పవన్ కళ్యాణ్ తీరుపై మావోయిస్టు నేత గణేష్ విసుర్లు..దోర్నాలలో తాగునీటి కోసం రాస్తారోకో..గిద్దలూరు వైకాపాలో చేరికలపై చేరికలు..

????టాలీవుడ్ లో హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో పాల్గొంటూ ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రస్తుతం ఎక్కువగా ఎన్నికల వైపు ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే బీజేపీ టిడిపి పార్టీతో పొత్తు కలుపుకొని ఈసారి ఎలక్షన్స్ లో నిలబడే విధంగా ప్లాన్ చేశారు. ఇప్పటికే అన్ని పార్టీల సైతం తమ అభ్యర్థులు పోటీ చేసే జాబితాలను కూడా విడుదల చేశారు. ఈ క్రమంలోనే మవోయిస్టు కీలక నేత గణేష్ ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలపైన స్పందిస్తూ ఒక లేఖను కూడా రాయడం జరిగింది..ముఖ్యంగా సినీ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించినటువంటి జనసేన పార్టీ పైన తీవ్రమైన విమర్శలను సైతం చేశారు.????ఆయన పార్టీని స్థాపించేటప్పుడు తమ పార్టీ కూడా కమ్యూనిజం భావాజలం కలిగి ఉంటుందంటూ వెల్లడించారు.కానీ అతడు ప్రస్తుతం బిజెపితో పొత్తు పెట్టుకుని మరి రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ కు స్థిరమైన రాజకీయ విధానం అనేది లేదని అతనికి విశ్వాసనీయత చాలా తక్కువ అని..సినీ గ్లామర్ కాపు కులస్తుల గుర్తింపుతోనే రాజకీయ నిరుద్యోగులకు జనసేన ఒక వేదికగా మారిపోయింది అంటూ మావోయిస్టు గణేష్ సైతం ఒక లేఖ ద్వారా వెల్లడించారు.దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు..ఇప్పటివరకు జనసేన కార్యకర్తలు నాయకులు కూడా పవన్ కళ్యాణ్ ను ఇదే విధంగానే విమర్శిస్తూ ఉన్నారు ఇప్పుడు మావోయిస్టు కూడా విమర్శిస్తూ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఇటివలె ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి డైలాగులను కూడా విడుదల చేయగా అందులో కూడా పొలిటికల్ పరంగా ఉండడంతో అసలు ఈ సినిమాకు పొలిటికల్ కలుపు తగిలిస్తే ఎవరు చూస్తారు అంటూ  పలువురు అభిమానులు వాపోతున్నారు.మరి ఆ మావోయిస్టు రాసినటువంటి లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

తాగు నీటి కోసం ఖాళీ బిందెలతో రాస్తారోకో..ప్రకాశం జిల్లా..

పెద్దదోర్నాల పంచాయితీ పరిధిలోని ఇనముక్కల ఎస్సీ పాలెం మహిళలు సోమవారం ఖాళీ బిందెలతో కేజీ రోడ్డుపై రాస్తారోకో చేశారు.నీళ్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు.నీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. గత్యంతరం లేక పొలాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని తెలిపారు. ట్యాంకర్ ల ద్వారా రోజు మార్చి రోజు నీటిని సరఫరా చేయడం మూలంగా ఇబ్బందులు తప్పడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.ప్రతి రోజూ నీటిని సరఫరా చేసి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. దాదాపు గంటసేపు రాస్తారోకో చేయడంతో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.ఎస్ఐ అంకమ్మరావు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దన్నారు .సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెప్పారు.దీంతో రాస్తారోకోను విరమించారు.కార్యక్రమంలో దాదాపు వంద మహిళలు ఖాళీ బిందెలతో పాల్గొన్నారు.

*కేపీ సమక్షంలో వైసీపీ లో చేరిన పది ఎస్సీ కుటుంబాలు..గిద్దలూరు..వైసీపీ ఇంచార్జి కేపీ నాగార్జున రెడ్డి సమక్షంలో బెస్తవారిపేట అంబేద్కర్ కాలనీకి చెందిన 10 ఎస్సీ కుటుంబాలు టీడీపీ ని విడి వైసీపీ పార్టీలో చేరారు.ఈ సందర్బంగా వారికీ వైసీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు*……………………????  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న పాలుగుల్ల అనసూయమ్మ..

గిద్దలూరు పట్టణ 8వ వార్డ్ లో పాలుగుల్ల అనసూయమ్మను గిద్దలూరు వైయస్సార్ సిపి అభ్యర్థి కేపీ.నాగార్జున రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీకి ఆహ్వానించినారు.         ???? కేపీ.సమక్షంలో వైసీపీ లో చేరిన సంజీవరానిపేట 30ఎస్సీ కుటుంబాలు..గిద్దలూరు ..వైసీపీ ఇంచార్జి కేపీ నాగార్జున రెడ్డి సమక్షంలో సంజీవరానిపేట గ్రామానికి చెందిన 30 ఎస్సీ కుటుంబాలు టీడీపీ ని విడి వైసీపీ పార్టీలో చేరారు….ఈ సందర్బంగా వారికీ కేపీ నాగార్జున రెడ్డి వైసీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించినారు……???? *కుందురు నాగార్జున రెడ్డికి పిడతల.. మద్దతు .

 గిద్దలూరులో వైసీపీ నేత పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వైసిపి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డిని భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు.సీఎం జగన్ మోహన్ రెడ్డితో కలిసినప్పుడు గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని సీఎం జగన్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని కోరారు.అనంతరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ… సీఎం జగన్ పై ఉన్న అభిమానంతో గిద్దలూరు ప్రజలు పులివెందుల తర్వాత అత్యధిక ఓట్ల మెజారిటీ 2019 ఎన్నికలలో అందించారని మరో మారు అదేవిధంగా తనను ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కుందూరు నాగార్జున రెడ్డి కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్ష పార్టీలు కూడా సీఎం జగన్ ను కొనియాడుతున్నాయన్నారు.కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు, కార్యకర్తలు,పిడతల అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*