సీఎం జగన్ సమక్షంలో వైకాపాలో చేరిన అమలాపురం జనసేన నాయకులు..జగన్ పై ధ్వజమెత్తిన షర్మిల,సునీత!!!..గిద్దలూరువైసీపీ,టీడీపీలో కొనసాగుతున్న చేరికలు..రెబల్ గా పోటీ చేస్తానంటున్న ఆమంచి..

????సీఎం జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జనసేన అమలాపురం జనసేన ఇన్‌ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు-

సీఎం జగన్‌ సమక్షంలో మేమంతా సిద్ధం యాత్ర సందర్భంగా  వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జనసేన అమలాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు-*

????బాబు బంధం ప్రజలతో కాదు ఫెవికాల్ తో- సీఎం జగన్….చంద్రబాబుకు ప్రజలతో బంధం లేదు. కానీ, అతని బంధం ఫెవికాల్‌తో ఉందని,ఎందుకంటే మీరు అతనిని మానిఫెస్టో లేదా ఏదైనా మంచి చేశారా అని అడిగిన ప్రతిసారీ, నోటికి ఫెవికాల్ పూసుకుంటాడు నోరు ముసుకుంటాడని ఎద్దేవా చేశారు.

????షర్మిలను ఎందుకు దూరం పెట్టారు.. వివేకానంద కేసులో నిందితుడికి టికెట్ ఎలా ఇచ్చారు..సునీత కీలక వ్యాఖ్యలు..!!!

ఒకప్పుడు వైసీపీలో కీలక భూమిక పోషించిన షర్మిళ.. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీకి అన్నీ తానై అన్నట్లుగా నడిపించిన షర్మిళ..అనంతర కాలంలో పార్టీకి ఎందుకు దూరయమ్మారనే విషయంపై సునీత స్పందించారు. ఇందులో భాగంగా…సీబీఐ కేసుల్లో జగన్‌ అరెస్టయి జైలులో ఉన్న సమయంలో షర్మిల పార్టీని భుజాన వేసుకుని నడిపించిందని సునీత గుర్తుచేశారు. అనంతరం జరిగిన పరిణామాలే షర్మిళను పార్టీ నుంచి దూరం పెట్టడానికి కారణమని తెలిపారు. ఇందులో భాగంగా…జగన్ వెంట కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు,ఎంపీలు రాజీనామా తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో షర్మిళ తీవ్రంగా ప్రచరం చేసి గెలిపించారని చెప్పిన సునీత…ఆ ఎన్నికల్లో విజయం తర్వాత షర్మిళకు ఆదరణ వస్తోందనే కారణంతో పక్కనపెట్టారని తెలిపారు. అయితే…2014 ఎన్నికల్లో కడప నుంచి ఆమె పోటీ చేస్తారని అంతా భావించారని..అయితే ఆ స్థానాన్ని అవినాష్ కు ఇవ్వాలని నిర్ణయించారని..అది వివేకాకు ఇష్టం లేదని.. తర్వాత జరిగిన పరిణామాలే తన తండ్రిని బలి తీసుకున్నాయన్నట్లుగా సునీత వివరించారు!మరోపక్క కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహించి,పెద్దదర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిళ…వివేకా కేసులో అవినాశ్‌ ను సీబీఐ నిందితుడిగా తేల్చిందని చెప్పారు.ఇదే సమయంలో… హత్య కేసులో నిందితుడిగా ఉన్నవారికి సీఎం జగన్‌ టికెట్‌ ఎలా ఇస్తారని షర్మిళ ప్రశ్నించారు.చిన్నాన్న హత్య వ్యవహారంలో జగన్‌ ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు!

????వైఎస్సార్ బీజేపీ కి వ్యతిరేకి.. కొడుకు జగన్ బిజెపికి బానిస..ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

వైఎస్సార్ బీజేపీ కి ఎప్పుడు వ్యతిరేకి..మతం పేరుతో చిచ్చు పెట్టేది బీజేపీ..వైఎస్సార్ కొడుకు జగన్ మోహన్ రెడ్డి బీజేపీ కి బానిస..ముస్లీం లకు జగన్ సమాధానం చెప్పాలని షర్మిలా రెడ్డి ఒక ప్రకటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు .గోద్రా లో దాడులు జరిగితే జగన్ నోరు విప్పలేదని బీజేపీకి బానిస అయిన జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతాడని ఆమె ప్రశ్నించారు.జగన్ ముస్లింలకు ఎన్నో వాగ్ధానాలు చేశాడుఇమామ్ లకు 15 వేలు వేతనం అన్నాడు.ముస్లీం బ్యాంక్ అన్నాడు.చనిపోతే 5 లక్షల భీమా అన్నాడు.ఎన్నో హామీలు ఇచ్చి మరిచాడని ముస్లీం పక్షాన నిలబడేది కాంగ్రెస్ మాత్రమే అన్నారు.బాబు,జగన్ ఇద్దరు ముస్లీం ల పక్షాన లేరని బీజేపీ రాష్ట్రానికి ఎం చేసిందని వీళ్ళు బానిసలు అయ్యారో ప్రజల ముందుకు వచ్చి చెప్పాలన్నారు.విభజన హామీలు ఒక్కటి సైతం బీజేపీ నెరవేర్చలేదని హోదాపై బీజేపీ మోసం చేసిందన్నారు.వైఎస్సార్ బ్రతికి ఉంటే కడప స్టీల్ ఎప్పుడో పూర్తి అయ్యేదని కడప స్టీల్ ను శంకుస్థాపన ప్రాజెక్ట్ కింద మార్చారని,మూడు సార్లు శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు.ఎంపిలు నిద్ర పోతున్నారని,స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్క రోజు కూడా కడప స్టీల్ మీద మాట్లాడలేదని ఆరోపించారు.కడప – బెంగళూర్ రైల్వే లైన్ వైఎస్సార్ ఆశయం.కడప లైన్ ను జగన్ వద్దన్నారని,సిబిఐ నిందితుడు గా అవినాష్ రెడ్డి మీద ముద్ర వేసిందని నిందితుడుగా ఉన్న అవినాష్ రెడ్డి కి మళ్ళీ ఎలా టిక్కెట్ ఇచ్చారని,బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ఎందుకు అసలు నిజం దాచి పెడుతున్నారని ప్రశ్నించారు.సిబిఐ విచారణ ఎందుకు వద్దన్నారని,మీరు నేరం చేయక పోతే విచారణకు ఎందుకు అడ్డుపడుతున్నారని, నిందితులను ఎందుకు కాపాడుతున్నారన్నారు.జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని,హత్యారాజకీయాలు ప్రోత్సహించే వారికి బుద్ది చెప్పాలన్నారు.సిబిఐ నిందితుడని చెప్తున్న అవినాష్ రె డ్డికి టిక్కెట్ ఇవ్వడంతోనే నేను పోటీ చేస్తున్నానన్నారు .కడప ప్రజలకు అందుబాటులో ఉంటానని,వైఎస్సార్ లాగ సేవ చేస్తానని అన్నారు.

????జగన్ రెడ్డి పాలనలో రైతులకు కన్నీరే *

ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే అన్నదాత పథకం ద్వారా రైతులకు యేటా 20 వేలు…..రాష్ట్రంలో రైతుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి వ్యవసాయాన్ని దండుగ చేశాడని గిద్దలూరు ఎన్డీయే కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి వైసీపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా 5వ రోజు కంభం మండలంలోని లింగోజీపల్లె, తెల్లదిన్నే,ఎల్. కోట, ఔరంగాబాద్,నడింపల్లె, సైదాపురం,కందులాపురం, సూరేపల్లె,రావిపాడు, జంగంగుంట్ల,కాగితాల గూడెం, హాజరత్ గూడెం,దర్గా, దేవనగరం,పెద్దనల్లకాల్వ, చిన్న నల్లకాల్వ,లింగాపురం, ఎర్రబాలెం గ్రామాలలో పర్యటించిన ఆయన గ్రామ పెద్దలు,మహిళలు, రైతులను, అవ్వ తాతలను ప్రతీ ఒక్కరిని కలుసుకొని నాడు తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ,వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతులను పట్టించుకోక పొగా పంట పొలాల మోటార్లకు మీటర్లు బిగించి రైతుల నడ్డి విరిచిందన్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే అన్నదాత పథకం ద్వారా రైతులకు యేటా రూ. 15 వేల రూపాయలు అందించటం జరుగుతుందన్నారు.అదే విధంగా మహిళా సంక్షేమం కోసం మహాశక్తి పథకం,బీసీల సంక్షేమం కోసం బీసీ రక్షణ చట్టం వంటి పథకాలతో సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశ పెట్టటం జరిగిందన్నారు.మే 13న జరిగే ఎన్నికల్లో గిద్దలూరు అసెంబ్లీ కూటమి అభ్యర్దిగా పోటీ చేయుచున్న తనకు, ఎంపీ అభ్యర్దిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు, మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గోన్నారు.

????ఎన్నికల ప్రచారంలో కేపీ సతీమణి కల్పనా రెడ్డి..గిద్దలూరు పట్టణంలోని 5వ వార్డులో ఇంటింటికి తిరిగి మే 13న జరిగే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నాగార్జున రెడ్డికి మరియు ఒంగోలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కల్పనా రెడ్డి కోరారు ..????సొంతగూటికి చేరిన కో-ఆప్షన్ మెంబెర్ దమ్మల జనార్దన్..

ఇటీవల వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన గిద్దలూరు మున్సిపాలిటీ కో-ఆప్షన్ మెంబర్,ఆర్యవైశ్య ప్రముఖులు దమ్మల జనార్దన్ తిరిగి గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి, గిద్దలూరు మున్సిపాలిటీ కౌన్సిలర్స్,వైసీపీ నాయకులు ఆర్యవైశ్య ప్రముఖుల సమక్షంలో ఈరోజు తిరిగి సొంత గూటికి వైసీపీలోకి చేరారు.వారికి నాగార్జున రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించినారు….????అర్ధవీడు మండలంలో టీడీపీకి ఎదురుదెబ్బ..!!! గిద్దలూరు వైసీపీలోకి కొనసాగుతున్న చేరికలు..

గిద్దలూరు వైసీపీ ఇంచార్జి, ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి నేత్రుత్వంలో నియోజకవర్గంలో వైసీపీ లోకి కొనసాగుతున్న వలసల జోరు.అర్ధవీడు మండలంలోని గన్నేపల్లె గ్రామానికి చెందిన సుమారు 20 కుటుంబాలు టీడీపీకి, జనసేన పార్టీకి గుడ్ బై చెపుతూ గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు.???? కంభం మండలంలో వైసీపీని టిడిపిలో చేరిన ప్రముఖులు..కంభం మండలంలో ముత్తుముల అశోక్ రెడ్డి పర్యటన సందర్భంగా కందులాపురం గ్రామంలో మాజీ వార్డు మెంబరు ముద్దార్స్ శ్రీనివాసులు, ఔరంగాబాద్ పంచాయతీలోని నడింపల్లె గ్రామంలో కైరంకొండ రంగసాయి,రావిపాడు గ్రామంలో వైసీపీ నాయకులు ఎక్కులూరి శ్రీరాములు,కలగట్ల జయరాములు,సయ్యద్ బాషా,వీరిశెట్టి వెంకట సుబ్బయ్య (పాలు)కొమరోలు పట్టణానికి చెందిన బండి వెంకటసుబ్బయ్య వారి కుటుంబ సభ్యులు వైసిపిని వీడి టిడిపిలో చేరారు. వారిని అశోక్ రెడ్డి టిడిపి కండవాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

*గిద్దలూరు జనసేన పార్టీ రెబల్ అభ్యర్థిగా ఆమంచి స్వాములు..

కంభంలో శుక్రవారం జనసేన పార్టీ నాయకులు ఆమంచి స్వాములు కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. తాను గిద్దలూరు నియోజకవర్గం జనసేన పార్టీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా 2024 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు గిద్దలూరు ఎమ్మెల్యే టికెట్ రాకుండా కుట్రలు జరిగాయన్నారు.ఇక్కడ జనసేనను గెలిపించి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు గిఫ్టుగా ఇస్తానని ఆమంచి స్వాములు అన్నారు. ఇకనుంచి తాను గిద్దలూరు నియోజకవర్గంలోనే నివాసం ఉంటానన్నారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*