ఏం ‘టంగ‌య్యా’ స్వామీ.. మోడీపై విసుర్లు!.. అకస్మాత్తుగా ముస్లింలపై మోడీకి ప్రేమ పుట్టుకు వచ్చేసింది.. ముస్లింలలో పేదరికం ఎక్కువట!.. ఆయన కూడా ముస్లిం స్నేహితులు ఉన్నారట..!ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. “బస్సు ప్రమాదం” ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి!!!

????ఏం ‘టంగ‌య్యా’ స్వామీ.. మోడీపై విసుర్లు!.. అకస్మాత్తుగా ముస్లింలపై మోడీకి ప్రేమ పుట్టుకు వచ్చేసింది.. ముస్లింలలో పేదరికం ఎక్కువట!.. ఆయన కూడా ముస్లిం స్నేహితులు ఉన్నారట..!!!..ఒక‌రోజు ముస్లిం స్నేహితులే అన్నం పెట్టి ఆక‌లి తీర్చార‌ట .. సెంటిమెంటు డైలాగులు.

ఒక మాట మాట్లాడితే.. దానికి క‌ట్టుబ‌డి ఉండాలి. లేదా.. అస‌లు ఆ మాటే మాట్లాడ‌కూడ‌దు.ఒక మాట మాట్లాడితే.. దానికి క‌ట్టుబ‌డి ఉండాలి. లేదా..అస‌లు ఆ మాటే మాట్లాడ‌కూడ‌దు. పైగా ఇప్పుడు సోష‌ల్ మీడియా ప్ర‌భావం ఎక్కువ‌గాఉన్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లకు-నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను వేరే ఎవ‌రో వ‌చ్చి వివ‌రించాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌జ‌లే విశ్లేష‌కులుగా మారుతున్నారు.దీంతో నాయ‌కులు చెబుతున్న మాట‌ల‌ను వారు నిశితంగానే గ‌మ‌నిస్తున్నారు.నాయ‌కులు ఎంతటి ఉద్దండులైనా.. కూడా వారు చెబుతున్న ప్ర‌తి విష‌యాన్ని గ‌మ‌నిస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న దేశ సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ.. ముస్లింల‌ను ఉద్దేశించి అనే క వ్యాఖ్య‌లు చేశారు.వారి రిజ‌ర్వేష‌న్లు ఎత్తేస్తామ‌న్నారు. అంతేకాదు.. మ‌త ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్లు ఏంటి? అనే ప్ర‌శ్న ను కూడా తీసుకువ‌చ్చారు. వారి రిజ‌ర్వేష‌న్లు ఎత్తేసి.. వాటిని ఓబీసీల‌కు పంచేస్తామ‌ని కూడా చెప్పారు. ఇక‌, కాంగ్రెస్ వ‌స్తే.. పెద్ద ఎత్తున హిందూ వ‌ర్గాల ఆస్తులు లాగేసుకుని.. ముస్లింల‌కు పంచేస్తుంద‌ని కూడా పెద్ద వివాదం లేవ‌నెత్తారు. దీనికి కౌంట‌ర్ ఇచ్చు కోలేక కాంగ్రెస్ నోరెళ్ల బెట్టింది.ఇంత బ‌లంగా ముస్లింల‌పై విమ‌ర్శ‌లు చేసిన మోడీ.. అనూహ్యంగా టంగ్ మార్చేశారు. నాలుగోద‌శ పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. ఎన్డీయే కూట‌మి పేల‌మైన ఓటు బ్యాంకును సొంతం చేసుకుంద‌న్న విశ్లేష‌ణ‌లు వ‌చ్చిన ద‌రిమిలా.. మోడీ ముస్లింల‌పై ప్రేమ కురిపించారు. వారిపై ఎన్ని పొగ‌డ్త‌లో కురిపించారు. ముస్లింలు చాలా పేద‌వార‌ని అన్నారు. అంతేకాదు.. ????గ‌తంలో త‌న‌కు ఒక‌రోజు ముస్లిం స్నేహితులే అన్నం పెట్టి ఆక‌లి తీర్చార‌ని కూడా.. సెంటిమెంటు డైలాగులు పండించారు. మోడీ ఏమ‌న్నారంటే.. ???? ముస్లింల‌పై తన వ్యాఖ్యలను కొంద‌రు కావాల‌ని వక్రీకరించార‌ని తెలిపారు. కౌంట‌ర్‌: తొలి మూడు ద‌శ‌ల ఎన్నిక‌ల స‌మ‌యంలో 6 మీడియాచాన‌ళ్ల‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన‌ప్పుడు ఈ మాట ఎందుకు చెప్ప‌లేదు? + చిన్నప్పుడు తమ ఇంట్లో రంజాన్, ఈద్‌ పండగను కూడా నిర్వహించిన‌ట్టు చెప్పారు. కౌంట‌ర్‌: అధికారంలోకి వ‌చ్చాక‌.. ఒక్క‌రోజైనా.. ఈ విష‌యం చెప్పారా? ముస్లింల‌తో క‌లిసి ఇప్తార్ విందు తీసుకున్నారా? + ఎక్కువమంది పిల్లలు గురించి మాట్లాడినప్పుడు అది ముస్లింల గురించి అని ఎవరు చెప్పారు? అని గ‌డుసు ప్ర‌శ్న‌వేశారు. కౌంట‌ర్‌: ఇది పూర్తిగా అబ‌ద్ధం. రాజస్థాన్ నుంచి మ‌హారాష్ట్ర‌, యూపీలో మోడీ.. చేసిన ప్ర‌చారం ముస్లింల పిల్ల‌ల గురించేన‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగిన‌ప్పుడు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడారు. ???? 2002లో గోద్రా రైలు దుర్ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు కూడా తన ప్రత్యర్థులు ముస్లిం వర్గంలో తన ప్రతిష్ఠను దెబ్బతీశారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కౌంట‌ర్‌: మ‌రి బీబీసీ డాక్యుమెంట‌రీని ఎందుకు అడ్డుకున్నారు. ఈ విష‌యాలు అప్పుడు ఎందుకు చెప్ప‌లేదు. ????నా స్నేహితుల్లో చాలా మంది ముస్లింలు ఉన్నారని మోడీ చెప్పారు. కౌంట‌ర్‌: ఒక్క‌రినైనా ఏనాడైనా.. స‌మాజానికి చూపించారా? ఒక్క‌స్నేహితుడినైనా రాజ‌కీయంగా తీసుకువ‌చ్చారా? టికెట్ ఇచ్చారా? ????హిందూ-ముస్లిం అంటూ తేడా చూపడం ప్రారంభించిన రోజు.. ప్రజాజీవితంలో ఉండే అర్హత తనకు లేద‌ని కూడా చెప్పుకొచ్చారు. కౌంట‌ర్‌: అస‌లు ప్రచారం అంతా కూడా.. ఈ `తేడా` చుట్టే తిరిగింది. కానీ, ఇప్పుడు టంగు మార్చేశారు.???? కొస‌మెరుపు: నాలుగు ద‌శ‌ల్లో జ‌రిగిన పోలింగ్‌లో ఆయన ఇలా మాట్లాడలేదు. మైనారిటీ ఓట్లు ఎక్కువ‌గా ఉన్న యూపీలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ నెల 25న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. దీంతో మోడీ టంగ్ మారింద‌నే చ‌ర్చ సాగుతోంది.

????పల్నాడు జిల్లాలో బస్సు ప్రమాదం ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి..

మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన జగన్.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని జగన్ ఆకాంక్ష.

????ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్..

కీలక నిర్ణయం! ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ పలు ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ పలు ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అప్పటివరకూ ఉన్న డీజీపీ వల్ల కాదని.. ఆయనను కూటమి నేతల ఫిర్యాదు మేరకు మార్చినా కూడా ఎందుకు ఈ స్థాయిలో హింసాత్మక ఘటనలు జరిగాయంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ సంగతి అలా ఉంటే… ఈ విషయంపై ఈసీ సీరియస్ అయ్యింది. అవును… ఏపీలో పోలింగ్ రోజు పలు హింసాత్మక ఘటనలు జరగడం.. అది జరిగి మూడు రోజులు పూర్తవుతున్న ఆ రచ్చ సద్దుమణిగినట్లు కనిపించకపోవడంపై ఈసీ సీరియస్ అయ్యింది! పోలింగ్ సమయంలోనూ.. అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాలను ఆదేశించింది. ఈ ఘటనలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా సమన్లు పంపింది. దీంతో… ఈ ఇద్దరు అధికారులు గురువారం ఢిల్లీ వెళ్లి, కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు హాజరై, ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఎన్నికలతో పాటు, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల పట్ల స్థానిక అధికారులు నిర్లిప్తంగా,నిర్లక్ష్యంగా వదిలేసినట్టు ఈసీ గుర్తించిందని తెలుస్తుంది. పల్నాడులో స్వయంగా పర్యటించిన ఏపీ ప్రత్యేక అబ్జర్వర్ రాం మోహన్ మిశ్రా ఈ అంశాలను నేరుగా సీఈసీకి నివేదించినట్టు తెలుస్తోంది. దీపక్ మిశ్రాపై వైసీపీ ఫిర్యాదు!: మరోపక్క టీడీపీ నేతలతో కుమ్మక్కై తెర వెనుక కథ నడిపారంటూ ఏపీ పోలీస్‌ అబ్జర్వర్‌ దీపక్‌ మిశ్రాపై సీఈవో, డీజీపీకి వైసీపీ ఫిర్యాదు చేసింది! పోలింగ్‌ రోజు కూటమికి మద్దతుగా వ్యవహరించాలని ఆయన పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చారని.. పోలింగ్‌ కు 3 రోజుల ముందు టీడీపీ నేత విష్ణువర్థన్‌ ఇచ్చిన పార్టీకి ఆయన హాజరైనట్లు గుర్తించబడ్డారని ఆ ఫిర్యాదులో పెర్కొన్నట్లు తెలుస్తుంది. పోలింగ్‌ అనంతరం మంగళవారం తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్‌ రూమ్‌ లను పరిశీలించేందుకు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని వచ్చిన సమయంలో… తీవ్ర రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ – టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. పల్నాడు జిల్లాలో విధ్వంసం!: చంద్రగిరి రచ్చ ఒకెత్తు అయితే పల్నాడు జిల్లాలో జరిగిన దారుణాలు మరొకెత్తు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో తీవ్ర హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇదే సమయంలో… గురజాల నియోజకవర్గంలో ఒక పార్టీ కార్యకర్తలు వైసీపీకి ఓటు వేశారనే కారణంతో ఇళ్లపై దాడులు చేయడంతో భయబ్రాంతులకు గురైన మహిళకు గుడిలో దాక్కున్న పరిస్థితి! తాడిపత్రిలో విధ్వంస కాండ!: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ పార్టీల అనుచరులు విధ్వంసకాండను సృష్టించారు. తాడిపత్రిలోని చింతలరాయుని పాలెంలో టీడీపీ – వైసీపీ పోలింగ్ ఏజెంట్ల మధ్య తీవ్ర రచ్చ జరిగింది. అనంతరం జరిగిన ఘటనలో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడం.. జేసీ ప్రభాకర్ రెడ్డి అస్వస్థతకు గురవ్వడం తెలిసిందే!

????ప్రకాశం జిల్లా కొమరోలు మండలం కొమరోలు పట్టణంలోని అక్రమంగా అమ్ముతున్న 33 (750ml) బాటిల్స్ మద్యాన్ని పట్టుకున్న కొమరోలు ఎస్సై మధుసూదన్ వారి సిబ్బంది….బాటిల్స్ తో పాటు ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నా పోలీస్ సిబ్బంది..

????నిన్న యర్రగొండపాలెం మండలము వాదంపల్లి గ్రామములో జరిగిన గొడవలలో గాయపడిన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మార్కాపురం ఏరియ హాస్పిటల్ లో పరామర్శించిన యర్రగొండపాలెం నియోజకవర్గ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారు యర్రగొండపాలెం మండల పార్టీ అధ్యక్షులు కొప్పర్తి చిన్నఓబుల రెడ్డి

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*