పవన్ ని కలిసిన ఒంగోలు ఎంపీ మాగుంట..రేణిగుంట గోదాముల్లో బయటపడ్డ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎన్నికల తాయిలాలు..ముత్తుములకే మాదిగల ఓట్లు..సూపర్ సిక్స్ పథకాలను ప్రతీ ఇంటికి తెలపాలి:ముత్తుముల*

పవన్ కళ్యాణ్ ని కలిసిన ఒంగోలు ఎంపీ మాగుంట..

మంగళగిరి లోని జనసేన పార్టీ ఆఫీస్ లో జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన తోపాటు యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి, ప్రకాశం జిల్లా పార్టీ ఇంచార్జి షేక్ రియాజ్ , అయినాబత్తిన ఘనశ్యాం ,తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కుప్పా రంగసాయి గారు,కండే శ్రీనివాసులు తదితర నాయకులు పాల్గొన్నారు.

????రేణిగుంట గోదాముల్లో బయటపడ్డ టన్నుల కొద్దీ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎన్నికల తాయిలాలు..టీడీపీ నేతలు ఫైర్..    రేణిగుంట గోదాముల్లో బయటపడ్డ టన్నుల కొద్దీ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎన్నికల తాయిలాలు.. చేతి గడియారాలు, డమ్మీ ఈవీఎం యంత్రాలు, గొడుగులు, కండువాలు, జెండాలు, ఆమ్ప్లిఫైర్లు, టోపీలు , టీషర్స్ గుర్తింపు- పరిసర ప్రాంతాల్లో మరిన్ని గోడౌన్ లలో కుక్కర్లు, ఫ్యాన్లు,డబ్బుల కట్టలు ఉన్నట్లు సమాచారం.రెండవ రోజు మధ్యాహ్నం హడావుడిగా గోడౌన్ కు చేరుకున్న వాణిజ్య పన్నుల శాఖ అధికారులు.. బిల్లులు ఉన్నాయంటూ మీడియాను కూడా అనుమతించకుండా హడావుడి ఎన్నికల అధికారులు ఏమైయ్యారని టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు..తాయిలాలు నిల్వ ఎన్నికల నియమావళి విరుద్ధం కాదా..! అంటు మండిపడ్డారు ..ఎస్పీ, కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు.

ఫోటో : టీడీపీ లో చేరిన వారితో అశోక్ రెడ్డి

 

టీడీపీలో చేరిన 100 కుటుంబాలు

పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండల ఎంపీపీ మేడూరి వెంకట్రావ్ ఆధ్వర్యంలో వెలగలపాయ గ్రామానికి చెందిన 100 కుటుంబాలు మరియు భోగోలు గ్రామానికి చెందిన వార్డు మెంబర్, ముఖ్య నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారందరికి టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి ముత్తుముల అశోక్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.కార్యక్రమంలో వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన జె రామలింగేశ్వర రావు, కె జయచంద్ర గౌడ్, కె వెంకట్రావ్,జె శ్రీను, ఎస్ ప్రసాద్, ఎమ్ మహేష్ మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గోన్నారు.

???? వివాహా కార్యక్రమంలో పాల్గోన్న ముత్తుముల..   ప్ర   కాశం జిల్లా, రాచర్ల గ్రామంలో సూర మధుసూదన్ రెడ్డి శారదల కుమార్తె చి.ల.సౌ హరిప్రియ వివాహా కార్యక్రమంలో గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోని నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేశారు. అనంతరం రాచర్ల మండలం, రంగారెడ్డి పల్లె గ్రామంలో కందుల శింగారెడ్డి కుమార్తె చి.ల.సౌ వాహిని వివాహా కార్యక్రమంలో పాల్గోని నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.*

????అశోక్ రెడ్డికే మాదిగల ఓట్లు..మాదిగలను మోసం చేసిన జగన్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడిస్తాం*..

గిద్దలూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్న ముత్తుముల అశోక్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఎమ్మార్పిఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు తెలిపారు.. గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగ ప్రజలంతా అశోక్ రెడ్డికే మీ విలువైన ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.బుధవారం పట్టణంలోని టీడీపి కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ అశోక్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో మాదిగల మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉంటుందన్నారు…మాదిగలను మోసం చేసిన జగన్..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్గీకరణ అనేది తన తండ్రి కోరిక అని అధికారంలోకి రాగానే వర్గీకరణ సమస్యకు అనుకూలంగా తీర్మానం చేస్తామని జగన్మోహన్ రెడ్డి మాటిచ్చారని.ఈ రాష్ట్రాన్ని ఐదేళ్లు ముఖ్యమంత్రిగా జగన్ పరిపాలించినప్పటికీ రిజర్వేషన్ వర్గికరణ అంశాన్ని పట్టించుకోలేదని ఒక్క మాట కూడా మాట్లాడలేదని వర్గీకరణ విషయంలో కనీసం సుప్రీంకోర్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వ తరఫు నుంచి ఒక్క న్యాయవాదిని కూడా జగన్ ఏర్పాటు చేయకుండా మాదిగలను మోసం చేశారని డాక్టర్.మున్నంగి నాగరాజు మాదిగ మండిపడ్డారు.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పార్టీని మాదిగ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు..*కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి జలదంకి నరశింగరావు మాదిగ, యం.యస్.పి. రాష్ట్ర కార్యదర్శి పుల్లుగుజ్జు ఫ్రాంక్లిన్ మాదిగ, యం.యస్.పి. జిల్లా అధ్యక్షులు తొరటి. ఆనంద్ మాదిగ,రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదిమూలపు ప్రకాష్ మాదిగ,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు, బొప్పూరి.ప్రసాద్ మాదిగ, గిద్దలూరు నియోజకవర్గ ఎస్సి సెల్ అధ్యక్షులు గుర్రం దానియేలు మాదిగ, పందీటి రజినిబాబు,చిట్టెం ఆరోగ్యం మాదిగ,మండల అధ్యక్షులు కొమ్మునూరి వెంకటేష్ మాదిగ,నాయకులు వినుకొండ చిన్న, ఓబయ్య మాదిగ,గుర్రం ప్రసాద్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.*

????సూపర్ సిక్స్ పథకాలను ప్రతీ ఇంటికి తెలపాలి : ముత్తుముల.*రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు ఉమ్మడిగా ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రతీ ఇంటికి తెలియచేయాలని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాచర్ల, గిద్దలూరు,కొమరోలు టీడీపీ ముఖ్యనాయకులు, యూనిట్, బూత్ ఇన్ఛార్జ్ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతీ టీడీపీ కార్యకర్త రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో నెలకొన్న అరాచక పాలనను ప్రజలకు వివరించాలని, నాడు తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రతీ ఒక్కరికి గుర్తు చేసి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం, ఉపాధి, మహిళా సంక్షేమం, రైతుల సంక్షేమం ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ప్రతీ ఒక్కరూ ఒక సైనికునిగా పని చేసి నియోజకవర్గంలో తన గెలుపుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రాచర్ల కొమరోలు గిద్దలూరు మండలాల ముఖ్య నాయకులు క్లస్టర్,యూనిట్, బూత్ ఇన్ఛార్జ్ లు పాల్గొన్నారు.*

*????ప్రభుత్వ మద్యం షాప్ లో విధులు నిర్వహిస్తున్న సూపర్వైజర్, వాచ్మెన్ అరెస్ట్..288 క్వార్టర్ సీసాల మద్యం బాటిళ్లు తో పాటు ఒక కారు స్వాధీనం..* పరారీలో యాచవరం గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి..

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామం వద్ద అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ కారును స్వాధీనం చేసుకున్న సెబ్ అధికారులు.అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్, ఒకరు పరారీ, 288(180 ఎం.ఎల్) మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న అధికారులు. కారును సీజ్ చేయడంతో పాటు మద్యం తరలిస్తున్న వ్యక్తులను రిమాండ్ కు తరలించిన అధికారులు.అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిలో ఇద్దరూ కాకర్ల గ్రామంలోని ప్రభుత్వ మద్యం షాపులో పనిచేస్తున్న కొప్పుల వెంకట రమేష్ (సూపర్వైజర్), దార్ల అనిల్ (వాచ్ మెన్) గా విధులు నిర్వహిస్తున్నట్లు సెబ్ అధికారులు గుర్తించారు. యాచవరం గ్రామానికి చెందిన బెల్ట్ షాప్ నిర్వాహకుడు యామ చిన్న వెంకటేశ్వర్లు పరారీ లో ఉన్నట్లు సెబ్ అధికారులు తెలిపారు. పట్టు బడిన కారు మరియు మద్యం విలువ సుమారు 3,50,000/- విలువ ఉంటుంది అని సెబ్ డీఎస్పీ దుర్గాప్రసాద్ మీడియా సమావేశం లో వివరాలు వెల్లడించారు…_

???? గిద్దలూరు మండలం దిగువమెట్ట రైల్వేస్టేషన్ సమీపంలో గాయపడ్డ చుక్కల దుప్పిని స్థానికులు గుర్తించారు.వెంటనే వారు దిగువ మెట్ట అటవీశాఖ డిప్యూటీ రేంజి అధికారి వంశీకృష్ణ కి సమాచారం అందించారు. ఆయన సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన దుప్పిని స్వాధీన పరుచుకొని కేఎస్ పల్లి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రంగస్వామి,గోపాల మిత్రులు రామాంజనేయులతో ప్రథమ చికిత్స చేయించారు.అనంతరం చుక్కల దుప్పిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.ఈ కార్యక్రమంలో దిగువ మెట్ట అటవీశాఖ డిప్యూటీ రేంజి అధికారి వంశీకృష్ణ,ఎఫ్ బీ వో ఖయుమ్,చెక్ పోస్టు హెల్పర్ సుందర్ రాజ్,స్వచ్ఛ సేవకులు పి.సురేంద్ర,రమణ తదితరులు ఉన్నారు

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*