టీడీపీ – బీజేపీ – జనసేన పొత్తుపై వైయస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు.. బిజెపి టిడిపి కూటమి చారిత్రాత్మకం..మాజీ ఎమ్మెల్యే ముత్తుముల.. టిడిపిలో కొనసాగుతున్న వలసలు.. కడపలో ఏసీబీ దాడులు..

???? టీడీపీ – బీజేపీ – జనసేన కలిసి పోటీ చేస్తున్నట్లు చేసిన ప్రకటనపై వైఎస్ షర్మిళ ఘాటుగానే స్పందించారు.ఈ సందర్భంగాచంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు.”అందరూ దొంగలే”అంటూ వ్యాఖ్యానించారు.

 దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుపై స్పందించిన షర్మిళ… “అందరూ దొంగలే.. ఎందుకు కలుస్తున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. పోలవరం ఇచ్చారని కలుస్తున్నారా.. ప్రత్యేక హోదా ఇచ్చారని కలుస్తున్నారా.. రాజధాని ఇచ్చారని కలుస్తున్నారా” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఐదు సంవత్సరాలపాటు బీజేపీ పొత్తుపెట్టుకుని కూడా ప్రజలకు న్యాయం చేయకపోయినా.. మళ్లీ అదే బీజేపీతో ఎందుకు కలుస్తున్నారు అని షర్మిళ సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంపై ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని అన్నారు. ఇదే సమయంలో… 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని షర్మిళ ట్విట్టర్ వేదికగా  ఆరోపించారు..

  • ????ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కలయిక చారిత్రాత్మకమైంది: గిద్దలూరు టిడిపి ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి..
    తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమిని పార్టీ సభ్యులుగా అందరం స్వాగతిస్తున్నామని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల ఆధారంగా అధినేత చంద్రబాబు నాయుడు పొత్తు నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నిరంకుశ పాలనను తుద ముట్టించేందుకు బిజెపి టిడిపి జేఎస్పి  కలిసి పోటీ చేయనున్నాయన్నారు. జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది. అప్పులాంధ్ర ప్రదేశ్ గా మార్చింది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. కులంతో సంబంధం లేకుండా బీసీలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జగన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగాయి. వైసీపీ పాలనలో ప్రభుత్వం అంటే కేవలం జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణరెడ్డి, ధనుంజయ్ రెడ్డిగా మారిందని ఈ ప్రభుత్వంలో బీసీలను ఎంత హీనంగా చూశారో వైస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణ మూర్తి మాటల్లోనే విన్నామన్నారు. బీసీలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు లాంటింది. మొన్న జరిగిన జయహో బీసీ కార్యక్రమం ద్వారా మరోసారి రుజువైందన్నారు. ఇంత అరాచక జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు మూడు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. తెలుగుదేశం పార్టీ పై కేంద్రంలో ఉన్న బీజీపీ పెద్దలకు కూడా నమ్మకం కలిగింది. అందుకే కేంద్రమే పొత్తులకు ఆహ్వానించిందని తెలుగు ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ సంకల్పించిన మహాయజ్ఞానికి ఇటు జనసేనతో పాటు, బీజేపీ కూడా కలిసి వస్తోంది. నారా చంద్రబాబు నాయుడు దార్శనికపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రక్షనగా ఉంటుందని మేము నమ్మాము, అతి పెద్ద జాతీయ పార్టీతో పాటు దేశం మొత్తం తమకు మద్దతిస్తోందన్నారన్నారు.

????టిడిపిలో చేరిన 50 బీసీ కుటుంబాలు.. 

గిద్దలూరు టీడీపీలోకి వలసలు కొనసాగుతూనే వున్నాయి. స్థానిక నాయకత్వాన్ని బలపరుస్తూ, అధికార పార్టీని వీడుతూ తెలుగుదేశం పార్టీకి జై కొడుతున్నారు. గిద్దలూరు పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో కంభం మండలం, ఎర్రబాలెం గ్రామంలోని వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన 50 కుటుంబాలు, ఒక మాజీ సర్పంచ్, విద్యా కమిటీ చైర్మన్, వైస్ సర్పంచ్ తో సహా వైసీపీకి గుడ్ బై చెబుతూ అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా టీడీపీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని, బీసీల సంక్షేమం టీడీపీ జనసేనలతోనే సాధ్యమని రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలోని బీసీ సోదరులంతా ఐక్యంగా పోరాడి అశోక్ రెడ్డిని గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో వైసిపిని వీడి టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్ పిక్కిలి ఆదినారాయణ, విద్యాకమిటీ చైర్మన్ పిక్కిలి సుబ్బయ్య, తదితరులతోపాటు కంభం మండల టీడీపీ నాయకులు పాల్గోన్నారు.

???? మహిళా సూపరిండెంట్ ప్రమీలపై ఏసీబీ దాడులు..

కలెక్టరేట్ కార్యాలయంలోని సి సెక్షన్ లో పనిచేస్తున్న సూపరిండెంట్ గా పనిచేస్తున్న ప్రమీల…వి.ఎన్.పల్లి కి చెందిన శేఖర్ అనే రైతు వద్ద సర్వే నెంబర్ 51 లో 6.6 చుక్కల భూమికి సంభందించి రు. 1,50,000 డిమాండ్ చేసింది.అడ్వాన్స్ గా రు.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులకు దాడి చేశారు.ప్రస్తుతం ఏసిబి అధికారులు ప్రమీలను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.ఈ తనిఖీలలో డీఎస్పీ గిరిధర్, శ్రీనివాస్ రెడ్డి,మహమ్మద్ అలీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*