సీఎం సమక్షంలో వైకాపాలో చేరిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు మార్కాపురం ఎమ్మెల్యేలు

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఏ.ఎండి ఇంతియాజ్‌ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.వచ్చే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఇంతియాజ్‌ ను వైసీపీ తరఫున బరిలో దించుతారని టాక్‌ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ అధికార వైసీపీలో చేరారు. ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ పాల్గొన్నారు.వచ్చే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఇంతియాజ్‌ ను వైసీపీ తరఫున బరిలో దించుతారని టాక్‌ నడుస్తోంది.వైసీపీ ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లో 2014, 2019లో వైసీపీ తరఫున కర్నూలు నుంచి ఎస్వీ మోహన్‌ రెడ్డి, హఫీజ్‌ ఖాన్‌ గెలుపొందారు. 2014లో కర్నూలులో వైసీపీ తరఫున గెలిచిన ఎస్వీ మోహన్‌ రెడ్డి ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించారు.మళ్లీ 2019 ఎన్నికల తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రసుతం ఆయన కూడా కర్నూలు సీటును ఆశించారు. మరోవైపు 2019లో కర్నూలు నుంచి వైసీపీ తరఫున హఫీజ్‌ ఖాన్‌ పోటీ చేసి గెలుపొందారు. ఆయన కూడా ఈ సీటును ఆశిస్తున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్‌ వీరిద్దరిని కాదని.. ప్రస్తుతం పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్‌) సీఈవోగా, భూపరిపాలన శాఖ అదనపు కార్యదర్శిగా, మైనార్టీ శాఖ కార్యదర్శిగా పలు బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ ను ఎంపిక చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా పదవీకాలం ఉన్నప్పటికీ, ప్రస్తుతం సీనియర్‌ ఐఏఎస్‌ గా కీలక పదవుల్లో కొనసాగుతున్నప్పటికీ ఇంతియాజ్‌ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) తీసుకున్నారు. ఈ మేరకు ఇందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం.. ప్రభుత్వం వెంటనే ఆమోదించడం జరిగిపోయాయి. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది, వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సైతం రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి నోటిఫికేషన్‌ కూడా జారీ చేశారు. కాగా ఇంతియాజ్‌ గతంలో కృష్ణా జిల్లాతోపాటు పలు జిల్లాలకు కలెక్టర్‌ గా పనిచేశారు.ఇంతియాజ్‌ స్వస్థలం కర్నూలు జిల్లాలోని కోడుమూరు. కర్నూలు అసెంబ్లీ స్థానంతోపాటు పార్లమెంటు స్థానం పరిధిలో భారీగా ఉన్న ముస్లింల ఓటర్లను ఆకట్టుకోవడానికి వైసీపీ ఇంతియాజ్‌ కు సీటు ఇస్తుందని తెలుస్తోంది.కార్యక్రమంలో కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ పాల్గొన్నారు.

????నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు,పూర్తిస్థాయి అవినీతి రహిత పరిపాలన అందించుటకు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండటానికి నేను సిద్ధంగా ఉన్నానని గిద్దలూరు నియోజకవర్గం సమన్వయకర్త,నియోజకవర్గ సమన్వయకర్త కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు.కొమరోలులో జరిగిన వాలంటరీ వందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని పూర్తిస్థాయిలో అమలుపరచుటకు, గౌరవ ముఖ్యమంత్రి ఒక గొప్ప సచివాల వ్యవస్థను ఏర్పాటు చేసి,ఆ వ్యవస్థకు ప్రజలకు అనుసంధానంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక గొప్ప వ్యవస్థను సృష్టించడం జరిగింది. ఆ వ్యవస్థ “వాలంటరీ వ్యవస్థ”.ఈ వ్యవస్థలో పనిచేసే ప్రతి వాలంటరీ పూర్తిస్థాయి ప్రజలకు సేవలు అందిస్తూ, ప్రభుత్వం తరఫున ఎప్పటికీ ఎప్పటికీ వారి సమస్యలను పరిష్కరిస్తూ,ఎవరికి ఏ సమస్య లేకుండా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి అందే విధంగా పూర్తి సేవ దృక్పథంతో పనిచేస్తున్న వాలంటరీలకు వందనాలు తెలిపారు.

*????పొదిలి మండలంలో వైఎస్సార్ ఆసరా చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అన్నా*భారీ గజ మాలతో ఎమ్మెల్యే అన్నాను ఘనంగా సన్మానించిన మహిళలు..జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన మహిళలు..రాబోయే ఎన్నికల్లో మీ ఆత్మీయునిగా వస్తున్న గెలిపించండి అని కోరిన ఎమ్మెల్యే అన్నా* ..అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తూ సంక్షేమపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందామని గిద్దలూరు ఎమ్మెల్యే,మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త అన్నా రాంబాబు అన్నారు. బుధవారం పొదిలిలోని దర్శి రోడ్డులోని మంజునాథ కల్యాణ మండపంలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా 4 విడత వారోత్సవాలల్లో ఎమ్మెల్యే అన్నా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏపీఐఐసి చైర్మన్, జిల్లా వైసీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జంకే వెంకట రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు ముఖ్య మంత్రి జగనన్న చిత్రపటానికి మహిళలతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతు మహిళల అభ్యున్నతి కొరకు, అన్ని వర్గాల మహిళలకు ఆర్థికంగా ఆదుకోవడానికి వైఎస్సార్ ఆసరా పథకం రూపొందించారన్నారు. ఈ పథకం వలన మహిళలు స్వతహాగా అనేక చిన్నచిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని, ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగ పడుతుందన్నారు. జగనన్న ఆదేశాల మేరకు మార్కాపురం నుండి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా సేవకై వస్తున్న నన్ను ఆశీర్వదించి గెలిపించాలని ఎమ్మెల్యే అన్నా మహిళలను కోరారు. ఈ కార్యక్రమం లో మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేతలు, పొదిలి మండల వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధికారులు, మహిళలు, గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.

ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అన్నా*..  ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన చెక్కులను బుధవారం గిద్దలూరు శాసన సభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త అన్నా రాంబాబు పంపిణీ చేశారు. బుధవారం పొదిలి దర్శి రోడ్డులోని మంజునాథ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమం లో బాధితులకు ఎమ్మెల్యే అన్నా పంపిణీ చేశారు. పొదిలి మండలంలోని బుచ్చిన పాలెం గ్రామానికి చెందిన పల్లెర్ల చిన్న వెంకటేశ్వర్లుకు రూ.65 వేలు, సలకనూతలకు చెందిన బొల్లినేని నాగేశ్వరావు కు లక్ష రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అన్నా అందచేశారు. అనంతరం బాధితులు ముఖ్య మంత్రి జగనన్న కు, ఎమ్మెల్యే అన్నా కు కృతజ్ఞతలు తెలిపారు.

????*మీ ఆత్మీయునిగా వస్తున్న ఆదరించండి..పొదిలి పట్టణ, మండల వైసీపీ నాయకుల ఆత్మీయ సమావేశంలో గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా*… మార్కాపురం నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా మీ ఆత్మీయునిగా వస్తున్న రాబోయే ఎన్నికల్లో నన్ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని గిద్దలూరు శాసనసభ్యులు, మార్కాపురం నియోజక వర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు తెలిపారు. బుధవారం పొదిలి దర్శి రోడ్డు లోని మంజునాధ కల్యాణ మండపంలో నిర్వహించిన పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అన్నా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏపీఐఐసి చైర్మన్, జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని పంచాయతీల నుంచి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై ఎమ్మెల్యే అన్నా కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ పాదయాత్రలో పేదల సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్ నవరత్నాల ద్వారా ప్రతిఇంటికీ సంక్షేమం అందించారన్నారు. రాజకీయాల్లోకి రాకముందే తల్లిదండ్రుల పేరుపై ట్రస్టు ప్రారంభించి నీటి సమస్య తీర్చానని, ఉచిత అంబులెన్సు ఏర్పాటు చేశానన్నారు. 100 మంది కిపైగా విద్యార్థులను ఇంజినీరింగ్, ఎంబీఏ, మెడి సిన్ చదివించానన్నారు. పలు గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు ఎమ్మెల్యే అన్నాను పరిచయం చేసుకుని శాలువా, పూలదండలతో ఘనంగా సత్క రించారు.

????ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందచేయడంలో వాలంటీర్లదే ప్రముఖ పాత్ర..   ముఖ్య మంత్రి జగనన్న ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందచేయడంలో వాలంటీర్లదే ప్రముఖ పాత్ర అని గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు అన్నారు. బుధవారం పొదిలిలోని దర్శిరోడ్డులో గల మంజునాథ ఫంక్షన్ హాలులో జరిగిన పొదిలి టౌన్, మండలములోని వాలంటీర్లకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నా పాల్గొని మాట్లాడారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్టం మరింత అభివృద్ధి చెందాలంటే ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మెహన్ రెడ్డి అయితేనే సాధ్యమవుతుందన్నారు. వాలంటీర్లు తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న అందించిన ప్రభుత్వ పధకాలను ప్రజలకు వివరించి జగనన్న కు అండగా నిలవాలని ప్రతి ఒక్కరిని కోరాలని సూచించారు.వాలంటీర్ లు వారి పరిధిలోని కుటుంబాల సమస్యలు ఎల్లప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించాలన్నారు. అనంతరం పొదిలి టౌన్, మండల పరిధిలోని వాలంటీర్ లకు సేవావజ్ర, సేవారత్న, సేవా మిత్ర అవార్డులకు ఎంపికైన వాలంటీర్ లను ఎమ్మెల్యే అన్నా శాలువాతో, బ్యాడ్జ్, ప్రశంసాపత్రాలతో ఎమ్మెల్యే అన్నా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో పొదిలి మండలంలోని ప్రజాప్రతినిధులు, వైసీపీ ముఖ్య నేతలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, సచివాలయ కన్వీనర్ లు, గృహ సారధులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*