400 సీట్లు ఎందుకివ్వాలి? బీజేపీపై సామాజిక ఉద్య‌మకారుల యుద్ధం!..చలో మాచర్లకు అనుమతి లేదు..జిల్లా ఎస్పీ మల్లికాగర్గ్ ..నిర్మల్ నెల్లూరు కర్నూలు జిల్లాలలో ప్రమాదాలు..

????400 సీట్లు ఎందుకివ్వాలి? బీజేపీపై సామాజిక ఉద్య‌మాకారుల యుద్ధం!

”ఇప్ప‌టి వ‌ర‌కు మీరు(ప్ర‌జ‌లు) చూసింది ట్రైల్ మాత్ర‌మే.. అస‌లు క‌థ ముందుంది” అని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చెబుతున్నారు.ప్ర‌స్తుతం దేశంలో జ‌రుగుతున్న‌సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్‌(ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు ద‌శ‌లు జ‌రిగాయి. మరో రెండు ద‌శ‌ల పోలింగ్ జ‌ర‌గాల్సి ఉంది) ప్ర‌క్రియ‌లో ఊరూ వాడా .. బీజేపీ నేత‌లు.. త‌మ‌కు 400 సీట్లు రావాల‌ని.. ఇవ్వాల‌ని కూడా..ప్ర‌చారం చేస్తున్నారు. ఇది వ‌స్తే.. దేశ గ‌తిని మార్చేస్తామ‌ని కూడా చెబుతున్నారు. ”ఇప్ప‌టి వ‌ర‌కు మీరు(ప్ర‌జ‌లు) చూసింది ట్రైల్ మాత్ర‌మే.. అస‌లు క‌థ ముందుంది” అని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చెబుతున్నారు. ఇక‌, కేంద్ర మంత్రి , బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా కూడా..ఇదే చెబుతున్నారు. త‌మ‌కు 400 సీట్లు వ‌స్తే.. పీవోకేను భార‌త్‌లో క‌లిపేస్తామ‌ని.. యూసీపీ(ఉమ్మ‌డి పౌర‌స్మృతి )ని అమ‌లు చేస్తామ‌ని అంటున్నారు. మంత్రి పదవికి లోకేష్ దూరం ? మొత్తంగా చూస్తే.. త‌మ‌కు 400 స్తానాలు కావాల‌ని క‌మ‌ల నాథులు కోరుతున్నారు.ఇక‌, ఇదే విష‌యాన్ని కాంగ్రెస్ నేత‌లు.. ఇండియా కూట‌మి స‌భ్యులు కూడా ప్ర‌స్తావిస్తూ.. ఇదే జ‌రిగితే.. అంటే బీజేపీకి 400 స్థానాలు క‌ట్ట‌బెడితే.. రాజ్యాంగాన్ని మార్చేస్తా రని, త‌ద్వారా.. రిజ‌ర్వేష‌న్లుపోతాయ‌ని. ముస్లింలు పొరుగు దేశాల‌కు వెళ్లి త‌ల‌దాచుకునే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని చెబుతున్నారు. వీరి ప్ర‌చారంలో బీజేపీ దూకుడు ముందు ఇండియా కూట‌మి… కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న‌వి పెద్ద‌గా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు చేర‌డం లేద‌నే ఉంది. ఈ నేప‌థ్యంలో తాజాగా సామాజిక ఉద్య‌మ‌కారులు.. రోడ్డెక్కారు. వీరిలో ప్ర‌ముఖులు మేధాపాట్క‌ర్‌, అరుణ్ రాయ్ వంటి వారు కూడా ఉన్నారు. 400 సీట్లు బీజేపీకి ఎలా వ‌స్తాయ‌ని..ఎందుకు వ‌స్తాయ‌ని.. ఎందుకు ఇవ్వాల‌ని వీరు ప్ర‌శ్న‌ల పరంప‌ర ఎక్కు పెట్టారు. కొన్ని మీడియా చానెళ్ల‌కు ఎన్నిక‌ల‌కు ముందుగానే వీరు ఇచ్చిన ఇంట‌ర్వ్యూల‌ను ప్ర‌చారం కాకుండా.. ప్ర‌సారం కాకుండా కూడా..తొక్కి పెట్టిన‌ట్టు తెలిసింది. అయితే.. వీటికి సంబంధించిన కొన్ని విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ప్ర‌ధానంగా వీటిలో రెండు కోణాల‌ను ఉద్య‌మకారులు ప్ర‌స్తావించారు. స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణానికి బీజేపీ ప్ర‌భుత్వంలో అడ్డుక‌ట్ట ప‌డింద‌ని.. ర‌చ‌యిత‌లు.. మేధావుల‌ను కూడా అణిచేశార‌ని వీరు చెబుతున్నారు.ఇక‌, ధ‌ర‌లు.. సామాన్యులపై మోపిన భారాల‌ను వీరు ప్ర‌స్తావిస్తున్నారు.వీటిని ప్రాతిప‌దిక‌గా చేసుకుని.. గ‌డిచిన ఎన్డీయే 10 ఏళ్ల‌పాల‌న‌ను కూడా.. వీరు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. దేశంలో 12 మంది ర‌చ‌యిత‌లు..హ‌త్య‌కు గుర‌య్యార‌ని తెలిపారు. అదేవిధంగా ఉద్య‌మకారులైన.. వ‌ర‌వ‌ర‌రావు, ప్రొఫెస‌ర్ సాయిబాబా వంటి వారిని వంద‌ల మందిని అరెస్టు చేసి జైలు పాలు చేశార‌ని చెబుతున్నారు. ఇందుకోసమేనా 400 సీట్లు ఇవ్వాలి ? అనేది వీరి ప్ర‌శ్న‌. మ‌రోవైపు..సామాన్య జ‌నాల‌పై ధ‌ర‌ల భారం మోపారని చెబుతున్నారు. పుట్టిన ద‌గ్గ‌ర నుంచి చ‌చ్చేవ‌ర‌కు మ‌ధ్య ప్ర‌తిదీ జీఎస్టీతో ముడిప‌డిన విష‌యాన్ని ఎత్తి చూపారు. ఇందుకోసమేనా..బీజేపీకి 400 సీట్లు ఇవ్వాల‌ని నిల‌దీస్తున్నారు.అయితే.. వీరి విష‌యాల‌ను.. వాద‌న‌ల‌ను ప్ర‌ధాన మీడియా స్ర‌వంతులు ప్ర‌సారం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ????ఇక ఎన్నికల చివరి రోజు  వచ్చేసరికి ఇతడు మనల్ని ఒక వేళ కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే మనల్ని గాలి పిలుచుకోవడం కూడా కష్టమే అంటాడేమో అని పలువురు నెటిజెన్లు విమర్శిస్తున్నారు.ఒక ప్రధాని తాను ఎలా పాలిస్తాడు ఎంత అభివృద్ధి చేస్తాడు అన్న విషయంపై ఎన్నికల ప్రసంగాలు చేయాలి కానీ ఇలా మీ మంగళ సూత్రాల దొంగలు ఇస్తారు, ఇంట్లో కులాయి నల్లాలు చోరీ చేస్తారు, మీ ఇంటికి వచ్చే విద్యుత్తు కనెక్షన్ కట్ చేస్తారు అని బెదిరిస్తూ భయపెడుతూ ఎన్నికల ప్రచారాలు చేయడం 140 కోట్ల ప్రజలకే సిగ్గు చేటు అని నెట్టింట తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.ఇలా చేసేవాడిని మానసిక సంతులన కోల్పోయిన వ్యక్తిగా పరిగణలోకి తీసుకోవాలని నెట్టింట విమర్శిస్తున్నారు.

????టీడిపి  తలపెట్టిన “ ఛలో మాచర్ల ” ప్రోగ్రామ్ కి ఎటువంటి అనుమతి లేదు..ఎస్పీ మాలిక గార్గ్..

పల్నాడు జిల్లా ఎస్పీ మాలిక గార్గ్ ఆదేశాల మేరకు జిల్లాలో 144 CRPC సెక్షన్ అమలులో ఉన్నందున టీడీపీ వారు తలపెట్టిన “ ఛలో మాచర్ల ” ప్రోగ్రామ్ కి ఎటువంటి అనుమతులు ఇవ్వనందున టీడీపీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, సదరు ప్రోగ్రామ్ కి పాల్గొనటం, హాజరవటం,ర్యాలిగా వెళ్ళటం చెయ్యకూడదని అట్లు చేసిన ఎడల చట్ట ఉల్లంగన కింద నేరం కావున అటువంటి వారిపై చట్టపరమైన మరియు కటినమైన చర్యలు తీసుకుంటామని,జిల్లా ఎస్పి హెచ్చరించారు. టిడిపి నేతల గృహనిర్బంధం..మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతలను

గృహనిర్బంధం చేస్తున్న పోలీసులు ..గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, కనపర్తి శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసు బలగాలను మొహరించారు.పోలింగ్ మరుసటి రోజు నుంచి జూలకంటిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.అలాగేగొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

????మాచర్ల పట్టణంలోని వినాయకుని గుట్టలోటిడిపి నాయకుల దాడి..వైసీపీకి చెందిన లుకయ్య(63) వృద్ధుడిపై దాడి…కేశవరెడ్డి అనుచరుడుగా పిలవబడే తోడిచర్ల విజయ్, తోడిచెర్ల యాకోబు మరికొందరు విచక్షణారహితంగా దాడి చేశారు.ఈ దాడిలో వైసీపీకి చెందిన పొన్నూరు లుకయ్య(63) కీ తీవ్రమైన గాయాలయ్యాయి…..????నిర్మల్ జిల్లాలో బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు*నిర్మల్ జిల్లాలోని సారంగా పూర్ మండలం మహబూబ్ ఘాట్ వద్ద ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ముస్కాన్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు ఈరోజు తెల్లవారు జామున బోల్తా పడింది.అందులో ప్రయాణిస్తున్న 25 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సల కోసం హైదరాబాద్ తరలిస్తుండగా..అదిలాబా ద్‌కు చెందిన ఫర్హాన అనే యువతి మరణించినట్లు తెలిసింది. మరొ ముగ్గురి పరిస్థితి సైతం సీరియస్ గానే ఉందని డాక్టర్లు సూచించారు…

????జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం,ఒకరి మృతి*నెల్లూరు జిల్లా…దుత్తలూరు సమీపం లో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం,ఒకరి మృతి,నలుగురికీ తీవ్ర గాయాలు..ప్రయాణికులు ప్రకాశం జిల్లా CS పురం మండలం ఉప్పలపాడు,పామూరుకు చెందిన వ్యక్తులుగా గుర్తింపు…ప్రకాశం జిల్లా కు చెందిన కొందరు వ్యక్తులు తిరుమలకు వెళ్లి తిరిగి తమ స్వస్థలాలకు వెళుతుండగా దుత్తలూరు సమీపంలో జాతీయ రహదారిపై తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న వాహనం పాలవ్యాను ను ఢీకొన్న ఘటనలో ఒకరు మరణించి నట్టు, నలుగురికి తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం,మరణించిన వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగి గా గుర్తింపు, వీరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

????ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా ఇద్దరు చిన్నారులు దుర్మరణం*కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.40 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్రగాయాలయ్యాయి.మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.ఇంకా బస్సులో కొందరు ప్రయాణీకులు చిక్కుకున్నారు.ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్‌ నుంచి ఆదోని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు హాహాకారాలు చేస్తు్న్నారు.బస్సు డ్రైవర్ అతి వేగంగా వెళ్తూ మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగిందని సమాచారం.మృతులు లక్ష్మీ మరియు గోవర్ధిని హైద్రాబాద్ వాసులుగా గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన ప్రయాణీకులను సమీప ఆస్పత్రికి తరలించారు.అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.???? ప్రవేట్ బస్సులు ఆటోలు,  ప్రమాదాలకు ఎక్కువగా గురవుతున్నాయి.. అతి వేగం ఒక కారణం కాగా మద్యం సేవించి డ్రైవింగ్ చేయడము, ఆటోలో బస్సులో బైకులు నడిపే వారికి  డ్రైవింగ్ నియమాలు తెలియకపోవడం ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు,. డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చే సమయంలో రోడ్డు రవాణా శాఖ అధికారులు లైసెన్సులో పొందుతున్న వారికి కనీసం  డ్రైవింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి లైసెన్సులు జారీ చేస్తున్నారని పలువురు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.

???? వీక్షణ సమావేశంలోపాల్గొన్న జిల్లా కలెక్టర్.. ..ప్రకాశం…జిల్లా ఒంగోలు పట్టణంలో స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యలయం లో ఎన్నికల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూముల భద్రతపై ముఖ్య ఎన్నికల అధికార సంఘం నిర్వహించిన విక్షణసమావేశంల జిల్లా కలెక్టర్ ఏ.ఎస్.దినేష్ కుమార్ జిల్లా డి ఆర్ ఓ  శ్రీలత .జాయింట్ కలెక్టర్ తదితరులు పాల్గోన్నారు

7k network
Recent Posts

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*