ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు..ట్రావెల్స్‌ బస్సులో రూ.2.40కోట్లుసీజ్..జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన కర్నూలు క్రీడాకారులు..రేపు గిద్దలూరు రానున్న పవన్ కళ్యాణ్.. ఏర్పాట్లు పరిశీలించిన ముత్తుముల..గిద్దలూరు టిడిపిలో చేరికలు

???? ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు! అవును…లోక్‌ సభ ఎన్నికల తొలి రెండు దశల పోలింగ్‌ శాతంపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వస్తున్నాయని తెలిపారు.దేశంలో సుమారు పాతిక సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎం)ను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.అయితే… ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారీ..వాటి పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.అనేకసార్లు పరీక్షించిన తర్వాతే వాటిని ఉపయోగంలోకి తెచ్చినప్పటికీ సందేహాలు ముగియడంలేదు.ఈనేపథ్యంలో తాజాగా మమతా బెనర్జీ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు! అవును…లోక్‌ సభ ఎన్నికల తొలి రెండు దశల పోలింగ్‌ శాతంపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వస్తున్నాయని తెలిపారు.పశ్చిమ బెంగాల్‌ లో మే 1న జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన సందర్భంగా మమత ఈ వ్యాఖ్యలు చేశారు.ఇందులో భాగంగా…తొలి రెండు దశల పోలింగ్‌ ముగిసినపుడు ఒక పోలింగ్ సంఖ్యను ప్రకటించిన అధికారులు..ఆ తర్వాత ముందు ప్రకటించిన సంఖ్యకంటే ఏకంగా 5.75 శాతం పోలింగ్‌ పెరిగిందని ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ప్రకటించడమేంటని మమతా బెనర్జీ ప్రశ్నించారు.ఇదే సమయంలో…బెంగాల్‌ లో బీజేపీకి ప్రతికూలంగా ఉన్న చోట్లలోనే పోలింగ్‌ శాతం పెరిగిందని తెలిపారు.ఈ విధంగా పోలింగ్‌ శాతం ఒక్కసారిగా గణనీయంగా పెరగడంతో ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వస్తున్నాయని మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదే క్రమంలో…ఎన్నికల్లో గెలవడానికి భారతీయ జనతాపార్టీ ఎంతకైనా దిగజారుతుందని ఆరోపించారు.దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కాగా…భారత్ లో పలుసందర్భాల్లో ఈవీఎం లపై సందేహాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.అయితే… యూరప్‌,ఉత్తర అమెరికాలోని దేశాలు మాత్రం ఈవీఎంలకు దూరంగా ఉంటున్నాయి.????ఇదే సమయంలో…ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌, అమెరికా తదితర దేశాలు పారదర్శకత లోపించిందని చెబుతూ ఈవీఎంలను నిషేధించడం గమనార్హం.

???? క్రీడలతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు: కరస్పాండెంట్ పరమేష్..జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైన క్రీడా కారులకు దుస్తులు పంపిణి..కర్నూల్..

యూత్ అండ్ స్పోర్ట్స్డె అండ్వ డెలప్మెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 4 నుండి 6 వ తేది వరకు గోవాలో జరుగనున్న జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ చెట్టు ఎంపికైన విద్యార్థులకు వేదాన్సీ స్కూల్ కరస్పాండెంట్ పరమేష్ క్రీడా దుస్తులను విద్యార్థులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పథకాలతో రావాలని రాష్ట్రాన్ని పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సీనియర్ కరాటే మాస్టర్ బూరెల కేశవ్ పాల్గొన్నారు

????వైసీపీ షాకిచ్చిన వాలంటీర్లు..ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన తిమ్మాపురం గ్రామానికి చెందిన 5 మంది వాలంటీర్లు..గిద్దలూరు మండలంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. తిమ్మాపురం గ్రామానికి చెందిన 5 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేశారు.అనంతరం స్థానిక సర్పంచ్ పసుపుల మల్లీశ్వరయ్య ఆధ్వర్యంలో గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వాలంటీర్లు మర్రి మల్లికార్జున మీనిగే మనోహర్ గద్దల రంగస్వామి సప్పరపు వెంకటరమణ బాసికం వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

????ముత్తుముల సమక్షంలో టిడిపిలో చేరిన మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్..గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీయే తిమ్మాపురం సర్పంచ్ పసుపుల మల్లీశ్వరయ్య ఆధ్వర్యంలో మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మరియు వైసీపీ ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి టీడీపీ కండవాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మే 13న జరిగే ఎన్నికల్లో అశోక్ రెడ్డికి అత్యధిక మెజార్టీ వచ్చేందుకు కృషి చేస్తామని స్థానికంగా ఉండే అశోక్ రెడ్డిని గెలిపించుకుంటేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమన్నారు.కార్యక్రమంలో వైసిపిని వీడి టీడీపీలో చేరిన బలుస శ్రీనివాసులు,బలుసా రమణ,శ్రీనివాసులు చిలక రామయ్య,చిలక శ్రీనివాసులు,తదితరులు పాల్గొన్నారు.????జనసేన అధినేత బహిరంగ సభ ఏర్పాట్లలో భాగంగా హెలీప్యాడ్ ను పరిశీలించిన ముత్తుముల..గిద్దలూరు పట్టణంలో శుక్రవారం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఉండటంతో, ఒంగోలు రోడ్డులో HP పెట్రోల్ బంకు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ ఏర్పాట్లను గిద్దలూరు ఎన్డీయే కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాయుమార్గం ద్వారా గిద్దలూరు చేరుకొని అక్కడి నుండి జయరాం లాడ్జి వద్ద బహిరంగ సభలో పాల్గొంటారని, రేపు జరిగే బహిరంగ సభలో నియోజకవర్గంలోని అన్నీ గ్రామాల నుండి టీడీపీ, జనసేన,బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేలాది మంది తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

????ఇంటింటి ప్రచారంలో ముత్తుముల తనయుడు*బెస్తవారిపేట మండలం పందిళ్ళ పల్లె, పందిళ్ళపల్లె మోక్షగుండం sc కాలనీలు గ్రామంలో గిద్దలూరు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి తనయుడు ముత్తుముల దివ్యేష్ రెడ్డి గురువారం సాయంత్రం ఇంటింటికి తిరిగి టీడీపీ, జనసేన,బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తుముల అశోక్ రెడ్డికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.????టీడీపీలోకి చేరిన 18 కుటుంబాలు..ప్రకాశంజిల్లా.. గిద్దలూరు నియోజకవర్గం కంభం పట్టణంలోని అంకాలమ్మ తిప్ప మీద గల 18 యానాది కుటుంబాలు గురువారం తుపాకుల అంజి,కావేటి లక్ష్మణ్ ఆధ్వర్యంలో మండల టీడీపీ అధ్యక్షులు తోట శ్రీను సమక్షంలో టీడీపీలోకి చేరారు.

????ట్రావెల్స్‌ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్‌ చేసిన పోలీసులు..తూర్పు గోదావరి జిల్లా..జిల్లాలో పోలీసులు భారీగా నగదు సీజ్‌ చేశారు.

గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్‌ జిల్లాల చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు.దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్‌ చేసినట్లు దేవరపల్లి సర్కిల్‌ సీఐ బాల సురేష్‌ బాబు తెలిపారు…

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*