సమర శంఖం పూరిస్తున్న పవన్?..కేరళ సీఎం కీలక వ్యాఖ్యలు..గిద్దలూరు టిడిపిలో చేరికలు..దొంగను అరెస్టు చేసిన మార్కాపురం పోలీసులు

????గెలుపు కోసం సమర శంఖం పూరిస్తున్న పవన్?

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్..ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు.ఈ నెల 30 వ తేదీన పిఠాపురం నుంచి సమర శంఖం పూరిస్తున్నారు. పిఠాపురం కేంద్రంగానే పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నారు.మూడు విడతలుగా పవన్‌ కళ్యాణ్ ప్రచారం ఉండేలా పర్యటన షెడ్యూల్‌ రూపొందిస్తున్నారు పార్టీ నేతలు. ప్రతి విడతలో జనసేన పార్టీ పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్‌ రూపొందించనున్నారు.ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్ ఈనెల 30 వ తేదీన పిఠాపురం వెళ్తారు. మొదటి రోజు శక్తిపీఠమైన శ్రీ పురూహూతిక అమ్మవారిని పవన్‌ దర్శనం చేసుకోనున్నారు.అక్కడ వారాహి వాహనానికి పూజలు చేసిన తరువాత దత్తపీఠాన్ని సందర్శిస్తారు.ఇక ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటారు. ఈ క్రమంలో పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలని నిర్వహిస్తారు.క్రియాశీల కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు ఉంటాయని పవన్‌ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ ప్రకటనలో తెలిపారు.అలాగే టీడీపీ,బీజేపీ నేతలతో కూడా పవన్ కళ్యాణ్ భేటీలకు ఏర్పాట్లు చేస్తున్నారని,పిఠాపురం నుంచే రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు వెళ్లాలని పవన్‌ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గంలో బంగారు పాప దర్గా సందర్శన, క్రైస్తవ పెద్దలతో సమావేశంతో పాటు సర్వమత ప్రార్థనల్లో పవన్‌ కళ్యాణ్ పాల్గొంటారు. ఉగాది వేడుకలను కూడా పవన్‌ కళ్యాణ్ పిఠాపురంలోనే నిర్వహించుకోనున్నారు.ఇప్పటికే 18 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్.. పెండింగ్ స్థానాలపై కసరత్తు చేస్తున్నారు.3 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ అసెంబ్లీ స్థానాలు ఇంకా మచిలీపట్నం పార్లమెంట్ పై కొనసాగుతున్న సందిగ్ధత కొనసాగుతోంది. ఆ ప్రాంతాల నేతలతో ఇప్పటికే భేటీ అయిన పవన్ పలుమార్లు చర్చలు నిర్వహించారు. ఇవాళ రేపట్లొ ఫైనల్ చేసి ఎన్నికల ప్రచారానికి పవన్ బయలుదేరనున్నారని సమాచారం తెలుస్తోంది.

???? ‘ఆ’ నినాదాలను మీరు విడనాడగలరా ?..‘భారత్‌ మాతా కీ జై’ , ‘జై హింద్‌’ అంటూ మొదట ముస్లింలే నినదించారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు.

ఆ నినాదాలను విడిచి పెట్టే ధైర్యం మీకు ఉందా? అని సంఫ్‌ు పరివార్‌ నేతలను నిలదీశారు.వివాదాస్పద సిఎఎని వ్యతిరేకిస్తూ కేరళ ప్రభుత్వం వరుసగా చేపడుతున్న నాలుగవ ర్యాలీ సోమవారం ముస్లింలు అధికంగా ఉండే ఉత్తర కేరళలో కొనసాగింది.ఈసందర్భంగా విజయన్‌ ప్రసంగించారు. దేశ చరిత్రలో,స్వాతంత్య్ర పోరాటంలో పలువురు ముస్లిం పాలకులు, పలువురు అధికారులు,వ్యక్తులు కీలక పాత్ర పోషించారని అన్నారు.చరిత్రలో ఇందుకు అనేక సాక్ష్యాలు ఉన్నాయని,అజీముల్లా ఖాన్‌ అనే ముస్లిం వ్యక్తి ‘భారత్‌ మాతా కీ జై ‘ అనే నినాదాన్ని రూపొందించారని అన్నారు. అలాగే అబిద్‌ హసన్‌ అనే దౌత్యవేత్త ‘జై హింద్‌’ అనే నినాదాన్ని లేవనెత్తారని చెప్పారు.ఇక్కడికి వచ్చిన కొందరు సంఘ్ పరివార్‌ నేతలు తమ ముందు కూర్చున్న వారిని ‘భారత్‌ మాతాకీ జై ’ అని నినాదాలు చేయాలని కోరారు.అయితే ఆ నినాదాన్ని ఎవరు మొదట రూపొందించారు.ఆ వ్యక్తి పేరు అజిముల్లా ఖాన్‌ అని వారికి తెలుసో లేదో తనకు తెలియదని అన్నారు. ఈ నినాదాన్ని ముందుకు తెచ్చింది ముస్లిం కావడంతో ఆ నినాదాన్ని ఆపేస్తారో లేదో కూడా తనకు తెలియదని వ్యాఖ్యానించారు.మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ కుమారుడు దారా షికో 50కి పైగా ఉపనిషత్తులను సంస్కృత గ్రంథం నుండి పర్షియన్‌ భాషలోకి అనువదింప చేయడంతో ఆ భారతీయ గ్రంథాలు ప్రపంచమంతటా చేరాయని అన్నారు.ముస్లింలను భారత్‌ నుండి వెళ్లగొట్టాలనుకుంటున్న సంఘ్ పరివార్‌ నేతలు, కార్యకర్తలు ఈ చారిత్రక విషయాలను తెలుసుకోవాలని అన్నారు.స్వాతంత్య్ర పోరాటంలో ఇతరులతో పాటు ముస్లింలు కూడా కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా విజయన్‌ గుర్తు చేశారు.

*ముత్తుముల సమక్షంలో 40 కుటుంబాలతో సహా టీడీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ..*ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో గిద్దలూరు మండలం,నరవ బయనపల్లె గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు మీసాల పాపయ్య యాదవ్ గ్రామంలోని 40 కుటుంబాలతో సహా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్బంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.. గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశంతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.*????రాచర్ల వారి వివాహా కార్యక్రమంలో పాల్గోన్న ముత్తుముల*గిద్దలూరు పట్టణం,నంద్యాల రోడ్డులోని శ్రీ చీతిరాల కళ్యాణ మండపంలో పట్టణానికి చెందిన రాచర్ల మహేశ్వరరావు,సావిత్రి ల కుమారుడు “చి.మణికంఠ మరియు చి.ల.సౌ హర్ష”ల వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో గిద్దలూరు టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.

???? పొదిలి మండలంలో నీటి ఎద్దడి నివారణ కోసం మాదిరెడ్డి పాలెం, పోతవరం, కంభాలపాడు గ్రామాలలో వైస్సార్సీపీ పార్టీ తరుపున నీటి సరఫరా. అన్నా రాంబాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలు పెట్టి నీటి సరఫరా చేస్తున్నారు.

????జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోటార్ సైకిళ్ళు, సెల్ ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న షేక్ సుభాని అనే యువకున్ని అరెస్ట్ చేసి అతని వద్ద 5 మొబైళ్లు, మూడు బైక్ లు స్వాధీనం చేసుకున్న మార్కాపురం సీఐ ఆవుల వెంకటేశ్వర్లు, ఎస్సై అబ్దుల్ రెహమాన్.

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!