ప్రధాని మోదీ జగన్ ఊసేది?..రేవంత్ ను అమిత్ షా భయపెడుతున్నాడా?..రాజకీయ స్వార్థం కోసం మైనారిటీలతో ఆడుకోవడం దుర్మార్గం-జగన్..నడ్డాపై కేసు ..రేవంత్ కేసుకు కౌంటరా?..విస్తృత ప్రచారంలో మాగుంట కుటుంబం..జాతీయ క్రీడాకారులకు సన్మానం..రూ.8.5 కోట్ల నగదు సీజ్‌

????ప్రధాని మోదీ  ప్రసంగంలో జగన్ ఊసేది?. మోదీ ఏపీలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పలు సభల్లో పాల్గొన్న ప్రధాని ఏపీ ప్రభుత్వంపై జగన్ పేరెత్తకుండా విమర్శలు చేశారు. గతంలో కూటమి ప్రచారంలోను మోదీ జగన్ పై కాకుండా మంత్రులు, ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించారు.ఇప్పుడేమో తాజాగా ఓ అడుగు ముందుకేసి టీడీపీ,జనసేన నాయకులు కోరుకున్నట్లుగా వైసీపీ ప్రభుత్వాన్నయితే విమర్శించారు. కానీజగన్ ప్రస్తావన లేదు.

ఏపీలోను డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని మోదీ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదల కోసం కాకుండా మాఫియా కోసం పనిచేస్తుందని విమర్శించారు. అన్నమయ్య జిల్లా పీలేరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ..ఏపీలో ఎన్డీయే కూటమి, డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన అవసరం ఉందన్నారు. అనేక ఖనిజాలు,దేవాలయాలు కలిగిన నేల రాయలసీమని.. ఈ ప్రాంతంలో చైతన్యవతంమైన యువత ఉందన్నారు.ఇక్కడ ఓ ఆసక్తికర అంశం ఏంటంటే.. జగన్ పేరు లేకుండా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రధాని మోదీ.. తన ఎన్నికల ప్రసంగంలో టీడీపీ పేరు మాత్రం ప్రస్తావించడం లేదు. అలా అని భాగస్వామి జనసేనను తలచుకోవడం లేదు. ఎంత వరకు ఎన్డీయే, బీజేపీ గురించి మాత్రమే చెబుతున్నారు. అటు టీడీపీ, ఇటు జగన్ ఈ రెండు పేర్లు లేకుండా ప్రధాని మోదీ చాలా వ్యూహాత్మకంగా ఏపీలో పర్యటిస్తున్నారు.ప్రధాని మోదీ మాటల మాంత్రికుడు అనే విషయం అందరికీ తెలిసిందే. అందులో ప్రధాని ప్రసంగం అంటేనే తీవ్రమైన కసరత్తులు జరుగుతాయి.ఆయన ఎన్నికల ముందు ఎన్నో  హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను అబద్ధపు హామీలతో మోసగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి . అయితే మోదీ టీడీపీ ప్రస్తావన తీసుకురాకపోవడం వెనుక రాజకీయ కోణం ఉందని విశ్లేషణలు మొదలయ్యాయి. ఎందుకంటే ఏపీలోని రెండు పార్టీలు టీడీపీ, వైసీపీ తమకు అనుకూలంగా వ్యవహరించేవే. ఈ సమయంలో ఇద్దరితో వైరం పెంచుకోవాలని మోదీ భావించడం లేదు. ఒకవేళ ఎన్నికల తర్వాత ఆయా పార్టీలతో అవసరం వస్తే ముందు జాగ్రత్త చర్యగా ప్రధాని ప్రచారం సాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

???? నడ్డాపై కేసు .. రేవంత్ కేసుకు కౌంటరా ? దాంతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కు నోటీసులు జారీ చేసి తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు.ముస్లిం రిజర్వేషన్ల మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మార్పింగ్ చేసి రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పినట్లు తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఆ పోస్టు వచ్చిన నేపథ్యంలో బీజేపీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ పై కేసులు నమోదు చేశారు. దాంతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కు నోటీసులు జారీ చేసి తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు.ఎన్నికల నేపథ్యంలో తాను హాజరు కాలేనని రేవంత్ సమాధానం ఇచ్చాడు.ఈ విషయంలో కోర్టుకు వెళ్లగా కోర్టు కూడా నాలుగు వారాల గడువు విధించింది.అయితే మే5న బీజేపీ ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. అది ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని బెంగుళూరు పోలీసులు ట్విట్టర్ ఎక్స్ కు వెళ్లడించారు.అదే రోజు బెంగుళూరు డీజీపీ కార్యాలయం ఆ ట్వీట్ మీద విచారణకు ఆదేశించింది.ఈ మేరకు బెంగుళూరు హైగ్రౌండ్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదయింది. ముస్లింలకు వ్యతిరేతకంగా ఉన్న ట్వీట్‌పై వివరణ ఇవ్వాలంటూ బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డాకు, బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాళవియా, బీజేపీ స్టేట్‌ ప్రెసిడెంట్‌ బీవై విజయేంద్రకు సమన్లు జారీచేశారు బెంగళూరు పోలీసులు. వారం రోజుల్లో తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. బెంగుళూరు పోలీసులు నడ్డాకు సమన్లు జారీచేయడం వెనక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ మీద నమోదయిన కేసుకు కౌంటర్ అని భావిస్తున్నారు.కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ మార్ఫింగ్ వీడియోలు పోస్ట్ చేయడం మూలంగానే ఇరుక్కున్నాయి. దీంతో బీజేపీ పెట్టిన కేసుకు కౌంటర్ గా బెంగుళూరులో నడ్డా మీద కేసు పెట్టినట్లు భావిస్తున్నారు. ఈ వార్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ గా మారిందని అంటున్నారు. తెలంగాణలో కేసు పెడితే అది ఖచ్చితంగా కౌంటర్ అని భావించే బెంగుళూరులో కేసు పెట్టించినట్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో వేచిచూడాలి.

???? రేవంత్ ను అమిత్ షా భయపెడుతున్నాడా ?..

“అమిత్ భాయ్ నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.దానికి మినిస్ట్రీ ఆఫ్ హోమం అఫైర్స్ ను ఉపయోగించుకుంటున్నాడు “అమిత్ భాయ్ నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.దానికి మినిస్ట్రీ ఆఫ్ హోమం అఫైర్స్ ను ఉపయోగించుకుంటున్నాడు. ఒక రాజకీయ పార్టీ వ్యతిరేకంగా మార్ఫింగ్ వీడియో తయారు చేస్తే , ఒక రాజకీయ పార్టీ లేదా నాయకుడు,లేదా సంబంధిత రాజకీయ పార్టీ ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. కానీ ఈడీ మరియు సీబీఐని ఉపయోగించినట్లుగా వారు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కోర్టుకు నా ట్విట్టర్ అకౌంట్ల వివరాలు ఇచ్చాను.సోషల్ మీడియా యుగంలో ఇష్టారాజ్యంగా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.అందుకు ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసి నోటీసులు పంపుతున్నారు.ఇది సరైనది కాదు’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. రిజర్వేషన్లకు సంబంధించి అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన మార్ఫింగ్ వీడియోకు సంబంధించి రేవంత్ కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.తాజాగా ఎఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ తనను కేంద్ర హోంమంత్రి భయపెట్టాలని చెప్పడం సంచలనం రేపుతున్నది.అదే సమయంలో రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ గురించి కూడా రేవంత్ స్పందించాడు.పీఎం పదవిలో ఉండి నరేంద్రమోడీ అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు. రాహుల్‌గాంధీ ఎలాంటి వాడో ప్రపంచానికి తెలుసు. అతను నిజాయితీపరుడు.వారి ఇంట్లో ముగ్గురు ప్రధానులు ఉన్నారు. అయినా ఆయనకు సొంత ఇల్లు లేదు.మోడీ ప్రధానమంత్రి పదవిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే అది అతనికి సరిపోదు’ అని వ్యాఖ్యానించడం విశేషం.

???? మీ రాజకీయం స్వార్థం కోసం మైనార్టీల జీవితాలతో ఆడుకోవటం దుర్మార్గం:కళ్యాణదుర్గంలో బహిరంగ సభలో సీఎం జగన్..

ఆరు నూరైన నూరు ఆరైనా మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండితీరాల్సిందే,ఇది మీ వైయస్ఆర్ బిడ్డ మాట..ఇలా మోదీ ముందు చంద్రబాబు మాట్లాడగలడా? మైనార్టీ రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పిన తర్వాత కూడా బాబు ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతున్నాడు. మైనార్టీలను వేరుగా చూడటం, రాజకీయం స్వార్థకోసం మైనార్టీల జీవితాలతో ఆడుకోవటం దుర్మార్గం.. ఎన్ఆర్సీ, సీఏఏ ఏదైనా సరే మైనార్టీల గౌరవానికి ఎల్లప్పుడు అండగా ఉంటా????చంద్రబాబు ఓటుకు ఇచ్చే వెయ్యి, 2వేలకు మోసపోవద్దు,????చంద్రబాబు తాను దోచుకున్న సోమ్ముతో ప్రతి ఎన్నికలకు నోట్లు ఇచ్చి ఓట్లు కోనాలని ప్రయత్నిస్తుంటాడు,అతను ఇచ్చే వెయ్యి, రెండు వేలకు మోసపోవద్దు..మీ బిడ్డ జగన్ మళ్ళీ వస్తేనే ప్రతి సంవత్సరం ఏ ఏ నెల ఏ పథకాలు వస్తాయో తెలియజేస్తు క్యాలెండర్ అందిస్తాం..గుర్తుపెట్టుకోండి జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతినెల ప్రతి ఇంట్లో పండుగే..పథకాలన్నీ కొనసాగాలంటే జగనే రావాలన్నారు.

???? జాతీయస్థాయి క్రీడాకారులను సన్మానించిన వేదాన్షి కరెస్పాండెంట్ ఎస్. పరమేష్.

కర్నూలు జిల్లా స్పోర్ట్స్ న్యూస్.. గురువారం కర్నూలు జిల్లాలోని పెదపాడు గ్రామంలో వేదాన్షి స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన క్రీడాకారుల అభినందన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న వేదాన్షి స్కూల్ కరస్పాండెంట్ ఎస్. పరమేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల్లో ఎల్లప్పుడూ గెలుపోవటములను సమానంగా తీసుకుని ముందుకు సాగాలని, అలాగే గోవాలో జరిగిన సెవెంత్ నేషనల్ ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొని జాతీయస్థాయిలో పథకాల సాధించిన క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. అనంతరం జాతీయస్థాయి పోటీలలో పథకాలు అండర్ – 17 జూనియర్ పోటీలలో యు. రఘు 44 కేజీ విభాగంలో బంగారు పతకం, విజయ్ 52 కేజీ విభాగంలో సిల్వర్ పతకం, విష్ణు వర్ధన్ 66 కేజీ విభాగంలో బంగారు పతకం, యూత్ పోటీలలో జస్వంత్ 60 కేజీ విభాగంలో బంగారు పతకం, మహేష్ 75 కేజీ విభాగంలో బంగారు పతకం, సీనియర్ పోటీలలో ప్రసాద్ 60 కేజీ విభాగంలో బంగారు పతకం, శివ కుమార్ 80 కేజీ ప్లస్ విభాగంలో సిల్వర్ పతకం, వరుణ్ 90 కేజీ ప్లస్ భాగంలో బంగారు పతకం సాధించిన క్రీడాకారులను సన్మానించిన. ఈ కార్యక్రమంలో కోచ్ ఫయాజ్, తల్లిదండ్రులు, చందు తదితరులు పాల్గొన్నారు.

???? ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద పోలీసుల తనిఖీలు.. లారీలో తరలిస్తున్న రూ.8.5 కోట్ల నగదు సీజ్‌.. హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు తరలిస్తుండగా పట్టివేత…..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

???? కొత్తపట్నం మండలంలో కొత్తపట్నం, పల్లెపాలెం, రాజుపాలెం తదితర గ్రామాలలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు, ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్ , మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు శ్రీ నిఖిల్ రెడ్డి ఆళ్ల శ్రీనివాస రెడ్డి మరియు పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ మండల నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

???? మార్కాపురం లో రాక్ వెల్ స్కూల్ లో *”MY FIRST VOTE” Interaction With Raghav* అనే కార్యక్రమం లో మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకునే యువతీ యువకుల కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు తెలుగుదేశం పార్టీ యువనాయకులు మాగుంట రాఘవ రెడ్డి. ఈ కార్యక్రమం లో మాగుంట రాఘవ రెడ్డి మాట్లాడుతూ యువత తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, తమ సన్నిహితులకు ఓటు యొక్క విలువను తెలియపరచాలని కోరారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*