చెలరేగిపోతున్న మట్టి మాఫియా..ఘనంగా ఉడుముల గృహప్రవేశం.. జగన్ పై ధ్వజమెత్తిన ముత్తుముల.. ఫ్లెక్సీలను తగలబెట్టిన బి.కె అభిమానులు.

????100 కోట్ల మట్టి తరలించుకెళ్లారు .. దుమ్ము ధూళి కి పంటలు దెబ్బతింటున్నాయి.. గుంతలలో పశువులు చనిపోతున్నాయి..ఎర్రమట్టి కొండ తవ్వకాలను శాశ్వతంగా ఆపకపోతే ఎన్నికలను బహిష్కరిస్తాం..

బాపట్ల జిల్లా మార్టూరు మండలంలోని బొబ్బేపల్లి గ్రామంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఎర్రమట్టి కొండను పలుకుబడి కలిగిన రాజకీయనాయకులు గత 15 సంవత్సరాల నుండి గుత్తేదారులు, అధికారులు అండదండలతో వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎర్రమట్టి కొండను అక్రమంగా తవ్వుకుంటూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. దీంతో తమ తాము వేసుకున్న ఫైర్లు దుమ్ము ధూళి వల్ల తీవ్రంగా దెబ్బతింటున్నాయి రైతులు లక్షలాది రూపాయలు నష్టం చవిచూస్తున్నారు. ఈ గ్రామంలో ఎక్కువగా పొగాకు పత్తి మిర్చి కూరగాయల పంటలు పండిస్తుంటారు. గత 15 ఏళ్లుగా ఎర్ర మట్టి తవ్వకాలవల్ల,వాహనాల రాకపోకలు సాగిస్తున్నాడం వల్ల పైర్లపై దుమ్ము ధూళి పడి పసిడి రాశులు కురిపించే పూత కాయ దశల్లో సమూలంగా పీకి పారేస్తున్నామని రైతులు వాపోతున్నారు. గత 15 ఏళ్లుగా సుమారు 100 కోట్లకు పైగా మట్టిని అక్రమంగా తరలించారని అన్నారు. ఇక మేతకోసం వెళ్లే గేదెలు మేకలు వంటి పశువులు వర్షాకాలంలో గుంతలలో పడిపోయి చనిపోతున్నాయని పశుపోశకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గురువారం బొబ్బేపల్లి గ్రామానికి చెందిన నాయకులు,ప్రజలు కొండ వద్దకు చేరుకొని ఎర్ర మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పంచాయతీ పరిధిలో ఉన్న ఎర్రమట్టి కొండను అక్రమంగా తొలిచేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని దాని వలన గ్రామానికి ఎటువంటి ఉపయోగం లేకపోగా ఎన్నో అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేకాక దొంగ బిల్లులతో సైతం అక్రమ రవాణా జరుగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు తమ మొరను వినిపించినా కూడా వారు కూడా అందిన కాడికి దండుకుంటున్నారే కానీ గ్రామ ప్రజానీకం ఆవేదనను పట్టించుకోవడంలేదని, అధికారుల సైతం తమ సమస్యను పరిష్కరించకపోగా తమపైనే తప్పుడు కేసులు బనాయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తవ్వకాలను శాశ్వతంగా ఆపివేయాలని తద్వారా పర్యావరణాన్ని తమ పంట పొలాలను కాపాడాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు .ఈ సమస్యను ఎన్నికలలోపు పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికలను తమ గ్రామంలోని ప్రజలంతా కలిసికట్టుగా బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు.

*ఉడుముల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఐఐసీ చైర్మన్, ఎమ్మెల్యే లు అన్నా, కుందూరు

పొదిలికి చెందిన ఉడుముల గురువారెడ్డి నూతన గృహప్రవేశ మహోత్సవ కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త అన్నా రాంబాబు, మార్కాపురం ఎమ్మెల్యే,గిద్దలూరు వైసీపీ సమన్వయకర్త కుందూరు నాగర్జున రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారిని ఎమ్మెల్యే లు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

????జగన్ రెడ్డి మాట తప్పాడు, మడమతిప్పాడు..చంద్రబాబు 2సెంట్లు ఇంటి పట్టా ఇస్తే.. జగన్ రెడ్డి సెంటుకు కుదించాడు..మార్కాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించకుండా పశ్చిమ ప్రాంత వాసులకు వెన్నుపోటు పొడిచాడు..వెలుగొండ జలాలు అందించడంలో మాట తప్పాడు..కార్పొరేషన్ల ద్వారా ఒక్క రూపాయి అయిన సబ్సిడీ ఋణం అందించాడా..?గిద్దలూరు టీడీపి ఇంచార్జ్ ముత్తుముల..

రాష్ట్రంలో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని గిద్దలూరు టీడీపి ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అశోక్ రెడ్డి మాట్లాడుతూ 57నెలల పాలనా కాలంలో 14 లక్షల అసైన్మెంట్ భూములను కబ్జా చేసిన జగన్ రెడ్డి ముఠా ప్రజా ద్రోహులు కాదా అని ప్రశ్నించారు. పశ్చిమ ప్రకాశం ప్రజలకు ఆయువు పట్టు అయిన వెలుగొండ జలాలను నాడు తెలుగుదేశం హయాంలో యుద్ధప్రాతిపదికన 80% పనులను పూర్తి చేస్తే, 2023 డిసెంబర్ నాటికీ నీరు అందిస్తానని మాయమాటలు చెప్పిన జగన్ రెడ్డి వెలుగొండ జలాలను అందించకుండా జిల్లాలోకి ఎలా వచ్చాడన్నారు. జిల్లాల పునర్విభజనలో వెనుకబడిన పశ్చిమ ప్రకాశం కనిపించలేదా అన్నారు. గత తెలుగుదేశం హయాంలో పక్కా గృహలకు 2.50 లక్షలు మంజూరు చేస్తే, వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే రూ.1.80 వేల రూపాయలతోనే చేతులు దులుపుకొని పేదల పై కపట ప్రేమ చూపించారన్నారు. కార్పొరేషన్ల ద్వారా ఒక్కరికైనా, ఒక్క రూపాయి కూడా సబ్సిడీ ఋణం అందించలేదన్నారు. అదే విధంగా జగనన్న లేఅవుట్ ల, పేరుతో పేదలకు లబ్ది చేకూర్చటం కంటే అధికారపార్టీ నాయకుల దోపిడీకే ప్రాధాన్యత ఇచ్చాడని, ఆర్బాటాలతో మొదలు పెట్టిన ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు ఒక్క రూపాయి లబ్ది చేకూరలేదన్నారు. జగన్ పాలన అంతా అబద్దపు హామీలు, అరాచక పాలన తప్ప అభివృద్ధి శూన్యమని రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపటం ఖాయమన్నారు.

????ప్రకాశం జిల్లా, కొత్తపట్నంలో ఆరవీటి సుబ్రహ్మణ్యం కుమారుడి వివాహ కార్యక్రమంలో పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించిన గిద్దలూరు టీడీపి ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి..

*????తెదేపా టికెట్ బి.కె పార్థసారథి కి ఇవ్వనందుకు ఫ్లెక్సీలను తగలబెట్టిన బి.కె అభిమానులు. పెనుకొండ లోని బి.కె పార్థసారథి ఇంటి ముందు తెదేపా ఫ్లెక్సీలు తగలబెట్టి,రోడ్డుపై బైఠాయించిన బికే అభిమానులు.*

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*