వైయ‌స్ఆర్ సీపీలో చేరిన జ‌న‌సేన నేత‌ పితాని..ఎన్నికలలో విజేత ఎవరో తేల్చిచెప్పిన వైబ్రాంట్ ఇండియా సర్వే..ఒంగోలులో సీఏఏ కి నిరసనగా ర్యాలీ.. ఏసీబీ దాడులు.

????2024 ఎన్నికలు..విజేత ఎవరో తేల్చి చెప్పిన వైబ్రాంట్ ఇండియా సర్వే…..ఈసారి ఎన్నికల్లో తమదే విజయం అంటూ ఎవరికి వారు బలమైన నినాదాలు చేస్తున్నారు.గెలుపు ఎవరిని వరించబోతోందనే అంశంపై భిన్న అంచనాలు వెలువడుతున్నాయి.రాష్ట్రంలో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తుంది. అధికార పార్టీని ఎలాగైనా గద్దె దించాలని బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి వ్యూహాలు రచిస్తుంది.. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు విజయం సాధిస్తారో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తాజా పరిస్ధితులపై మరో సర్వే ఫలితాలు వెలువడ్డాయి.2018 నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో సర్వేలు చేస్తున్న వైబ్రాంట్ ఇండియా అనే సంస్ధ తాజాగా ఏపీలో నిర్వహించిన సర్వే ఫలితాలను ప్రకటించింది. ఇందులో రాష్ట్రంలో వైసీపీకీ మరియు ఎన్డీయే కూటమికీ తీవ్రమైన పోరు నెలకొనబోతుందని తేల్చి చెప్పేసింది. అంతే కాదు పలు చోట్ల హోరాహోరీ పోరు సాగబోతోందని ఈ సర్వే తేల్చింది. రాష్ట్రంలోని 175 సీట్లలో 29 స్ధానాల్లో పరిస్ధితి నువ్వా నేనా అన్నట్లు సాగనున్నట్లు సర్వే ఫలితాల్లో వెల్లడించింది.అయితే రాష్ట్రంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి ఎదురుదెబ్బ ఖాయమని వైబ్రాంట్ ఇండియా సర్వే తేల్చేసింది. వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన ఎన్డీయే కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన 115 నుంచి 120 సీట్లు కైవసం చేసుకుంటాయని ఈ సర్వే తేల్చిచెప్పింది. వైసీపీ కేవలం 55 నుంచి 60 సీట్లకే పరిమితం కానుందని ఈ సర్వే ఫలితాలు తెలిపాయి. అయితే వైసీపీ 29 సీట్లలో కచ్చితంగా గెలుస్తుందని, మరో 18 సీట్లలో తీవ్రమైన పోరు ఉంటుందని తెలిపింది. అలాగే ఎన్డీయే పార్టీలు 79 సీట్లు కచ్చితంగా గెలుస్తాయని, మరో 20 సీట్లలో తీవ్రమైన పోరు ఉంటుందని తెలిపింది.

???? వైకాపా లో చేరిన జ‌న‌సేన నేత‌ పితాని బాలకృష్ణకళ్యాణ దుర్గం నియోజకవర్గం

టిడిపి ఇన్ ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరిన జ‌న‌సేన నేత‌ పితాని బాలకృష్ణ..డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లా ముమ్మడివరం నియోజకవర్గానికి చెందిన ప‌లువురు జనసేన పార్టీ కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.’మేమంతా సిద్ధం; బస్సుయాత్రలో తుగ్గలి వద్ద వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు,సీఎం వైయస్ జగన్ సమక్షంలో ముమ్మడివరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పితాని బాలకృష్ణ, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్ సానబోయిన మల్లిఖార్జున్‌ సహా పలువురు జనసేన పార్టీ కీలక నేతలు వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వారికి వైయ‌స్ఆర్ సీపీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

????మోడీ మత దురహంకార విధానాన్ని ఖండించండి  ..సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు.. ఒంగోలులో వామపక్ష లౌకిక పార్టీల నిరసన ప్రదర్శన…..

ప్రధాని మోడీ మత దురహంకార విధానాన్ని దేశ ప్రజలందరూ ముక్త కంఠం తో ఖండించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు .రాజ్యాంగస్ఫూర్తికి తిలోదకాలు ఇచ్చి బిజెపి ప్రభుత్వం సిఏఏ వంటి నిరంకుశ చట్టాన్ని చేయటాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో వామపక్ష లౌకిక పార్టీలు ఆధ్వర్యంలో శనివారం నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఒంగోలులోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పూలమాల వేసి నివాళి అర్పించారు .అక్కడి నుంచి ప్రారంభమైన ప్రదర్శన ఒంగోలు కలెక్టరేట్ వరకు సాగింది.అనంతరం జరిగిన కార్యక్రమానికి సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్ అధ్యక్షత వహించారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల్లో హిందువుల ఓట్లు సాధించేందుకు ముస్లిం మైనారిటీ లకు హాని కలిగించే సీఏ ఏ చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమన్నారు.బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్ల కాలంలో అనేక ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని విమర్శించారు.సిఏఏ చట్టం కేవలం ముస్లింలకు మాత్రమే కాదని దేశంలోని ఇతర మైనార్టీ వర్గాలకు ఎంతో ప్రమాదకరమైందన్నారు .రాష్ట్రంలోని అధికార పార్టీ వైసిపి ప్రతిపక్ష టిడిపి సీఏ కి అనుకూలంగా ఓట్లు వేసి ఇప్పుడు ముస్లింల హక్కులు కాపాడుతామని హామీలు గుప్పిస్తున్నారన్నారు.టిడిపి వైసిపి వారి విధానాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు .రానున్న ఎన్నికల్లో మతతత్వ బిజెపిని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.కొత్త పార్లమెంట్లో ఇండియా కూటమి సీఏఏకు వ్యతిరేకంగా బిల్లు పెడుతుందని వైసిపి టిడిపి వారి వైఖరిని స్పష్టం చేయాలన్నారు .కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య పాల్గొని ప్రసంగించారు.కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్ డి హనీఫ్ ,సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకురాలు ఎస్ లలిత కుమారి,వామపక్ష పార్టీల నాయకులు వై సిద్దయ్య,జాల అంజయ్య, జీవి కొండారెడ్డి,చీకటి శ్రీనివాసులు,ఆవాజ్ రాష్ట్రకమిటీ సభ్యులు సయ్యద్ హుస్సేన్,షంషీర్ బేగ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఈదా సుధాకర్ రెడ్డి,ముస్లిం మైనారిటీ సెల్ జిల్లా చైర్మన్ షేక్ మాబు, టిడిపి మైనారిటీ నాయకులు కపిల్ భాష, షేక్ కరిముల్లా,కంకణాల ఆంజనేయులు బాబు, రమాదేవి, ముస్లిం సంఘాల నాయకులు పాల్గొన్నారు.

????రెవెన్యూ శాఖ ప్రధాన అధికారి పై నిఘా పెట్టిన ఏసీబీ…*ఎమ్మార్వో పై వచ్చిన ఆరోపణలపై పంజా విసిరిన ఏసిబి..తిరుపతి రేణిగుంట ఎమ్మార్వో శివ ప్రసాద్ ఇళ్ళు, ఆఫీస్ల పై ఏసిపి దాడులు నిర్వహించింది.గతంలో రేణిగుంట ఎమ్మార్వోగా పని చేసిన శివ ప్రసాద్ ఎన్నికల నేపథ్యంలో కడపకు బదిలీపై వెళ్లారు.రేణిగుంట, కడప, తిరుపతి, బెంగుళూరులలో ఏక కాలంలో దాడులు నిర్వహించారు.భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసిబి అధికారులు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*