కేజ్రీవాల్‌ పేరు చెప్పాకే మాగుంటకు బెయిల్‌!!! గిద్దలూరు టిడిపి వైకాపాలలో చేరికలు.. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిలు రద్దు పై వాదనలు

????కేజ్రీవాల్‌ పేరు చెప్పాకే మాగుంటకు బెయిల్‌.. కేజ్రీవాల్ అరెస్ట్ పై కాషాయం పార్టీ కుట్ర..ఆప్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!!!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఆరు నెలల పాటు తీహార్ జైల్లో ఉండి తాజాగా బెయిల్ పై బయటకు వచ్చిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.. కేజ్రీవాల్ అరెస్ట్ పై స్పందించారు.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారం మరింత సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పైగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఢిల్లీ సీఎం అరెస్ట్ రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోందని తెలుస్తుంది.ఈ సమయంలో కేజ్రీవాల్ అరెస్ట్,మాంగుంట రాఘవకు బెయిల్ మొదలైన విషయాలపై ఆప్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఆరు నెలల పాటు తీహార్ జైల్లో ఉండి తాజాగా బెయిల్ పై బయటకు వచ్చిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.. కేజ్రీవాల్ అరెస్ట్ పై స్పందించారు.ఇందులో భాగంగా…ఆయన కేజ్రీవాల్ అరెస్ట్ పై కాషాయం పార్టీ కుట్ర ఉందని విరుచుకుపడ్డారు.ఇదే సమయంలో..ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ పేరు చెప్పిన తర్వాతే మాగుంట రాఘవకు బెయిల్ వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు! వయసు ఎంతో తెలుసా? అవును…లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఎటువంటి మనీ ట్రయల్ ఆధారాలు లేవని..కేవలం కుట్రలు చేసే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని..ఆప్ ను నాశనం చేయాలని చూస్తున్న బీజేపీ ప్రయత్నాల్లో ఇదొకటని మొదలుపెట్టిన సంజయ్ సింగ్…కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి స్టేట్ మెంట్ ఇచ్చారని..ఆ తర్వాతే రాఘవకు బెయిల్ ఇచ్చారని.. ఇప్పుడు టీడీపీ టిక్కెట్ ఇవ్వడంతో మోడీ ఫోటో పట్టుకుని ఓట్లు అడుగుతున్నారని కామెంట్స్ చేశారు!! విచారించ‌నున్న అధికారులు! అరవింద్ కేజ్రీవాల్ మీకు తెలుసా అని మాగుంట శ్రీనివాస్ రెడ్డిని ఈడీ మొదట అడిగినప్పుడు,అతను నిజం చెప్పాడని చెప్పిన సంజయ్ సింగ్…తాను అరవింద్ కేజ్రీవాల్‌ ను కలిశానని, అయితే చారిటబుల్ ట్రస్ట్ భూమి విషయంలో కలిశానని చెప్పాడని తెలిపారు.అయితే ఆ తర్వాత కొడుకుని అరెస్ట్ చేసి 5 నెలల పాటు జైలులో ఉంచడంతో..తండ్రి స్టేట్ మెంట్ మార్చాడని ఆరోపించారు.ఇదే సమయంలో… ఫిబ్రవరి 10 – జూలై 16 మధ్య మాగుంట రాఘవ నుంచి ఏడు స్టేట్ మెంట్లు తీసుకోబడ్డాయని.. ఈ ఏడు స్టేట్ మెంట్ లలోనూ మొదటి ఆరింటిలో కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా అతను ఏమీ మాట్లాడలేదని అన్నారు. ఈ సమయంలో జూలై 16న ఇచ్చిన ఏడో స్టేట్ మెంట్ లో మాత్రం తన వైఖరిని మార్చుకుని,కుట్రలో భాగస్వామి అయ్యాడని.. ఫలితంగా,అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇచ్చాడని..దీంతో బెయిల్ దక్కిందని సంజయ్ చెబుతున్నారు!! కాగా.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా టీడీపీ తరుపున ఒంగోలు నుంచి శ్రీనివాసుల రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ముందుగా ఈ టిక్కెట్ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కొడుకు రాఘవకు ఇస్తున్నట్లు కథనాలొచ్చినా.. చివరి నిమిషంలో చంద్రబాబు శ్రీనివాస్ రెడ్డినే ఎంపిక చేశారు!!

????ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై సీబీఐ తరఫు న్యాయవాది,పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ వాదనలు వినిపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా తనకు ప్రాణాహనీ ఉందని అప్రూవర్ దస్తగిరి తరుపు కోర్టు దృష్టి తీసుకెళ్లారు. దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి.. తాను జైల్లో ఉన్న సమయంలో ప్రలోభాలకు గురిచేశాడని దస్తగిరి పిటిషన్‌లో పేర్కొన్నాడు. తన తండ్రి పైనా అవినాష్ అనుచరులు దాడి చేశారని గుర్తు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి చాలా ప్రభావితమైన వ్యక్తి అని, ఆయనకు వెంటనే బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరారు పిటిషనర్ తరుపు న్యాయవాది.మరోవైపు దస్తగిరికి ప్రాణ హానీ ఉందని సీబీఐ వాదించింది. దీనికి ప్రతిస్పందించిన హైకోర్టు.. దస్తగిరిక ప్రాణ హానీ ఉందని మీరు ఇప్పుడు ఎలా చెబుతున్నారు? అని ప్రశ్నించింది.అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదని సీబీఐని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది.ఈ ప్రశ్నకు స్పందించిన సీబీఐ.. సుప్రీంలో బెయిల్ రద్దు చేయాలని సవాల్ చేసే లోపే వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టుకు వెళ్లిందని పేర్కొంది.దీంతో సీబీఐ సైతం సునీత పెటిషన్‌లో కౌంటర్ దాఖలు చేశామని హైకోర్టుకు సీబీఐ వివరణ ఇచ్చింది.

???? ప్రకాశం జిల్లా అర్దవీడు మండలం బొమ్మిలింగం గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ. కర్రల దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు. బాధితులకు కంభం ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స.

???? అర్ధవీడు మండలంలో వైసీపీకి ఝలక్..మాగుంట, ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన అర్ధవీడు మాజీ ఎంపీపీ..

మాగుంట, ముత్తుముల సమక్షంలో అర్ధవీడు మాజీ ఎంపీపీ  తన వర్గం తో కలిసి టిడిపిలో చేరారు.మండలంలో టీడీపీలోకి వరుస చేరికలతో వైసీపీ కంచుకోటగా ఉన్న అర్ధవీడులో ప్రస్తుతం తెలుగుదేశం తన పంజా విసురుతూ ముందుకు దూసుకుపోతుంది.ఇటీవల వైసిపిని వీడిన ఎంపీపీ, మండల ముఖ్య నాయకుల బాటలోనే మండలంలోని మరి కొంతమంది ముఖ్య నాయకులు అధికార పార్టీకి గుడ్ బై చెపుతున్నారు. శుక్రవారం సాయంత్రం గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి మరియు ఒంగోలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డిల సమక్షంలో అర్ధవీడు వైసీపీ ముఖ్య నాయకుడు,మండల మాజీ ఎంపీపీ పాలుగుళ్ల పురుషోత్తమ రెడ్డి,తన ఆధ్వర్యంలో ఒక వైస్ సర్పంచ్, ఒక వార్డు మెంబరు,100 కుటుంబాలతో సహా అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మాగుంట రాఘవరెడ్డి టీడీపీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.కార్యక్రమంలో వైసిపిని వీడి టీడీపీలో చేరిన అర్ధవీడు వైస్ సర్పంచ్ సిరివెళ్ల బాలయ్య వార్డ్ మెంబర్ మద్దెర్ల గాలెమ్మ మద్దెర్ల చిన్న సుబ్బారాయుడు వర్రా రాములు షేక్ వలి కీర్తి వెంకటేశ్వర్లు వార్డ్ మెంబర్ తోట చిన్నసుబ్బరాయుడు, మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గోన్నారు*

???? ప్రజలు మళ్లీ సీఎంగా జగనన్ననే కోరుకుంటున్నారు*. కుందూరు*….

రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు ఎమ్మెల్యేగా మీ కుందూరు నాగార్జున రెడ్డిని, ఎంపీ గా చెవిరెడ్డిని అత్యధిక మెజారిటీ తో గెలిపించండి..ఎవ్వరికీ సాధ్యం కానన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి,రాష్ట్ర ప్రజల గుండెల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రపంచ రాజకీయాలకే ఆదర్శమని గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి,ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు.శుక్రవారం కంభం మండలంలోని నర్సిరెడ్డి పల్లె,తురిమెళ్ల,ఎర్రబాలెం గ్రామాల్లో పర్యటించి గిద్దలూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనని ,ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర రెడ్డి ని ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ గత 40 ఏళ్లలో ఎవ్వరికీ సాధ్యంకాని విధంగా కేవలం ఐదేళ్లు పాలనలో జగనన్న రాష్టాన్ని మరింత అభివృద్ధి చేశారన్నారు.చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా జనరంజక పాలన అందించిన జగనన్న వైపే ప్రజలంతా ఉన్నారని స్పష్టం చేశారు.రానున్న ఎన్నికల్లో తిరిగి జగనన్నను సీఎంగా ఎన్నుకోవడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు*……

????బీసీల సంక్షేమమే ఎన్డీయే కూటమి లక్ష్యం*..మాగుంట, ముత్తుముల సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్న 35 బీసీ కటుంబాలు*..

రాష్ట్రంలో బీసీల సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ముందుకు అడుగులు వేస్తుందని అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ ను ప్రవేశపెట్టిందని ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు.గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొంగలవీడు పంచాయతీలోని చంద్రారెడ్డి పల్లె గ్రామానికి చెందిన 35 బీసీ కుటుంబాలు గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి మరియు ఒంగోలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ఆధ్వర్యంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా వారికి టిడిపి కండువాలు కప్పి సాధనంగా పార్టీలోకి ఆహ్వానించారు రాబోయే ఎన్నికల్లో బీసీ సోదరులంతా ఐక్యమత్యంగా పోరాడి గిద్దలూరు అసెంబ్లీ, ఒంగోలు పార్లమెంటు ఎంపీ స్థానాలకు అత్యధిక మెజార్టీ తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో చేరిన చల్లా ఓబయ్య, బిల్లా రంగయ్య, బిల్లా రవి వార్డ్ మెంబర్ , చాబోలు కాశన్న నాయకులు తదితరులు పాల్గోన్నారు*

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*