ముస్లిం మైనార్టీల సంక్షేమం తెలుగుదేశంతోనే సాధ్యం..మాజీ శాసనమండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్.. ఇంటింటికి ప్రచారంలో తెలుగు తమ్ముళ్లు.. భాష్యం స్కూల్ బిల్డింగ్ పై నుండి పడి విద్యార్థిని మృతి..ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన..కంభం


రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల సంక్షేమం తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని మాజీ శాసన మండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్ అన్నారు. గిద్దలూరు పట్టణంలోని షాదీఖానాలో ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీ సోదరుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిధులుగా ఆయనతోపాటు గిద్దలూరు టీడీపి ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి మరియు రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తక్ అహ్మద్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు రసూల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చి వారికి అన్నీ విధాలుగా అండగా నిలిచిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు. నేడు అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి మైనార్టీల సంక్షేమాన్ని మరిచి వారి పై దాడులు చేయటమే పనిగా పెట్టుకున్నారని, ముస్లిం సోదరుల పై వైసీపీ మూకలు దౌర్జన్యం చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అరాచక పాలనను తరిమికొట్టటానికి ముస్లిం సోదరులంతా సిద్ధంగా ఉండాలని, గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపి జనసేనల ఉమ్మడి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డిని గెలుపించేందుకు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వం నడుస్తుందని, అధికారంలోకి వచ్చిన నాటి నుండి దోచుకోవటమే పనిగా పెట్టుకున్న జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలన్నారు.
కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు, రాష్ట్ర, పార్లమెంట్ కమిటీ మైనార్టీ నాయకులు, ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గోన్నారు.
???? *అశోక్ రెడ్డి గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న తెలుగు తమ్ముళ్లు…

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కంభం మండలం లోని లింగోజిపల్లి లో ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్6 పథకాల గురించి వివరించడం జరుగుతుంది.మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు ముత్తుముల అశోక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో ని ప్రతి ఇంటికి తిరిగి మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం జరుగుతుంది కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచి తాటికొండ వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు తాటికొండ కాశయ్య, ఆవులపాటి వెంకటసుబ్బయ్య, , నాగేళ్ల రామయ్య , కరణం ప్రసాదు , ఇ. లక్ష్మణరావు ,రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గోన చెన్నకేశవులు , పార్లమెంట్ మైనార్టీ ప్రధాన కార్యదర్శి అనీష్ అహ్మద్, మాజీ ఎంపీటీసీ ఖాదర్ హుస్సేన్,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు సిరివెళ్ల రవికుమార్ జిలాని, తదితరులు పాల్గొన్నారు.
????గిద్దలూరు నియోజకవర్గ టీడీపి జనసేనల ఉమ్మడి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డిని గెలిపించేందుకు తెలుగు తమ్ముళ్లు నడుం బిగించారు.
బుధవారం ఉదయం పట్టణంలోని 1వ వార్డు, 8వ వార్డు, మరియు 19వ వార్డులలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రతీ ఇంటికి తిరిగి టీడీపి – జనసేనల ఉమ్మడి మ్యానిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. నాడు తెలుగుదేశం హయాంలో ముత్తుముల అశోక్ రెడ్డి పట్టణంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించారని, పేదలకు 1404 ఎన్టీఆర్ టిడ్కొ గృహాలను మంజూరు చేశారని, సిమెంట్ రోడ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేశారని గుర్తు చేశారు..

????బుధవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ సంబరాలను స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు.తోలుత సర్ సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంఈఓ బి.మాల్యాద్రి మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానం ప్రజల దైనందిన జీవితాలతో ముడిపడి వుందనీ, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి దేశ నిర్మాణ పటిష్టతకు సూచికగా,ఆర్థిక అభివృద్ధికి బాసటగా నిలుస్తాయనీ,విభిన్న రంగాలలో శాస్త్ర విజ్ఞాన సేవలు అద్భుతాలను చేస్తాయన్నారు.

ప్రజల జీవన ప్రమాణ పురోగతిలో శాస్త్రం సాంకేతిక విజ్ఞాన పాత్ర అద్వితీయమైనదనీ,పాఠశాల స్థాయిలోనే వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచనలు చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక ఆవిష్కరణలను తిలకించి ప్రశంసల జల్లు కురిపించారు.కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు వై. వీరనారాయణ, మొయినుద్దీన్, కొమ్మునూరి.కిరణ్ కుమార్, ఏ.వి.శ్రీకృష్ణ, పాండురంగ బాబు పాల్గొన్నారు

???? భాష్యం స్కూల్ 4 వ అంతస్తు మీద నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థి క్రింద పడి మృతి చెందిన సంఘటన పిడుగురాళ్లలో చోటుచేసుకుంది.వివరాల్లో కెళితే కొనకండ్ల రిషిత అనే బాలిక పదవ తరగతి భాష్యం స్కూల్లో చదువుతుంది. స్కూల్ బిల్డింగ్ నాలుగవ అంతస్తులో పదవ తరగతి క్లాసులు నిర్వహిస్తుంది.స్కూల్ మీద నుండి కింద పడ్డ రిషితను హుటాహుటిన పట్టణ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చటం జరిగింది.పై నుండి కింద పడ్డ రిషిత వెంటనే చనిపోవడం జరిగిందని తెలిపారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*