ఢీల్లీ పీఠం కూడా షేక్ అవుతుంది..సీఎం జగన్..లోపాలు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి..జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్.. అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత..గిద్దలూరు కంభం మార్కాపురంలో టీడీపీ, వైసీపీ విస్తృత ప్రచారం….

????అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నల ఓట్లతో ఢీల్లీ పీఠం కూడా షేక్ అవుతుంది -ఇచ్చాపురుం బహిరంగ సభలో సీఎం జగన్..

ఇప్పటికే కొనసాగుతున్న, బడ్జెట్ కేటాయించిన పథకాలను అడ్డుకుని మీ బిడ్డను ఇబ్బందిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. మీ బిడ్డ ముఖ్యమంత్రిగా మీకు పథకాలను అందించేందుకు కోర్టుకు వెళ్లి పోరాడుతున్నాడంటే ఆలోచన చేయండి, ఏస్థాయిలో కుట్రలు చేస్తున్నారో..ఇన్ని సంవత్సరాలుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నారు, చివరి రెండు నెలలు పింఛన్ సోమ్ము ఇంటికి రాకపోతే అవ్వాతాతలకు ఈ కుట్రలు, క్రమంతప్పకుండా అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటూ, ఆఖరి రెండు నెలలు బటన్ నోక్కినా కూడా సోమ్ము రాకుండా ఎవరు కుట్ర చేస్తున్నారని అక్కచెల్లెమ్మలకు తెలియకుండా ఉంటుందా..వీళ్లు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన పైన దేవుడు చూస్తున్నాడు, ప్రజల దీవెనలు ఉన్నాయి, జరుగుతున్న పరిస్థితులను అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలు, రైతన్నలు గమనిస్తున్నారన్నారు..ఓటు అనే ఆయుధంతో వీరు కొట్టబోయే దెబ్బతో ఢీల్లీ పీఠం కూడా కదులుతుందనడం పై ముందు ఏం జరగబోతుందన్న విషయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

????లోపాలు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి..జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్.. మార్కాపురం..కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏ.ఎస్.దినేష్ కుమార్ మంగళవారం మార్కాపురంలో పర్యటించారు. ఎస్.వీ.కె.పీ. కాలేజీలో ఏర్పాటు చేసిన ఈ.వి.ఎం.ల స్ట్రాంగ్ రూమును ఆయన పరిశీలించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాలను భద్రపరిచిన తీరును అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. వీటికి కల్పిస్తున్న భద్రత ఏర్పాట్ల పైనా కలెక్టర్ ఆరా తీశారు. ఇదే ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఒంగోలు లోక్ సభ ఎన్నికలలో ఉపయోగించే ఈ.వి.ఎం.ల కమిషనింగ్ ప్రక్రియను కూడా కలెక్టర్ పరిశీలించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు.ఈ ప్రాంగణంలో లైటింగ్, బ్యారికేడ్ల ఏర్పాటు విషయంలో స్థానిక రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా కు ఆయన పలు సూచనలు చేశారు.అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ కేంద్రంలో కల్పించిన మౌలిక సదుపాయాలు, పోలింగ్ జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరూ వాళ్లకి కల్పించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు కోసం ఒక ఉద్యోగికి యు.పీ.ఐ. విధానంలో ఒకరు డబ్బులు పంపినట్లు వచ్చిన వార్తలపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన తెలిపారు.ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఉద్యోగి స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు… ???? పోలింగ్ కేంద్రాల పరిశీలన…మార్కాపురం మండలంలోని పెద్ద నాగులవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, నికరంపల్లె ప్రాథమికోన్నత పాఠశాల, జమ్మనపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, కొలభీమునిపాడు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.విధుల్లో పాల్గొనేందుకు వచ్చే సిబ్బందికి వసతి కల్పించేందుకు చేస్తున్న ఏర్పాట్లపై ఆరా తీశారు.ఈ దిశగా కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై అధికారులకు ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ రాహుల్ మీనా,తహసిల్దార్ రవికుమార్,సెక్టార్ ఆఫీసర్ డి.శ్రీనివాసులు అధికారులు ఉన్నారు.

????మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి మండలంలో ఆముదాలపల్లి గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు  పాల్గొన్నారు. గడపగడప తిరుగుతూ వారి ప్రేమానురాగాలు ఆదరణలు ఇస్తూ ఆహ్వానించారు ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థి అన్నా వెంకట రాంబాబుకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

*అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత..అంబేద్కర్ కోనసీమ జిల్లా..ఆలమూరు మండలం.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామంలో 216(ఏ) నెంబరు గల జాతీయ రహదారిపై నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఎస్సై శ్రీను నాయక్ నేతృత్వంలో స్టాటిక్ సర్వ్యులేషన్ టీం ఇంచార్జ్ కె.నాగేశ్వరరావు తెలిపిన వివరాలు ప్రకారం రాజానగరం నుండి అమలాపురం వైపుగా ఏపీ 39 ఎల్ క్యూ 77 నెంబరు గల కారులో 15,600 రూపాయల విలువ గల 180ML సామర్థ్యంతో ఉన్న 104 కోటర్ బాటిల్స్ ను స్వాధీనపరుచుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై తెలియజేశారు. అలాగే చట్టం దృష్టిలో అందరూ సమానులేనని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం, నగదు వంటి తదితర వస్తువులను సరైన ఆధారాలు లేకుండా తరలించినచో కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఏఎస్ఐ సూర్యచంద్రరావు, సిఐఎస్ఎఫ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు….???? చిత్తూరు జిల్లా..కర్ణాటక నుంచి కంటైనర్ ద్వారా తరలిస్తున్న మద్యం సీజ్ ..బంగారుపాళ్యం వద్ద పోలీసులు పట్టుకున్న పోలీసులురు..50 లక్షలు విలువ చేసే 720 కేసులు గా గుర్తింపు.. తిరుపతి రాజకీయ నాయకులకు చెందినది గా అనుమానిస్తున్న పోలీసులు

????కంభం జోరుగా సైకిల్ ప్రచారం..

కంభం గ్రామ పంచాయతీ పరిధిలోని 54 పోలింగ్ కేంద్రంలో జోరుగా సైకిల్ ప్రచారం చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అనీష్ అహ్మద్(అన్ను )కార్యనిర్వహక కార్యదర్శి (దాదా) బూత్ కన్వీనర్ నాగూర్ ఖాన్ ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించడం అలాగే రేపు 13వ తారీకు జరగబోయే ఎన్నికల్లో ముత్తుముల అశోక్ రెడ్డి నీ పార్లమెంటు కు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో షుకూర్. ఫజల్. ఫయాజ్. మరియు ముస్లిం యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

????యువ‌త‌కు బంగారు భ‌విష్య‌త్తు అందించేందుకు ఎంతో కృషి చేసిన జగనన్న..మార్కాపురం టౌన్ లో టీడీపీని వీడి 30 మంది యువత ఎమ్మెల్యే అన్నా సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిక*..రాష్టంలో యువ‌త‌కు బంగారు భ‌విష్య‌త్తు అందించేందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గ‌త ఐదేళ్లుగా ఎంతో కృషి చేశార‌ని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నా రాంబాబు అన్నారు.

మంగళవారం మార్కాపురం పట్టణంలోని 18వ వార్డుకు చెందిన 30 మంది టిడిపికి చెందిన యువకులు టీడీపీని వీడి 18 వ వార్డు కౌన్సిలర్ కరీముల్లా, నాయకులు టి. వెంకటరావు, బెల్లకొండ గోపీ,కంభం వెంకట రమణల ఆధ్వర్యంలో మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మార్కాపురం పట్టణం, జవహర్ నగర్ లోని ఎమ్మెల్యే అన్నా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబుని కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారికీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా పార్టీ కండువాలు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ జగనన్న చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై వైసీపీ లో చేరామన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నా రాంబాబు విజయానికి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయానికి కృషి చేస్తామన్నారు. పార్టీ లో చేరిన వారిలో ఏనుగుల సాయి, ఏనుగుల శివ, ఏనుగుల ప్రవీణ్, భూపని కిరణ్, ఇవి వెంకట్, సాయి, అశోక్, శివారెడ్డి, శేఖర్, అజయ్, విష్ణు, మౌలాలి, హరి, కాశీ, మహీంద్రా, మహేష్, ఉమా మహేష్, రేవంత్, మోహన్, అరవింద్, రంగా, మనోజ్, శివ, గోపీ, ఇమ్రాన్ తదితరులు ఉన్నారు.*

???? ఫ్యాను గుర్తుపై ఓటు వేసి,కుందురు,చెవిరెడ్డి లను గెలిపించండి..జంగంగుంట్ల గ్రామంలో ఇంటింటి ప్రచారంలో నాగార్జున రెడ్డి కుటుంబ సభ్యులు..నియోజకవర్గ అభివృద్ధి చెయ్యడమే నాగార్జున రెడ్డి లక్ష్యం*….

గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి గెలుపే లక్ష్యంగా వారి తమ్ముడు కుందురు కృష్ణ మోహన్ రెడ్డి సతీమణి కుందురు కోమలతా రెడ్డి మంగళవారం సాయంత్రం వరుసగా జంగంగుంట్ల గ్రామంలో ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాల అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు….ఎల్లప్పుడు గిద్దలూరు ప్రజల సంక్షేమం, కార్యకర్తల బాగోగులు చూసే తత్వం,నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా నాగార్జున రెడ్డి పనిచేస్తరన్నారు*…నియోజకవర్గ అభివృద్ధి కోసం తపన పడే నాగార్జున రెడ్డికి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు మద్దతుగా నిలవాలన్నారు…మే 13న జరిగే ఎన్నికల్లో గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న కుందురు నాగార్జున రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు…కార్యక్రమంలో జంగంగుంట్ల సర్పంచ్ మాసాని సుజాత,ఎంపీపీ తులసమ్మ ఓబుల్ రెడ్డి, కంభం మండల వైయస్సార్ సీపీ కన్వీనర్ గొంగటి చెన్నారెడ్డి, కంభం మండల మాజీ మార్కెట్ చైర్మన్ నెమలిదిన్నె చెన్నారెడ్డి, ఎంపీటీసీ పాలగిరి శరభారెడ్డి,కంభం మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు….

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*