వాళ్లకు పట్టిన గతే నీకు కూడా..రోజాపై షర్మిల సంచలన వ్యాఖ్యలు!!!

 

ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలు, ఘాటు వ్యాఖ్యలు చేసేవారిలో పర్యాటక శాఖ మంత్రి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఒకరు.ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలు, ఘాటు వ్యాఖ్యలు చేసేవారిలో పర్యాటక శాఖ మంత్రి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఒకరు. ఇప్పటివరకు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ లపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న రోజా ఇప్పుడు షర్మిలపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో రోజాకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ మంత్రులకు పట్టిన గతే వచ్చే ఎన్నికల్లో రోజాకు కూడా పడుతుందని షర్మిల హెచ్చరించారు.

నగరి నియోజకవర్గంలో రోజా దోపిడీని కూడా జబర్దస్త్‌ గా చేస్తున్నారని షర్మిల విమర్శించారు. రాత్రికి రాత్రే కొండలు మాయమవుతున్నాయని ఆరోపించారు. గ్రావెల్, మట్టి, ఇసుక, ఆఖరికి చిన్నచిన్న ఉద్యోగాల్లో సిఫారసులకు కమీషన్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు. హౌసింగ్‌ స్కీంలో రూ.కోట్ల స్కామ్‌ చేశారని ధ్వజమెత్తారు. వెంచర్లు వేయాలంటే రియల్టర్లు రోజాకు కప్పం చెల్లించాల్సిందేనని షర్మిల ఆరోపించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి నెలవారీ ముడుపులు అందుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై పిచ్చివాగుడు వాగితే తెలంగాణలో బీఆర్‌ఎస్‌ మంత్రులకు పట్టిన గతే రోజాకు కూడా పడుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. నగరి ఎమ్మెల్యే రోజా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని షర్మిల మండిపడ్డారు. నోరుంది కదా అని పారేసుకోవద్దని హెచ్చరించారు. గతంలో రోజాను ‘ఐరన్‌ లెగ్‌’ అని పిలిచేవారని ఎద్దేవా చేశారు. అప్పట్లో రోజా తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ఎంతలా దూషించారో ప్రజలకు ఇంకా గుర్తుందన్నారు. నగరి నియోజకవర్గంలో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేస్తే రోజా, ఆమె అన్న, భర్తలకు ప్లాట్లయినా ఇవ్వాలి, లేదంటే కప్పమైనా కట్టాలని షర్మిల ఆరోపించారు. పేదలకు ఇచ్చే ఇళ్లు, ఉద్యోగాల్లోనూ ఆమె కమీషన్లు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రోజాతో చెప్పించుకునే స్థితిలో తాను లేనన్నారు. మరమగ్గాలకు విద్యుత్తు ఛార్జీలు తగ్గించమని కార్మికులు గగ్గోలు పెడుతున్నా రోజా చెవికెక్కదా అంటూ నిలదీశారు. కిందటి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి జగనన్న తప్పారని షర్మిల ఆరోపించారు. ఆ తప్పులు ఎత్తి చూపుతున్నానని, చెల్లెలన్న ఇంగితం లేకుండా రోజాలాంటి వారి చేత తనను తిట్టిస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడ బిడ్డనైన తనను, తన కుటుంబాన్ని, తన వాళ్లను సామాజిక మాధ్యమాల్లో అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ ఇంట్లో అక్కాచెల్లెళ్లు, అమ్మలు లేరా అని వైసీపీ నేతలను నిలదీశారు. ఇలాంటి నియంతలు మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకదన్నారు. ఈ నేపథ్యంలో రోజాపై షర్మిల వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి.

7k network
Recent Posts

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్

👉జగన్ గురించి లోకేష్ ఏం చెప్పారంటే ? …👉 కాల్పుల విరమణను అతిక్రమించి బీరుట్ పై ఇజ్రాయిల్ దాడి…👉 మళ్లీ మొదటికి: లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో హోర్మూజ్ మూసివేత!…👉 కేరళలో కామ్రేడ్స్ గెలుస్తారా…కామ్రేడ్స్ ఉనికి నిలుస్తుందా ?… 👉 ఇండియాలో జాంబీ డ్రగ్ క‌ల‌క‌లం!😱…👉ఒంగోలులో డ్రగ్స్ పై అవగాహన…👉పోలీసులే డ్రంకెన్ డ్రైవ్ చేస్తే ఎలా..? నిలదీసిన యువకుడు – గుంటుపల్లి హైవేపై ఘటన*

👉పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనుల సమీక్ష కార్యక్రమం…👉బెంగాల్ లో మరో రచ్చ.. 91 లక్షల ఓట్లు అవుట్😲 …👉అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు*…👉మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుపుతాం.. ఎమ్మెల్యే కందుల…