ఎక్కడికెళ్తే అక్కడే అవినీతి.. మోడీ మనసు కనిపెట్టారా?
ఇటీవల.. మోడీ ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపైనా అవినీతి ఆరోపణలు చేశారు. అవినీతి పెరిగిపోయిందని.. 25 ఏళ్లుగా.. ఇక్కడున్న బీజేడీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఎక్కడికెళ్తే.. అక్కడే అవినీతి కనిపించడం.. వాటిపై వ్యాఖ్యలు చేయడం ప్రధాని నరేంద్ర మోడీకి చాలా అలవాటుగా మారిపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీజేపీపాలిత రాష్ట్రాల్లో ఏం జరిగినా..ఆయన కు పెద్దగా కనిపించదు.కానీ, బీజేపీయేతర రాష్ట్రాల్లో మాత్రం..అంతా అవినీతి కనిపిస్తూ ఉంటుంది.ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికలకు ముందు..ప్రచారానికి వచ్చిన మోడీకి ఇక్కడ అవినీతి ప్రభుత్వం కనిపించింది.అంతా అవినీతి పరులేనని అన్నారు. కానీ,ఐదేళ్లుగా ఆయన ఏం చేస్తున్నారనేది మాత్రం చెప్పలేదు.నిజానికి అవినీతి పెచ్చరిల్లినప్పుడు..కేంద్ర ప్రభుత్వంగా ఆయన అడ్డుకనే ప్రయత్నం చేయొచ్చు.ఎవరూ కాదనరు.అసలు ప్రతిపక్షాలు కూడా..ఇదే డిమాండ్ చేశాయి.అవినీతిని ఎందుకు అడ్డుకోవడం లేదని..గత రెండేళ్ల నుంచి ఏపీలో ఇదే మాట వినిపించింది.కట్ చేస్తే.. తర్వాత తెలంగాణలోనూ మోడీ ఇదే మాట చెప్పారు. తెలంగాణలోనూ అవినీతి పెరిగిపోయిందన్నారు. ‘డబుల్ ఆర్’ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అన్నారు. అంతేకాదు..తాము అధికారంలోకి వస్తే..అవినీతిని కట్టడి చేస్తామన్నారు.ఈ ప్రత్యేకత తెలుసా? ఇక, ఇప్పుడు తాజాగా ఒడిశాలోనూ ప్రధాని పర్యటించారు.తెల్లవారగానే 7 గంటలకల్లా ఆయన 10 కిలో మీటర్ల మేర రోడ్ షో చేశారు. మొత్తానికి రోడ్ షోను విజయవంతం చేశారు. అయితే.. చిత్రం ఏంటంటే.. ఒకవైపు ఎన్నికల పోలింగ్ (ఐదో దశ) జరుగుతుండగానే.. ఓ మీడియాకు ఆయన నిలబడే ఇంటర్వ్యూ ఇచ్చారు. నిజానికి కోడ్ అమల్లో ఉండగా.. పైగా సోమవారం ఓవైపు ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా..ఆయన ఇంటర్వ్యూ ఇచ్చేశారు.ఈ సందర్భంగా.. మోడీ ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపైనా అవినీతి ఆరోపణలు చేశారు. అవినీతి పెరిగిపోయిందని..25 ఏళ్లుగా..ఇక్కడున్న బీజేడీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.అంతేకాదు.. తొలిసారి ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడానికి ప్రజలు కోరుతున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే.. ఇక్కడ చిత్రం ఏంటంటే..నవీన్ పట్నాయక్ కు ఆస్తులు లేవు.వ్యాపారాలు కూడా లేవు.ఆయన మంత్రివర్గంలోని వారిలో నూ ఒకరిద్దరు తప్ప..అందరూ సాధారణ నాయకులు.. అయినా కూడా..ప్రధాని మోడీకి సర్కారులో అవినీతి కనిపించడం గమనార్హం. మొత్తంగా ఏదో ఒక బూచి చూపించి..బీజేపీని గెలిపించాలన్న తాపత్రయం తప్ప.. నిజాలతో పనిలేదన్న విషయం స్పష్టమైంది.???? కాగా ఇటీవల బిజెపి పలు కంపెనీల నుండి (ఎలక్టోరల్ బాండ్స్) విరాళాల పేరా అక్రమంగా వసూలు చేసిందని వస్తున్న ఆరోపణలపై ముందు విచారణ జరపాలని ప్రతిపక్షాలు లొల్లి లొల్లి చేస్తున్న విషయం విధితమే. ఈ విరాళాల వసూళ్లలో గోమాంసం ఎగుమతి చేసే కంపెనీల నుండి కూడా భారీ స్థాయిలో విరాళాలు సేకరించడం ఆ పార్టీ ప్రతిష్టను దిగజారుస్తుంది. కరోనా సందర్భంగా పీఎం ఫండ్ నిధులు ఎక్కడికి పోయాయని ప్రతిపక్షాలు నిలదీస్తున్నప్పటికీ బిజెపి నాయకులు నోరు తెరిచిన పాపాన పోలేదు. ఇక ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఆ పార్టీ ఎంతవరకు నెరవేర్చిందో అందరికీ విధితమే కాబట్టి బిజెపి చెప్పేవన్నీ శ్రీరంగనీతులే అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
????నేను ఎలాంటి రేవ్ పార్టీలకు వెళ్లలేదు: హీరో శ్రీకాంత్.. తాను బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నాననే ప్రచారం అవాస్తమని హీరో శ్రీకాంత్ పేర్కొన్నారు. తాను ఎలాంటి పార్టీలకు వెళ్లలేదని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నానని తెలిపారు. కాగా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక యువకుడు తన లాగే ఉండటంతో అందరూ తాను అనుకున్నారని వివరణ ఇచ్చారు.????బెంగళూరు రేవ్‌పార్టీ కేసులో ట్విస్ట్.. నటి హేమ రేవ్‌పార్టీలో పాల్గొన్నట్టు బయటపెట్టిన బెంగళూరు పోలీసులు. తాను హైదరాబాద్‌లోనే ఉన్ననంటున్న నటి హేమ..హేమ విడుదల చేసిన వీడియో కూడా బెంగళూరు ఫామ్‌హౌస్‌లో షూట్ చేసిందేన్నంటున్న పోలీసులు.
????నరసరావుపేట..పల్నాడు జిల్లా నూతన ఎస్పీ గా బాధ్యతలు తీసుకున్న మల్లిక గార్గ్.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ 4 న కౌంటింగ్ సజావుగా జరగడమే నా ముందున్న మొదటి లక్ష్యం అన్నారు..దేశానికి లా ఆర్డర్ లో ఆంధ్రప్రదేశ్ కి మంచి పేరు ఉండేది..ప్రస్తుతం జరిగిన సంఘటనల కారణం గా కొన్ని శాంతి భద్రతలు అదుపు తప్పాయి..రాజకీయ నాయకులు లా అండ్ ఆర్డర్ అని అతి క్రమిస్తే కఠిన చర్యలు..పోలీస్ డిపార్ట్ మెంట్ లో తప్పుడు చర్యలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
????హింసాత్మక ఘటనలపై ఏపీ డీజీపీకి సిట్ నివేదిక. 150 పేజీల నివేదికను డీజీపీకి ఇచ్చిన సిట్ చీఫ్. తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలో దర్యాప్తు చేసిన సిట్. రెండు రోజుల పాటు విచారణ జరిపిన సిట్.
????చెన్నై లో ట్రోలింగ్ తట్టుకోలేక మహిళ ఆత్మహత్య*గత కొద్ది రోజుల క్రితం ఏడు నెలల చిన్నారి అపార్ట్మెంట్ పై నుండి కింద పడిపోతుండగా స్థానికులు అంత కలిసి కాపాడారు..ఐతే ఈ విషయం పై పలువురు ఆ చిన్నారి తల్లి రమ్య ని సోషల్ మీడియాలో నిందించారు. ఇక మీడియా కూడా “ఫెయిల్యూర్ మదర్ “అంటూ కథనాలు ప్రసారం చేసాయి. ఈ ట్రోలింగ్ తట్టుకోలేక రమ్య ఆత్మ హత్య చేసుకుంది..
????ఏసీబీ వలలో హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ మాధవి..రైతు వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసిబికి చిక్కిన తహసీల్దార్ మాధవి..కమలాపూర్ తహసిల్దార్ ఆఫీస్ లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు..కమలాపూర్ మండలం కన్నూరు గ్రామం కు చెందిన కసరబోయిన గోపాల్ దగ్గర విరాసత్ రిజిస్ట్రేషన్ కోసం 30 వేలు డిమాండ్ 5వేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్టు సమాచారం.. ఎసిబీ అధికారులు పూర్తి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..సదరు అధికారిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి.. విచారణ చెపడితే అనేక ఆసక్తికర అంశాలు బయట పడే అవకాశం..తాసిల్దార్ ఏసీపీ పట్టుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్న బాధితులు.. తాసిల్దార్ కార్యాలయంలో మరో మూడు అవినీతి చేపలు ఉన్నాయని ఆరోపిస్తున్న బాధితులు.. ప్రతి చిన్న పనికి పైసలు డిమాండ్ చేస్తున్న తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది.
????ఒంగోలు జిల్లా (సెబ్ ) అడిషనల్ సూపర్డెంట్ వారి ఆదేశాల మేరకు గిద్దలూరు సెబ్ సీఐ వారి సిబ్బంది తో కలిసి జనరల్ ఎలక్షన్ – 2024 నిమిత్తం గిద్దలూరు పట్టణంలోని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సదరు వ్యక్తి వద్ద 13 మద్యం సీసాలు 750 ఎం ల్ (డిఫెన్స్ లిక్కర్ ) పరిమాణం కలిగిన లిక్కర్ బాటిల్స్ ను మరియు ఒక ద్విచక్ర వాహనం ను సీజ్ చేయడం జరిగింది. .ఆ వ్యక్తి వివరములు ,పేరు :హెచ్ . కోటేశ్వరరావు, తండ్రి. నడిపి కోటయ్య, వయస్సు: 43 సంవత్సరములు, రాచర్ల..ఈ దాడుల్లో పాల్గొన్న అధికారులు గిద్దలూరు SEB CI ఎస్ .కొండారెడ్డి , వారి సిబ్బంది ఎం.మాధవరావు, ఎస్ డి.రిజ్వాను,జి. వెంకటేశ్వర్లు పాల్గొనడం జరిగింది.
????పెంచికలపాడు లో అవగాహన కార్యక్రమం..ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పెంచికలపాడు గ్రామంలో కంభం సర్కిల్ సీఐ రామకోటయ్య, బేస్తవారిపేట ఎస్సై నరసింహారావు ఆధ్వర్యంలో స్థానిక గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా శాంతియుతంగా జరిగేందుకు సహకరించిన గ్రామస్తులను సీఐ రామకోటయ్య అభినందించారు.ఓట్ల లెక్కింపు సందర్భంగా గ్రామంలో ఎవరు కూడా అల్లర్లకు పాల్పడకుండా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఒకవేళ అల్లారులకు పాల్పడితే అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
????సీఐ సోమయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో సమావేశం* గిద్దలూరు పట్టణంలోని గిద్దలూరు పోలీస్ స్టేషన్ లో సోమవారం గిద్దలూరు అర్బన్ సీఐ సోమయ్య ఆధ్వర్యంలో వైసిపి, బిజెపి, టిడిపి, జనసేన పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన నాయకులకు కార్యకర్తలకు సీఐ సోమయ్య కృతజ్ఞతలు తెలిపారు. అలానే ఓట్లు లెక్కింపు సందర్భంగా ఎవరు కూడా గొడవలు పడకుండా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలా కాదని అల్లర్లు చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
???? *వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్ఐ నరసింహారావు*ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణ సమీపంలోని ఒంగోలు కర్నూలు హైవేపై సోమవారం బేస్తవారిపేట ఎస్సై నర్సింహారావు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించకుండా సరైన వాహన సంబంధిత ధ్రువపత్రాలు లేని వాహనదారులకు ఎస్ఐ నరసింహారావు జరిమానా విధించారు. వాహనదారులు తప్పనిసరిగా తమ వాహన సంబంధిత ధ్రువపత్రాలు దగ్గర ఉంచుకోవాలని అలానే మద్యం తాగి వాహనాలు నడపవద్దని ఎస్ఐ నరసింహారావు వాహనదారులకు సూచించారు.

