శంభు బోర్డర్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులు ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు!!!ఆందోళనకారుల పోస్టులు తీసేశాం, అకౌంట్లు రద్దు చేశాం’ అని అంగీకరించిన ట్విటర్!!!.. మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇంట్లో సిబిఐ సోదాలు!!!

???? పంజాబ్ – హరియాణా మధ్యనున్న శంభు బోర్డర్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులు ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు.

కేంద్ర ప్రభుత్వం తమ ముందు ఉంచిన ప్రతిపాదనను తిరస్కరించినట్లు శంభు బోర్డర్ వద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన రైతు సంఘాల నేతలు చెప్పారు.రైతులతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో ఐదు పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామని ప్రతిపాదించారు. కానీ, దీని కోసం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఐదేళ్ల ఒప్పందంపై రైతులు సంతకం పెట్టాల్సి ఉంటుంది.అయితే, చర్చల తర్వాత ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయని రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ చెప్పారు. 23 పంటలకు కనీస మద్దతు ధరను తాము కోరుతున్నట్లు తెలిపారు.

???? ‘ఆందోళనకారుల పోస్టులు తీసేశాం, అకౌంట్లు రద్దు చేశాం’ అని అంగీకరించిన ట్విటర్ ????… ప్రభుత్వం ఏమంటోంది?

ప్రధాన సోషల్ మీడియా వేదికల్లో ఒకటైన ఎక్స్ (గతంలో ట్విటర్) భారత్‌లో కొనసాగుతున్న రైతుల నిరసనలకు సంబంధించిన అకౌంట్లు, పోస్టులను తొలగించినట్లు అంగీకరించింది.భారత ప్రభుత్వం కంపెనీకి ‘ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్’ (కార్యనిర్వాహక ఆదేశాలు) పంపిన తర్వాత ఆ పేజీలను తీసివేసినట్లు ఎక్స్ పేర్కొంది.జైలు శిక్షతో పాటు జరిమానాలు విధించే అవకాశం ఉందని ఆ ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొన్నట్లు ఎక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో ఆ సంస్థ ఏకీభవించలేదు.తన అధికారిక అకౌంట్ లో ఎక్స్ తన వివరణ ఇచ్చింది.ఎక్స్ నుంచి తమ పోస్టులను తొలగించినట్లు పలువురు గతంలో ఫిర్యాదు చేశారు.

భారత్‌లో రైతుల నిరసనను కవర్ చేస్తున్న రిపోర్టర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, ప్రముఖ రైతు నాయకుల ఎక్స్ అకౌంట్లు సస్పెండ్ అయినట్లు ఎక్స్ యూజర్, జర్నలిస్ట్ అయిన మహ్మద్ జుబైర్ సోమవారం రాశారు.తన ఎక్స్ అకౌంట్‌తో పాటు న్యూస్ ప్లాట్‌ఫాం ‘గావ్ సవేరా’ను కూడా నిలిపివేసినట్లు జర్నలిస్ట్ మన్‌దీప్ పూనియా బీబీసీతో చెప్పారు.”మేం గ్రామీణ భారతాన్ని కవర్ చేసే ప్రొఫెషనల్ జర్నలిస్టులం. క్షేత్రస్థాయి నుంచి రిపోర్టింగ్ చేస్తున్నాం. కానీ, ప్రభుత్వానికి అది అనవసరం. ప్రభుత్వం మా గొంతు నొక్కుతోంది. ఇది మా జీవనోపాధిని కూడా దెబ్బతీస్తుంది” అని ఆయన అన్నారు.ప్రభుత్వ ఆదేశానుసారం” భారత్‌లో అకౌంట్లు, పోస్టులు నిలిపివేస్తున్నట్లు ఎక్స్ తన వివరణలో పేర్కొంది.

????జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివాసంలో గురువారం సీబీఐ సోదాలు నిర్వహించింది.మరో 29 చోట్ల కూడా సీబీఐ సోదాలు చేసింది.సత్యపాల్ మాలిక్ బంధువు అనుమాలిక్ పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ- ఈ సోదాలు నిజమేనని ధ్రువీకరించారు.‘అసలు విషయం ఏమిటనేది నాకు తెలియదు. ఏడుగురు సభ్యులున్న సీబీఐ బృందం ఇక్కడకు వచ్చింది. దాదాపు 3, 4 గంటలపాటు సోదాలు నిర్వహించారు’’ అని ఆయన చెప్పారు.సీబీఐ అధికారులు ఇల్లంతా వెదకడంతోపాటు సత్యపాల్ మాలిక్ గదిని కూడా శోధించారు’’ అని అనుమాలిక్ చెప్పారు.ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అనేక విమర్శలు మొదలయ్యాయి.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దీనిపై ‘ఎక్స్’లో స్పందించారు.‘‘మాజీ గవర్నర్ నిజాలు చెబితే ఆయనింటికి సీబీఐను పంపిస్తారు. ప్రధాన ప్రతిపక్షం బ్యాంకు ఖాతాను స్తంభింపజేస్తారు. ఇదేనా ప్రజాస్వామ్యమంటే’’ అని ఆయన ప్రశ్నించారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*