకోటీశ్వరుల అండదండలు,ఇడి,సిబిఐ చెప్పు చేతల్లో ఉన్నాయి కాబట్టి అలా అని ఉండవచ్చా?)…

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ్య‌వ‌హారం.. రాజ‌కీయంగా దుమారం రేపుతోంది. ఆయ‌న అనుకుని అంటున్నారో… లేక అనాలోచితంగా అంటున్నారో తెలియ‌దు కానీ…. ఇప్ప‌టికిరెండు ప్ర‌ధాన మీడియా చానెళ్లకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌రి ఈ వ్యాఖ్య‌ల ఆంత‌ర్యం ఏంటో తెలియాల్సి ఉంది.రెండు కీల‌క అంశాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. ప్ర‌స్తుతం ప్ర‌ధాన‌ని మోడీ వ‌రుస‌గా మూడోసారి యూపీలోని వార‌ణాసి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మోడీ వింత స‌మాధానాలుచెప్పారు.’మీరు ఇంకెన్నిసార్లు పోటీ చేయాల‌ని అనుకుంటున్నారు’అన్న ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. నేను ఇప్పుడు మూడో సారి గెలుస్తున్నా. 140 కోట్ల మంది ప్ర‌జ‌ల ఆశీస్సులు ఉన్నాయి. కాబ‌ట్టి.. మ‌రో నాలుగు సార్లు 5 సార్ల‌యినా గెలుస్తా. అంతేకాదు..ఈ దేశాన్ని 2047 వర‌కు పాలిస్తాఅని మోడీ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. తాను దైవాంశ సంభూతుడిన‌ని (హిట్లర్ కూడా తాను దైవాంశ సంభూతుడేనని చెప్పుకునే వాడట).. ఇత‌ర మ‌నుషుల మాదిరిగా.. త‌న‌కు జీవ సంబంధం లేద‌ని కూడా .. మోడీ వ్యాఖ్యానించారు. నిజానికి ఇవ‌న్నీ.. ఒక దేశ ప్ర‌ధానిగా .. ఎవ‌రూ ఇంత‌కు ముందు చెప్ప‌లేదు.గ‌తంలో వాజ‌పేయిని ఇదే ప్ర‌శ్న అడిగిన‌ప్పుడు ‘ప్ర‌జ‌లు ఇచ్చిన అధికారం.. నువ్వు మాకొద్దు.. అని వారు ఇప్పుడు కోరుకున్నా.. త‌క్ష‌ణం దిగిపోతా. ఈ దేశం ముఖ్యం ప‌ద‌వులు కాదు’అని చెప్పారు. కానీ, దీనికి విరుద్ధంగా లాజిక్ కూడా అంద‌నివిధంగా మోడీ మ‌రో న‌నాలుగు సార్లు 5 సార్లు గెలుస్తాన‌న‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. లాజిక్ ప్ర‌కారం చూసుకున్నా.. ప్ర‌స్తుతం మోడీ వ‌య‌సు 74. మ‌రో ఐదేళ్ల త‌ర్వాత 79.. అప్ప‌టికి బీజేపీ పెట్టుకున్న 75 ఏళ్ల వ‌య‌సు ల‌క్ష్మ‌ణ రేఖ‌ను ఆయ‌న చేరుకుంటారు.కాబ‌ట్టి పోటీకి అన‌ర్హులు అవుతారు. అయినా… పోట చేసినా.. ఇంకోసారి మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు. అప్ప‌టికి 84 ఏళ్లు వ‌స్తాయి.కానీ, మోడీ మాత్రం ఇంకా ఇంకా గెలుస్తాన‌ని చెబుతున్నారు.ఈ వ్యాఖ్య‌ల‌పైనే ఇండియా కూట‌మి నాయ‌కులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు..’ఎండలో తిరిగి ప్ర‌చారం చేయ‌డంతో మోడీకి పిచ్చిప‌ట్టింది. అందుకే ఇలాంటి మాట‌లు చెబుతున్నారు’ అని ఒక‌రంటే..’మోడీని త‌క్ష‌ణం… రామ్ మ‌నోహ‌ర్ లోహియా ఆసుప‌త్రిలోని 203వార్డులో(మాన‌సిక చికిత్స‌లు చేసే) చేర్చాలంటూ“ మ‌రికొంద‌రు చెబుతున్నారు. ఏదేమైనా..మోడీ కొంత అతిగా అయితే స్పందిస్తున్నార‌నేది విశ్లేష‌కులు కూడా చెబుతున్న మాట‌.గ‌తంలో ఉన్నంత ఇమేజ్ ఆయ‌న‌కు ఇప్పుడు లేద‌ని కూడా అంటున్నారు. అందుకే అస‌హ‌నంతో ఆయ‌న లేనిపోని వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని చెబుతున్నారు.ఉదాహ‌ర‌ణ‌కు ఒడిశాలోని ప్ర‌సిద్ధ పూరీ జ‌గ‌న్నాథుని ఆల‌య ర‌త్న‌భండాగారం తాళం చెవుల‌ను న‌వీన్‌ప‌ట్నాయ‌క్ ప్ర‌బుత్వం మాయం చేసింద‌న్నారు. తాము అధికారంలోకి వ‌స్తే.. తాళం చెవుల నిగ్గు తేలుస్తామ‌న్నారు. వాస్త‌వానికి ఇవి ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌నులు కావ‌ని.. గ‌తంలో కేర‌ళ‌లోని ప‌ద్మ‌నాభ స్వామి.. ర‌హస్య నిధిపై సుప్రీంకోర్టు వ్యాఖ్య‌లు చేసింది.అయినా.. మోడీ ఇలాంటి వాటికే ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇచ్చారు. ????శతకోటేశ్వరుల అండదండలు,ఈ డి, సిబిఐ లను చెప్పు చేతల్లో పెట్టుకుని.. ఈవీఎంల మాయాజాలం ఎలాగూ ఉంది.. ఏదో ఒకటి చేసే ఈసారి కనుక  గెలిస్తే.. మనుధర్మశాస్త్రం అమలు చేయించి తానే రాజు లాగా కొనసాగాలని ఆయన కోరిక ఏమో అని మరికొందరు విమర్శిస్తున్నారు.

???? నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు. మద్యం మత్తులో తన భార్యను అత్యంత పాశవికంగా హతమార్చాడు ఓ భర్త. దీంతో కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లె గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కనకాద్రిపల్లె గ్రామానికి చెందిన సుగుణమ్మ (48), వడ్డే రమణ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. త్రాగుడుకు బానిసగా మారి రమణ, ప్రతి నిత్యం పుటుగా మద్యం సేవించి, ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులందరితో తరచుగా గొడవ దిగుతున్నాడు. మద్యం మానిపించేందుకు కుటుంబసభ్యులు అన్ని ప్రయత్నాలు చేశారు. చివరికి గత కొంతకాలంగా కుటుంబ సభ్యులందరూ అతన్ని ఇంటి నుంచి దూరంగా ఉంచారు. అయితే గత రాత్రి పూటుగా మద్యం సేవించిన కిరాతకుడు రమణ ఇంటికి వచ్చి భార్య సుగుణమ్మతో ఘర్షణ పడ్డాడు. దీంతో మరింత ఆవేశానికి లోనైన రమణ, నిద్రిస్తున్న భార్యను తెల్లవారు జామున గొడ్డలితో తల భాగంపై విచక్షణా రహితంగా నరికి దారుణ హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి జారుకున్నాడు.మహిళ దారుణ హత్య సమాచారం తెలుసుకున్న కొలిమిగుండ్ల సీఐ గోపినాథ్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న రమణ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

???? పైకం చెల్లించలేదని భార్యను కిడ్నాప్ చేసిన వైనం దుండిగల్‌, మే 26: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి లక్షల రూపాయలు కాజేసి యేళ్లకు యేళ్లు ముఖం చాటేశాడు. దీంతో తమ పైకం తిరిగి చెళ్లించాలని ఓ నిరుద్యోగి డిమాండ్‌ చేశాడు. అయితే ఇతగాడు రేపు, మాపు అని తిప్పిస్తుండటంతో విసిగిపోయిన బాధితుడు ఇక లాభం లేదని మాస్టర్ ప్లాన్‌ వేశాడు. సాధారణంగా తీసుకున్న సొమ్ము చెల్లించకుంటే ఇంట్లో విలువైన వస్తువులో, పొలాలో.. ఆస్తులో ఇలా స్వాధీనం చేసుకుంటారు. కానీ తన కుటుంబసభ్యులతో కలిసి అతడి భార్యను కిడ్నాప్‌ చేశారు. కానీ సదరు నిరుద్యోగి మాత్రం తన సొమ్ము వసూలు చేయడానికి ఏకంగా తనను మోసం చేసిన వ్యక్తి భార్యను ఎత్తుకెళ్లాడు.పైగా తీసుకొన్న డబ్బులు ఇస్తేనే భార్యను వదులుతానని హెచ్చరించాడు. దీంతో లబోదిబో మంటూ సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు.ఈ విచిత్ర ఘటన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా సూరారం ఠాణా పరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఏపీలోని కర్నూల్‌ జిల్లాకు చెందిన మాగంటి లక్ష్మణరావుతో హైదరాబాద్‌కు చెందిన ఎలిజబెత్‌రాణికి 19 ఏండ్ల క్రితం వివాహమైంది. కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధిలోని సుందర్‌నగర్‌లో ఈ జంట కాపురం ఉంటున్నారు. వీరికి కూతురు,కొడుకు ఉన్నారు.ఎలిజబెత్‌రాణి స్థానిక ఓ కార్పొరేట్‌ హాస్పిటల్‌లో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తుంది.అయితే ఆమె భర్త లక్ష్మణరావు ఏడేళ్ల క్రితం ఓయూ ప్రాంతంలోని మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన వెంకటేశ్‌ అనే వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.4 లక్షలు తీసుకున్నాడు.అయితే ఆ తర్వాత లక్ష్మణరావు దందా బయటపడటంతో పై అధికారులు అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించాడు. అతడికి ఉద్యోగం ఇప్పించకపోగా ఉన్న ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు లక్ష్మణరావు.ఈ విషయం తెలుకున్న వెంకటేశ్‌ డబ్బుల కోసం అతడిని ఒత్తిడి చేయసాగాడు. అయితే లక్ష్మణరావు రేపు, మాపు అంటూ కాలం దాటేస్తుండటంతో చిర్రెత్తుకొచ్చిన వెంకటేశ్‌ కిడ్నాప్‌ ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో మరో ఇద్దరు మహిళల సాయంతో శనివారం ఉదయం ఎలిజబెత్‌రాణిని ఆటోలో ఎక్కించుకుని మాణికేశ్వర్‌నగర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లారు. తాను కిడ్నాపైన విషయం ఎలిజబెత్‌రాణి తన కొడుకుకు ఫోన్‌ చేసి చెప్పింది. దీంతో లక్ష్మణరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.శనివారం సాయంత్రానికి వెంకటేశ్‌ ఇంటికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని, నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి ఇరువర్గాల మధ్య రాజీ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ప్రస్తుతం ఇరువర్గాలు పోలీసుల అదుపులోనే ఉన్నారు.. ఇంటికొచ్చి భార్యను ఎత్తుకెళ్లారు

????కొందరు మద్యం మత్తులో ఏం చేస్తున్నామా అనే ఆలోచన కూడ లేకుండా ప్రవర్తిస్తుంటారు.ఏ పని చేయడానికైన వారు వెనుకాడరు. తాజాగా ఓ యువకుడు ఫ్రెండ్స్ చాలెంజ్ చేశారని నీటిలోకి దూకాడు. చివరకు అతడి కుటుంబంలో విషాదం అలుకుముకుంది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణ గుట్ట, బండ్లగూడ ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు ఉన్నారు.వీరు కర్ణాటక రాష్ట్రంలోని కమలాపూర్ చెడుగుప్ప ప్రాంతానికి టూర్ కి వెళ్లారు.ఈ క్రమంలో ఫుల్లుగా మద్యం తాగారు. ఆ మత్తులోనే నలుగురు స్నానం చేసేందుకు నదిలోకి దిగారు.తాగిన మైకంలో ఫ్రెండ్స్ సాజిద్ అనే యువకుడికి ఛాలెంజ్ చేశారు. ఇక ఫ్రెండ్స్ రెచ్చగొట్టడంతో సాజిద్ ఒక్కసారిగా నదిలోకి దూకేశాడు.అతడికి పూర్తి స్థాయిలో ఈత రాదు. దీంతో నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయాడు. ఇది ఇలా ఉంటే సాజిద్ నీటిలో మునిగిపోతుంటే..కాపాడాల్సింది పోయి…అతడి ఫ్రెండ్స్ వీడియోలు తీస్తూ తెగ ఎంజాయ్ చేశారు.చివరకు ఆ యువకుడు మృతి చెందగా… ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటకలోని కమలాపూర్ చెడుగుప్ప ప్రాంతంలో తాగిన మైకంలో ఫ్రెండ్స్ రెచ్చగొట్టడంతో సాజిద్ నదిలోకి దూకి ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటనపై కేసులు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సాజిద్ మృతదేహం హైదరాబాద్ పాతబస్తికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు అతను ఎలా చనిపోయాడు అక్కడ ఏం జరిగిందో అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇక ఈ నలుగురు వ్యక్తుల గురించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ కు చెందిన సాజిద్, గోటి, అఫు గోమా, తాజుద్దీన్ అనే నలుగురు వ్యక్తులు ఆటోలు నడుపుతుంటారు. వీళ్లు అప్పుడప్పుడు గంజాయి కూడా అమ్ముతుండేవారని స్థానికులు చెబుతున్నారు.

????మేనకోడలితో మామ పాడుపని.. పెళ్లి చేసుకోమనేసరికి ..! పాపం..      అతడు ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు. దేశకోసం ప్రాణాలు అర్పించే ఆర్మీ జవాన్ . సరిహద్దుల్లో పహారా కాసే అతడికి అందమైన ఫ్యామిలీ కూడా ఉంది.కానీ ఏం లాభం.. అతడిది వక్రమైన బుద్ది. సమీప బంధువుపై కన్నేశాడు.ఆమెను లొంగదీసుకున్నాడు.చివరకు పెళ్లి చేసుకోమనే సరికి ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఆ యువతిని మట్టుబెట్టి.. సాక్ష్యాలు లేకుండా చేశాడు. ఇందుకు సహకరించింది జవాన్ భార్య కూడా. ఆ తర్వాత ఏం ఎరగన్నట్లు విధులకు వెళ్లిపోయాడు.. అయితే స్థానికులకు అర్థనగ్నంగా పొలంలో రక్తంతో తడిసి ఉన్న ఓ అమ్మాయి మృతదేహం కనిపించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాల్ డేటా ఆధారంగా నిందితుడ్ని అరెస్టు చేశారు. చివరకు నిందితుడు బాధితురాలికి మామయ్య అవుతాడని తెలిసి అవాక్కయ్యారు.మేన కోడలు వరుసయ్యే అమ్మాయిని వంచించి, నమ్మకద్రోహం చేసి హత్య చేశాడు ఆమె మామ. కుటుంబ బాంధవ్యాలను భయపట్టేలా ఉన్న ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పింటూ సింగ్ రాజ్ పుత్.. ఆర్మీలో లాన్స్ నాయక్‍గా పనిచేస్తున్నాడు. ఉజ్జయిని నివాసి అయిన భరత్ సింగ్ రాథోడ్ కుమార్తె సవితా రాథోడ్ ఆమెకు మామ వరుస అవుతాడు. అమ్మాయి.. రత్లాంలోని సఖ్వాల్ నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ నర్సింగ్ కోచ్ చేస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.దీంతో వీరిద్దరి మధ్య శారీరక సంబంధం మొదలైంది. అయితే సవితా తరచుగా తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుంది.అప్పటికే పెళ్లైన పింటూ.. దాట వేసుకుంటూ వస్తున్నాడు. ఇటీవల జమ్ము కాశ్మీర్ నుండి సెలవులపై ఇంటికి వచ్చిన పింటూ ఈ విషయంపై తేల్చుకుని విధుల్లో చేరాలని అనుకున్నాడు. ఏప్రిల్ 1వ తేదీన సాయంత్రం సవితను కలవాలని ఫోన్ చేశాడు. ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి రత్లామ్‌లోని మోవ్-నీముచ్ హైవే నాలుగు లేన్‌లో సమీపంలోని మైదానంలోకి వెళ్లారు. తన వెంట తెచ్చుకున్న కత్తితో సవిత ఛాతిపై దాడి చేశాడు. అనంతరం కత్తితో గొంతు కోశాడు. దీంతో అక్కడిక్కడే ప్రియురాలు అతడి కళ్లముందే గిలగిలా కొట్టుకుని చనిపోయింది. మృతదేహాన్ని అక్కడే ఉన్న పొదల్లో పడేసి.. స్వగ్రామానికి వెళ్లాడు.ఇంటికి వెళ్లి తన భార్య శీతల్‌కు జరిగిందంతా చెప్పాడు.అనంతరం భార్య కూడా సాక్ష్యాలను చెరిపేసేందుకు ప్రయత్నం చేసింది. దృశ్యం సినిమా తరహాలో ఆ గ్రామంలో హత్య జరిగిన రోజు తాము లేమని చెప్పేందుకు భార్యను ఆమె పుట్టింట్లో వదిలి..అదే రోజు రాత్రి పింటూ ఢిల్లీ నుండి విమానంలో జమ్ము కాశ్మీర్ చేరుకుని డ్యూటీలో చేరాడు. అమ్మాయి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. కాల్ డేటా ఆధారంగా నిందితుడ్ని గుర్తించారు. కాగా, నిందితుడు పింటూను అరెస్టు చేశారు. అలాగే భర్తకు సహకరించిన భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

???? కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులురెడ్డిని ఆదివారం సాయంత్రం పొదిలి లో ఆయన నివాసంలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు కలిశారు. కార్యక్రమంలో కొనకనమిట్ల ఎంపీపీ మురళి కృష్ణ ,పార్టీ కన్వీనర్ మోర శంకర్ రెడ్డి ,ఉడుముల గురవారెడ్డి , సచివాలయం కన్వీనర్ సురవరపు పెద్ద వెంకటరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి ఏలూరి సంజీవరెడ్డి , సీసీకేఆర్ శ్రీనివాసులురెడ్డి , ఎంఆర్ఎఫ్ వెంకటేశ్వర్ రెడ్డి, కంకణాల రమేష్ , మండల పెసిడెంట్ కారుమూరి వెంకటేశ్వ రెడ్డి,వెన్న శ్రీ రాములు రెడ్డి ,దోర్నాల నారాయణరెడ్డి , పార్టీ నాయకులు పాల్గొన్నారు

???? దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోకొమరోలు మండలం తాతిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన జయరాం రెడ్డికి  దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో మరియు దాతల సహకారంతో జయరాం రెడ్డికి ట్రై సైకిల్ ను ఇవ్వడం జరిగింది.

కార్యక్రమంలో దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు లొక్కు.శరత్ బాబు, ఉపాధ్యక్షులు సునీల్ కుమార్ నాయుడు సెక్రటరీ కారుమంచి చిన్న పీరయ్య కామూరి శివరామిరెడ్డి, రవికుమార్ బైక్ మెకానిక్ కిషోర్ కుమార్ వెంకటసుబ్బయ్య . మరియు గ్రామ ప్రజలు పాల్గొని సహాయం చేసిన ప్రతి ఒక్కదాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు

7k network
Recent Posts

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*