వైకాపాలో చేరిన జనసేన పిఠాపురం మాజీ ఇంచార్జ్.. బండి సంజయ్ అవినీతిపై పోరు.. హోల్ సేల్ మెడికల్ షాపులపై సోదాలు..పుల్లలచెరువు వైకాపాకు భారీ షాక్..ఎమ్మెల్యే కేపీ ఆయన సతీమణి విస్తృత ప్రచారం

????వైసిపి లో చేరిన జనసేన పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషుకుమారి. ఆంధ్ర మిర్రర్..

జనసేన పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషుకుమారి బుధవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు .ఆమె 2019 ఎన్నికల్లో జనసేన తరుపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసారు.కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, పిఠాపురం వైఎస్‌ఆర్‌సీపీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీత పాల్గొన్నారు.

????బండి సంజయ్ అవినీతిపై కిషన్ రెడ్డి నోరు విప్పాలి!!!….పొన్నం ప్రభాకర్,ఈటల రాజేందర్ కు బండి సంజయ్ కు మధ్య విభేదాలున్నాయని, వారిద్దరికీ పడదని పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ కొద్దిరోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.ఆతర్వాత బండి సంజయ్ వ్యాఖ్యలకు పొన్నం ప్రభాకర్ కూడా దీటుగా కౌంటర్ ఇచ్చారు.తన తల్లిని బండి సంజయ్ అవమానించారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి బండి సంజయ్ వర్సెస్ పొన్నం ప్రభాకర్ అన్న రీతిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బండి సంజయ్ పై పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ కు బండి సంజయ్ కు మధ్య విభేదాలున్నాయని,వారిద్దరికీ పడదని పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. కరీంనగర్ కు బండి సంజయ్ ఏం చేశారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ఆస్కార్ అవార్డు పొందే రేంజ్ లో బండి సంజయ్ నటిస్తున్నారని సెటైర్లు వేశారు. సెప్టెంబర్ లో బీఆర్ఎస్ అధికారంలో ఉందని, తాము డిసెంబర్లో అధికారంలోకి వచ్చామని, అది వర్షాకాలం కాదని చెప్పారు. పంట నష్టం గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. బండి సంజయ్ పై అవినీతి ఆరోపణలు వచ్చినందునే ఆయనను తొలగించారని ఆరోపించారు. కారణం లేకుండా తనమీద బండి సంజయ్ అభాండం వేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తాను సజీవ దహనానికైనా సిద్ధం అని సవాల్ విసిరానని, కానీ, తనపై ఆరోపణలు బండి సంజయ్ నిరూపించలేక సైలెంట్ గా ఉన్నారని చెప్పుకొచ్చారు. బండి సంజయ్ అవినీతిపరుడు కాదని కిషన్ రెడ్డి చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.తన వాయిస్ రికార్డ్ చేసిన ఆర్డీవోపై చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశానని,చర్యలు తీసుకుంటారని చెప్పుకొచ్చారు. ఉచిత బస్సుల్లో ఇప్పటిదాకా 30 కోట్ల మంది మహిళలు ప్రయాణించారని అన్నారు. బండి సంజయ్ అవినీతిపై తెలంగాణ రాష్ట్రం కోడై కూస్తుందని,దానికి ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డిని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కేసీఆర్ అపాయింట్ చేయించారని సంచలన ఆరోపణలు చేశారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఎమ్మెల్యేగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు.గంగుల కమలాకర్ బండి సంజయ్ ల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు.

????హైదరాబాద్ లో హోల్ సేల్ మెడికల్ షాప్ లపై తనిఖీలు.. ..ఆంధ్రా మిర్రర్.

ఢిల్లీ నుండి ఎలాంటి బిల్స్ లేకుండా తీసుకువచ్చి హైదరాబాద్ లో 40% డిస్కౌంట్ లో ఇంజక్షన్స్ ని అమ్ముతున్న మెడికల్ షాపులు.. హోల్ సేల్ మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు కేసు నమోదు చేసి 51 లక్షల విలువైన ఇంజక్షన్స్ స్టాక్ సీజ్ చేసారు.సికింద్రాబాద్ లో దుర్గా హబ్ మెడికల్ షాప్ లో 6.7 లక్షల స్టాక్ ను,ఉప్పల్ లో శ్రీ తిరుమల ఫార్మా మెడికల్ షాప్ లో 3.52 లక్షల స్టాక్,సుల్తాన్ బజార్ లో శ్రీ పరస్ మెడికల్ ఏజెన్సీస్ లో 9 లక్షల స్టాక్,నాగోల్ లోని శ్రీ గణేష్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ లో 14 లక్షల స్టాక్,కాప్రాలోని శ్రీ రాజరాజేశ్వర డిస్ట్రిబ్యూటర్స్ లో 2 .7 లక్షల స్టాక్ సీజ్ చేశారు.కాచిగూడ లోని శ్రీ బాలాజీ ఏజెన్సీస్ లో డ్రగ్ కంట్రోల్ అధికారులు 16 లక్షల స్టాక్ సీజ్ మెడికల్ షాప్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

???? *పుల్లలచెరువు మండల వైసీపీకి షాక్*.. ఆంధ్ర మిర్రర్.. ఏఎంసీ మాజీ చైర్మన్

ఉడుముల సొంత గ్రామం నుండి భారీ వలసలు ..మండలంలోని వెంకటరెడ్డి పల్లి గ్రామంలో టీడీపీ నాయకులు రెంటపల్లి సుబ్బారెడ్డి, గొగి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 60 వైసిపి కుటుంబాలు యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఎమ్మేల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు సమక్షంలో టిడిపిలో చేరారు.వారిని ఎరిక్షన్ బాబు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసిపి వంటెద్దు పోకడలు నచ్చక,పెత్తందారు వ్యవస్థ ఎక్కువ అవడంతో పార్టీని నమ్ముకుని కష్టపడుతున్న తమని పక్కకు నెట్టేసి ఒక వర్గాన్ని తాటిపర్తి చంద్రశేఖర్ పనిచేస్తున్నారన్న అభియోగంతో వారు టిడిపిలో చేరుతున్నట్లు తెలిపారు. టిడిపిలో తగిన గౌరవం కల్పిస్తామని ఎరిక్షన్ బాబు వారికి హామీ ఇచ్చారు.

????యడవల్లి పంచాయతీ పరిధిలోని కార్యకర్తల పరిచయ కార్యక్రమంలో గిద్దలూరు వైసిపి ఇన్చార్జి కేపీ*

 ప్రకాశం జిల్లా రాచర్ల మండలం యడవల్లి పంచాయతీ పరిధిలోని నాయకులు మరియు కార్యకర్తలతో యడవల్లి గ్రామంలో ఆత్మీయ సమావేశం లో గిద్దలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కుందురు నాగార్జునరెడ్డి పాల్గొన్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు..????*కంభం టౌన్ లో కొంతమంది నాయకులతో గిద్దలూరు ఇంచార్జ్ కేపి.నాగార్జున రెడ్డి సతీమణి కల్పనా రెడ్డి ముఖాముఖి కలిస మాట్లాడారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*