వైసిపి కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు-‘వర్ల’..డ్రగ్స్,రేవ్ స్కాముల సూత్రధారులు టీడీపీ వాళ్ళే!..వైకాపా**మదనపల్లెలో యువకుడు దారుణహత్య**3 వారాల్లో ప్రపంచ యుద్ధం?..*లక్షలు పెట్టి రేవ్ పార్టీలకు ఎందుకెళ్తారు?

????రాష్ట్రంలో వైసీపీ దుకాణం బంద్..నిశ్శబ్ద విప్లవంలో జగన్ అరాచక పాలన కొట్టుకుపోవడం ఖాయం..సజ్జల అవహన రాహిత్యం తో మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారు..ఆరోజే 32 చోట్ల రీపోలింగ్ కోరామని తెలిపిన వర్ల..

సీఎం జగన్ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతూ… వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు.శుక్రవారం నాడు టీడీపీ నేతలు ఈసీని కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు.అనంతరం వర్ల రామయ్యమాట్లాడుతూ.. మాచర్లలో నిశ్శబ్ద విప్లవం వచ్చింది, ఆ నిశ్శబ్ద విప్లవంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డి కొట్టుకుని పోతున్నాడు.పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తే సీఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలింగ్ బూత్ 202లో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేశాడు అక్కడ వీవీ ఫ్యాట్ స్లిప్‌లు బయటపడ్డాయి,అందులో 6 ఓట్లు వైసీపీకి.. 22 ఓట్లు టీడీపీకి పడ్డాయి.అవి చూసి పిన్నెల్లికి పిచ్చెక్కింది. మాచర్లలో నిశ్శబ్ద విప్లవం వచ్చింది,పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న మాచర్లలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, అక్కడ రాజ్యాంగ పాలన లేదు. ఈ ఎమ్మెల్యే మాకొద్దని ప్రజలు నిర్భయంగా ఓట్లు వేశారు.మాచర్లలో మొదలైన నిశ్శబ్ద విప్లవం విప్లవం రాష్ట్రంలోని మిగతా 174 నియోజకవర్గాల్లోనూ వచ్చింది.ఆ నిశ్శబ్ద విప్లవంలో జగన్ అరాచక పాలన కొట్టుకొని పోవడం ఖాయం. జగన్ నిర్మించుకున్న అవినీతి, నేర సామ్రాజ్యాన్ని ప్రజలు కూల్చివేశారు.అల్లర్లు సృష్టించి సజావుగా కౌంటింగ్ జరగకుండా ఉండేందుకు ఏజెంట్లను కిడ్నాప్ చేసి గందరగోళం సృష్టించేందుకు సజ్జల కుట్ర పన్నారు.ఇక వైసిపి కుట్రలు చెల్లవు.రాష్ట్రంలో వైసీపీ దుకాణం బంద్ అయింది, పోలీసులు వైసిపి నేతల మాట వినే పరిస్థితిలో లేరు. ఇకనైనా సజ్జల రామకృష్ణారెడ్డి,డిజిపి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు సహకరించాలి, నాడే 32 చోట్ల రీపోలింగ్ కోరాం…సజ్జల అవగాహన రాహిత్యంగా మాట్లాడటం మానుకోవాలి. ఓడిపోతున్నామన్న నిరాశ నిస్పృహలో సజ్జల రామకృష్ణారెడ్డి ఏవేవో మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఓడిపోతున్నామని తెలిసి చాలామంది వైసిపి నేతలు ఇళ్లకే పరిమితమయ్యారు. వై నాట్ 175 అన్న పెద్దలు కనీసం డిపాజిట్లు అయినా దక్కుతాయా అని ఆందోళన చెందుతున్నారు.మరి కొంతమంది ప్రతిపక్ష హోదా అయినా అన్న దక్కుతుందా అని ఆందోళనలో ఉన్నారు. వైసీపీ కార్యాలయాలు చిన్నబోయి ఒకరిద్దరూ బిక్కుబిక్కుమంటూ కూర్చుంటున్నారు.వైసిపి ఖేల్ ఖతం అయిందని ఆ పార్టీ కార్యకర్తలకు కూడా అర్థమైంది. పోలింగ్ ఏజెంట్లుగా ఉండటానికి కూడా ఆ పార్టీకి కార్యకర్తలు కరువయ్యారు. పోలీసులు కూడా వారి మాట వినడం లేదు,మాకెందుకు వచ్చిన గొడవ చట్టం ప్రకారం పని చేస్తామని పోలీసులు బదులిస్తున్నారు. ఈ నిశ్శబ్ద విప్లవం ప్రభావం జూన్ 4 ఉదయం 10 గంటలకు భగ్గుమంటుందని వర్ల అన్నారు.ఈసిని కలిసిన వారిలో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథ్ రెడ్డి.మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి, టీడీపీ నేతలు మన్నవ సుబ్బారావు, ఎస్పీ సాహెబ్, కోడూరి అఖిల్ తదితరులు ఉన్నారు.

????డ్రగ్స్ అయినా, స్కాములైనా సూత్రధారులు మాత్రం తెలుగు డ్రగ్స్ పార్టీ (టీడీపీ) వాళ్ళే!.. వైకాపా ఆరోపణలు..బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళలో నారా లోకేష్ కి ముఖ్య అనుచరులు అయిన చిత్తూరు జిల్లాకు చెందిన మద్దిపట్ల ప్రణీత్ చౌదరి (ఐటీ ఎంప్లాయ్) కొండేటి సుకుమార్ నాయుడు (సీఈవో) Eavetop Softtech pvt Ltd. బెంగళూరు టీడీపీ ఐటీ వింగ్ కి చెందిన కీలక వ్యక్తులు..చిత్తూరు, పూతలపట్టు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో వీరికి సన్నిహిత సంబంధాలు.ఇవన్నీ చూస్తుంటే వైజాగ్ డ్రగ్స్ కంటైనర్ దగ్గర నుంచి బెంగళూరు రేవ్ పార్టీ వరకు అన్నీ నారా లోకేష్ అనుచరుల హయాంలోనే జరుగుతున్నాయని ప్రజలకు బాగా అర్థమవుతోందని వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు.

????మదనపల్లెలో యువకుడు దారుణ హత్య..భార్య ముందే భర్తను అతి కిరాతకంగా నరికిన దుండగులు..యువకుని హత్యతో ఉలిక్కిపడ్డ మదనపల్లె..

మదనపల్లి పట్టణంలోని శ్రీవారినగర్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం వేకువుజమున మదనపల్లిలో దందాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులు 20 మందికి పైగా వెళ్లి గేటు బీగాలు పగలగొట్టి తలుపులు ధ్వంసం చేసి, ఇంట్లో నిద్రిస్తున్న రామారావు కాలనీకి చెందిన పుంగనూరు శేషు(25)ను కత్తులు వేట కొడవలతో అతి కిరాతకంగా నరికి హతమార్చారు. ఘటన సమాచారం అందుకున్న డిఎస్పి ప్రసాద్ రెడ్డి, సీఐలు వలీబషు, యువరాజు, శేఖర్ తదితరులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పంచినామా అనంతరం పోస్టుమార్టం కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పి తెలిపారు.

????3 వారాల్లో 3వ ప్రపంచ యుద్ధం.. భారతీయ జ్యోతిషుడి సంచలనం ఇవి తీవ్ర రూపం దాల్చి ప్రపంచ యుద్ధానికి దారి తీస్తే.. అందులోనూ అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాలు జరిగితే..? అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తే.. ఓవైపు రెండున్నరేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నడుస్తోంది. మరోవైపు ఏడు నెలలుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య బీభత్సమైన సమరం సాగుతోంది.. ఇంకోవైపు తైవాన్ ను చైనా తరచూ భయపెడుతోంది.. ఇదేకాక.. ఆ మధ్య ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ (ఐఆర్జీసీ)ను ఇజ్రాయెల్ హతమార్చడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇంతలో ఇరాన్ అధ్యక్షుడు రైసీ అనూహ్యంగా దుర్మరణం పాలయ్యారు. దీనివెనుక ఇజ్రాయెల్ ఉందనే ఆరోపణలూ వస్తున్నాయి. ఇలా యూరప్, పశ్చిమాసియా, ఆసియాల్లో ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఇవి తీవ్ర రూపం దాల్చి ప్రపంచ యుద్ధానికి దారి తీస్తే.. అందులోనూ అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాలు జరిగితే..? అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తే..? వివిధ దేశాల మధ్య, ముఖ్యంగా ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతలతో మూడో ప్రపంచ యుద్ధం సంభవిస్తుందనే ఊహాగానాలు పెద్దఎత్తున వచ్చాయి. కానీ, అవి భయాందోళనలుగానే మిగిలిపోయాయి. నోస్ట్రడామస్, బాబా వంగాతో సహా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చాలామంది జ్యోతిష్కులు దీని గురించి అంచనాలు వేసినా.. అదేమీ జరగలేదు. అయితే, ఇలాంటి అంచనాల వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతూ.. చాలామంది దృష్టిని ఆకర్షిస్తాయి. ఇప్పుడు అలానే భారతీయ జ్యోతిషుడు చెప్పిన అంచనాలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. హరియాణాలోని పంచకులకు చెందిన ప్రముఖ జ్యోతిషుడు కుశాల్ కుమార్ లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేసిన దాని ప్రకారం.. మూడో ప్రపంచ యుద్దం మరో మూడు వారాల దూరమే ఉంది. గ్రహాల గమనం, స్థితి ఆధారంగా జరగబోయే ఘటనలపై ఈ వేద జ్యోతిషుడు జోస్యం చెబుతుంటాడు. మరి ఇది ఎంతవరకు వాస్తవ రూపం దాలుస్తున్నదో చూడాలి. అసలు అవకాశం ఉన్నదా..? జ్యోతిష్యులు, ఇతర వ్యక్తులు చెప్పినవన్నీ నిజం కావాలని ఏమీ లేదు. అసలు జరగను కూడా జరగని ఉదంతాలు ఉన్నాయి. అందులోనూ ఈ కాలంలో ప్రపంచ యుద్ధాలు సంభవించడం కష్టమే అనుకోవాలి. ఎందుకంటే జరగబోయే నష్టాలు తెలుసు కాబట్టి.. ఏ దేశమూ దీనిని కోరుకోదు. అందుకనే రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నా అమెరికా బయటి నుంచి మద్దతు ఇస్తున్నదే కానీ.. నేరుగా రంగంలోకి దిగలేదు. గాజా స్ట్రిప్ పై దాడిచేస్తున్న ఇజ్రాయెల్ ను వారిస్తున్నదే కానీ.. ఎగదోయడం లేదు. ఈ ఉదాహరణ నేపథ్యంలో చూసినా మూడో ప్రపంచ యుద్ధం అసంభవమే.

????₹ 50 లక్షలు పెట్టి.. రేవ్ పార్టీకి దేనికి పోతారు? ఆడ, మగకి నో రూల్స్, నో లిమిట్స్!గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రేవ్‌ పార్టీ పేరు గట్టిగా వినిపిస్తోంది. అక్కడే జరిగే దారుణాల గురించి జోరుగా చర్చించుకుంటున్నారు.ఆ వివరాలు..రెవ్‌ పార్టీ..రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది.బెంగళూరు శివారులో ఆదివారం రాత్రి జరిగిన రేవ్‌ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ఈ పార్టీలో పలువురు టాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పార్టీకి వచ్చిన వారిలో చాలా వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ రేవ్‌ పార్టీలో టాలీవుడ్‌ నటుడు శ్రీకాంత్‌, నటి హేమ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. శ్రీకాంత్‌ తనకు ఈ పార్టీతో అసలు సంబంధమే లేదని స్పష్టం చేయగా.. హేమ మాత్రం కవర్‌ చేసుకునే ప్రయత్నంలో భాగంగా అడ్డంగా బుక్కయ్యింది. పైగా ఆమె రేవ్‌ పార్టీలో ఉన్నట్లు బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఈ రెండు రోజుల నుంచి మీడియా, సోషల్‌ మీడియా ఇలా ఎక్కడ చూసిన రేవ్‌ పార్టీ వార్తలే కనిపిస్తున్నాయి. జనాలు సైతం అసలు రేవ్‌ పార్టీ అంటే ఏంటి.. అక్కడ ఏం చేస్తారో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.????రేవ్‌ పార్టీ అంటే మన బర్త్‌డే పార్టీల్లాంటిందే అనుకుంటే.. పబ్బులో కాలేసినట్లే. సామాన్యుల ఇళ్లలో పార్టీలంటే నాన్‌ వెజ్‌, మందు. అదే బాడాబాబుల ఇళ్లలో పార్టీలు అంటే రకరకాల మద్యం బ్రాండ్లు, ఫుడ్డు,దానితో పాటు అమ్మాయిలు కూడా ఉంటారనే టాక్‌ ఉంది.మరి రేవ్‌ పార్టీ అంటే అంతకు మించి. ఇక్కడ మందు, చిందుతో పాటు డ్రగ్స్‌, విశృంఖల శృంగారం ప్రధానం అంటున్నారు.రేవ్‌ అనేది ఇంగ్లీష్‌ వర్డ్‌. ఎక్సైటింగ్‌ అనే అర్థంలో వాడతారు. అంటే ఈ పార్టీలు కూడా అలానే ఎక్సైటింగ్‌ అన్నమాట.ఈ పార్టీలు చాలా సీక్రెట్‌గా జరుగుతాయి.ఎక్కువగా నగర శివార్లలోనే వీటిని కండక్ట్‌ చేస్తారు. పైగా ఇవి ఇల్లీగల్‌. ఇక ఈ పార్టీల్లోకి ఎవరికి పడితే వారికి ఎంట్రీ ఉండదు. పార్టీకి ఎంత మంది రావాలని ముందే నిర్ణయిస్తారు. చివరి నిమిషంలో కొత్త వారికి అనుమతి ఇవ్వడం వంటివి ఉండవు. చాలా తక్కువ సంఖ్యలో ఈ పార్టీకి ఎంట్రీలు ఇస్తారు.????మహిళలే ఎక్కువ..ఇక రేవ్ పార్టీకి వెళ్లాలంటే.. 50 లక్షల ఎంట్రీ ఫీజు చెల్లించాలి. ఇక రేవ్‌ పార్టీకి వచ్చే వారిలో 25 శాతం మగవాళ్లు ఉంటే.. 75 శాతం మహిళలు ఉంటారు. అంటే 100 మందికి ఆహ్వానం ఉంటే వీరిలో 25 మంది మగవాళ్లు ఉంటే.. మిగతా 75 మంది ఆడవాళ్లే ఉంటారు. ఇక వీరందరికి పార్టీ నిర్వహణకు ముందుగానే పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేస్తారు. ఎస్‌టీడీ,ఎయిడ్స్‌ వంటి రోగాలు ఉన్న వారిని అనుమతించరు. ఇక ఒక్కసారి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చామంటే మొబైల్స్‌ ఆఫ్‌ చేయాలి. కెమరాలు తీసుకెళ్లకూడదు. అక్కడ సీసీ కెమరాలు ఉండవు.లోపల ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియదు.ఇక రేవ్‌ పార్టీలో మందు,డ్రగ్స్‌తో పాటు..విశృంఖల శృంగారం కీలకం.ఈ పార్టీకి వచ్చే వారిలో అమ్మాయిలే ఎక్కువ.ఇక ఒక్కో అమ్మాయి.. నలుగురైదుగురు అబ్బాయిలతో శృంగారంలో పాల్గొంటుంది.రాత్రంతా మద్యం, డ్రగ్స్‌, శృంగారం ఇదే పని.ఇక్కడకు కొందరు బడా బాబులు తమ భార్యల కోర్కెలను తీర్చడానికి తీసుకువస్తారని టాక్‌.ఇక శృంగారం కూడా విచ్చలవిడిగా ఉంటుంది.. రకరకాల థీమ్స్‌ పేరుతో గ్రూపులుగా డివైడ్‌ అయ్యి.. విచ్చలవిడిగా ఎంజాయ్‌ చేస్తుంటారు. అయితే పార్టీకి వచ్చే వారికి ముందుగానే వీటి గురించి పూర్తిగా చెప్తారట.ఒక్కసారి పార్టీకి వచ్చాక.. దేనికి నో చెప్పకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. అడ్డమైన గలీజు పనులకు రేవ్‌ పార్టీ అడ్డా అంటున్నారు. మరి ఇంత జుగుప్సకరమైన పార్టీలు సెలబ్రిటీలు హాజరవ్వడం సంచలనంగా మారింది.

7k network
Recent Posts

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*