మోదీపై అనర్హత వేటు వ్యవహారం..మంత్రి బుగ్గన,ఆమంచిల ఎన్నికల అఫీడబిట్ పై అభ్యంతరం.. మాగుంట, ముత్తుముల,కేపీ కుటుంబాల విస్తృత ప్రచారం..పోలీసుల అవగాహన సదస్సు..

????13 రాష్ట్రాల్లో మొత్తం 88 నియోజకవర్గాల్లో రెండో దశ లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే తొలి విడత పోలింగ్ ముగిసిన నేపథ్యంలో…

రెండో విడతలో బిహార్, ఛత్తీస్‌ గఢ్, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్‌ లల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది.ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ తీవ్రంగా కృషి చేస్తుంది.మరోపక్క బీజేపీని ఎలాగైనా గద్దెదించాలని ఇండియా కూటమి కసరత్తులు చేస్తుంది.ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది.పైగా ఆ విషయం ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించింది కావడంతో మరింత ఆసక్తిగా మారింది. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే…ప్రధాని మోడీకి సంబంధించి అనర్హత పిటిషన్ దాఖలయ్యింది..దీనిపై విచారణ తేదీ ఫిక్సయ్యింది. అవును…ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్ ఒకటి ఢిల్లీ హైకోర్టులో దాఖలైంది.ఈ పిటిషన్ ను ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. అయితే…నేడు ఈ పిటీషన్ విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడింది.దీంతో…ఈ నెల 29వ తేదీ (సోమవారం) ఈ పిటీషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుందని తెలుస్తుంది. దీంతో…సోమవారం ఢిల్లీ హైకోర్టులో ఏమి జరగబోతోందనేది ఆసక్తిగా మారింది. వాస్తవాన్నికి ఈరోజే ఈ పిటిషన్ పై విచారణ జరగవలసి ఉన్నప్పటికీ…ఈ పిటీషన్‌ ను విచారించాల్సిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సచిన్ దత్తా విధులకు హాజరు కాలేదు.ప్రస్తుతం ఆయన సెలవులపై వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం నాడు విధులకు హాజరు కానున్నారని..ప్రధాని మోదీ అనర్హత పిటీషన్‌ పై ఆరోజు ఆయన విచారణ చేస్తారని చెబుతున్నారు! వీవీప్యాట్‌ల‌పై సుప్రీంకోర్టు తీర్పు లోక్‌ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా… దేవుళ్లు,మతాల పేర్లను విస్తృతంగా వినియోగిస్తోన్నారనే ఆరోపణలను ప్రధాని మోడీ ఎదుర్కొంటోన్నారు. హనుమాన్ చాలీసాను స్వేచ్ఛగా వినే హక్కును కూడా ప్రజలు కోల్పోయారంటూ కర్ణాటక ఎన్నికల ప్రచార సభలో మోడీ పేర్కొన్నారు.ఇదే క్రమంలో… ఉత్తరప్రదేశ్‌ లోని ఫిలిభిత్‌ లోని ఎన్నికల ప్రచార సభలో దేవుళ్లు – దేవాలయాలు, హిందువులు – హిందూమతం పేర్లతో మోడీ ఎన్నికల్లో ప్రచారం చేశారని పిటిషన్ లో పేర్కొన్నట్లు తెలుస్తుంది!

????ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌ పై అభ్యంతరం..మరోసారి డోన్‌ నుంచి ప్రాతినిథ్యం వహించేందుకు వైసీపీ అభ్యర్థిగా బుగ్గన నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు నామినేషన్ల పరిశీలన సందర్భంగా.. ఆయన ఎన్నికల అఫిడవిట్‌ పై అభ్యంతరం వ్యక్తం అయ్యింది. ఇందులో భాగంగా… టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి తరఫు న్యాయవాది.. బుగ్గన నామినేషన్ పై అభ్యంతరం తెలిపారు. ఇందులో భాగంగా… బుగ్గన తన ఆస్తుల వివరాలు పూర్తిగా వెల్లడించలేదని, నామినేషన్‌ పత్రంలో కొన్ని కాలమ్స్‌ ని భర్తీ చేయలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే క్రమంలో.. ఈ ఫిర్యాదులో పేర్కొన్న విషయాలకు సంబంధించి తనవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, అందువల్ల వెంటనే అతని నామినేషన్‌ తిరస్కరించాలని ఎన్నికల అధికారిని కోరారు. ఇదే సమయంలో కొన్ని ఆధారలను ఆర్వోకు చూపించారని అంటున్నారు.

????చీరాల కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ పెండింగ్…

4.63 కోట్లు విద్యుత్ బకాయలు ఎగనామం పెట్టాడంటూ ఆర్వోకు పిర్యాదు చేసిన నాగార్జున రెడ్డి అనే వ్యక్తి.వీటితో పాటు నియోజకవర్గంలో ఆమంచి అక్రమాలు, అరాచకాలు, హత్యలు చేశాడని బుక్ లేట్ రూపంలో ఆర్వో సమర్పింసిన నాగార్జున రెడ్డి.నామినేషలో పత్రాలలో కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను లేవు అందుకే పెండింగ్ లో పెట్టాం: ఆర్వో రేపు ఉదయం 10గంటలకు సబ్మిట్ చేయాలని చెప్పామని ఆర్వో సూర్యనారాయణ రెడ్డి తెలిపారు.

చిన్న కంభం టీడిపి కి భారీ షాక్…

గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి తమ్ముడు కుందురు కృష్ణ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ లో చేరిన కుటుంబాలు..కంభం పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి తమ్ముడు కుందురు కృష్ణ మోహన్ రెడ్డి గారి సమక్షంలో కంభం మండలం చిన్న కంభం పంచాయతీ పరిధిలోని “”దేవ నగరం”” గ్రామం “”ఎస్సీ పాలెం”” చెందిన 100 కుటుంబాలు సర్పంచ్ తమ్ముడు డాక్టర్ రసూల్ మరియు మాజీ ఎంపీటీసీ గజ్జెల ఓంకార్ ఆధ్వర్యంలో టీడీపిని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.ఈ సందర్భంగా వారికి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

???? పలువురు వాలంటీర్ల రాజీనామా..చంద్రబాబు.. మోసపూరితమైనటువంటి వాలంటరీకి ఇచ్చిన హామీ, గతంలో వాలంటరీ వ్యవస్థపై తాను తాన దత్త పుత్రుడు చేసిన తీవ్ర ఆరోపణలు , మరియు వాలంటరీ సేవలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి, వ్యవస్థను తాత్కాలికంగా నియంత్రణ చేసిన చంద్రబాబుకు వ్యతిరేకంగా గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కే. నాగార్జున రెడ్డికి మద్దతుగా బేస్తవారిపేట మండలం పి. వెంకటాపురం వాలంటరీస్ పి. వెంకటాపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టమటం వెంకటరమణారెడ్డి మరియు గ్రామస్తులు ఆధ్వర్యంలో కందుల శివారెడ్డి ,కే .సుశీల, కె. రవికుమార్, బి .కృష్ణవేణి ,ఏ. పద్మావతి ,ఎం . దివ్యభారతి, స్వచ్ఛందంగా రాజీనామా చేయడం జరిగింది.

???? శుభ కార్యక్రమాలలో పాల్గొన్న ముత్తుముల   కుమారుడు దివ్యేష్.. గిద్దలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి తనయుడు దివ్యేష్ రెడ్డి శుక్రవారం రాచర్ల మండలం సోమిదేవిపల్లె గ్రామంలో జరుగుతున్న కప్పేట వెంకటేశ్వర రెడ్డి రమాదేవిల కుమారుడు మాధవ రెడ్డి వైష్ణవిల వివాహ వేడుక మహోత్సవంలో ????కొమరోలు మండలం తాటీచెర్ల గ్రామంలో జరుగుతున్న బోగోలు నడిపి పోలయ్య అంకమ్మల కుమారుడు రామాంజనేయులు రమాదేవిల వివాహ వేడుక మహోత్సవంలో ????గిద్దలూరు మండలం తంబళ్ల పల్లె గ్రామంలో జరుగుతున్న కొత్తకోట శ్రీనివాసులు రాజ్య లక్ష్మిల కుమారుడు రాజమోహన్, విష్ణుప్రియ ల వివాహ వేడుక మహోత్సవంలో????కంభం మండలం జంగం గుంట్ల గ్రామంలో జరుగుతున్న శ్రీరాం యేసయ్య రాణిల కుమారుడు ప్రవీణ్ కుమార్ ఇందు ల వివాహ వేడుక మహోత్సవంలో,గిద్దలూరు పట్టణంలోని శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి ఆలయ కళ్యాణ మండలంలో జరుగుతున్న వలసాని శ్రీనివాసులు లక్ష్మీ దేవిల కుమారుడు వెంకటేష్,లక్ష్మీ శ్వేతల వివాహ వేడుక మహోత్సవంలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు.కార్యక్రమంలో మండల గ్రామ టీడీపీ నాయకులు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

????వైసీపీ పాలనలో వ్యాపార రంగాలు కుదేలు..అన్నీ వర్గాల సంక్షేమం ఎన్డీయే కూటమితోనే సాధ్యం..మీకు ఏ సమస్య వచ్చిన అండగా ఉంటా..గిద్దలూరు పట్టణ ఇంటింటి ప్రచారంలో ముత్తుముల అశోక్ రెడ్డి..రాష్ట్రంలో వైసీపీ పాలనలో వ్యాపార రంగాలు కుదేలు అయ్యాయని గిద్దలూరు ఎన్డీయే కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి ప్రజలకు వివరించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం గిద్దలూరు పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్ నుండి అమ్మవారిశాల,పొట్టి శ్రీరాములు విగ్రహాం వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించి వ్యాపార సముదాయాల యజమానులను కలుసుకొని టీడీపీ,జనసేన,బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాలను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.నాడు తెలుగుదేశం హయాంలో అన్నీ వర్గాల సంక్షేమం కోసం కృషి చేయటం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ అన్నీ వర్గాలను నట్టేట ముంచిందని,వ్యాపార రంగాల పై దాడులు చేయించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అని ప్రజలంతా వైసీపీ చేస్తున్న అరాచకాలను గుర్తు ఉంచుకోవాలన్నారు.తాను స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చిన అండగా ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.

???? దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం బొద్దికూరపాడులో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి మరియు దర్శి శాసనసభ అభ్యర్థి డా గొట్టిపాటి లక్ష్మి భర్త డా. కడియాల లలిత్ సాగర్ సమక్షం లో పలువురు వై. యస్. ఆర్. సి.పి ని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగింది ఈ కార్యక్రమం లో టి. డి. పి, జనసేన, బీజేపీ మండలం నాయకులు, గ్రామ నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

???? మైనారిటీ సంక్షేమానికి గత NDA కూటమి ప్రభుత్వం లో రాష్ట్రం లో చేపట్టిన వివిధ పధకాలను తెలియజేస్తూ రూపొందించిన పొస్టర్ ను ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆవిష్కరించారు. ఆయన  ఆవిష్కరించిన కరపత్రాలను ముస్లిం నాయకులు షేక్ మస్తాన్ వలి,షేక్ పఠాన్ అహ్మద్ ఖాన్, షేక్ అబూ బకర్,షేక్ తోహిద్, షేక్ బాబా మసీద్ లో పంపిణి చేసారు.తెలుగుదేశం పాలన లో దుల్హన్ స్కీం ,ఇమామ్ మౌజన్లకు గౌరవ వేతనాలు, చంద్రన్న భీమా , విద్యావ్యాప్తి ,దుకాన్ ఔర్ మకాన్ , స్వయం ఉపాధి , విదేశీ విద్య స్కీం ,సబ్సిడీ రుణాల పధకాలు ముస్లిం సంక్షేమం కోసం గతం లో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేయడం జరిగిందని ముస్లిం సోదరులకు తెలియజేస్తూ కరపత్రాలను ముస్లిం నాయకులు పంపిణి చేశారు.

????కంభం మండలం కందులాపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్బిఎస్ నగర్ ,గాంధీ బజార్,ఇస్లాంపేట్ వీధులలో ప్రచారాన్ని కొనసాగిస్తున్న గిద్దలూరు నియోజకవర్గ అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి సోదరుడు కృష్ణ మోహన్ రెడ్డి సతీమణి కుందూరు కోమలత రెడ్డి మరియు కంబం మండలం కన్వీనర్ గొంగటి చెన్నారెడ్డి ,ఎంపీపీ తులసమ్మ , సర్పంచ్ బత్తుల రజినీ ఎంపీటీసీ నేరెళ్ల శ్వేత ,ఉప సర్పంచ్ గారు, సచివాలయం కన్వీనర్ లు, గృహ సారధులు,పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు..

???? దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం బొద్దికూరపాడులో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి మరియు దర్శి శాసనసభ అభ్యర్థి డా గొట్టిపాటి లక్ష్మి భర్త డా. కడియాల లలిత్ సాగర్ సమక్షం లో పలువురు వై. యస్. ఆర్. సి.పి ని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగింది ఈ కార్యక్రమం లో టి. డి. పి, జనసేన, బీజేపీ మండలం నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

???? టీడిపి కీ భారీ షాక్..ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం,అర్ధవీడు పట్టణానికి చెందిన 25 మేదరి కుటుంబాలు,మాజీ ఎంపీపీ రవికుమార్  ఆధ్వర్యంలో వైస్సార్సీపీ లోకి చేరారు.శుక్రవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి సోదరుడు కుందురు కృష్ణ మోహన్ రెడ్డి  సమక్షంలో వైసీపీలోకి చేరారు.ఈ సందర్భంగా వారిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కృష్ణ మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.*

????ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఐపియస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (క్రైమ్) శ్రీధర్ రావు కంభం మరియు అర్ధవీడు పీఎస్ పరిధిలో గ్రామాలను సందర్శించి ప్రజలకు ఎన్నికల ప్రవర్తన నియమావళి మరియు ఓటు హక్కు ప్రాధాన్యత గురించి, ఎలక్షన్ సమయంలో ఏమి చేయవచ్చునో చేయకూడదో అనే విషయాలపై ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. పోలింగ్ రోజున ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేందుకు జిల్లా పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని, ప్రతీ ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహనా పెంచుకొని పాటించాలని సూచించారు.ఎన్నికల వేళ ప్రజలు గొడవలు,అల్లర్లకు దూరంగా ఉండాలని, ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగేలా సహకరించాలని కోరారు. గ్రామాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.కార్యక్రమంలో కంభం సీఐ రామకోటయ్య, కంభం ఎస్సై రాజేష్, అర్ధవీడు ఎస్సై అనితా మరియు సిబ్బంది పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*