సీఎం కేజరి వాల్ కు హైకోర్టు ఊరట..ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా గరుడ్ సుమిత్ సునీల్..గిద్దలూరు వైకాపా టిడిపిలలో హోరాహోరీ చేరికలు..వైసీపీకి ఆమంచి రాజీనామా!..భర్త,ప్రియుడు ఇద్దరూ కావాలి..మహిళ నిరసన!

????ఢిల్లీ ముఖ్యమంత్రి కేజరివాల్ కు హైకోర్టు నుండి ఊరట లభించింది…అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రి అరెస్ట్ అయి జైలుకు వెళ్లడంతో దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ పాలన కొరవడిందని హిందూసేన జాతీయ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త విష్ణు గుప్తా..ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.ఈ పిల్‌పై విచారణ జరిపేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.జస్టిస్‌ మన్మోహన్‌,జస్టిస్‌ మన్మీత్‌ ప్రీతమ్‌ సింగ్‌ అరోరాలతో కూడిన ఢిల్లీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ గురువారం ఆ పిల్‌ను కొట్టేసింది.అరెస్ట్ అయిన తర్వాత కూడా సీఎం పదవిలో కొనసాగాలా వద్దా అనే అంశం పూర్తిగా కేజ్రీవాల్‌ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.ఇక ఈ అంశంపై రాష్ట్రపతి లేదా గవర్నర్‌లను సంప్రదించాలని హైకోర్టు పిటిషనర్‌కు సూచించింది. కొన్నిసార్లు వ్యక్తిగత ప్రయోజనం జాతీయ ప్రయోజనాలకు లోబడి ఉండాలని.. కానీ అది కేజ్రీవాల్ వ్యక్తిగత నిర్ణయమని కోర్టు తెలిపింది.ఇది న్యాయస్థానం అని.. కోర్టులు ఎప్పుడైనా రాష్ట్రపతి పాలన గానీ..గవర్నర్‌ పాలన గానీ విధించిన సందర్భాలు ఉన్నాయా అని పిటిషనర్‌ను ప్రశ్నించింది.దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ లేదా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పిటిషనర్‌కు చెప్పింది.ఢిల్లీ సీఎం అరెస్ట్ కావడంతో రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయడం లేదని తాము ఎలా చెప్పగలం అంటూ ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. అది నిర్ణయించడానికి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కు పూర్తి సామర్థ్యం ఉందని.. అలాంటి లెఫ్టినెంట్ గవర్నర్‌కు తాము మార్గదర్శకాలు సూచించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. చట్టం ప్రకారం ఏం చేయాలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చేస్తారని పేర్కొంది. కోర్టు పిటిషన్‌ను కొట్టి వేయడంతో.. పిటిషనర్ విష్ణు గుప్తా.. తన పిల్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ముందు ప్రస్తావించనున్నట్లు వెల్లడించారు.ఇక ఇప్పటికే అరవింద్‌ కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ మార్చి 28 వ తేదీన సుర్జిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.

????ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గరుడ్ సుమిత్ సునీల్ ఐ.పి.యస్..ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించటమే లక్ష్యం:జిల్లా ఎస్పీ ..

ఎలక్షన్ కమీషన్ వారి ఆదేశాల మేరకు ఇంటలిజెన్స్ (SIB) నుండి ప్రకాశం జిల్లా నూతన ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఐ.పి.యస్ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ ని,ASP (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ASP (క్రైమ్)యస్.వి. శ్రీధర్ రావు,AR అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు,డిఎస్పీలు,సీఐలు,ఆర్ఐలు,ఎస్సైలు పాల్గొని పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ముందుగా జిల్లా పోలీసు కార్యాలయానికి విచ్చేసిన జిల్లా ఎస్పీకి పోలీసులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు.జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం జిల్లాలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చేయడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు.ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్వేచ్ఛాయుత, పారదర్శక, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తామన్నారు.గతంలో ప్రకాశం జిల్లాలో ట్రైనీ ఐపీఎస్ గా పనిచేశారు.

????కోటా నరసింహులు మృతి వైఎస్సార్సీపీ పార్టీకి తీరని లోటు..అంత్యక్రియల్లో పాల్గొని వీడ్కోలు పలికిన ఎమ్మెల్యే అన్నా.. మార్కాపురం ఎమ్మెల్యే కె.పి…..గుండెపోటుతో మృతిచెందిన గిద్దలూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్,వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, ఆర్యవైశ్య సంఘ నాయకులు కోటా నరసింహులు అకాల మరణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి తీరనిలోటని మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి,గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి,మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి లు అన్నారు. గురువారం గిద్దలూరు మండలంలోని తిమ్మాపురం గ్రామం లోని కోటా నరసింహులు పార్థివదేహానికి వారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు, కుందూరు నాగార్జున రెడ్డిలు మాట్లాడుతూ పార్టీకి కోటా అందించిన సేవలు మరువలేవని,ఇటువంటి మంచి మిత్రున్ని కోల్పోవడం బాధాకరమని ఇటువంటి వ్యక్తి దొరకడం చాల అరుదని అన్నారు.ఈ అంతిమయాత్రలో కోటా శ్రీనివాసులు, పోలేపల్లి నరేంద్ర,దాసరి సురేష్, గర్రె సుబ్బారావు తదితర వైసీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు,ఆర్యవైశ్య సంఘ సభ్యులు,గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు.

????ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే కుందూరు..

పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు. పట్టణంలోని 7వ వార్డులో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్ వలి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొని మాట్లాడారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఆయన ఉపవాస దీక్ష విడిపించారు.ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, ముస్లింలు పాల్గొన్నారు.

????గురువారం రాత్రి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నందు తెలుగుదేశం పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి పరిచయ కార్యక్రమం లో ఉమ్మడి ప్రకాశం జిల్లా టిడిపి, జనసేన మరియు బీజేపీ నాయకులతో కలిసి పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు బీజేపీ పార్టీల ఏమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు,కుమార్తె వెంట ఎమ్మెల్యే రవి కుమార్, టీడీపీ నేతలు మాగుంట తదితరులు పాల్గొన్నారు……………????కంభం పట్టణ వైకాపా నాయకులు సుభాని తదితరులను కలిసిన గిద్దలూరు వైకాపా అభ్యర్థి మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి……..????టిడిపి నుండి వైకాపాలోకి భారీ చేరికలు..బేస్తవారిపేట మండలం కొత్త మల్లాపురంలో తెలుగుదేశంపార్టీ నుండి 20 కుటుంభాలు గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జీ శాసన సభ్యులు కుందురు నాగార్జునరెడ్డి సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో గురువారం చేరడం జరిగింది.కార్యక్రమంలో ఎంపీపీ ఓసురారెడ్డి,జడ్పీటీసీ రాజయ్య ఎంపీటీసీ శ్రీనువాసులు సీనియర్ నాయకుడు కోటయ్య తదితరులు పాల్గొన్నారు ..     ????రాచర్ల మండలంలో టీడీపీ కి భారీ షాక్..వైసీపీలోకి వలసల జోరు*…గిద్దలూరు నియోజకవర్గంలో ఊర్లు ఊర్లు ఊడ్చేస్తున్న కేపీ!!!

రాచర్ల మండలంలో టీడీపీభారీ షాక్ తగిలింది, గిద్దలూరు వైసీపీ ఇంచార్జి, ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి నేత్రుత్వంలో నియోజకవర్గంలో వైసీపీ లోకి కొనసాగుతున్న వలసల జోరుతో,టీడీపీ, జనసేన పార్టీకి బీటలు వాలుతున్నాయి.రాచర్ల మండలంలోని రంగారెడ్డి పంచాయతీకీ చెందిన రంగారెడ్డి పల్లె , సత్తేలి గ్రామల నుంచి మొత్తం 50 కుటుంబాలు మరియు అనముల పల్లె గ్రామనికి చెందిన 30 కుటుంబాలు,అచ్చంపల్లె గ్రామానికి చెందిన 30 కుటుంబాలు…మొత్తం రాచర్ల మండలంలో 110 కుటుంబాలు టీడీపీకి, జనసేన పార్టీకి గుడ్ బై చెపుతూ గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. .????కంభం పట్టణ వైకాపా నాయకులు సుభాని తదితరులను కలిసిన గిద్దలూరు వైకాపా అభ్యర్థి మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి.????ఇటీవల వైకాపా నుండి టిడిపిలో చేరిన కంభం మండల నాయకులను సైతం తిరిగి వైకాపాలోకి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు భోగట్ట..???

????‘భర్త, ప్రియుడు.. ఇద్దరూ కావాలి’.. విద్యుత్‌ స్తంభం ఎక్కి మహిళ నిరసన! వీడియో వైరల్….ఆమె ముగ్గురు పిల్లల తల్లి. భర్త, పిల్లలతో ఎంతో సంతోషంగా సాగిపోతుంది ఆమె కాపురం. అయితే భర్తకు తెలియకుండా ఆమె ప్రియుడితో రహస్యంగా సంబంధం పెట్టుకుంది. ఈ విషయం బట్టబయలు కావడంతో తనకు భర్తతోపాటు ప్రియుడు కూడా కావాలంటూ మొండిపట్టు పట్టింది. కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించక పోవడంతో.. సదరు మహిళ కరెంట్ స్తంభం ఎక్కి నిరసన వ్యక్తం చేసింది. తాను భర్త, ప్రియుడు ఇద్దరితో కలిసి ఉంటానని, అందుకు అంగీకరిస్తేనే కిందికి దిగివస్తానని డిమాండ్ చేసింది. గమనించిన స్థానికులు .. ఆమెను కాపాడేందుకు యత్నించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో బుధవారం (ఏప్రిల్‌ 3) చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

*వైసీపీ కి ఆమంచి రాజీనామా!!!

వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ప్రకాశం జిల్లా ముఖ్య నేత ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేశారు.తన భవిష్యత్తు కార్యాచరణను ఈనెల తొమ్మిదో తేదీన ప్రకటిస్తానని తెలిపారు.చీరాల వైసీపీ టికెట్ ఆశించిన ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు వైసీపీ ఇంచార్జి పదవికి రాజీనామా చేశారు.ఐనప్పటికీ వైసీపీ చీరాల ను కరణం వెంకటేష్ కు కేటాయించింది.ఈ క్రమంలో మౌనంగా ఉన్న ఆమంచి..ఇటీవల కాలంలో చీరాలలో పలు ప్రాంతాల్లో వైసిపి టికెట్ ఆమంచి కేటాయించాలని కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు.ఈ పరిస్థితుల్లో వైసిపి నుంచి ఎటువంటి సానుకూలత కనిపించని సమయంలో ఆయన మంచి కృష్ణమోహన్ పార్టీకి రాజీనామా చేశారు.చీరాల నియోజవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనే ఆలోచనతో ఆమంచి కృష్ణమోహన్ ఉన్నట్లు సమాచారం.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*