ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి..షర్మిల భర్త బ్రదర్ అనిల్ కామెంట్లు ఎవరిపై?.. బాబుకు మోది షాక్!!.. పవన్ ఇల్లు అసిస్టెంట్ అమ్మేశాడా..బి పేటలో మాగుంట ప్రచారం..గిద్దలూరు తెదేపాలో చేరిన నాయకులు..అబాకస్ పోటీ పరీక్షలో జాతీయస్థాయి అవార్డు సాధించిన నజీర్..

????ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది.ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు.జిరాక్సులు మాత్రమే ఇస్తారు.వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి.ఈ డేటా , పత్రాలు అన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి.చివరికి ఆస్తి యజమానుల ఫింగర్ ప్రింట్స్ కూడా వారి దగ్గరే ఉంటాయి. వాటిని ఉపయోగించుకుని రాత్రికి రాత్రి పత్రాలు మార్చేస్తే ప్రభుత్వానికి బాధ్యత ఉండదు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా.. మొదట ప్రభుత్వ అధికారి దగ్గరకే వెళ్లాలి.మొత్తం ఓ కుట్ర ప్రకారం…ప్రజల ఆస్తులపై హక్కులు లేకుండా చేస్తున్నారన్న అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖలో కార్డు ప్రైమ్‌ 2.0 అనే రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చింది.ఆస్తి సొంతదారుడు, కొనుగోలుదారుడు,ఇద్దరు సాక్షుల సంతకాలు ఉండవు. వీరి వేలిముద్రనే సంతకంగా పరిగణిస్తున్నారు. కొత్త విధానంలో దరఖాస్తుదారులే స్వయంగా డాక్యుమెంట్లు రూపొందించుకోవాలి.లేదా నెట్‌సెంటర్‌ నిర్వాహకులను ఆశ్రయించాలి. డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌కు వెళ్ళి దరఖాస్తు చేసుకోవడానికి లాగిన్‌ కావాలి.అందులో ఏ రకమైన డీడ్‌ రాయించుకోవాల్సి ఉంటుందో దానికి సంబంధించిన ఫార్మేట్‌ను ఎంపిక చేసుకుని, ఆ వివరాలు నమోదు చేసి, దానిని సబ్‌రిజిస్ట్రార్‌కు లింక్‌ రూపంలో పంపించాలి. దానిని సబ్‌ రిజిస్ట్రార్‌ పరిశీలించిన తర్వాత అందులో ఏవైనా తప్పులను సవరించాల్సి ఉంటే తిరిగి దరఖాస్తుదారుడికి సబ్‌రిజిస్ట్రార్‌ మెయిల్‌ ద్వారా లింక్‌ పంపుతారు. వాటిని కూడా సరిచేసి లింక్‌ ద్వారానే మరలా సబ్‌రిజిస్ట్రార్‌కు పంపితే, దానిని ఆయన ఓకే చేసినతర్వాతే కొనుగోలుదారుడు, అమ్మకందారుడు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్ళి వేలిముద్ర వేయాల్సివుంటుంది.ఇంత చేసిన తర్వాత కూడా అసలైన పత్రాలివ్వరు.అవి ప్రభుత్వం దగ్గరే అంటే.. ఈ ర్డు ప్రైమ్‌ 2.0 అనే రిజిస్ట్రేషన్ విధానం గుప్పిట్లో పెట్టుకున్న క్రిటికల్ కేర్ అనే ప్రైవేటు కంపెనీ వద్ద ఉంటాయి.ఈ రిజిస్ట్రేషన్ సంగతి సరే..అసలైన పత్రాలు ఎందుకు ఇవ్వరు..జిరాక్సులే ఎందుకు ఇస్తారన్నది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా… అమలు చేయాల్సిందేనని అధికారులు ఆదేశాలిచ్చారు.దీని వెనుక గూడుపుఠాణి ఏమిటో ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.

????షర్మిల భర్త బ్రదర్ అనిల్ కామెంట్లు ఎవరిపై?..  తాజాగా షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ చేసిన కామెంట్లు మీడియాలో వైరల్ గా మారాయి. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఆదివారం రోజు కడపలోని రాజారెడ్డి వీధిలో పర్యటిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ..ఎవరికి భయపడకండి..

..అందరికీ ఆ ఏసు ప్రభువే అండగా ఉంటారు.. పాపులను తరిమికొట్టండి.న్యాయం కోసమే మేము పోరాడుతున్నాం.ఆ దేవుడు మీద నమ్మకం ఉంచుకొని పాపాలు చేసే వారిని తొక్కి వేయండి అంటూ బ్రదర్ అనిల్ కుమార్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ అనిల్ కుమార్ తన భార్య షర్మిలకు మద్దతుగా నిలిచి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై పరోక్ష కామెంట్లు చేశారని భావిస్తున్నారు.ఇక ఇప్పటికే కడప పార్లమెంటు స్థానం నుండి వైయస్ షర్మిల కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా సొంత కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డిపై ముకుమ్మడిగా మాటల తూటాలు పేల్చుతున్నారు.ఇక షర్మిల వైసిపి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి పై పోటీ చేస్తుంది.అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా షర్మిల గెలవాలని అవినాష్ రెడ్డి తన చిన్నాన్న వివేకను హత్య చేశారని,అలాంటి నిందితులని పార్లమెంటుకి పంపకూడదని, నిందితులు పార్లమెంటుకు పోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను..మీఅందరూ నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలంటూ ప్రచారం చేస్తోంది.

???? పవన్ ఇల్లు అసిస్టెంట్ అమ్మేశాడా!!!..

అవును పవన్ ఇల్లు కట్టుకున్నారు..ముచ్చటగా మంచి ఇల్లు. అందులో వుందాం అనుకున్నారు.కానీ దాన్ని మెయింటెయిన్ చేయలేక అమ్మేసారు.కానీ అలా చెప్పుకోవడం నామర్దా కదా ..అందుకే తన అసిస్టెంట్ బలవంతంగా తన చేత అమ్మించేసారు.లేదా తనే అమ్మేసాడు అంటున్నారు.కాస్త కన్ఫ్యూజ్ గా వుంది కదా. పవన్ మాటలు,ప్రసంగాలు అలాగే వుంటాయి. ప్రజారాజ్యం పార్టీ పెట్టింది మెగాస్టార్ చిరంజీవి.దాన్ని నిర్వహించలేక కాంగ్రెస్ లో కలిపేసింది ఆయనే.అలా కలపడం ద్వారా లబ్ది పొంది, కేంద్రంలో మంత్రి పదవి పొందింది ఆయనే.కానీ పవన్ అలా అనుకోవడం లేదు. ప్రజారాజ్యం పార్టీని బలవంతంగా కన్నబాబు అనే జస్ట్ పార్టీ సభ్యుడు లేదా పార్టీ ఎమ్మెల్యే అమ్మేసేలా చేసారు అంటున్నారు.అదే సందర్భంలో అక్కడే వున్న మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంచి వాడే.కన్నబాబే చెడ్డవాడు.కన్నబాబు అంటే మొదటి నుంచీ పవన్ కు కోపమే.తను ఎమ్మెల్యే కాలేదు, తమ దగ్గర చేతులు కట్టుకుని వుండే వాడు ఎమ్మెల్యే,మంత్రి అయిపోయాడు అన్నది పవన్ బాధ.ఆ బాధ ఇన్నాళ్లూ పైకి చెప్పలేదు. ఇప్పుడు కక్కేసారు. ‘కన్నబాబూ రా అంటే పరుగెత్తుకుని వచ్చేవాడు. డొక్కు స్కూటర్ మీద తిరిగేవాడు.మా అన్న ఏదైనా సమాచారం అడిగితే ఇచ్చే పని చేసేవాడు. అంచెలంచెలుగా ఎదిగిపోయాడు’ అనేసి మళ్లీ నాలుక కర్చుకున్నాడు. ఎదగొచ్చు…కానీ అందరినీ తొక్కేసి ఎదగకూడదు అంటూ సవరణ ఇచ్చుకున్నారు.కన్నబాబు ఎవర్ని తొక్కేసి ఎదిగారు? ప్రజారాజ్యం అధినేత మెగాస్టార్ తో పాటే కదా కాంగ్రెస్ లోకి వెళ్లింది. చాలా మంది కాంగ్రెస్ వాదుల మాదిరిగానే కదా వైకపాలోకి వచ్చింది.కష్టపడి ప్రజల అభిమానం చూరగొనకుండా గెలవగలరా? మరి ఇక్కడ తొక్కేయడం అన్న పాయింట్ ఎక్కడుంది?పవన్ ఎంత మంది హీరోలను తొక్కేసి ఈ స్థాయికి వచ్చారు? అలా అంటే ఒకె అనగలరా? అసలు మెగాస్టార్ బ్రదర్ కాకుండా వుంటే పవన్ కు ఈ రోజు ఆ డొక్కు స్కూటర్ అయినా వుండేదా? తమ దగ్గర పని చేెసేవాడు పనివాడిలాగే వుండిపోవాలి.తమను దాటిపోకూడదు అనే నైజం ఎవరికీ ఉండకూడదు.పవన్ తన నైజం అలాంటిది అని బయటపెట్టుకున్నారు ఈ రోజు గత అయిదేళ్లలో ఇదే కన్నబాబు ఎన్నిసార్లు చిరంజీవితో టచ్ లో వున్నారు. జగన్ ను మెగాస్టార్ కు మధ్య కమ్యూనికేషన్ కన్నబాబే అన్న సంగతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.ఈ సంగతి పవన్ కు తెలియదా?పవన్ బాధ ఒకటే తను ఎమ్మెల్యే కాలేకపోయాను, సిఎమ్ కాలేకపోయాను.జగన్ తనకన్నా చిన్న అయినా సిఎమ్ అయిపోయాడు. కన్నబాబు తమ దగ్గర చెేతులు కట్టుకుని వుండేవాడు. మంత్రి అయిపోయాడు.అదే కదా పవన్ బాధ ఆ ఇద్దరి మీద.

????ఏపీ సీఎం పదవి బాబుకు కాదా..?.. షాక్ ఇచ్చిన మోదీ..!!

ఆంధ్రప్రదేశ్‌ లో పొత్తు కుదిరాక టీడీపీ,జనసేన,బీజేపీ సంయుక్తంగా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో తొలి సభను ‘ప్రజాగళం’ పేరుతో నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ సభకు మూడు పార్టీల ముఖ్య నేతలు.. ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ మాటలపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.అభివృద్ధి జర గాలంటే కేంద్రంలో,రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్లు ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఎన్డీయే కూటమిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రసంగం మొత్తంలోనూ ఆయనెక్కడా చంద్రబాబును,పవన్‌ కళ్యాణ్‌ ను అభినందిస్తూ మాట్లాడకపోవడంపై టాక్‌ నడుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓట్లేయాలని అని చెప్పకుండా ఎన్డీయే కూటమికి ఓట్లేయాలని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. కేంద్రంలో ఎన్డీయే కూటమికి నాయకత్వ స్థానంలో ఉంది బీజేపీయే కావడం ఇక్కడ గమనార్హం.మూడు పార్టీల కూటమి ద్వారా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని ఆశించిన చంద్రబాబుకు మోదీ గట్టి షాకే ఇచ్చారని టాక్‌ నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎన్డీయేకు రాకుండా కాంగ్రెస్‌ కు మళ్లించడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని కూడా మోడీ ఆరోపించారు. ????ఇలా తన ప్రసంగం ఆద్యంతం ప్రధాని మోదీ ఎన్డీయే కూటమిని గెలిపించాలని అన్నారే కానీ చంద్రబాబు సీఎం కావాలని లేదా పవన్‌ సీఎం కావాలని వ్యాఖ్యానించలేదు.రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వాలు ఉండాలంటున్న మోదీ మాటల వెనుక నిగూడార్థం ఉందని అంటున్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అంటే బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటారనేది ఆయన మాటల ఉద్దేశమని ఊహాగానాలు నడుస్తున్నాయి.ఎన్డీయే కూటమి తరఫున పురందేశ్వరిని ఏపీ ముఖ్యమంత్రిని చేయాలనేది నరేంద్ర మోదీ ఉద్దేశమా అని ఆయన మాటల వెనుక నిగూడార్థాన్ని వెతుక్కుంటున్నారు. చంద్రబాబుపై ఈ ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేసింది.ఆయనను 50 రోజులకుపైగా జైలులో పెట్టింది. అలాగే చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ తోపాటు టీడీపీ ముఖ్య నేతలందరిపైన కేసులు దాఖలయ్యాయి.ఈ నేపథ్యంలో తమపై నమోదైన కేసుల విచారణ ముందుకు సాగకుండా ఉండటానికి ప్రధాని మోదీ ఏదడిగినా ఇవ్వడానికి చంద్రబాబు ముందుంటారని అంటున్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి కూడా ఆయన సిద్ధపడొచ్చని చెబుతున్నారు.ఈక్రమంలోనే చిలకలూరిపేట ప్రజాగళం సభలో ప్రధాని మోదీ చంద్రబాబును ఏమాత్రం అభినందించకపోవడం, పొగడకపోవడం దీన్నే సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.చంద్రబాబు అనుభవాన్ని కానీ, విజన్‌ ను కానీ, ఆయన సీఎంగా ఉండాల్సిన అవసరాన్ని కానీ మోదీ ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం.కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అనే మాట వెనుక మోదీ ఉద్దేశాలు వేరని అంటున్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అని మోదీ పలుమార్లు నొక్కిచెప్పడం వెనుక కీలక వ్యూహం ఉందని చెబుతున్నారు.బీజేపీ ఏపీలో ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది.. ఎన్ని గెలుస్తుంది? అనే విషయాన్ని పక్కనపెడితే కూటమి తరఫున ముఖ్యమంత్రి ఎవరనే అంతిమ అధికారం మోదీకే ఉంటుందంటున్నారు.ఎన్డీయే ముఖ్యమంత్రి అని ప్రధాని మాటల వెనుక ఉద్దేశం కూడా అదేనని అంటున్నారు. దీని ప్రకారం..బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సీఎంను చేయడమే మోదీ ఉద్దేశం కావచ్చని చెబుతున్నారు.????పురంధేశ్వరి ఏపీకి సీఎం అవుతారని ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి గతంలోనే ప్రస్తావించడం గమనార్హం.మోదీ ప్రసంగం టీడీపీ శ్రేణులకు సంతోషాన్ని ఇవ్వలేదని అంటున్నారు. చంద్రబాబు అనుభవాన్ని పొగుడుతూ వైఎస్‌ జగన్‌ ను మోదీ తిట్టిపోస్తారని టీడీపీ శ్రేణులు అంచనా వేశాయి. అయితే వారి అంచనాలు తప్పడంతో తీవ్ర నిరాశ తప్పలేదని అంటున్నారు.

???? అబాకస్ పోటీ పరీక్షలో విజయం సాధించి జాతీయస్థాయిలో అవార్డు అందుకున్న స్పందన పాఠశాల విద్యార్థి నజీర్, హైదరాబాదులో ఆదివారం జరిగిన జాతీయస్థాయి అబాకస్ పోటీ పరీక్షలో విద్యార్థి నజీర్ ఈ ఘనత సాధించాడు. ఈ సందర్భంగా విద్యార్థి నజీర్ ను హైదరాబాద్ అబాకస్ నిర్వాహకులు అభినందించి మోమెంటో అందజేశారు జాతీయ స్థాయిలో సత్తా చాటి జాతీయ అబాకస్ అవార్డు అందుకున్న నజీర్ ను స్పందన విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ పేర్ల సుధీర్ కుమార్ రెడ్డి అభినందించారు జాతీయ స్థాయి అవార్డు అందుకోవడం తమకు తమ పాఠశాలకు గర్వకారణం అన్నారు.……???? గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేటలో తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు సైదులు నివాసం లో కార్యకర్తల తో ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గిద్దలూరు శాసనసభ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి మరియు మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయులు నిఖిల్ రెడ్డి.. అనంతరం ఆయన అర్థవేడు మండలంలో రోడ్ షోలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి కుప్పా రంగసాయి,జనసేన నియోజకవర్ఘ ఇంచార్జి బెల్లంకొండ సాయి బాబు మరియు తదితర టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

????మాగుంటను కలిసిన కంభం టిడిపి నాయకులు…కంభం మండల టీడీపీ నాయకులు రజాక్ భాష (స్టార్),కాకర్ల ప్రసాద్,బాబు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు ఎన్డీయే కూటమి అభ్యర్దిగా పోటీ చేయుచున్న ముత్తుముల అశోక్ రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్దిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలుపు కొరకు అత్యధిక మెజార్టీ వచ్చేందుకు కృషి చేస్తామన్నారు.కార్యక్రమంలో అయిన బత్తిన గణేష్ శ్యామ్ పాల్గొన్నారు……………..???? గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన కంభం పట్టణ వైకాపా నాయకుడు మొగల్ అస్లాం భేగ్.. కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉన్న ఆయన ఆదివారం టిడిపిలో చేరడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది..

????ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన 25 కుటుంబాలు..ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో గడికోట పంచాయతీ మాజీ సర్పంచులు ముచ్చుకుండ్ల రామసుబ్బయ్య, మందగిరి రంగస్వామి, దూదేకుల నరసింహులు ఆధ్వర్యంలో దేవనగరం గ్రామానికి చెందిన ఇద్దరు వార్డు మెంబర్లతో సహా 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో స్థానికంగా ఉండే అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*