బీజేపీ నేతలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు .. పిఠాపురం నుంచి కే.పవన్ కల్యాణ్ పోటీ!..సింబల్ తెలిస్తే షాకే!..రంజాన్ వేడుకలలో ఎంపీ మాగుంట,ఎమ్మెల్యే కేపీ..విస్తృత పర్యటన లో ముత్తుముల..యశోద హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స

????బీజేపీ నేతలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయన ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ..రాజకీయంగా బతకడానికే బీజేపీ వాళ్లు రాముడి పేరు వాడుకుంటున్నారని విమర్శించారు.దమ్ముంటే బీజేపీ లీడర్ చెప్పి రాజకీయం చేయాలని సవాల్ విసిరారు. బీజేపీ ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చిగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో నూతన రామాలయం నిర్మించకముందు నుండే అక్కడ హిందువులు పూజలు చేసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. దేశంలో మత ఘర్షణలు సృష్టించడంలో బీజేపీ ఎక్స్‌ఫర్ట్ అని సెటైర్ వేశారు. గాంధీ ఫ్యామిలీ పవర్ పాలిటిక్స్ చేస్తే ఈపాటికి బీజేపీ ఏమయ్యేదోనని అన్నారు. అప్పటి ప్రధాని పీవీ తల్చుకుంటే ఎల్‌కే అద్వానీ రథయాత్ర చేసేవారా అని కీలక వ్యాఖ్యలు చేశారు.

 

????పిఠాపురం నుంచి కే.పవన్ కల్యాణ్ పోటీ!..సింబల్ తెలిస్తే షాకే!…కే. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి గాజు గ్లాసుని పోలిన బకెట్ గుర్తుపై పిఠాపురంలో పోటీ అనే అంశం ఇప్పుడు జనసైనికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు!ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనకు సరికొత్త చిక్కులు వచ్చేలా కనిపిస్తున్నాయి! ఇప్పటికే జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు ను ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ చేసిందనే వార్తలు అల్లకల్లొలంగా మారిన సంగతి తెలిసిందే!జనసేన అభ్యర్థులు పోటీ చేయని చోట్ల కూటమికి ఇది చాలా పెద్ద ఇబ్బంది అని చెబుతున్నారు! ఆ సంగతి అలా ఉంటే..తాజాగా జనసేనానికి మరో చిక్కొచ్చి పడేలా ఉందని తెలుస్తుంది!అవును..రానున్న ఎన్నికల్లో భీమవరం, గాజువాకల్లో కాకుండా పిఠాపురంలోనే తాను పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.దీంతో… పవన్ కల్యాణ్ ఈసారి ఎలాగైనా గెలుస్తారని జనసైనికులు చెబుతున్నారు.మరోపక్క ఈసారి కూడా పవన్ ని ఓడించాలని అధికార పార్టీ కంకణం కట్టుకుందని అంటున్నారు.మరోపక్క… పవన్ ని వైసీపీ వాళ్లు కాదు.. టీడీపీ వాళ్లే ఓడిస్తారని,ఇదో రకం స్కెచ్ అని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు.ఆ సంగతులు అలా ఉంటే…తాజాగా పిఠాపురంలో తన అభ్యర్థిని నిలబెట్టనుందంట నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ.ఈ పార్టీ పిఠాపురం అభ్యర్థి పేరు కే. పవన్ కల్యాణ్ కాగా..వారి ఎన్నికల గుర్తు బకెట్! దీంతో..ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. కే. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి గాజు గ్లాసుని పోలిన బకెట్ గుర్తుపై పిఠాపురంలో పోటీ అనే అంశం ఇప్పుడు జనసైనికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు!కాగా…ఈ సమస్య కేవలం పిఠాపురానికే పరిమితం కాదని తెలుస్తుంది.రానున్న ఎన్నికల్లో బకెట్ సింబల్ ఉన్న తమను పోటీ చేయొద్దని పవన్ కల్యాణ్ బెదిరించారని,ప్రలోభ పెట్టారని నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, ఎంపీ బాలశౌరిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు షేక్ జలీల్ తెలిపారు.ఇదే సమయంలో… మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తనను ఏకంగా తుపాకీతో బెదిరించాడని షేక్ జలీల్ ఆరోపించారు.గాజు గ్లాస్, బకెట్ గుర్తు చూడటానికి ఒకేలా ఉంటున్నాయనే ఉద్దేశంతో తమను పోటీ చేయవద్దని జనసేన నేతలు బెదిరింపులకు దిగుతున్నారని జలీల్ చెప్పారు.ఇదే క్రమంలో..ఐదు కోట్లు ఇస్తామని కూడా ఆశ చూపారన్న జలీల్..తాను అందుకు ఒప్పుకోలేదని చెప్పిన సంగతీ తెలిసిందే!

????మార్కాపురం డిఎస్పీ ఆఫీస్ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ గరుడ్ సునీల్….జిల్లాలోని పోలీస్ కార్యాలయం,స్టేషన్ల యొక్క స్థితిగతులు,సిబ్బంది పని తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించడంలో భాగంగా బుధవారం మార్కాపురం సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా సందర్శించి, తనిఖీ నిర్వహించారు. ముందుగా సబ్ డివిజన్ చుట్టూ ఉన్న ఆవరణాన్ని మరియు పాత బిల్డింగ్ ను పరిశీలించారు.రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లాలోని పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, గ్రామలను సందర్శించి ప్రత్యేక దృష్టి సారించాలని,క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా చట్టపరమైన చర్యలుండాలని, నేర చరిత్ర కల్గిన వ్యక్తులు, ట్రబుల్ మాంగర్స్ పై ప్రత్యేక నిఘా కొనసాగించాలని, గ్రామాల్లోని ప్రజలతో మమేకమై ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన కల్పించాలని,ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. MCC పట్ల పూర్తి అవగాహన కల్గి ఉండాలని, ఎన్నికల నియమావళికి కట్టుబడి విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ బాల సుందరం, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు మరియు సిబ్బంది ఉన్నారు.

???? ఉపాస్ మరియు యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో అత్యంత డిఫికల్ట్ అయిన గుండె బృహా దమని విచ్చేదనం అత్యంత అరుదైన కేసు ను శస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా ప్రాణదానం చేసినట్లు యశోద హాస్పిటల్ చీఫ్ కార్డియాక్ డాక్టర్ సత్య శ్రీధర్ కాలే . ఉపాస్ కార్డియాక్ డాక్టర్ శ్రీధర్ చివుకుల తెలిపారు.

????ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి రంజాన్ పండుగ సందర్బంగా కొనిజేడు ఈద్గా లో నమాజ్ లో పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేసినారు.కార్యక్రమం లో మస్తాన్ వలి,ఆరిఫ్,అయినాబత్తిన ఘనశ్యామ్,తాతా ప్రసాద్ మరియు పలువురు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

నేడు దర్శి లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో పమిడి రమేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి,కార్యక్రమంలో ఆయనతోపాటు దర్శి శాసనసభ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ భర్త లలిత్ సాగర్,దివి రమేష్, కౌన్సిలర్ వి.సి.రెడ్డి మరియు పలువురు టిడిపి నాయకులు,జనసేన నాయకులు,బిజెపి నాయకులు పాల్గొన్నారు.

???? నేడు దర్శి లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో పమిడి రమేష్ జన్మదిన వేడుకల్లోపాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి,

కార్యక్రమంలో ఆయనతోపాటు దర్శి శాసనసభ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ భర్త లలిత్ సాగర్,దివి రమేష్, కౌన్సిలర్ వి.సి.రెడ్డి మరియు పలువురు టి. డి. పి నాయకులు, జనసేన నాయకులు,బిజెపి నాయకులు పాల్గొన్నారు.

*రంజాన్ వేడుకల్లో గిద్దలూరు వైసీపీ ఇంచార్జి కుందూరు..కంభం,గిద్దలూరు

పట్టణాలలోని ఈద్‌గాహ్‌లో రంజాన్ సందర్భంగా గిద్దలూరు టౌన్ ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన రంజాన్‌ వేడుకల్లో గిద్దలూరు వైసీపీ ఇంచార్జి, ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి,వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

????ఇంటింటి ప్రచారంలో ముత్తుముల సోదరీ గీత..

గిద్దలూరులో అభివృద్ధి, సంక్షేమం జరగాలంటే ప్రజల మద్య స్థానికంగా నివాసం ఉండే అశోక్ రెడ్డిని గెలిపించాలని,వారి సోదరీ గీత గారు ప్రజలను కోరారు. గురువారం బేస్తవారిపేట పట్టణంలోని గాంధీ బజారు,నెహ్రూ బజారు,జగన్నాయకుల వీధుల్లో ఇంటింటికి తిరిగి టీడీపీ, జనసేన,బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాలను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.నాడు తెలుగుదేశం హయాంలో అశోక్ రెడ్డి గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు.మే 13న జరిగే ఎన్నికల్లో స్థానికంగా నివాసం ఉండే గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డికి, మరియు ఒంగోలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గార్లకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.

????ఎన్డీయే కూటమి అభ్యర్థి ముత్తుముల గిద్దలూరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా గిద్దలూరు మండలం, తిమ్మాపురం వెల్లుపల్లె గ్రామాలలో  పర్యటించారు.ఈ సందర్భంగా ఆ గ్రామాల మహిళలు,ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*