పవన్ నీవల్ల మేం బలి కావాలా..జనసేన నేత పంతం సరోజ.. ఈసీ అనుమతి తప్పనిసరి ఈసీవో ముఖేష్ కుమార్.. వైకాపాను వీడుతున్న వారిపై వ్యంగాస్త్రాలు.. కంభం వైకాపాలో చేరికలు

త‌ప్పెవ‌రిది ప‌వ‌న్‌..నీవ‌ల్ల మేం బ‌లికావాలా?.. కాకినాడ జనసేన నేత పంతం సరోజ..

అసెంబ్లీ,పార్ల‌మెంటు ఎన్నిక‌ల పొత్తులు,టికెట్ల కేటాయింపు వ్య‌వ‌హారం వంటివి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు భారీ సెగ పెడుతున్నాయి.అది కూడా కాపులు,శెట్టిబ‌లిజ సామాజిక వ‌ర్గాలు ఎక్కువ‌గా ఉన్న ఉమ్మడి తూర్పు గోదావ‌రి జిల్లాలోనే కావ‌డం గ‌మ‌నార్హం. ”త‌ప్పెవ‌రిది ప‌వ‌న్‌?”అంటూ నిల‌దీత‌లు తెర‌మీదికి వ‌చ్చాయి.దీంతో ఇప్పుడు జ‌న‌సేన ఎలా రియాక్ట్ అవుతుంద‌నేది చూడాలి.కాకినాడ మాజీ మేయర్, జనసేన నేత పంతం సరోజ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీని సర్వనాశనం చేశారు. విధానపరమైన అంశాలు,పార్టీ నిర్మాణం తెలిసిన వ్యక్తిగా ఉండి ఈ రోజు జనసేన పార్టీని ఏం చేశారు? మనకు పోల్ మేనేజ్ మెంట్ లేదని,బూత్ మేనేజ్ మెంట్ లేదని,టీడీపీకి పోల్ మేనేజ్ మెంట్ లో 40 ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి వాళ్లకే అవకాశం ఇద్దాం, వాళ్లతో సమానంగా కలిసి అడుగులేద్దాం అని మొన్న తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ చెప్పారు. పోల్ మేనేజ్ మెంట్ లేకపోవడం అనేది ఇన్చార్జిల తప్పా?“అని స‌రోజ నిల‌దీశారు.నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి నెలకోసారి ఇక్కడికి వచ్చి క్లబ్ లో ఉంటూ,ఒక రోజుంతా మీటింగులు పెడుతుంటారని,మూడు నాలుగు రోజులు ఇక్కడే ఉంటూ పోల్ మేనేజ్ మెంట్ కానీ,బూత్ మేనేజ్ మెంట్ కానీ చేయకుండా ఏం చేస్తున్నార‌ని స‌రోజ ప్ర‌శ్నించారు.“ఈ అంశంపై మీడియా ముఖంగా జనసేన పార్టీని ప్రశ్నిస్తున్నాను. ప్రశ్నించమని మా నాయకుడు పవన్ కల్యాణే నేర్పారు.పవన్ కల్యాణ్ స్ఫూర్తితోనే ఇవాళ ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. ఈ రోజు వరకు జనసేన పార్టీ ఏం చేస్తోంది?ఆయన దశాబ్దకాలంగా పార్టీని నడిపారు కదా.ఇప్పటిదాకా పోల్ మేనేజ్ మెంట్, బూత్ మేనేజ్ మెంట్ లేదంటే,ఇది ఎవరి వైఫల్యం?ఈ ప్రశ్నకు పవన్ కల్యాణ్,నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పి తీరాలి“అని స‌రోజ నిప్పులు చెరిగారు.ఇంతమంది జనసైనికులు ఉన్నారు, పవన్ కల్యాణ్ అంటే పడిచచ్చిపోయే యువత ఉంది…పవన్ కల్యాణ్ కోసం చొక్కాలు చించుకుంటూ,కాళ్లకు చెప్పులు కూడా లేకుండా కారు వెంట పరిగెడుతుంటూ ఆయనకు కొంచెం కూడా జాలి కలగడం లేదా? అని ప్ర‌శ్నించారు స‌రోజ‌.”పార్టీని న‌మ్ముకున్న వారి భవిష్యత్తును ఇవాళ సర్వనాశనం చేశారు. దశాబ్దకాలం అంటే…ఒక తరానికి భవిష్యత్తు పోయింది. మా నాయకుడు సీఎం అవుతాడు,సీఎం అవుతాడు అని ఒక తరం వారిని ఆయన వెంట తిప్పించుకున్నారు. మా నాయకుడు సీఎం అవ్వాలని కలలుగనే ఈ యువత ఏమైపోవాలి?” అని నిల‌దీశారు.

**రానున్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసుకోవాలనుకున్నా కూడా ఈసీ అనుమతి తప్పనిసరి అని ఈసీవో ముఖేష్ కుమార్ మీనా తాజా లేఖలో స్పష్టం చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసుకోవాలనుకునే నేతలు.. స్థానిక రిటర్నింగ్ అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతే ప్రచారం నిమిత్తం ఓటర్ల ఇళ్లకు వెళ్లాలని సూచించారు. ఇదే క్రమంలో సభలు, సమావేశాల విషయంలోనూ కీలక సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో… సభలూ, సమావేశాలు పెట్టుకోవాలన్న.. ఆఖరికి కరపత్రాలు పంచాలన్నా కూడా సువిధ యాప్ లో అనుమతి తీసుకోవాల్సిందే అని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించేవారు, కీలక నేతలు తమ తమ ప్రచార వాహనాల అనుమతులను స్థానికంగా కాకుండా.. సీఈఓ స్థాయిలోనే అనుమతులు తీసుకోవాలని.. అదేవిధంగా.. తమ తమ ప్రచార సామాగ్రికి అనుమతులు కూడా సీఈవో వద్దే తీసుకోవాలని తెలిపారు. ఇక ప్రధానంగా సభలు పెట్టుకోవాలన్నీ, ర్యాలీలు చేపట్టాలన్నా కనీసం 48 గంటల ముందు అనుమతి తీసుకోవాలని.. పోలింగ్ కు 48 గంటల ముందు నుంచీ ఎలాంటి ప్రచారలకూ అనుమతులు ఉండవని.. తెలిపారు. ఇదే సమయంలో… పోలింగ్ తేదీ రోజున నియోజకవర్గంలో తిరిగేందుకు అసెంబ్లీ అభ్యర్థితో పాటు వారి పోలింగ్ ఏజెంట్ కు కలిపి రెండు వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తారని ,లోక్ సభ అభ్యర్థులకు మరో వాహనం అనుమతిస్తామని తెలిపారు.

????వైకాపాను వీడి టీడీపీలో చేరిన వారిపై సోషల్ మీడియా వేదికగా వ్యంగాస్త్రాలు..         గిద్దలూరు నియోజకవర్గంలో వైస్సార్సీపీ నుండి చేరికలు అంటూ డబ్బా కొట్టుకుంటున్న వ్యక్తులకు టిడిపి కండువాలు మార్చుకుంటున్న వారు టిడిపి కార్యకర్తలేనన్న సంగతి నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలుసునని గతంలో గిద్దలూరు శాసనసభ్యులు అన్నారాంబాబు టిడిపి నుండి వైసిపిలో చేరిన క్రమంలో ఆయనతో పాటు టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నాడు పార్టీలో చేరి ఐదేళ్ళు అధికారం పదవులను అనుభవించి నేడు టిడిపిలో చేరుతున్న పరిస్ధితి..అంతే తప్పా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని అభిమానించే నాయకులు కార్యకర్తలు ఏఒక్కరు పార్టీని వీడి పోలేదని అంటుండగా మరికొందరు మాత్రం ప్యాకేజీల కోసం అమ్ముడు పోతున్నారని ఎద్దేవా చేస్తున్నారు …

????గిద్దలూరు మండలంలోని కొంగలవీడు గ్రామంలో మొదలైన గిద్దలూరు వైసీపీ ఇంచార్జి కేపీ.నాగార్జునరెడ్డి  ఎన్నికల ప్రచార కార్యక్రమం.. వైకాపాలో చేరికలు..

శుక్రవారం గిద్దలూరు నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా మన ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విచ్చేయుచున్న సందర్భంగా వారికి స్వాగతం పలకడానికి గిద్దలూరు నగర పంచాయతీ, గిద్దలూరు రూరల్,బేస్తవారిపేట, కొమరోలు,రాచర్ల మండలాల ముఖ్య నాయకులతో గిద్దలూరు ఇంచార్జ్ శాసనసభ్యులు కుందురు నాగార్జున రెడ్డి మంగళవారం సమావేశం నిర్వహించినారు. ????కంభం,కందులాపురం గ్రామాలలో “విశ్వబ్రాహ్మణుల”20 కుటుంబాలు మంగళవారం  గిద్దలూరు ఇంచార్జ్,శాసన సభ్యులు కేపి.నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ఆయనకు మద్దతు తెలిపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్