జగన్ పై,సజ్జల పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..షర్మిల ఆరోపణలపై స్పందించిన అవినాష్..చిన్నారిదానకర్తల..పెద్ద దానం..బేస్తవారిపేట లో రోడ్డు ప్రమాదం

????జగన్ పై, సజ్జల పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..

తాజాగా కడప జిల్లా కమలాపురంలో బస్సు యాత్ర నిర్వహించిన వైఎస్ షర్మిళ.. తన సోదరి, వైఎస్ వివేకా కుమార్తె సునీతతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇందులో భాగంగా… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల పాటు కుంభకర్ణుడిలా నిద్రపోయి,ఎన్నికలకు ఆరు నెలల ముందు నిద్రలేచారని విమర్శించారు.ఏపీలో ఎటు చూసినా ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, అక్రమాలు,దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు మాత్రమే ఉన్నాయని.. అభివృద్ధి ఎక్కడా లేదని విమర్శించారు. ఇదే క్రమంలో… తన తండ్రి వైఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద పీట వేశారని చెప్పిన షర్మిళ… జగన్ సీఎం అయ్యాక ప్రాజెక్టులకు దిక్కే లేదని,కడప స్టీల్ ఫ్యాక్టరీని గాలికి వదిలేశారని ఫైరయ్యారు! కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయ్యి ఉంటే.. ప్రత్యక్షంగా పాతిక వేల మందికి, పరోక్షంగా మరో 20వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు. అనంతరం వైఎస్ వివేకా వ్యవహారంపై స్పందించిన షర్మిళ… వివేకా హత్య జరిగి ఐదేళ్లు అవుతున్నా హత్య చేసిన వారు బయట తిరగుతున్నారని మండిపడ్డారు.అవినాశ్ రెడ్డిని నిందితుడని సీబీఐ చెప్పినప్పటికీ మళ్లీ అతడికే జగన్ టికెట్ ఇచ్చారని విమర్శించారు! స్వయంగా సీఎం జగన్ కి బాబాయ్ అయినా కూడా వివేకా విషయంలో కనీస న్యాయం జరిగే పరిస్థితి లేదని దుయ్యబట్టారు.ఇదే సమయంలో…నిందితులు చట్టసభల్లోకి వెళ్లకూడదనే తాను పోటీలో నిలుచున్నట్లు పునరుద్ఘాటించారు.

*బస్సుయాత్రలో భాగంగా మూడో రోజు ఆదివారం వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో పర్యటించిన వైఎస్ షర్మిళ… ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇందులో భాగంగా… “నన్ను పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా? నేను ఎవరిని అనుకుంటున్నవ్? రాజన్న బిడ్డని గుర్తుపెట్టుకో! అధికార మదం తలకెక్కిందా?అంటూ విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో”నువ్వూ.. నీ కొడుకు పేమెంట్‌ తీసుకుని నన్ను,సునీతను పలుమార్లు పలు విధాలుగా హింసించారు! సోషల్ మీడియాలో హేలన చేశారు.నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు”అంటూ షర్మిళ తీవ్రస్థాయిలో సజ్జల రామకృష్ణారెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు!ఇదే క్రమంలో..ఇలాంటి సజ్జలకి సలహాదారుగా నియమించడం జగన్‌ చేసుకున్న ఖర్మంటూ షర్మిల వ్యాఖ్యానించారు. అనంతరం వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారంపైనా వైఎస్ షర్మిళ స్పందించారు.ఇందులో భాగంగా…వివేకా లాంటి మంచి మనిషి నేడు భూతద్దం పెట్టి వెతికినా దొరకరని చెప్పిన షర్మిళ..అలాంటి మంచి మనిషిని నరికి చంపేశారని అన్నారు. ఇదే సమయంలో… చిన్నాన్నను చంపినవాళ్లకు, చంపించిన వాళ్లకు మధ్య ఎన్నో లావాదేవీలున్నాయని తెలిపారు.వివేకా హత్య కేసులో అవినాష్‌ రెడ్డి నిందితుడని సీబీఐ చెప్పినా కూడా ఆ నిందితుడుని జగన్‌ కాపాడుతున్నారని అన్నారు. ఈ సమయంలో…చిన్నాన్న కుటుంబానికి న్యాయం చేయకపోగా..మళ్లీ అదే మనిషికి టిక్కెట్ ఇచ్చారని చెప్పిన షర్మిళ..ఇది అహంకరం కాపోతే మరేమిటని నిలదీశారు.ఈ అన్యాయం అడ్డుకోవడానిమే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు షర్మిల పునరుద్ఘాటించారు.

????షర్మిల చేస్తున్న ఆరోపణలపై వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు….షర్మిలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.మనిషై పుట్టాక కనీసం విచక్షణా జ్ఞానం ఉండాలని అవినాష్ రెడ్డి అన్నారు. విజ్ఞత కలిగిన ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరన్న అవినాష్ రెడ్డి ..ఎన్నైనా అనండి, ఎంతైనా ప్రచారం చేసుకోండి అని స్పష్టం చేశారు.బురదచల్లి తుడుచుకోమని చెప్పడం మామూలైపోయిందన్న అవినాష్ రెడ్డి .. తుడుచుకుంటూ పొతే, బురదచల్లుతూనే ఉంటారని అన్నారు.మాట్లాడేవాళ్లు ఎంతైనా మాట్లాడుకోవచ్చని.. ఆ వ్యాఖ్యలను వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. మాట్లాడే వాళ్లది మనిషి పుట్టుకే అయితే కొంచమైనా విజ్ఞత,విచక్షణ ఉంటుందంటూ అవినాష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

????బేస్తవారిపేట లో రోడ్డు ప్రమాదం..

ప్రకాశం జిల్లా బేస్తవారి పేట టౌన్ నందు స్థానిక ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన జాతీయ రహదారి పై కారు బొలెరో వాహనము ఎదురు ఎదురుగా ఢీకొనడం జరిగింది.కారు గుంటూరు కి వెళ్తున్న క్రమంలో కంభం నుండి గిద్దలూరుకు కూల్ డ్రింక్స్ లోడుతో వెళ్తున్న బొలోర వాహనము బ్రిడ్జిపై ఎదురెదురుగా ఢీకొనడంతో కారు డ్రైవర్ కు స్వల్ప గాయాలు కారుకు బెలూన్ ఓపెన్ కావడంతో కారు డ్రైవర్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడటం జరిగింది. సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి బేస్తవారిపేట హెడ్ కానిస్టేబుల్ జయరాజు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ట్రాఫిక్ సమస్య అంతరాయం కలవకుండా క్రేన్ తో వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు

*”చిన్నారి దానకర్తల.. పెద్ద దానం”*

CIO (చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్) రాజమండ్రి తరపున పిల్లల్లో దాతృత్వ గుణం పెంపొందించే దిశగా ‘Nhanne sdaqedaar’ అనే అంశంపై యాక్టివిటీ నిర్వహించటమైనది. తోటి‌ మానవులకు సహాయపడటం దేవునికి అత్యంత ఇష్టమైన కార్యమని పిల్లలకు బోధిస్తూ వారు దాచుకున్న డబ్బులలో కొంత దానం చేయాలని ప్రోత్సాహించగా.. పిల్లలు తమ డిబ్బీలలో దాచుకున్బ డబ్బులు తీసుకువచ్చి సామూహికంగా ఓ వృధ్దాశ్రమానికి వెళ్ళి తమ చేతుల మీదుగా అక్కడి వృధ్దులకు పండ్లు, రొట్టెలు అందించారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*