సిఎఎ రాజ్యాంగ విరుద్ధం..గిద్దలూరు..టిడిపిలో చేరికలు..రంజాన్ తోఫా రద్దు చేసిన ఘనత వైకాపాదే..110 రంజాన్ కిట్ల పంపిణీ

????సీఎఎ రాజ్యాంగ విరుద్ధం.. మతప్రాతి ప్రాతిపదికగా పౌరసత్వం ఇవ్వడం అన్యాయం.. ఖండించిన జె ఐ హెచ్.. ఆవాజ్ కమిటీలు..ఆంధ్ర మిర్రర్…ప్రకాశం జిల్లా..కంభం…

సీఎఎ రాజ్యాంగ విరుద్ధమని,మతప్రాతిపదికగా ఒక మతాన్ని మినహాయించి పౌరసత్వాన్ని కల్పించడం రాజ్యాంగం ఆశయాలకు భిన్నంగా వ్యవహరించడమే అని జమాతే ఇస్లామి హింద్ భాద్యులు ఎస్ ఎ రఫీ, పి గౌస్ ఖాన్, ఆవాజ్ కమిటీ తోపాటు పలువురు ముస్లిం పెద్దలు తీవ్రంగా ఖండించారు. రంజాన్ సందర్బంగా నిర్వహించిన ఓ సమావేశం లో వారు మాట్లాడుతూ కులం మతం ఇత్యాది భావనలతో వ్యక్తిగత నమ్మకాలతో నిమిత్తం లేకుండా ఈ దేశంలో నివసించే వారందరూ భారత ప్రవచిస్తుంటే కొందరిని ప్రత్యేకించి ఒక మతం వారిని వేరు చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమే అని వారు ఖండించారు. బిజెపి ప్రభుత్వం తాము చేస్తున్న అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి,ప్రజల దృష్టిని మరల్చడానికి ఇటువంటి కుట్రలు పన్నుతుందని వారు ఆరోపించారు.???? సి ఏ ఏ ను కేరళ ప్రభుత్వము అమలు చేయమని ముఖ్యమంత్రి తెలిపారని అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తెలియజేయాలని,సి ఎ ఏ అమలు చేస్తున్న బిజెపితో పొత్తు పెట్టుకున్న వైకాపా, టీడీపీ పార్టీలు ఈ రాష్ట్రంలో సి ఎ ఏ అమలు చేయమని ప్రకటించాలని ఆవాజ్ కమిటీ జిల్లా కార్యదర్శి ఎం షంషీర్ బేగ్ తెలిపారు.లేనిపక్షంలో లౌకిక వాదులందరు ఆ పార్టీలను ఓడించాలన్నారు.????ఈ సందర్బంగా లౌకిక వాద పరిరక్షణ కోసం అహర్నిశలు సహాయ సహకారాలు అందిస్తున్న కమ్యూనిస్ట్ పార్టీలకు,ప్రత్యేక బులెటిన్ లు ముద్రిస్తు, ప్రజలలో చైతన్యం పెంచేందుకు ప్రజాశక్తి పత్రిక చేస్తున్న కృషిని పలువురు అభినందించారు.కార్యక్రమం లో ముఫ్టీ యాసిన్ సాహెబ్,రసూల్ బేగ్,అబ్దుల్ కలాం,అసిఫ్ ఖాన్,చాంద్, మౌలాలి పాల్గొన్నారు.

????ముత్తుముల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ ఎంపీటీసీ, ముఖ్య నాయకులు*

కొమరోలు మండలంలోని సూరవారిపల్లె పంచాయతీ, మొట్టుపల్లె గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు యరదేశీ పాండు తన అనుచరులు ముఖ్య నాయకులతో సహా వైసీపీకి గుడ్ బై చెప్పి గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీని వీడిన వారికీ అశోక్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.. టీడీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ, ముఖ్య నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు స్థానికునికి, స్థానికేతరునికి జరిగే ఎన్నికలు అని గిద్దలూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.*కార్యక్రమంలో వైసిపిని వీడి టిడిపిలో చేరిన యరదేశీ రంగయ్య, దమ్ము తిరుపాలు, యరదేశి వెంకటేశ్వర్లు, యరదేశి వెంకట రంగయ్య, కొమరోలు బాబు,టీడీపీ నాయకులు తదితరులు పాల్గోన్నారు…. ????ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన 35 విశ్వబ్రాహ్మణ కుటుంబాలు*  గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో కంభం పట్టణానికి చెందిన 35 విశ్వ బ్రాహ్మణ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్బంగా వారికీ టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.నాడు తెలుగుదేశం హయాంలో చేతి వృత్తుల వారిని అన్నీ విధాలుగా చేతోడుగా ఉన్నామని రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం విజయానికి అన్నీ రంగాల వారు కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో చేరిన విశ్వబ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ ఎద్దనపూడి లక్ష్మి నారాయణ, ప్రధాన కార్యదర్శులు నల్లగట్ల వీరబ్రహ్మం, చెరుకుపల్లి సుభ్రమణ్యం, తదితరులు పాల్గోన్నారు.*

????*రంజాన్ తోఫా రద్దు చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వమే..తెలుగుదేశం హయాంలోనే మైనార్టీల సంక్షేమం.. ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన మైనార్టీ కుటంబాలు….తెలుగుదేశం హయాంలో ముస్లిం మైనార్టీ సోదరులకు మంజూరు చేసిన రంజాన్ తోఫా పథకాన్ని రద్దు చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వమే అని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంభం పట్టణంలోని అర్బన్ కాలనీకి చెందిన ముస్లిం మైనార్టీ సోదరులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్బంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువా కప్పి సాదరముగా పార్టీలోకి ఆహ్వానించారు.రాబోయే ఎన్నికల్లో ముస్లిం మైనార్టీ సోదరులకు వెన్నుపోటు పొడిచిన జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని, గిద్దలూరు నియోజకవర్గంలో అశోక్ రెడ్డిని గెలిపించి తెలుగుదేశం జెండాను ఎగరేస్తామన్నారు. కార్యక్రమంలో వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన పి. హరికృష్ణ, సయ్యద్ హుస్సేన్, షేక్ పండు, సయ్యద్ అమీర్, షేక్ ఖలందర్, పి దస్తగిరి, ఏ. రాకేష్, డి. నాయబ్ రసూల్, అనిల్ కుమార్, షేక్ అర్షద్, షేక్ కరిముల్లా, షేక్ మస్తాన్, షేక్ చాంద్ బాషా మండల టీడీపీ నాయకులు పాల్గోన్నారు.

????ముత్తుములను మర్యాదపూర్వకంగా కలిసిన కొంగల వీడు ఎస్టీ కాలనీ నాయకులు..* గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇన్చార్జి ముత్తుముల అశోక్ రెడ్డిని కొంగలవీడు గ్రామంలోని ఎస్టీ కాలనీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల శాలువా వేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు ప్రజలకు స్థానికంగా అనునిత్యం అందుబాటులో ఉండే ముత్తుముల అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కొంగలవీడు ఎస్టీ కాలనీకి చెందిన వార్డు మెంబర్ జగన్నాధం రమణయ్య, వైస్ సర్పంచ్ దాసరి సురేష్, మాజీ వైస్ సర్పంచ్ దాసరి చిన్న వెంకటయ్య, తదితరులు పాల్గోన్నారు.

????110 రంజాన్ కిట్ల పంపిణీ.. ఆంధ్ర మిర్రర్..కంభం

జకాత్ లో భాగంగా జమాత్  ఏ ఇస్లామి-హింద్ ప్రతి సంవత్సరం పేదవారి ఇంటికి వెయ్యి రూపాయల సరుకులు మరియు జకాత్ ను నగదు రూపంలో అందించడం జరుగుతుంది.అలాగే ఈ సంవత్సరం కూడా ఆదివారం జమాత్ ఆధ్వర్యంలో 110 కిట్స్ పేదవారికి పంపిణీ చేశారు.కార్యక్రమంలో జమాత్ ఏ ఇస్లామి హింద్ అధ్యక్షుడు రఫీ, జమాత్ ఏ ఇస్లామి హింద్ మాజీ ఉపాధ్యక్షులు గౌస్ ఖాన్, ముఫ్తీ యాసిన్ సాబ్, ఆవాజ్ కమిటీ జిల్లా కార్యదర్శి షంషీర్ బేగ్,ఎస్ ఐ ఒ ఏపీ ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ చాంద్ బాషా ,ఆర్టి ఏజెంట్ కరిముల్లా(మూవ్మెంట్ ఫర్ పీస్ & జస్టిస్ ),ఏ బి ఫంక్షన్ హాల్ అధినేత అయ్యుబ్ ఖాన్,టీచర్ కలాం, రసూల్ బేగ్, జమాత్ ఏ ఇస్లామి హింద్ సభ్యులు అసిఫ్,అబ్దుల్లా, ఎస్ ఐ ఒ సభ్యులు వసీం,బాజిద్,సాజిద్,రఖీబ్, ఫిరోజ్ ఖాన్, నసీర్, ఆదిల్, అకిబ్, సాకిబ్ మరియు బస్టాండ్  మస్జిద్  జమాత్ పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*