పవన్ పచ్చి మోసగాడు పోతిన..వైకాపాలో చేరిన పోతిన!..పవన్ పై రేణుక సంచలన వ్యాఖ్యలు..గంజాయి విక్రెతల అరెస్టు..గిద్దలూరు టిడిపిలో చేరికలు..

????మేమంతా సిద్దం బస్సుయాత్రలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమక్షంలో జనసేన,తెలుగుదేశం పార్టీల నుండి వైకాపాలో చేరిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు..

విజయవాడ పశ్చిమ ని.వర్గం నుంచి వైకాపాలో చేరిన జనసేన ని.వర్గ ఇన్‌ఛార్జ్‌ పోతిన మహేష్‌..మహేష్ ను  వైకాపా కండువా కప్పి…పార్టీలోకి ఆహ్వానించిన సీఎం వైయస్‌.జగన్‌.జనసేన నుంచి మహేష్ తోపాటు  వైకాపాలో విజయవాడ పట్టణ ఉపాధ్యక్షుడు వెన్న శివశంకర్,పశ్చిమ నియోజకవర్గం డివిజన్‌ అధ్యక్షులు షేక్‌ అమీర్‌ బాషా,పి శ్రీనివాసరావు, ఎస్‌ రాముగుప్తా,పిల్లా వంశీకృష్ణ, సోమిగోవిందరావు, ఎం.హనుమాన్,సయ్యద్‌ ముబీనా,జెల్లి రమేష్, పలువురు నేతలు పార్టీలో చేరారు.

????జనసేనకు రాజీనామా చేసిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పోతిన మహేష్‌.ఆ పార్టీ చీఫ్‌ పవన్‌కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌కల్యాణ్ నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందన్నారు.పవన్‌ ఏం చేస్తున్నారో కనీసం ఆయనకు కూడా అర్థం కావడం లేదన్నారు.స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పవన్‌ పని చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు పోతిన.పార్టీ నిర్మాణం, క్యాడర్‌ గురించి పవన్‌కల్యాణ్ ఏనాడూ పట్టించుకోలేదన్నారు. పవన్‌ది అంతా నటనేనంటూ దుమ్మెత్తిపోశారు.పవన్‌ సిద్ధాంతాలు స్వార్థపూరితమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ గురించి తెలిసే గతంలో ప్రజలు ఆయనను రెండు చోట్ల చిత్తుచిత్తుగా ఓడగోట్టారంటూ ఫైర్ అయ్యారు. 25 రోజుల తర్వాత జనసేన పరిస్థితి ఏంటో చెప్పగలరా అంటూ పవన్‌కు ప్రశ్నలు సంధించారు పోతిన. 21 సీట్లతో పార్టీకి, ప్రజలకు ఏం భవిష్యత్ ఇవ్వగలరంటూ పవన్‌కు సవాల్‌ విసిరారు.????జనసేన కోసం కష్టపడ్డ వాళ్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు పోతిన. జనసేనలో పని చేసిన వారికి టికెట్లు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ వారికి ఎందుకు సీట్లు ఇచ్చారో..కార్యకర్తలకు పవన్‌ సమాధానం చెప్పాలన్నారు.కాపు సామాజికవర్గాన్ని పవన్‌ బలి పెడుతున్నారని ఆరోపించారు.కాపు యువతను మోసం చేయోద్దని పవన్‌ను కోరారు.త్వరలోనే తన వద్ద ఆధారాలు బయటపెడతానన్నారు.????వీరమహిళలకు పదవీకాలం పొడిగించి మిగతా పదవులకు ఎందుకు పొడిగించలేదన్నారు.గతంలో పవన్‌ తల్లిని దూషించిన సుజనా చౌదరికి ఎలా సీటు ఇచ్చారని ప్రశ్నించారు పోతిన. పచ్చ నోట్లు పడేస్తే అన్ని మర్చిపోతారా అంటూ పవన్‌ను నిలదీశారు. ఈ అంశంపై కచ్చితంగా పవన్‌ సమాధానం చెప్పాలన్నారు. రాజధాని ప్రాంతంలో జనసేనను పవన్‌ చంపేశారన్నారు. బీజేపీ సీట్లు సర్దుబాటు చేయమని టీడీపీకి చెప్తే..జనసేన సీట్లు ఎందుకు త్యాగం చేసిందని ప్రశ్నించారు పోతిన. పొత్తు కుదుర్చింది జనసేన పార్టీ ఐతే సీట్లు ఎందుకు తగ్గించుకోవాలన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పోటీ చేయడానికి ఒక్క కాపు నాయకుడు దొరకలేదా అంటూ పవన్‌ను కడిగిపారేశారు పోతిన.పార్టీకి విధేయుడిగా ఉంటే నమ్మక ద్రోహం చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు పోతిన. టీడీపీ, జనసేన మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నాయని..రాబోయే రోజుల్లో జనసేన అడ్రస్ గల్లంతు అవడం ఖాయమని జోస్యం చెప్పారు పోతిన. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం,తెనాలి నియోజకవర్గాల్లో సర్వే చేసి గెలిచే పశ్చిమ నియోజకవర్గాన్ని ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు.బీసీలే త్యాగాలు చేయాలా..కమ్మ సామాజికవర్గం త్యాగాలు చేయదా అంటూ పవన్‌ను ప్రశ్నించారు.పశ్చిమ నియోజకవర్గం పెత్తందారులకు కాకుండా మరొకరికి ఇచ్చి ఉంటే సహకరించే వాళ్లమన్నారు పోతిన.

????రేణు దేశాయ్ గురించి తెలిసిందే.కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా,మోడల్‌గా, హీరోయిన్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘బద్రి’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె..అప్పుడే పవన్ కల్యాణ్‌తో ప్రేమలో పడినట్లు సమాచారం. కొన్నాళ్లకు పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత..పలు కారణాల చేత పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ విడాకులు తీసుకుని విడిపోయారు.

ప్రస్తుతం పిల్లల బాగోగులు చూసుకుంటూ తన లైఫ్ తను లీడ్ చేసుకుంటోంది.అడపాదడపా మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటోంది రేణు దేశాయ్.ఈక్రమంలోనే మరోసారి రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా అయ్యాయి.అయితే..రేణు దేశాయ్‌తో విడిపోవడానికి ముందే పవన్ కల్యాన్ రష్యా అమ్మాయి అన్నా లెజినోవాతో ప్రేమలో పడినట్లు సమాచారం.ఈ మేరకు ఆమెతో సహజీవనం స్టార్ట్ చేసిన తర్వాతే..రేణు దేశాయ్‌కి విడాకులు ఇచ్చినట్లు టాక్. ఈ విషయం మీదే రేణు మాట్లాడుతూ..‘ఆయన ఒక లేడీతో బేబీని కన్నారు.ఈ మాటలు నేను ఈజీగా చెబుతున్నా,కానీ రియల్‌గా అంత ఈజీగా లేదు.పవన్‌ కళ్యాణ్‌‌ని పిచ్చిగా ఇష్టపడే లేడీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో.. మీరొకసారి ఆలోచించండి.మీరు ఆయన భార్యగా ఉండి ఉంటే..ఆయన ఇలా మీతో చేస్తే..11 ఏళ్ల పెళ్లి తర్వాత వేరే ఆమెతో బేబీని కని ఉంటే మీకు ఒకేనా.అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటోంది’ అంటూ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

????గంజాయి అమ్మకాలు జరుపుతున్న వ్యక్తులు అరెస్టు నగదు స్వాధీనం..

ప్రకాశం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు,అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె.నాగేశ్వరరావు,స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆదేశాల మేరకు,ఒంగోలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పర్యవేక్షణలో తేది 09-04-2024 చీమకుర్తి సెబీ సీఐ ఇ.మారయ్యబాబు వారి సిబ్బంది కలిసి చీమకుర్తి పట్టణ పరిధి లో గంజాయి అమ్మకాలు జరుపుతున్న ఒడిషా రాష్ట్రం మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కు చెందిన ఇద్దురు వ్యక్తులను మధ్యవర్తుల సమక్ష్మంలో అరెస్టు చేసి వారి నుండి 2 కిలోల 260 గ్రాముల (2.26kgs) గంజాయిని మరియు రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొన్నారు,వాటి కొనుగులు విలువ పది వేలు మరియు మార్కెట్ ధర ఇరవై వేలు,రెండు సెల్ ఫోన్స్ విలువ రెండు వేలు,మొత్తం ప్రాపర్టీ విలువ రూ రూ 40వేలు.అందులో ఒడిశా రాష్ట్రంకు చెందిన యుదిస్టిర్ అను వ్యక్తి చీమకుర్తి పట్టణంలో హెయిర్ కట్ సెలూన్ లో పనిచేస్తు చీమకుర్తి పట్టణంలోని గ్రానైట్ ఫ్యాక్టరీ లలోని పనిచేయు కూలీలకు గంజాయి విక్రయిస్తుoటాడు. ఈ క్రమంలో వెస్ట్ బెంగాల్ చెందిన పేర్నమిట్ట సెంట్రింగ్ పనిచేయుచున్న గోలం మండల్ తో పరిచయం ఏర్పడి అతడు కుడా పేర్నమిట్ట గ్రామంలో గ్రానైట్ ఫ్యాక్టరీ లలోని పనిచేయు కూలీలకు గంజాయి విక్రయిస్తుoటాడు. పైతెలిపిన గంజాయిని యుదిస్టిర్ అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రము లోని ఫుల్భాని అటవీ ప్రాంతంలో ఆదివాసీల వద్ద కొనుగోలు చేసి చీమకుర్తి పట్టణంకు తీసుకోచ్చి గోలం మండల్ ఇస్తుండగా పట్టుకోవడమైనది.తదుపరి చర్యల నిమిత్తం వారిద్దరినీ కోర్టు ద్వారా రిమాండ్ కు పంపడమైనది.చీమకుర్తి సెబ్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గంజాయి అమ్మకాలు, రవాణా మరియు త్రాగిన వారిపై కఠిన చర్యలు తీసుకుటామని ఒంగోలు సెబ్ ఇ ఎస్ తెలిపినారు.ఈదాడిలో ఇ ఐ ఇ. మారయ్యబాబు,ఇ ఎసై వినీతరెడ్డి ,ఇ హెచ్ సి యూసఫ్ షరిఫ్ ,ఇ సి. కె .వి . రామిరెడ్డి పాల్గొన్నారు.

????ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు జరుగుమల్లి గ్రామంలోని వైస్సార్సీపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు.

????మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి  మంగళవారం రాత్రి పొదిలిలో ముస్లిం సోదరులకు ఇఫ్తియార్ విందు ఇచ్చారు.కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

????ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన 200 కుటుంబాలు..

గిద్దలూరు మండలం, ముండ్లపాడు గ్రామంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో ఒక మాజీ ఎంపీటీసీ సభ్యుడు మరియు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 100 కుటుంబాలు, 50 నూర్భాషా కుటుంబాలు, 50 రజక కుటుంబాలు మొత్తం 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్బంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.కార్యక్రమంలో టీడీపీలో చేరిన ఎంపీటీసీ పడిగపాటి శేఖర్, మరియు మాజీ వార్డు మెంబర్లు పీక్కిలి కాశయ్య, దూదేకుల చిన్న ఖాసీంపీరా, కొట్టాల దస్తగిరి,ఆరవీటి శ్రీను పాల్గోన్నారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*