నారాయణ విద్యాసంస్థల అవినీతి భాగోతం..కంభంలో ఘనంగా వైయస్సార్ ఆసరా..ముమ్మర ప్రచారంలో ఎమ్మెల్యే అన్నా

*????నారాయణ విద్యాసంస్థల అధినేత…ఏపీ మాజీ మంత్రి నారాయణ చేసిన మోసం…బస్సుల కొనుగోలు వ్యవహారంలో అవినీతి ..10 కోట్లకు పైగా పన్ను చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.22.25 లక్షలు మాత్రమే పన్ను…ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి వెల్లడి..

నెల్లూరు నగరంలో మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లలో జరిగిన పోలీస్ సోదాల విషయంలో ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మీడియాకు వివరాలు తెలియజేశారు.రాజకీయాలకు ఈ సోదాలకు సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.నారాయణ విద్యా సంస్థల పేరుతో బస్సుల కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వాన్ని మోసం చేయాలని చూశారని,రవాణా శాఖకు రావాల్సిన ఆదాయానికి గండి కొట్టాలని ప్రయత్నించారని..అందుకే ఆ కేసుతో సంబంధం ఉన్న అందరి ఇళ్లలో సోదాలు చేపట్టామని తెలిపారాయన.

????అసలేం జరిగిందంటే..? నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి అనుబంధంగా ఇన్స్ పైరా అనే సంస్థ ఉందని తెలిపారు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి. ఆ సంస్థకు పునీత్ అనే వ్యక్తి డైరెక్టర్ గా ఉన్నారని, నారాయణ విద్యాసంస్థల్లో కూడా ఆయన డైరెక్టర్ గా ఉన్నారని చెప్పారు. 2023 జూన్ లో ఇన్స్ పైరా అనే కంపెనీ నారాయణ విద్యా సంస్థలతో ఒక ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు ఎస్పీ. ఈ ఒప్పందం ప్రకారం 92 కొత్త బస్సుల కోసం రూ. 20.8 కోట్లకు ఇన్స్ పైరా సంస్థ ఆర్డర్ పెట్టిందని, అయితే ఇన్ వాయిస్ మాత్రం నారాయణ విద్యా సంస్థల పేరు మీద తీసుకున్నారని ఆయన వివరించారు.

????ఎందుకీ జిమ్మిక్కులు..?    వాస్తవానికి విద్యా సొసైటీ కి చెందిన వాహనాలకు పన్ను తక్కువగా ఉంటుంది. అందుకే ఇన్స్ పైరా సంస్థ ఇక్కడ నారాయణ విద్యా సంస్థల పేరు వాడుకుందని అంటున్నారు నెల్లూరు జిల్లా ఎస్పీ. అయితే ఈ కేసులో జిల్లా రవాణా శాఖ అధికారికి ఈ గోల్ మాల్ పై సమాచారం అందిందని, ఆ సమాచారం ఆధారంగా తాము విచారణ చేపట్టామని, సోదాలు చేశామని చెప్పారాయన. బస్సులను నారాయణ సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినా.. ప్రతి నెలా ఇన్స్ పైరా సంస్థ ఆ బస్సులకు సంబంధించి అద్దెను నారాయణ సంస్థలనుంచి వసూలు చేయడం విశేషం. వాహనాలను ఇన్స్ పైరా కొన్నా కూడా వాటిని నారాయణ సంస్థ కొన్నట్టు రవాణా శాఖకు చూపించారు. మరి వాటి యజమాని నారాయణ విద్యాసంస్థ అయితే.. ఇన్స్ పైరా కు సదరు సంస్థ అద్దె ఎందుకు చెల్లిస్తోందనేదే ఇక్కడ అసలు ప్రశ్న. అంటే ఇక్కడ గోల్ మాల్ చేసి, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని పోలీసులు తేల్చారు.

????అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు..   నెల్లూరు జిల్లా రవాణా శాఖ అధికారులు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారి ఇళ్లపై దాడులు చేశారు. ఈ దాడుల్లో కోటీ 81 లక్షల రూపాయల సొమ్మ స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్ముకి సదరు యజమానులు లెక్క చూపించకపోవడం విశేషం. దీన్ని ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తున్నట్టు తెలిపారు పోలీసులు. తప్పుడు డాక్యుమెంట్ల తో  వాహనాలను రిజిస్ట్రేషన్ చేసిన కేసులో పూర్తి స్థాయి విచారణ చేపట్టామన్నారు.ఈ వ్యవహారంలో పునీత్ పై కేసు నమోదు చేశామని,విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు.

????కోట్లకు బదులు లక్షల్లో పన్ను.. డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ విభాగం ఈ మోసాన్ని గుర్తించిందని తెలిపారు డీటీసీ చందర్. రవాణా శాఖ కమిషనర్ కు ఫిర్యాదు రావడంతో ఆయన ఆదేశాల మేరకు తాము విచారణ చేపట్టామన్నారు. మొత్తం 92 వాహనాలు కొనుగోలు చేశారని, నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి పన్ను ఎగ్గొట్టారని అన్నారు. రూ.10 కోట్లకు పైగా పన్ను చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.22.25 లక్షలు మాత్రమే పన్ను కట్టారన్నారు. నారాయణ సంస్థకు నోటీస్ లు ఇచ్చి వివరణ తీసుకుంటున్నామని, అవసరమైతే ఆయా బస్సుల్ని సీజ్ చేస్తామని చెప్పారు డీటీసీ చందర్. బస్సుల రిజిస్ట్రేషన్లలో జీఎస్టీ అక్రమాలకు కూడా పాల్పడినట్టు విచారణలో బయట పడినట్టు తెలిపారు .

*డ్వాక్రా రుణాలను మాఫీ చేసిన ఘనత జగనన్నదే..కంభంలో వైఎస్సార్ ఆసరా చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి

పాదయాత్ర లో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా రుణాలను మాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డిదే అని మార్కాపురం ఎమ్మెల్యే గిద్దలూరు వైసీపీ సమన్వయకర్త కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు.మంగళవారం పట్టణంలోని ఉదయగిరి బృందావన్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కంభం, అర్ధవీడు, బి పేట మండలాల వైఎస్సార్ ఆసరా 4 విడత వారోత్సవాలల్లో ఆయన మాట్లాడుతు మహిళల అభ్యున్నతి కొరకు, అన్ని వర్గాల మహిళలకు ఆర్థికంగా ఆదుకోవడానికి వైఎస్సార్ ఆసరా పథకం రూపొందించారన్నారు. ఈ పథకం వలన మహిళలు స్వతహాగా అనేక చిన్నచిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని, ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగ పడుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని మరలా అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గిద్దలూరు ప్రజలు జగనన్న తర్వాత అంతటి అభిమానంతో భారీ మెజార్టీ అందించారన్నారు. జగనన్న ఆదేశాల మేరకు గిద్దలూరు నుండి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో  ప్రజా సేవకై వస్తున్న తనను ఆశీర్వదించి గెలిపించాలని మహిళలను కోరారు.  కార్యక్రమంలో మూడు మండలాల వైసీపీ,నాయకులు, కార్యకర్తలు,అధికారులు,మహిళలు,పాల్గొన్నారు.

*????గడప గడపకు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన ఘనత జగనన్నదే..  ఎమ్మెల్యే అన్నా

*మార్కాపురం పట్టణంలో 12, 14 బ్లాక్ ల్లో ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్చార్జి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ప్రతి గడప -గడప కు ప్రభుత్వ పథకాలు అందించిన ఘనత ముఖ్య మంత్రి జగనన్నదే అని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. సోమవారం మార్కాపురం పట్టణంలోని 12, 14 బ్లాక్ లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని,ఆదరించి ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. జగనన్న ఆశీస్సులతో మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల తర్వాత అత్యధిక మెజారిటీని గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు ఇచ్చారని, అదే రీతిలో మార్కాపురం ప్రజలు ఆదరిం చాలని ఆశిస్తున్నానన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, మార్కాపురం పట్టణా భివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. జగనన్న పాలనలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో లబ్ది చేకూరిందన్నారు.ముందుగా ఎమ్మెల్యే అన్నా నాయకులు ఏర్పాటు చేసిన వైస్సార్సీపీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి పంచి పెట్టారు. అనంతరం వికాలంగునికి ట్రై సైకిల్ అందచేశారు.కార్యక్రమంలో పలువురు వైసీపీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు,వార్డు కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు, సచివాలయ కన్వీనర్లు,తదితరులు పాల్గొన్నారు

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*