టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

????టిడిపిని వాలంటీర్లే ఓడిస్తారా???

సీఎం జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన వాటిలో వాలంటరీ వ్యవస్థ కూడా ఒకటి..50 ఇళ్లకు చొప్పున ఒకరిని నియమించి.. ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను కూడా అందిస్తూ ఉన్నారు.అయితే ఇలాంటి వాలంటరీ వ్యవస్థ పైన గతంలో చంద్రబాబు నాయుడు చాలా నీచమైన కామెంట్స్ కూడా చేయడం జరిగింది.గోన సంచులు మోసే ఉద్యోగులు అంటూ వెటకారం చేయడమే కాకుండా మహిళలు ఒంటరిగా ఇళ్ల వద్ద ఉంటే వాలంటరీలు వెళ్లి తలుపు తడుతున్నారని..నీచ స్థాయికి దిగజారిపోయి మరీ మాట్లాడారు. ఈ మాటలకు పవన్ కళ్యాణ్ కూడా వత్తాసు పలకడం జరిగింది.దీంతో వాలంటరీలంతా రోడ్డు ఎక్కడమే కాకుండా దాదాపుగా 30 వేల మంది మహిళలు కూడా అదృశ్యమయ్యారని..తనకు కేంద్ర హోంశాఖ మంత్రి తెలియజేసింది అంటూ ఏవేవో నానా మాటలు మాట్లాడి ఉన్న పరువు కాస్త పోగొట్టుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే టిడిపి, జనసేన నేతలు వాలంటరీ వ్యవస్థకి ప్రస్తుతం భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది.ఎందుకంటే ప్రధానంగా ఎన్నికలలో వాళ్లే దెబ్బేసేలా చంద్రబాబుకు కనిపిస్తూ ఉండడంతో వాలంటరీలను సైతం గాళం వేసే పనిలో భాగంగా రూ.5000 జీతాన్ని కాస్తా రూ.10వేలకు పెంచుతానంటూ ఉగాది రోజున తెలియజేశారు.దీంతో వాలంటరీలంతా కూటమి వైపు తిరుగుతారని బాబు ఎంతో ఆశగా ఉండేవారు..కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు..వాలంటీర్లు రాజీనామా చేసి వైసిపి పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాలంటరీ అనే పదాన్ని పక్కనపెట్టి మరి ప్రతి ఇంటికి వెళ్లి జగన్ ప్రభుత్వంలో తాము నేరుగా చేసిన సేవలు గురించి వివరిస్తూ పలు రకాల కార్యక్రమాలను చేపడుతూ జగన్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ ఇంటికి వెళ్లి మరీ ప్రచారం చేస్తున్నారట.దీన్ని బట్టి చూస్తే అధికార పార్టీకి రాజకీయంగానే కాస్త అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది..ముఖ్యంగా చంద్రబాబు ఇస్తానన్న 10, 000 రూపాయల గాళం ఏమాత్రం పనిచేయలేదని క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది.మరి కొంతమంది నిన్ను నమ్మలేము దొర అంటూ చంద్రబాబుని కామెంట్స్ చేస్తూ ఉన్నారు..దీన్నిబట్టి చూస్తే బాబును వాలంటరీలే ఓడించేలా కనిపిస్తున్నారు.

???? డబ్బుల కోసం పవన్ సీట్లు అమ్ముకున్నారా!!!పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు..ఇటీవల జనసేనకు రాజినామా చేసి, వైసీపీలో చేరిన పోతిన మహేష్ ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ డబ్బులు,ఆస్తులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవును…జనసేన పార్టీ టిక్కెట్ దక్కకపోవడంతో పవన్ కల్యాణ్ వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో ఫైరయిన పోతిన మహేష్…తాజాగా ఆయన ఆస్తులపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాజాగా ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న పోతిన మహేష్ కు ఓ ప్రశ్న ఎదురైంది.ఇందులో భాగంగా…పవన్ కల్యాణ్ సినిమాలు చేసి సంపాదించిన డబ్బు పార్టీకి ఖర్చుపెడుతున్నారని జనసైనికులు చెబుతుంటే.. డబ్బుల కోసం పవన్ సీట్లు అమ్ముకున్నారని పోతిన మహేష్ చెప్పడంపై ప్రశ్నించారు! దీంతో దీనికి సమాధనంగా స్పందించిన మహేష్…2014 నుంచి 2024 వరకూ పవన్ కల్యాణ్ చేసిన సినిమాలు ఎన్ని? ఎన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి?ఎన్ని డిజాస్టర్ అయ్యాయి?పవన్ కల్యాణ్ చేసిన సినిమాలు… అత్తారింటికి దారేది,గోపాల గోపాల,సర్ధార్ గబ్బర్ సింగ్,కాటమ రాయుడు, అజ్ఞాతవాసి,వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో అని చెబుతు..ఈ సినిమాల మొత్తానికి ఆయనకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంత? అని ప్రశ్నించారు.ఇదే క్రమంలో… 2014 నుంచి 2024వరకూ సినిమాల్లో ఆయనకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంత..? ఆయన కట్టిన ఇన్ కం ట్యాక్స్ ఎంత..? ఆయన మెయిటినెన్స్ పోగా మిగిలింది ఎంత..?ఆయన పార్టీ కోసం ఖర్చు పెట్టింది ఎంత..?ఆయన కొన్న ఆస్తులు ఎంత..? అని ప్రశ్నించారు.ఇదే సమయంలో పవన్ కల్యాణ్ కి డబ్బులు ఎవరు ఇస్తున్నారనేది బహిరంగ సత్యం అని చెబుతూ…చంద్రబాబు నుంచి, టీడీపీ నేతల నుంచి పవన్ కు డబ్బులు వస్తున్నాయనేది అంతటా ఇదే క్రమంలో ఖచ్చితంగా పవన్ కల్యాణ్ కి ఉన్న ఆస్తుల వివరాలను ఎన్నికలకు ముందే బయటపెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా తాను ఒక మాట చెబితే దానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు. దీంతో… పోతిన మహేష్ కు తెలిసి పవన్ కల్యాణ్ 2014 – 2024 వరకూ కొన్న ఆస్తులు ఎంత అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది!

????ప్రస్తుతం పవన్ పిఠాపురం నుంచి బరిలో ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరంలో రెండు చోట్ల ఓడిపోయిన ఆయన ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకే కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాన్ని చూసి మరీ ఎంచుకున్నారు. ఇప్పటికే నాలుగు రోజుల పాటు నియోజవర్గంలో పర్యటించి.. స్థానిక నాయకులతో చర్చలు జరిపారు. అక్కడ తన గెలుపు బాధ్యతను టీడీపీ ఇన్ ఛార్జి వర్మకు అప్పగించారు.????ఇదిలా ఉండగా.. పవన్ పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని జైభీం పార్టీ అభ్యర్థి జగ్గారపు మల్లిఖార్జున పవన్ కల్యాణ్ పై ఈసీకి ఫిర్యాదు చేశారు. జనసేనాని విచ్చలవిడిగా రూ.వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని.. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కులం, మతం ప్రాంతం ఆధారంగా పవన్ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు అంటూ.. చర్యలు తీసుకోకుంటే హైకోర్టును ఆశ్రయిస్తాం అని సంచలన ఫిర్యాదే చేశారు. మరి ఏం జరుగుతుందో చూడాలి……

???? ఆంధ్ర మిర్రర్.. దరిశి  లో జరిగిన జయహో *బీ. సి సభ* లో దర్శి శాసనసభ అభ్యర్థి డా గొట్టిపాటి లక్ష్మి, జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ ,ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి,మునిసిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య ,మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు మరియు కార్యక్రమంలో రాష్ట్ర బి. సి. నాయకులు, తెలుగుదేశం,జనసేన,బిజెపి నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

???? ఆంధ్ర మిర్రర్ గిద్దలూరు.. శ్రీరామ నవమి సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు రోడ్ లో సీతామహాలక్ష్మి కల్యాణ మండపంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువనాయకులు మాగుంట రాఘవరెడ్డి వారి సతీమణి చందన మరియు గిద్దలూరు శాసనసభ అభ్యర్థి అశోక్ రెడ్డి వారి సతీమణి పుష్పలీల పాల్గొన్నారు.కార్యక్రమంలో డా. జె. వి నారాయణ, కుప్పా రంగసాయి, బిజెపి తెలుగుదేశం,జనసేన,నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

????ముత్తుముల సమక్షంలో టిడిపిలో చేరిన మాజీ జెడ్పిటిసి* ఆంధ్ర మిర్రర్..అర్థవీడు మండలంలో పర్యటిస్తున్న ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో పెద్దకందుకూరు గ్రామానికి చెందిన మాజీ జడ్పిటిసి సభ్యురాలు వెంకటలక్ష్మి వైసీపీని వీడి తన అనుచరవర్గంతో సహా తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టిడిపి కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో అశోక్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తామని మాజీ జెడ్పిటిసి తెలిపారు.

????వైసీపీలో చేరిన తెలుగుదేశం పార్టీ మాజీ కో ఆప్షన్ మెంబర్ మహబూబ్ బేగ్…ఆంధ్ర మిర్రర్ ..ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం లోని బెస్తవారిపేట పట్టణ నికి చెందిన,మాజీ కో ఆప్షన్ మెంబర్ మహబూబ్ బేగ్,పఠాన్ ఉస్మాన్ ఖాన్,అలీమ్ బేగ్,అజీజ్ బేగ్ ,టిడిపిని వీడారు.మంగళవారం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి సోదరుడు కుందూరు కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు.ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి కృష్ణమోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు నెం.1బాషా, ఇర్ఫాన్ పాల్గొన్నారు

????వైసీపీలో చేరిన మాజీ వార్డ్ మెంబర్ మౌలాలి.. ఆంధ్ర మిర్రర్..ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురం పంచాయతీకి చెందిన మాజీ వార్డు నెంబర్ షేక్.మౌలాలి టిడిపిని వీడారు.మంగళవారం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి సోదరుడు కుందూరు కృష్ణ మోహన్ రెడ్డి గారి సమక్షంలో మౌలాలి వైసీపీ లో చేరారు.ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి కృష్ణ మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ యువ నాయకులు,ఇర్ఫాన్,ఇబ్రహీం,దోమన,రమణ. రాంసుబ్బారెడ్డి, పాల్గొన్నారు..

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*