????మోడీ సర్ బిల్లు కట్టండి.. లేకపోతే చర్యలు తప్పవు”..ప్రధాని హోటల్ బిల్లు 84 లక్షలు!!.. మీరు చదివింది నిజమే. మోడీ అంటే మన ప్రధాని నరేంద్ర మోడీనే. ఆయనను హెచ్చరిస్తూ..ఓ ప్రముఖ హోటల్ తాజాగా లేఖ రాసింది. మీరు చదివింది నిజమే. మోడీ అంటే మన ప్రధాని నరేంద్ర మోడీనే. ఆయనను హెచ్చరిస్తూ..
ఓ ప్రముఖ హోటల్ తాజాగా లేఖ రాసింది.”మోడీ సర్ .. బిల్లు కట్టండి లేక పోతే చర్యలు తప్పవు” అని హెచ్చరించడం గమనార్హం.దీంతో కీలక ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు.. ప్రధాని మోడీ,బీజేపీ లు కూడా ఇరుకున పడ్డాయి. దీనిపై ఏం చేయాలని స్థానిక బీజేపీ నాయకత్వం కూడా చర్చిస్తోంది.ఏం జరిగింది? సాధారణంగా ప్రధాని మోడీ వంటివారు.. ఇతర రాష్ట్రాల్లో పర్యటనలకు వెళ్లినప్పుడు.. ప్రఖ్యాత హోటళ్ల లో బస చేస్తారు. అయితే..ఆయా పర్యటనలకు సంబంధించిన బిల్లులను లెక్క చూసి ప్రధాని కార్యాల యం చెల్లిస్తుంది. కొంత ఆలస్యమేఅయినా.. వాటిని ఇచ్చేస్తుంది. అయితే.. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రధాని చేసే పర్యటనలు రాజకీయం కిందకు వస్తాయి. దీంతో ఇలాంటి బిల్లులు ఎవరు చెల్లించాలనే మీమాంస వస్తుంది.ఇప్పుడు ఇలాంటి చిక్కే వచ్చిపడింది. గత ఏడాది మేలో కర్ణాటక ఎన్నికలు జరిగాయి. ఇక్కడ అప్పట్లో బీజేపీ సర్కారే ఉంది.దీంతో దీనిని మరో సారి నిలబెట్టుకునేందుకు బీజేపీ బాగానే ప్రయత్నించింది.ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండి ప్రచారం చేశారు.ఈ క్రమంలో మైసూరులోని ఓ ప్యాలెస్(హోటల్)లో ప్రధాని బస చేశారు. మూడు రోజులు ఆయన ఉన్నందుకు..ఆయన సిబ్బందికి. ఇతర అధికారులకు కలిపి మొత్తం రూ.84 లక్షల బిల్లయింది.అయితే.. దీనిని ఇప్పటి వరకు అంటే.. ఎన్నికలు ముగిసి ఏడాది వరకు కూడా చెల్లించలేదు.దీనిపై అనేక సందర్భాల్లో ప్యాలెస్ సిబ్బంది అటు కేంద్ర ప్రభుత్వాన్ని..ఇటు బీజేపీ ని కూడా నిలదీశారు. అయితే.. ప్రధాని పర్యటన కాబట్టి.. మోడీ కార్యాలయం చెల్లిస్తుందని..బీజేపీ చెప్పుకొచ్చింది.కానీ, మోడీ కార్యాలయం మాత్రం.. ఇదిరాజకీయ పర్యటన కాబట్టి.. తమకు సంబంధం లేదని తెలిపింది. మొత్తంగా రూ.84 లక్షల బిల్లు పెండింగులోనే ఉంది. ఇప్పుడు తాజాగా ఈ ప్యాలెస్ యాజమాన్యం.. ఇస్తారా? న్యాయపరమైన చర్యలు తీసుకోమంటారా? అంటూ.. ప్రధానికి లేఖ రాయడం సంచలనంగా మారింది. దీనిపై ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.
???? ఈవీఎంలను బీజేపీ ట్యాంపర్ చేసిందా? ఆ సీఎం రగడ ఇదే! పోలింగ్ చేసే ఈవీఎంలను బీజేపీ ట్యాంపరింగ్ చేసిందంటూ..ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా ఆరో దశ పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 పార్లమెంటు స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతోంది.
అయితే.. అత్యంత తీవ్ర సమ స్యాత్మక ప్రాంతంగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ఆదిలోనే అతి పెద్ద రగడ తెరమీదికి వచ్చింది. పోలింగ్ చేసే ఈవీఎంలను బీజేపీ ట్యాంపరింగ్ చేసిందంటూ..ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎంలకు బీజేపీ ట్యాగులు కనిపించాయన్నది సీఎం ఆరోపణ.దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. బంకురా జిల్లాలోని రఘునాథ్ పూర్ పార్లమెంటు స్థానంలో 5 ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్ లు కనిపించాయని సీఎం మమత ఆరోపించారు.తద్వారా.. ఓటర్లను ప్రలోభ పెట్టి.. మభ్యపెట్టి తమకు అనుకూలంగా ఓటు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారని.. ఆమె చెప్పుకొచ్చారు. దీనిపై తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కూడా సీఎం మమత డిమాండ్ చేశారు.అయితే..దీనిపై ఎన్నికల సంఘం వాదన వేరేగా ఉంది. సీఎం మమత ఆరోపణలను ఎన్నికల సంఘం అధికారులు తోసిపుచ్చారు.ఈవీఎంలను పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసేటప్పుడు పోటీలో ఉన్న పార్టీల అభ్యర్థులు, వారి ఏజెంట్ల సంతకాలు తీసుకుంటామని..అందుకే ట్యాగులు ఏర్పాటు చేయాల్సి వచ్చింద ని వివరించింది. రఘునాథ్ పూర్ నియోజకవర్గంలో బీజేపీ తరఫు ప్రతినిధులు మాత్రమే ఉండటంతో ఈవీఎం, వీవీ ప్యాట్ యంత్రంపై వారి సంతకం మాత్రమే తీసుకున్నట్టు ఎన్నికల సంఘం వివరించింది. అయినా కూడా మమత తన ఆరోపణలను కొనసాగించారు.ఈ సీ కేంద్రంతో కుమ్మక్కయిందని.. బీజేపీ చెప్పినట్టే చేస్తోందని ముఖ్యమంత్రి ఆరోపించారు.
????అమ్మగారి ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయని… నమ్మబలికి అమాయక మహిళను మోసగించిన ముగ్గురు కేటుగాళ్ళను వేములవాడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వేములవాడ పట్టణ సీఐ వీర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం వేములవాడ మున్సిపల్ పరిధిలోని హన్మక్కపల్లి(కోనాయపల్లి) గ్రామానికి చెందిన సింగారపు అంజవ్వ అనే మహిళ గత ఏడాదిన్నరగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ విషయాన్ని తన సమీప బంధువు ఎల్లయ్య దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో ఎల్లయ్య వేములవాడ అర్బన్ మండలంలోని చంద్రగిరిలో మహిపాల్ అనే ఒక పూజారి ఉన్నాడని, అతని దగ్గరికి వెళ్లి నాటు వైద్యం(చెట్ల మందులతో కూడిన) చేయించుకుంటే నీకున్న రోగం నయమవుతుందని అంజవ్వను నమ్మబలికి మహిపాల్ దగ్గరికి తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో వైద్యం కొరకు నిత్యం మహిపాల్ దగ్గరికి వెళ్తూ, వస్తున్న హన్మవ్వ తనకున్న అన్ని సమస్యలతో పాటు వ్యక్తిగత విషయాలను సైతం పంచుకుంది. ఇక ఇదే అదునుగా భావించిన మహిపాల్, అంజవ్వ జాతకం చూసి తన తల్లిగారి ఇల్లైన కోనాయపల్లిలో లంకె బిందెలు ఉన్నాయని, వాటిని తవ్వితీస్తే పెద్ద ఎత్తున బంగారం లభిస్తుందని, వాటిని తవ్వి తీసేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతాయని నమ్మబలికాడు. ఇది నిజమని నమ్మిన అంజవ్వ విడతల వారిగా మహిపాల్ కు డబ్బులు ఇవ్వడం ప్రారంభించింది. ఇలా సుమారు 20లక్షల రూపాయల వరకు మహిపాల్ కు అప్పజెప్పింది. ఇదే సమయంలో మహిపాల్, ఆంజవ్వల వ్యవహార శైలిని గమనించిన సుద్దాలకు చెందిన అబ్రహం అనే వ్యక్తి కొంతకాలం తర్వాత వీరువురిని సంప్రదించి లంకె బిందెల్లో నుండి తీసిన బంగారం కడిగేందుకు తాను సహకరిస్తానని చెప్పి వారితో జతకట్టాడు. అబ్రహం మాటల నమ్మిన అంజవ్వ 10లక్షల రూపాయల వరకు అప్పజెప్పింది. ఇలా మొత్తం 30లక్షల రూపాయలు ఇద్దరికి అప్పజెప్పింది. అయితే రోజులు గడుస్తున్నా మహిపాల్, అబ్రహం లు చెప్పిన విధంగా జరగకపోవడం, ఇచ్చిన డబ్బుల విషయంలో వారు ఇద్దరు స్పందించకపోవడంతో ఇక మోసపోయానని గ్రహించిన అంజవ్వ చేసేదేమీ లేక వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. అంజవ్వ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని, ఈ క్రమంలో మహిపాల్(A1)అబ్రహం(A2) ఎల్లయ్య(A3)లను చాకచక్యంగా పట్టుకుని వారిపై కేసు నమోదు చేసి శనివారం రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
????ప్రేమించాడు… కోరిక తీరాక, వదిలేశాడు!..తాజాగా ఇలాంటి ఘటననే ఒకటి తెలంగాణలో వెలుగుచూసింది. ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు ముఖం చాటేశాడు.కలిసి తిరిగి, సహాజీవనం చేసిన రోజులు మరిచిపోయాడు.పెళ్ళి మాట ఎత్తేసరికి మాయమైపోయాడు. దీంతో చేసేదీ లేక ఓ ప్రియురాలు అతడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. వరంగల్ జిల్లాలో జరిగిందీ ఘటన.నీటా టెక్స్‌టైల్స్ యజమాని గోవిందరాజ్ పాలకుర్తికి చెందిన ఓ మహిళను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. మూడు సంవత్సరాలుగా కలిసి ఉండి రెండు సార్లు అబార్షన్ కూడా చేయించాడని వాపోయింది బాధిత మహిళ.పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేయడంలో ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది.గతంలోనూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.శుక్రవారం మే 24వ తేదీ రాత్రి నుండి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపింది అమ్మాయి. దీంతో ఇంటికి తాళం వేసుకుని బయటికి వెళ్లిపోయిన గోవిందరాజ్ కుటుంబం.అమెకు మహిళా సంఘాలు అండగా నిలవడంతో తనకు న్యాయం చేయాలని పోరాడుతుంది.
????బైక్ రైడింగ్‌లో రొమాన్స్.. ప్రేమ హద్దు మీరుతోందా? అంటే ఈ మధ్య జరుగుతున్నకొన్ని ఘటనలను చూస్తే అవుననే చెప్పాలి. ఇటీవల కాలంలో ప్రేమజంటలు హద్దుమీరుతున్నాయి. బహిరంగంగా రోడెక్కుతూ రచ్చచేస్తున్నాయి. నడిరోడ్డుపై బైక్ రైడింగ్‌లో రొమాన్స్ చేస్తూ విమర్శల పాలవుతున్నాయి. మొన్న బెంగళూరులో.. తాజాగా రాజస్థాన్‌లో మరో జంట రొడ్డెక్కి రచ్చచేసింది.దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. ఇందులో కనిపించే జంట చేసిన వెకిలి చేష్టలు చూశాకా..వీళ్లను ఏమనాలో అర్థం కావడం లేదంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నడిరోడ్డుపై బైక్ నడుపుతూ హద్దులు మీరి రొమాన్స్ చేస్తూ వీళ్లు చేసిన న్యూసెన్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.గర్ల్ ఫ్రెండ్‌కు థ్రిల్ ఇవ్వాలనే లక్ష్యంతో కొంతమంది ఇలా సాహసాలు చేస్తున్నారు. అదేదో ఫ్యాషన్, ట్రెండ్ అన్నట్లుగా బైక్ ముందు భాగంలో అమ్మాయిని రివర్స్‌లో కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ చేస్తూ రొమాన్స్ చేస్తున్నారు.పిచ్చి చేష్టలతో వార్తల్లోకెక్కుతున్నారు. ప్రాణాల మీదుకు తెచ్చుకొని విమర్శల పాలవుతున్నారు. రాజస్థాన్‌లో ఈ జంట రాత్రి సమయంలో నడి రోడ్డుపై బైక్ మీద స్పీడ్‌గా వెళ్లడమే కాకుండా రొమాన్స్ చేస్తూ స్టంట్ చేశారు. అదే టైంలో రోడ్డుపై వెళ్తున్న మరికొందరు వీడియో తీస్తున్నా సోయిలేకుండా ఇంకా రెచ్చిపోయి పోజులిచ్చారు. చివరకు వీడియో వైరల్ కావడం.. లవర్స్ ప్రవర్తనపై నెటిజన్లు ఫైర్ కావడం చకచకా జరిపోయాయి. జంటపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ పోలీసులను ఎక్స్ వేదికగా ట్యాగ్ చేశారు. ప్రేమ జంటను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిచేత క్షమాపలు చెప్పించి.. కేసు ఫైల్ చేశారు. రాజస్థాన్ కోటలోని NH-52లో ఈ ఘటన జరిగింది. బండి రోడ్డులోని హెర్బల్ గార్డెన్ సమీపంలో ఈ జంట ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు వీడియో ఫుటేజీలో ఉందని తెలిపారు కోటా అదనపు పోలీసు సూపరింటెండెంట్ దిలీప్ సైనీ. ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని కైతూన్ గ్రామానికి చెందిన వసీమ్‌గా గుర్తించారు. అనంతరం.. మరో వీడియోలో తాము చేసింది తప్పు అని అంగికరించి మమ్మల్ని క్షమించండంటూ లవర్స్ వేడుకుంటున్న వీడియోను పోలీసులు విడుదల చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారడంతో… పోలీసులు మంచిపని చేశారంటూ.. ఆ జంటను విమర్శిస్తూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్..
????భార్యను హత్య చేసిన భర్త.. ఆలస్యంగా వెలుగు చూస్తున్న వాస్తవాలు.. పెళ్లయిన మొదటి రోజు నుండి మొదలైన చిత్రహింసలు ఆమె మరణం దాకా కొనసాగినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. కనీసం కుమారుడు పుట్టినా, చూడడానికి కూడా వెళ్లలేదట. ఆ తర్వాత పెద్దల సమక్షంలో ఎన్నిసార్లు మాట్లాడించిన నాగేంద్ర తీరు మాత్రం మారలేదు.చిన్న గొడవ నేపథ్యంలో భార్యను అత్యంత దారుణంగా కత్తితో హత్య చేశాడు ఓ భర్త.. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోయాలని పథకం వేశాడు. కుదరక ఇంట్లోనే గ్యాస్ సిలిండర్ లీక్ చేసే ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఆత్మహత్య డ్రామా ఆడాడు. ఇదంతా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన సాఫ్ట్‌వేర్ వివాహిత హత్య కేసు. అయితే పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ మహానగరం శివారు బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసిన హత్య కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని ???? ప్రకాశం జిల్లాకు చెందిన మధులతకు అదే జిల్లాకు చెందిన నాగేంద్ర భరద్వాజ్‌తో 2020లో వివాహం జరిగింది.వారికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. మీరు బాచుపల్లిలోని సాయిల్ అనురాగ్ కాలనీలో ఎమ్మెస్సార్ ప్లాజాలో నివాసం ఉంటున్నారు. దంపతులిద్దరూ కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.అయితే పెళ్లయిన మొదటి రోజు నుండి మొదలైన చిత్రహింసలు ఆమె మరణం దాకా కొనసాగినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. కనీసం కుమారుడు పుట్టినా, చూడడానికి కూడా వెళ్లలేదట. ఆ తర్వాత పెద్దల సమక్షంలో ఎన్నిసార్లు మాట్లాడించిన నాగేంద్ర తీరు మాత్రం మారలేదు. ఇక మే నెల 4వ తేదీన మధులతను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి బాచుపల్లి పోలీసులకు దొరికిపోయాడు.భార్యను హత్య చేసి ముక్కలు చేయాలి అని పథకం పన్నాడు నాగేంద్ర. ఫలించకపోవడంతో హత్య చేసిన గదిలో సిలిండర్ ఉంచి మరో సిలిండర్ కిచెన్‌లో పెట్టాడు. పవర్ ప్లగ్ పెట్టి వైర్లను సిలిండర్ వద్ద ఉంచి సిలిండర్ బ్లాస్ట్ అయినట్లుగా పోలీసులను తప్పుదోవ పట్టిందామని చూశాడు. అనంతరం తాళం వేసి కుమారుడితో సహా చందానగర్‌లోని స్నేహితుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్ళాడు. విషయాన్ని అతనికి చెప్పి తన ఛాతిని కత్తితో పోడుచుకున్నాడు. దీంతో భరద్వాజ్‌ను ఆసుపత్రికి తరలించారు.అయితే ఈ మధులత మరణాన్ని అననుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో అతన్ని రిమాండ్‌కు తరలించారు పోలీసులు. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడంతో పలు అనుమానాలకు తావిస్తోందని, నాగేంద్ర భరద్వాజ్‌ను కఠినంగా శిక్షించాలని మధులత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
???? కన్న కొడుకే చేయి చేసుకోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లి.. తన రక్తాన్ని పాలుగా మార్చి.. బిడ్డ ఆకలి తీరుస్తుంది. కడుపు చించుకుని.. తన ఒడికి చేరిన కన్న బిడ్డ కోసం.. జీవితాంతం శ్రమిస్తుంది తల్లి. బిడ్డలకు మంచి, చెడు తెలియజేస్తూ.. వారిని మంచి మార్గంలో ముందుకు నడుపుతూ.. ప్రయోజకుల్ని చేయాలని ఎన్నో కలలు కంటుంది. మరి తల్లి కడుపుకు చీల్చిన ఆ బిడ్డలు.. అమ్మ మాట వింటారా అంటే కొన్ని సందర్భాల్లో వింటారు.. కొన్నిసార్లు వ్యతిరేకిస్తారు. అయితే అప్పుడప్పుడు కొన్ని దారుణాలు మన కళ్లకు కనబడుతుంటాయి. ఆస్తి కోసం, అన్నం పెట్టాల్సి వస్తుందని.. కన్న తల్లినే అత్యంత దారుణంగా హింసించే సంతానాన్ని చూశాం. ఇక తాజాగా ఓ దారుణం చోటు చేసుకుంది.
చెడు వ్యసనాల బారిన పడ్డ.. కన్న బిడ్డ బాగు కోసం అతడికి నాలుగు మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నించింది ఓ తల్లి. కానీ ఆ కొడుకు అమ్మ మాట వినలేదు సరికదా.. తిరిగి ఆమె మీదనే చేయి చేసుకున్నాడు. కొడుకు చేసిన అవమానాన్ని తట్టుకోలేపోయిన ఆ తల్లి దారుణ నిర్ణయం తీసుకుంది. దాంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..కొడుకు చేయి చేసుకోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. ఈ సంఘటన యాదాద్రి జిల్లా మోత్కూరులో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు .మోత్కూరుకు చెందిన రేఖ అనే మహిళకు ఇంటర్ చదివే కుమారుడు ఉన్నాడు.అతడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదివేందుకు జాయిన్ అయ్యాడు. అయితే అక్కడ చెడు వ్యసనాలకు అలవాటు పడి.. ఇంటర్ ఫెయిల్ అయ్యాడు.కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లి.. కళ్ల ముందే కన్నబిడ్డ జీవితం నాశనం అవుతుంటే చూస్తూ తట్టుకోలేకపోయింది. దాంతో కొడుకును మంచి దారిలో పెట్టడానికి అతడికి నాలుగు మంచి మాటలు చెప్పిందిఇంటర్ వయసులోనే ఇలాంటి చెడు అలవాట్ల బారిన పడితే భవిష్యత్తు నాశనం అవుతుందని.. ఇప్పటికైనా ఆ అలవాట్లు మానుకోమని.. బాగా చదువుకోమని కొడుక్కి నచ్చచెప్పడానికి ప్రయత్నం చేసింది రేఖ. అయితే తల్లి మాటలు ఏమాత్రం రుచించని కొడుకు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగక.. కన్న తల్లిపై చేయి చేసుకున్నాడు.ఈ ఘటనతో ఆ తల్లి మనసు విలవిల్లాడింది.కన్న కొడుకు చేసిన అవమానాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది.దాంతో దారుణ నిర్ణయం తీసుకుంది. తన నివాసంలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బిడ్డ భవిష్యత్తు కోసం ఆరాటపడ్డ ఆ తల్లి.. చివరకు కన్న కొడుకు చేత తన్నులు తింటానని అసలు ఊహించేలేదు.తల్లి తీసుకున్న నిర్ణయంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
????50 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
ఇటీవల కాలంలో వైద్యం పేరుతో కార్పోరేట్ ఆసుపత్రుల యాజమాన్యం ప్రజలను పీడిస్తున్న విషయం విధితమే. ఈ కార్పోరేట్ల భారీన పడకుండా ఉండేందుకు బీద, మధ్యతరగతి కుటుంబాలు గళ్లీలో ఉండే చిన్న క్లినిక్ ల వద్దకు వెళుతుంటారు.కానీ ఆ క్లినిక్ ల పేరుతో ఎంతో మోసగాళ్లు డాక్టర్లుగా చలామణి అవుతూ వైద్య సేవలు చేస్తున్న విషయాన్ని గమనించుకోలేక పోతున్నారు.ఈ నేపధ్యంలోనే తెలంగాణ వైద్య మండలి అధికారుల దాడులతో 50 మంది నఖిలీ వైద్యుల గుట్టు రట్టయ్యింది.హైదరాబాద్ మేడ్చల్ పరిధిలోని పలు క్లినిక్ లపై వైద్య మండలి అధికారులు తనిఖీలు నిర్వహించడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఐడీపీఎల్, షాపూర్ నగర్, చింతల్ ప్రాంతాల్లో ఎటువంటి అర్హతలు లేకుండా క్లినిక్ నడుపుతూ డాక్టర్లుగా చలామణి అవుతున్న 50 మంది ఫేక్ డాక్టర్లను అధికారులు గుర్తించారు. వీరు నిర్వహిస్తున్న క్లినిక్ లలో రోగులను చేర్చుకొని పెద్ద ఎత్తున యాంటీ బయాటిక్స్ ఉపయోగిస్తూ.. వైద్యం చేస్తున్నారని అధికారులు తెలుసుకున్నారు.ఎటువంటి అర్హతలు లేకుండా వారికి తెలిసిన అరకొర వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వైద్యులుగా చెప్పుకోవడమే కాకుండా క్రినిక్ లకు అనుసందానంగా డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా నడుపుతున్నట్లు తెలిసింది.అధికారులు గుర్తించిన ఈ 50 మంది ఫేక్ డాక్టర్లపై కేసులు నమోదు చెయ్యగా..ఇద్దరిని రిమాండ్ కు తరలించారు.అంతేగాక వీరు నిల్వ ఉంచిన మందులను సీజ్ చేశారు.ఈ సందర్భంగా నఖీలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అర్హత కలిగిన వైద్యుల వద్దకే వెళ్లాలని అధికారులు సూచించారు.

