సీఎం జగన్‌ ఘటనపై పలు అనుమానాలు..ఉప ముఖ్యమంత్రి పై అభియోగం.. విస్తృత ప్రచారంలో మాగుంట కుటుంబం..ఓటమి భయంతోనే జగన్ రెడ్డి డ్రామా..మాజీ ఎమ్మెల్యే ముత్తుముల ఆరోపణ.

????సీఎం జగన్‌ ఘటనపై పలు అనుమానాలు..???

వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ, సింగ్‌నగర్‌లో జరిగిన రాయి దాడి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సీఎం రోడ్డుషో సందర్బంగా పలు మార్లు విద్యుత్ సరఫరా నిలిపి వేయడంపై కూడా పలు సందేహాలు వస్తున్నాయి. ఖచ్చితత్వంతో రాయి తగలడంపై కాట్ బాల్ వాడి ఉంటారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.వీవీఐపీ వాహనం చుట్టూ ఉండే రోప్ పార్టీ ఎందుకు లేదని మాజీ పోలీస్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.విద్యుత్ సరఫరా లేని సమయంలో బుల్లెట్ ప్రూఫ్ షీట్లు వాడాల్సిన సీఎం సెక్యూరిటీ..రాయి తగిలిన ఘటన జరిగిన తరువాత కూడా బస్ వద్ద జనాన్ని పోలీసులు క్లియర్ చేయలేదు. సమీపంలో ఏవైనా సీసీ కెమెరాలు ఉన్నాయోమోనని పరిశీలిస్తున్నారు.కాగా జగన్‌కు రాయి తగిలిన చోట వైద్యులు బస్ లోనే రెండు సార్లు చికిత్స చేసారు.అంతా అయిపోయాక ప్రభుత్వాసుపత్రికి వెళ్ళాలని ప్లాన్ చేశారు.అక్కడ చికిత్స తరువాత మళ్ళీ కేసరపల్లి క్యాంప్‌కు జగన్ వెళ్లిపోయారు. కాగా ముఖ్యమంత్రికి తగిలింది స్వల్ప గాయమేనని ప్రభుత్వాసుపత్రి వైద్యులు చెప్పారు. కాగా ఈ రోజు బస్ యాత్రకు సీఎం జగన్ బ్రేక్ ఇచ్చారు.. శనివారం రాత్రి ఆగంతుకులు ఆయనపై రాయి విసిరారు. గుర్తుతెలియని వ్యక్తి పూలతో పాటు రాయిని విసిరాడు. దీంతో ఎడమ కంటికి తగలడంతో స్వల్ప గాయమైంది.వైద్యులు బస్సులోనే చికిత్సఅందించారు.చికిత్స అనంతరం జగన్ బస్సు యాత్రను కొనసాగించారు.

????ఏపీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తమను మోసం చేసినట్లుగా ఒక మహిళ సీరియస్ ఆరోపణ చేసింది. తన భర్తకు ఉద్యోగం ఇస్తానని చెప్పిన ఆయన మాటలతో తాము డబ్బులు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. తాజాగా ఆమె చేసిన ఆరోపణ సంచలనంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో తన భర్తకు మేల్ నర్సింగ్ ఆర్డర్లీ జాబ్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేసినట్లుగా ఆమె ఆరోపిస్తోంది. గణపవరం ప్రాంతానికి చెందిన పరిమళ సుమన అనే మహిళ అదే ఊళ్లో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెకు మాధవరం గ్రామంలో లైన్ మెన్ గా పని చేస్తున్న సుదర్శన్, అతడి భార్య ఇద్దరు కలిసి తన భర్తకు ఎమ్ఎన్ వోగా జాబ్ ఇప్పిస్తానని చెప్పి నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. మంత్రికి రూ.4.5 లక్షలు ఇవ్వాలని చెప్పారని.. ఇందులో భాగంగా 2020 జనవరిలో మధ్యవర్తుల సాయంతో అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రిని కలిసి తాము డబ్బులు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. మాట ఇచ్చిన ప్రకారం ఎమ్ఎన్ వో ఉద్యోగం కాకుండా స్వీపర్ పోస్టు ఇచ్చినట్లుగా పేర్కొన్న మహిళ..ఏడాది తర్వాత ఆ జాబ్ నుంచి కూడా తొలగించినట్లుగాపేర్కొన్నారు.ఈవిషయాన్నిమధ్యవర్తులను ప్రశ్నించగా తమపై దాడికి పాల్పడినట్లుగా సదరు మహిళ ఆరోపించారు.ఎన్నికల వేళ ఉప ముఖ్యమంత్రి మీద దళిత మహిళ ఒకరు చేసిన ఆరోపణ హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను వివరణ అడగ్గా.. తాను ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదని.. ఎన్నికల వేళ ఇలాంటి ఆరోపణలతో తన ప్రతిష్ఠను దెబ్బ తీయాలని ప్లాన్ చేసినట్లుగా పేర్కొన్నారు.

????అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో కనిగిరికి రైలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి..గురువాజిపేటను మండల కేంద్రంగా మార్చేందుకు కృషి- డాక్టర్ ఉగ్ర..కనిగిరిఅడ్డరోడ్డు నుంచి గురువాజిపేట వరకు భారీ  ర్యాలీ..గజమాలతో మాగుంట ఉగ్రలకు స్వాగతం ..అధికారంలోకి వచ్చిన వెంటనే

మూడు నెలల్లో కనిగిరికి రైలు వచ్చే విధంగా కృషి చేస్తానని టిడిపి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలిపారు. కనిగిరి మండలం గురువాజిపేటలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.అడ్డరోడ్డు నుంచి గురువాజీపేట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.భారీ గజ మాలలతో టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కీర్తిశేషులు మాగుంట సుబ్బరామిరెడ్డి ప్రకాశం జిల్లాను దత్తత జిల్లాగా స్వీకరించి ఎన్నో అభివృద్ధి పనులు చేసి ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. ఆయన బాటలో తాను కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రం సాయంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చని తెలిపారు.వలసలు నివారించబడి ఉపాధి కల్పన కలుగుతుందని తెలిపారు. కనిగిరి టిడిపి అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆయన పదవీ లేకపోయినా కనిగిరి ప్రాంతాన్ని విడిచిపెట్ట లేదని ప్రజాసేవ లక్ష్యంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఉచిత కంటి వైద్య శిబిరాలు,అన్నా క్యాంటీన్ వంటి వాళ్ళు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరంతరం ప్రజల మధ్యనే ఉన్నారని తెలిపారు.కనిగిరి అభివృద్ధి కోసం తనను ఉగ్ర నరసింహారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.టిడిపి అభ్యర్థి డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ గురువాజీపేటను అవకాశం ఉంటే మండల కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ గ్రామంలో కళాశాల ఏర్పాటుకు పాటుపడతానని తెలిపారు. వెనుకబడిన కనిగిరి అభివృద్ధి తన లక్ష్యమని తెలిపారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి సహకారంతో కనిగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. మెజారిటీ నిచ్చే గ్రామాలకు ప్రాధాన్యత ఇచ్చి నిధుల కేటాయింపు చేసి అభివృద్ధి చేస్తానన్నారు .కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు నంబల వెంకటేశ్వర్లు,కన్వీనర్ పిచ్చాల శ్రీనివాసరెడ్డి,టిడిపి నాయకులు ముచ్చుమారి చెంచిరెడ్డి,నాగిరెడ్డి,పోతు కొండారెడ్డి,కుందూరు తిరుపతిరెడ్డి,నాదెండ్ల తిరుపతిరావు,కోటపాటి జనార్దన్ రావు,ఉగ్ర నరసింహారెడ్డి తనయుడు జయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

???? కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండల ఊళ్ళపాలెం,ఫకీర్ పాలెం లలో మాగుంట చారిటబుల్ ట్రస్ట్ మరియు సింగర్ కంపెనీ ఆధ్వర్యంలో మాగుంట అభిమానులు నడుపుతున్న ఉచిత కుట్టు మెషిన్ శిక్షణా కేంద్రాన్ని యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి సతీమణి చందన సందర్శించారు ,ఈసందర్భంగా శిక్షణ తీసుకుంటున్న మహిళలతో కొద్ది సేపు ముచ్చటించారు. కార్యక్రమంలో సర్పంచ్ పాకనాటి సుబ్బారెడ్డి, షేక్ నాసిర్,ఎన్నాబత్తిన మురళి కోటి రెడ్డి, షేక్ మున్నా,ఆత్మకూరి బ్రహ్మయ్య,చెరుకూరి ఆదిలక్ష్మి మరియు పలువురు మహిళలు పాల్గొన్నారు.


????దర్శి లోని శ్రీనివాస పద్మావతి ఎ /సి కల్యాణ మండపం నందు జరిగిన ఆర్యవైశ్య సోదర సోదరీమణుల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న దర్శి శాసనసభ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి,నారప శెట్టి పాపారావు,నారపు శెట్టి పిచ్చయ్య,డాక్టర్ కడియాల లలిత్ సాగర్ , తాతా ప్రసాద్, శ్రీ దివి రమేష్ మరియు పలువురు ఆర్యవైశ్య సోదరులు,కార్యకర్తలు పాల్గొన్నారు

????ఓటమి భయంతోనే జగన్ రెడ్డి డ్రామా రాజకీయాలు..నాడు కోడి కత్తి డ్రామా..నేడు రాళ్ల దాడి డ్రామా :గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల..

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతోనే డ్రామా రాజకీయాలు చేస్తున్నాడని గిద్దలూరు టీడీపీ ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2019 ఎన్నికల్లో ఇదే తరహాలో కోడికత్తి డ్రామాతో అధికారంలోకి వచ్చాడని, ప్రస్తుతం అన్నీ సర్వేల్లోనూ వైసీపీకీ ఓటమి తప్పదని తేలటంతో మరలా రాళ్ల దాడితో డ్రామా రాజకీయాలు మొదలు పెట్టాడన్నారు.ఈ ఐదేళ్ళ వైసీపీ పాలనలో జగన్ నిజస్వరూపం రాష్ట్ర ప్రజలంతా తెలుసుకున్నారని,సొంత చెల్లిని, తల్లిని గెంటేసిన జగన్ రెడ్డి తన రాజకీయ లబ్ది కోసం ఎన్ని డ్రామాలు ఆడిన రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.ఆదివారం ఉదయం కొమరోలు మండలంలోని పలుగ్రామాలలో పర్యటించిన అశోక్ రెడ్డి గ్రామాలలోని అవ్వ, తాతలు,మహిళలు ప్రతీ ఒక్కరిని కలిసి ఉమ్మడి మైనిఫెస్టోలోని అంశాలను వివరించారు.నాడు తెలుగుదేశం హయాంలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, ప్రజలకు జరిగిన సంక్షేమం గుర్తు చేశారు.తాను స్థానికంగా నివాసం ఉంటానని గిద్దలూరు ప్రజలకు సంక్షేమం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం తన లక్ష్యమని,మే 13 న జరిగే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్దిగా పోటీ చేస్తున్న తనకు,ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసుల రెడ్డికి సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు,మండల టీడీపీ,జనసేన, బీజేపీ నాయకులు పాల్గోన్నారు…????అశోక్ రెడ్డి కృషితోనే పట్టణంలో సిమెంట్ రోడ్లు, త్రాగునీరు..గిద్దలూరు పట్టణంలో సిమెంట్ రోడ్లు,త్రాగునీరు అశోక్ రెడ్డి కృషితోనే సాధ్యమైందని ఎన్డీయే కూటమి అభ్యర్థి అశోక్ రెడ్డి సతీమణి పుష్పలీల ప్రజలకు వివరించారు.పట్టణంలోని 4వ వార్డు ఏబీఎమ్ పాలెంలో ఇంటింటికి తిరిగి నాడు తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ, మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.గిద్దలూరు ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న అశోక్ రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు,జనసేన,బీజేపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*