48గంటల్లోపు ఓటింగ్ శాతాల డేటాను ఇసి వెబ్సైట్లో ఎందుకు ఉంచలేదు-సుప్రీంకోర్టు ఆగ్రహం..ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం..టూరిస్టు బస్సులో మంటలు ఎనిమిది మంది మృతి..పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా శ్యాం ప్రసాద్..వజ్రాల వేట మొదలు..ఘర్షణలకు పాల్పడితే చర్యలు కంభం సీఐ..పెట్రేగిపోతున్న మట్టి మాఫియా .

????పోలింగ్ పూర్తి అయిన తర్వాత 48 గంటల్లోపు ఓటింగ్ శాతాల డేటాను ఆయా నియోజకవర్గాల వారీగా ఈసీ వెబ్ సైట్ లో ఎందుకు ఉంచలేకపోతున్నారు? అన్న ప్రశ్నను సంధించింది సుప్రీం ధర్మాసనం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నల్ని సందించింది. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే ముగిసిన మొదటి.. రెండు.. మూడో దశల పోలింగ్ శాతాల్ని వెల్లడించే విషయంలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవటం.. ఈ గణాంకాల్ని పదే పదే మార్చటంపైనా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బోలెడంత విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి.. ఇప్పుడున్న అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్నా.. మరింత వేగంగా సమాచారాన్ని వెల్లడించే వీలుంది. అంతేకాదు.. ఇప్పుడున్న వనరుల నేపథ్యంలో ఏడు దశల్లో ఎన్నికల్ని నిర్వహించటానికి మించిన వైఫల్యం మరొకటి లేదన్న మాటా పలువురి నోటి వినిపిస్తోంది. అప్పుడెప్పుడో పదుల ఏళ్ల క్రితమే.. రెండు.. మూడు దశల్లో ఎన్నికలను పూర్తి చేసిన ఎన్నికల సంఘం రోజులు గడుస్తున్న కొద్దీ.. అంతకంతకూ ఎక్కువ సమయాన్ని తీసుకోవటం.. సరైన ప్లానింగ్ లేకపోవటమే కారణంగా చెప్పాలి. సుప్రీంకోర్టు తాజా ప్రశ్నల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఏమని బదులిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

????కౌంటింగ్ సమయంలో ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు:

కంభం సీఐ రామకోటయ్య..కౌంటింగ్ సమయంలో ఘర్షణలు చేస్తే ఉపేక్షించమని కంభం సీఐ రామకోటయ్య అన్నారు.శనివారం కంభం పోలీస్ స్టేషన్ లో పలు రాజకీయ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు.ప్రతి ఒక్కరు ప్రశాంతమైన వాతావరణం జీవించాలని తెలిపారు.కౌంటింగ్ సందర్భంగా గ్రామాల్లో ఏదైనా సంఘటన జరిగే అవకాశం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.కార్యక్రమంలో ఎస్సై పులి రాజేష్ మరియు మండల ఇరుపార్టీ ల నాయకులు పాల్గొన్నారు…

????భక్తులతో వెళుతున్న టూరిస్ట్ బస్సులో మంటలు: 8 మంది మృతి*  హర్యానా లో శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నూహ్​ ప్రాంతంలో ఓ టూరిస్ట్​ బస్సుకు మంటలు చెలరేగాయి. శుక్రవారం అర్థరాత్రి 1:30 నిమిషాల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పో యారు. మరో 24 మంది గాయపడ్డారు. బస్సులో కనీసం 60 మంది ఉంటారని సమాచారం. వీరిలో చాలా మంది మతపరమైన యాత్రలో పాల్గొన్నట్టు తెలుస్తోంది.

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు.. ఘటనాస్థలా నికి చేరుకొని క్షతగాత్రులు, మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

????పొదిలి మార్కాపురం అడ్డరోడ్డు వద్ద మోటార్ బైక్ ఢీకొన్న ఆర్టీసీ బస్సు బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు బాధితుడు నగర పంచాయతీ కార్మికుడిగా గుర్తింపు హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్ కు తరలింపు పరామర్శించిన తగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి.

????పెట్రేగిపోతున్న మట్టి మాఫియా..!!!

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చెర్లోపల్లె గ్రామం ఎడవల్లి పెద్ద చెరువు చర్లపల్లి సమీపంలో విచ్చలవిడిగా చెలరేగిపోతున్న మట్టి మాఫియా తెల్లవారుజాము నుండి ఇష్టారాజ్యంగా చెరువులోని మట్టిని చుట్టుపక్కల ఇటుకుల బట్టీలకు,ప్లాట్లకు తరలిస్తున్నారు. ఎన్నికలు ముగిసిన అధికారులు అటు ఇరిగేషన్ వారు మరియు రెవిన్యూ శాఖ ఎవరు గానీ పట్టించుకోకపోవడం తో అంతా మాదే రాజ్యం అన్న విధంగా మట్టి మాఫియా తయారయ్యింది..

???? వాన పడింది.. వజ్రాల వేట మొదలైంది

????కర్నూలు జిల్లా తుగ్గలిలో తొలకరి జల్లులు కురవడంతో ఇక్కడి ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. జొన్నగిరికి వెళ్లి వజ్రాల అన్వేషణను ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల వేట సాగుతోంది. ఒక్క వజ్రం దొరికితే తమ తలరాత మారిపోతుందన్న ఆశతో వజ్రాలు వెదుకుతున్నారు. గతేడాది కోట్ల విలువ చేసే వజ్రాలు దొరకడంతో ఈఏడాది వజ్రాల కోసం జనం తరలి వచ్చారు.

????పల్నాడు జిల్లా ఇన్చార్జిగా కలెక్టర్ శ్యాంప్రసాద్..

పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్యాంప్రసాద్ శుక్రవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ శివ శంకర్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు బదిలీ చేశారు. ఈనేపథ్యంలో జాయింట్ కలెక్టర్గా ఉన్న శ్యాంప్రసాద్ కు బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జేసీనే ఇన్ఛార్జ్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.

  • ????ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం..అన్నమయ్య జిల్లా మదనపల్లె

సెలవుల్లో ఊరికి పంపలేదని ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తంబళ్లపల్లె మండలంలో కలకలం రేపిన ఘటనపై వివరాలు .. మండలంలోని బలకవారిపల్లె హరిజనవాడకు చెందిన వెంకటప్ప కుమారుడు బి.శ్రీరాములు(15) కురబలకోట చేనేతనగర్లోని గురుకుల పాఠశాలలో 8చదువుతున్నాడు. సెలవుల్లో ఇంటిపట్టినే ఉన్న శ్రీరాములు, వాల్మీకిపు రంలోని బంధువుల ఇంటికి వెళ్లాలని కోరగా ఇంట్లో ఒప్పుకోలేదని ఆత్మహత్యయత్నం చేశాడు. కుటుంబీకులు గమనించి వెంటనే ఊరు నుంచి తప్పించి అతనిని మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంచడంతో తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*