నేడు ప్రధాని నామినేషన్..”మూడ్ ఆఫ్ ఏపీ” :పార్టీలకు పెరిగిన బీపీ !..ఈసారి బాబు గెలుపు ఖాయమేనా! ..జగన్ గెలుపు ఖాయం అంటున్న ఐప్యాక్..”అల్లు అర్జున్” పై నాగబాబు ట్వీట్స్ వైరల్  

నేడు ప్రధాని మోదీ నామినేషన్..

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు..ఈసారి ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేసినా పబ్లిసిటీ బాగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. బహుశా అలా చెయ్యడం వల్ల భారీ విజయం దక్కుతుందని భావిస్తున్నారేమో. ఈ కారణంగానే నామినేషన్ ప్రక్రియను కూడా హై రేంజ్‌లో జరుపుతుండటం హాట్ టాపిక్ అయ్యింది.

ఎప్పుడైనా సరే నామినేషన్ ప్రక్రియను సింపుల్‌గా చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరుతూ ఉంటుంది. కానీ రాజకీయ నేతలు అలా చెయ్యరు. భారీ హంగామా చేస్తారు. తమతోపాటూ.. పెద్ద ర్యాలీ నిర్వహిస్తారు. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మినహాయింపు కాదు అని నిరూపిస్తున్నారు. ఇవాళ మరోసారి వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేస్తున్న ప్రధాని మోదీ.. ఈ కార్యక్రమంలో 12 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనేలా ప్లాన్ చేశారు. అలాగే.. ఏపీ నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరవ్వబోతున్నారు.ఈసారి ఎన్నికల్లో ఎన్డీయేకి మ్యాజిక్ మార్క్ రావడమే కష్టం అని ఇండియా కూటమితోపాటూ.. కొన్ని ప్రతిపక్షాలు అంటుంటే.. సొంతంగా 370, కూటమితో కలిసి 400 సీట్లు సాధించాలనుకుంటున్న బీజేపీ.. భారీ ప్రచారంతో ప్రతిపక్షాలకు షాక్ ఇస్తోంది. నిన్న వారణాసిలో భారీ రోడ్ షో నిర్వహించిన మోదీ.. దాని తోనే.. తాను ఏం చేసినా భారీగానే ఉంటుందని మరోసారి ప్రతిపక్షాలకు సంకేతం ఇచ్చారు. ఇవాళ నామినేషన్ సందర్భంగా.. భారీ రోడ్ షో, ప్రచార సభ జరగనున్నాయి. అందుకే.. ఈ కార్యక్రమ ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షిస్తున్నారు.

వారణాసిలో ప్రధాని నామినేషన్ దాఖలుకు ముందు కాశీ విశ్వనాథుడు, కాలభైరవ ఆలయాలను దర్శించుకునే చాన్స్ ఉంది. బనారస్ హిందూ వర్సిటీ నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు 5 కిలోమీటర్ల మార్గంలో 4 గంటలపాటు రోడ్ షో నిర్వహిస్తారు. అలాగే ఇవాళ ఎన్డీఏ నేతల సమావేశంలో కూడా మోదీ పాల్గొంటారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ వారణాసికి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోది వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేస్తున్న సందర్భంగా వీరిద్దరికీ ఆయన నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీయే కూటమిలోని ప్రధాన పార్టీల నేతలకూ కూడా మోదీ ఆహ్వానం పలికారు.ఏపీలో కూటమి గెలుపు ఖాయం అని బీజేపీ భావిస్తోంది. ఈ కారణంగానే.. కూటమిలో భాగమైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ సేవల్ని దేశవ్యాప్తంగా వినియోగించుకునేందుకు బీజేపీ సిద్ధపడింది. ఇలా వీరిద్దరికీ ఆహ్వానం పపడం ద్వారా.. ఏపీలో వైసీపీకి వ్యతిరేక సంకేతాలు కూడా పంపినట్లైంది. అందువల్లే మోదీ నామినేషన్ అంశం ఇప్పుడు ఏపీలో కూడా హాట్ టాపిక్ అవుతోంది.ఇవాళ బీజేపీ బహిరంగ సభలో పాల్గొని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత ఇవాళ రాత్రికి చంద్రబాబు తిరిగి ఉండవల్లికి రానున్నారు.వారణాసి అనేది బీజేపీకీ, మోదీకీ కంచుకోటగా మారంది. మోదీ ఇప్పటికే రెండుసార్లు అంటే.. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో వారణాసి నుంచే గెలిచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ 6,74,664 ఓట్లతో గెలిచి 63.6 శాతం ఓట్లను సాధించారు. 2014లో మోదీ గుజరాత్‌లోని వడోదర, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి.. రెండు లోక్‌సభ స్థానాలకూ పోటీ చేశారు. యూపీలో బీజేపీని బలపరిచేందుకూ.. హిందీ బెల్టులో తన స్థాయిని పెంచుకునేందుకూ మోదీ.. వారణాసిని ఎంచుకున్నారు. అక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందుకే ఈ నియోజకవర్గం మోదీ అడ్డాగా మారింది. మరోసారి ఆయనకు భారీ మెజార్టీ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

????మూడ్ ఆఫ్ ఏపీ : పార్టీలకు పెరిగిన బీపీ !

అయితే పల్లె ఓటర్లలో ఒక రకమైన లక్ష్యం ఉందని పట్టణ ఓటర్లలో మరో రకమైన లక్ష్యం ఉందని ప్రచారం సాగుతోంది. ఏపీలో బ్రహ్మాండమైన ఓటింగ్ జరిగింది. పల్లె పట్నం తేడా లేకుండా ఈసారి జనాలు విరగబడి ఓటేశారు.అయితే పల్లె ఓటర్లలో ఒక రకమైన లక్ష్యం ఉందని పట్టణ ఓటర్లలో మరో రకమైన లక్ష్యం ఉందని ప్రచారం సాగుతోంది.ఇద్దరిదీ భవిష్యత్తుకి సంబంధించిన బెంగగానే చూస్తున్నారు. ఈ ప్రభుత్వం పోతేనే భవిష్యత్తు అని ఒక సెక్షన్ అలాగే ప్రభుత్వం ఉంటేనే ఫ్యూచర్ అని మరో సెక్షన్ బలంగా బటన్ నొక్కిన నేపధ్యాన్ని స్థూలంగా అంతా చూస్తున్నారు. ఈ మధ్యలో ఇంకా చాలా రకాలైన కుల సమీకరణలు కూడా ఉన్నాయని చెప్పాలి.ఏది ఎలా చూసుకున్నా ఏపీ ఓటర్ ఓటెత్తాడు. అది కూడా జోరుగానే. దాంతో ఈ పెరిగిన ఓటింగ్ తమకు లాభమా లేక నష్టమా అన్నదే అధికార వైసీపీతో పాటు విపక్ష టీడీపీ కూటమిలో చర్చోపచర్చగా సాగుతోంది.మరో వైపు చూస్తే ఏపీలో అధికార పక్షానికి వ్యతిరేకత అయితే పూర్తి స్థాయిలో లేదు.అలాగే కొన్ని విషయాలలో అనుకూలత ఉంది. అదే విధంగా విపక్ష కూటమికి అనుకూలత కొన్ని అంశాలలో ఉంది. ఇలా ఒక సంక్లిష్టమైన వాతావరణంలో జరిగిన ఎన్నికలుగా 2024 ఏపీ అసెంబ్లీ పోలింగ్ ని చూసి తీరాలని అంటున్నారు.ఏపీలో రెండు ప్రభుత్వాలను జనాలు చూసి ఇస్తున్న అచ్చమైన స్వచ్చమైన తీర్పుగా కూడా దీనిని భావించాలని అంటున్నారు. అయిదేళ్ల జగన్ పాలన అలాగే విభజన ఏపీలో అయిదేళ్ళ చంద్రబాబు పాలన చూసారు. ఈ రోజున వారి మ్యానిఫేస్టో కంటే కూడా వారి పాలనలో వారు ఇచ్చే ప్రాధాన్యతలు వారికి వేటి మీద ఫోకస్ ఉంది. వేటి మీద లేదు అన్న అంశాలు ఈ పదేళ్ళలో జనాలకు క్షుణ్ణంగా తెలుసు.ఇక తమకు ప్రభుత్వం నుంచి ఏమీ కావాలో బాగా తెలుసు. అలాగే ఎవరు అధికారంలో ఉంటే ఏపీ ప్రగతి గతిన సాగుతుంది అన్నది కూడా తెలుసు.ఇలా అన్ని రకాలుగా విశ్లేషించుకుని మరీ ఓటెత్తినట్లుగానే ఈ భారీ పోలింగ్ ని చూడాలి. అటు వైసీపీ ఇటు టీడీపీ అటు జగన్ ఇటు చంద్రబాబు ఈ ఇద్దరూ కూడా జనాలకు తెలిసిన వారు. వారి రాజకీయ జీవితం కూడా తెరచిన పుస్తకం.వారి పాలన కూడా చూసి ఉన్నారు.ఇలా తీసుకుంటే కనుక జనాలకు జవాబు చెప్పడం చాలా సులువు.అలాగే తమదైన తీర్పు ఇవ్వడం కూడా సులువు. అదే సమయంలో ఈ ఇద్దరి విషయంలో కచ్చితమైన అభిప్రాయానికి రావడం కూడా కొంత ఇబ్బంది.ఇలా అనేక శషబిషలకు అవకాశం ఉన్న ఈ ఎన్నికలలో ఓటర్లు మాత్రం సామాజిక పరంగా ప్రాంతీయ పరంగా అలాగే అర్బన్ రూరల్ అన్న దాని పరంగా చీలిపోయారు అని స్పష్టంగా అర్ధం అవుతోంది. దాంతో ఈసారి జరిగిన భారీ పోలింగ్ ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉందని అంటున్నారు. ఎవరెన్ని విశ్లేషించినా ఓటర్ మాత్రం గుంభనంగా ఉన్నాడు. తన బటన్ తాను నొక్కేసి వెళ్ళిపోయాడు.ఆ ఓటు మాదే అంటే మాదే అని రెండు పార్టీలు అనుకోవచ్చు.కానీ ఎవరికి నిజంగా పడింది అన్నది మాత్రం జూన్ 4న తెలుస్తుంది.అంతవరకూ పార్టీలకు హై బీపీ తప్పదని అంటున్నారు.

????ఈసారి బాబు  గెలుపు ఖాయమేనా!!!..ఏపీలో ఈరోజు జరిగిన ఎన్నికలు కొన్ని చోట్ల ప్రశాంతంగా, మరికొన్ని చోట్ల ఘర్షణల నడుమ ముగిసింది. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి కొద్దిచోట్ల పోలింగ్ పూర్తి కాగా.. మరికొన్ని చోట్ల క్యూలో కొంతమంది నిలబడి ఉన్నవారిని సమయం దాటిపోయినా.. ఓటింగ్ కి అనుమతినిచ్చారు. అయితే పలు చోట్ల వైసీపీ వర్గీయులు, టీడీపీ వర్గీయుల మద్యన వాదనలు కాదు తోపులాటలు, రాళ్ళు విసురుకోవడం లాంటి చెదురు మదురు సంఘటనలు జరిగాయి. ఇక ఈ రోజు పోలింగ్ వేవ్ మాములుగా లేదు. ఏపీలో ఎన్నడూ లేని విధంగా మహిళలు, ముసలి వాళ్ళు, యూత్ కూడా ఓటెయ్యడానికి ఉత్సాహం చూపించారు. చాలామేరకు ఈసారి బాబు గారి గెలుపు ఖాయమనే మాట వినిపిస్తోంది. మహిళలు, ఇంకా వృద్దులు చంద్రబాబు పథకాలకు పడిపోయి ఓటు వేసారని అంటున్నారు.???? జగన్ పథకాల్లో కొత్తదనంలేదు, కొద్దిగా పెంచి చెప్పడమే కాకుండా ఈ ఐదేళ్ళలో పెన్షన్ కొద్ధి కొద్దిగా పెంచుకుంటూ రావడం, సంక్షేమ పథకాల్నిపట్టించుకుని రోడ్లు వగైరా అభివృద్ధిని జగన్ నిర్లక్ష్యం చేసిన కారణం గానే ఈసారి జాగన్ కి దెబ్బపడుద్ది అని ఓటు వేసేందుకు వచ్చిన పలువురు మాట్లాడుకుంటున్నారు. చదువుకున్న వారు, రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకునే వారు జగన్ కి ఓటెయ్యలేదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇక జగన్ ఓట్ బ్యాంకు కింద ఎమన్నా పేద ప్రజల ఓట్లు పడినా.. టీడీపీ కూటమి 100 నుంచి 110 స్థానాలైతే పక్కాగా కొడుతోంది అంటున్నారు. చూద్దాం జూన్ 4 న ఏపీలో ఎలాంటి రిజల్ట్ రాబోతుందో అనేది.

???? అల్లు అర్జున్ పై నాగబాబు ట్వీట్స్ వైరల్!!!

ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు మెగా ఫ్యామిలీలో మరొకసారి చిచ్చుపెట్టేలా కనిపించాయి. గతంలో కూడా ఈ గొడవలు ఉన్నప్పటికీ అవి చాలా స్పష్టంగా కనిపించలేదు.. ముఖ్యంగా అల్లు వారి కుటుంబానికి మెగా కుటుంబానికి మధ్య పొలిటికల్ గొడవలు మరింత రాజుకుంటున్నాయి. తాజాగా నాగబాబు చేసిన ఒక ట్వీట్ అల్లు అర్జున్ అభిమానులను మరింత రెచగొట్టేలా కనిపిస్తోంది. అల్లు అర్జున్ పేరు ఎత్తకుండా నాగబాబు ఒక ఘాటు ట్వీట్ ను సైతం తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది.????ఈ ట్విట్ లో ఇలా రాసుకోస్తు..”మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడు అయినా పరాయి వాడే.. మాతో నిలబడే వాడు పరాయివాడైన మావాడే.. అంటూ అల్లు అర్జున్ పేరత్తకుండా ఇలా తన పైన ట్వీట్ చేశారని తెలుస్తోంది. నాగబాబు పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సందర్భంగా మెగా కుటుంబం అందరూ కూడా ఆయనకు అండగా నిలిచేందుకు సహాయపడ్డారు.. చాలామంది పిఠాపురం వెళ్లి కూడా ప్రచారం చేయడం జరిగింది. చిరంజీవి కూడా వీడియోతో తన సందేశాన్ని ఇచ్చారు. రామ్ చరణ్ కూడా చివరిలో పిఠాపురానికి వెళ్లి ప్రచారం చేశారు.????అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడైన వైసిపి అభ్యర్థి కోసం నంద్యాలకు వెళ్లి రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తన స్నేహితుడిని గెలిపించాలని కూడా అల్లు అర్జున్ పిలుపునిచ్చారు. దీంతో అల్లు అర్జున్ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని విషయం జన సైనికులకు చాలా కోపాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు పోలింగ్ పూర్తి అయిన తర్వాత నాగబాబు వక్రబుద్ధి బయటపడింది.. ఇలా తెలివిగా ట్వీట్ చేశారు. ముందుగానే చేస్తే కచ్చితంగా బన్నీ ఫ్యాన్స్ కి కోపం వస్తుంది దీంతో కూటమికి షాక్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలిసి పోలింగ్ అయిపోయిన వెంటనే ఇలా తన వక్ర బుద్ధితో ఈ ట్విట్ చేశారు నాగబాబు. ప్రస్తుతం మెగా వర్సెస్ మధ్య ఒక వార్ మొదలయ్యింది.

???? జగన్ గెలుపు ఖాయం అంటున్న ఐ ప్యాక్ డైరెక్టర్ ..

ఏపీ లో ప్రస్తుతం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవడానికి చాలానే ప్రయత్నాలను చేశారు. సంక్షేమ పథకాలు అందించి, అవి అందించినట్లు, తాను తప్ప ఇన్ని సంక్షేమ పథకాలు ఎవరూ అందించలేరని ప్రజలు అర్థం చేసుకునేలా ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు. నిజానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) నాయకత్వం వహించింది.????అయితే తాజాగా ఐ-ప్యాక్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు రిషి రాజ్ సింగ్ తాజాగా మాట్లాడుతూ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనే బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం లోకల్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ 34 ఏళ్ల ఐఐటీయన్, జగన్ గెలుపు ఫార్ములా చాలా సింపుల్, అది ఏంటంటే ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే అని పేర్కొన్నారు. ఏపీ ప్రజలు విశ్వసనీయతను నమ్మి సరైన నిర్ణయాన్ని ఓటు ద్వారా తెలియజేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.????భూ హక్కు చట్టంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాలను వైఎస్సార్‌సీపీ పట్టించుకోవడంలేదని స్పష్టం చేశారు. “నిజం పక్కింటికి తెలిసేలోపు అబద్ధం అనేది ఊరంతా తిరిగేసి వస్తుందనే సామెత ప్రకారం భూ హక్కు చట్టంపై అబద్ధం అనేది రాష్ట్రం అంతటా వ్యాప్తి చెందిందని అన్నారు. ప్రజలు ఏది నిజమో ఏది అబద్దమో గుర్తించాలని కోరారు. టీడీపీ ఈ ఎన్నికల తర్వాత ఏమవుతుందో కూడా ఊహించడం కష్టమని ఆయన వ్యాఖ్యానించారు. లోకేష్ సమర్థ నాయకుడు కాదని, పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా సేమ్ అలానే ఉంటుందని, అందువల్ల వారికి ఇదే లాస్ట్ ఎన్నిక కావచ్చు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.????జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను తాను కమ్యూనిటీ లీడర్గా అభివర్ణించుకుంటూ ప్రజలకు దూరం అవుతున్నారని చెప్పారు.ఒక కమ్యూనిటీ లీడర్ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవడం కష్టమని తన అభిప్రాయం వ్యక్తపరిచారు. ఇకపోతే ఈసారి జగన్ ఒంటరిగా, ఎవరి తోడు లేకుండా సింగల్ గా పోటీ చేస్తున్నారని, అది ఒక తెలివైన నిర్ణయం అని పేర్కొన్నారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*